Linda Yaccarino
-
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో మూడు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. పలు నివేదికల ప్రకారం..ఎక్స్.కామ్‌ను వినియోగించే సమయంలో యూజర్లకు ఎన్ని యాడ్స్ కావాలనుకుంటున్నాదో దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెరిఫైడ్ అకౌంట్లకు నెలకు రూ.650, ఏడాదికి రూ.6,800 చెల్లించి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారో వాళ్లకి ఇది అవసరం లేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని కలిసి.. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్.. త్వరలో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచేయం చేస్తామని, ప్రస్తుతం దానిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా మస్క్ దానిని నిజం చేశారు. బేసిక్, స్టాండర్డ్, ప్లస్ పేరుతో బేసిక్, స్టాండర్డ్, ప్లస్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ప్లాన్లకు పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఎక్స్ సీఈవో లిండా యాకరినో ఆమోదం తెలిపారు. యాకరినో ప్రకారం.. టెస్టింగ్ దశలో ఉన్న బేసిక్ ప్లాన్‌లో పూర్తిస్థాయిలో యాడ్లు ఉంటాయి. స్టాండర్డ్‌లో బేసిక్‌తో పోలిస్తే యాడ్ల సంఖ్య సగానికి తగ్గుతుంది. ప్లస్‌లో ఎలాంటి యాడ్లు ఉండవు. ఉచితం కాదు.. డబ్బులు చెల్లించాల్సిందే మరోవైపు యూజర్లు చేజారిపోకుండా ఉండేలా వారికి మిలియన్ డాలర్లను చెల్లిస్తున్న విషయం తెలిసిందే. మానిటైజేషన్ పేరుతో కంటెంట్ క్రియేటర్లకు ఏడాదికి 20 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎక్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై నుంచి ఎక్స్ యాడ్ రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని యూజర్లకు అందించడం ప్రారంభించింది. కాగా, మస్క్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో రానున్న రోజుల్లో ఎక్స్‌ను వాడుకోవాలంటే తప్పని సరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్’ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, విజయా గద్దె -
ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్ గాలి తీసేసిన సీఈవో!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్లో పాల్గొన్న ఆమె సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్‌లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు. కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్ చేయడానికి వారం ముందు ట్విటర్లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. కాగా ఎక్స్ తమ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్’ అనే టెక్నాలజీ పబ్లికేషన్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు. ‘మ్యాషబుల్’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్ 3.7 శాతం డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లను కలిగిన ట్విటర్.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. ఇక మంత్లీ యాక్టివ్ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్ వేదికపై అన్నారు. -
ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్ (ట్విటర్)’ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎక్స్ క్రియేటర్లకు సుమారు 20 మిలియన్లు (రూ.166 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించినట్లు ఆ కంపెనీ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. వెరిఫైడ్ యూజర్ల పోస్టులపై డిస్ప్లే అయ్యే యాడ్స్ ద్వారా సంస్థ సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ ఏడాది జూలై నుంచి క్రియేటర్లకు చెల్లించడం ప్రారంభించింది. యూట్యూబ్‌లో వీడియోలకు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు, వెబ్సైట్లలో ఆర్టికల్స్‌కు డబ్బులు వస్తాయి. అదే తరహాలో ఎక్స్.కామ్ సైతం ట్వీట్లకు డబ్బులు ఇస్తున్నట్లు అధినేత ఎలాన్ మస్క్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అర్హులైన క్రియేటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించినట్లు సీఈవో లిండా ట్వీట్ చేశారు. ‘క్రియేట్,కనెక్ట్, కలెక్ట్ ఆల్ ఆన్ ఎక్స్’. క్రియేటర్లు ఆర్ధికంగా విజయం సాధించేలా వారికి అండగా నిలిస్తున్నాం ’అని యాకారినో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే క్రియేటర్ కమ్యూనిటీకి 20 మిలియన్లు చెల్లించాం. తొలిసారిగా జులై నెలలో 5 మిలియన్లు అందించినట్లు తెలిపారు. Create. Connect. Collect all on X. We’re enabling the economic success of new segments like creators. And so far we've paid out almost $20 million to our creator community. https://t.co/kk137uPkAo — Linda Yaccarino (@lindayaX) September 29, 2023 యాక్టీవ్‌గా ఉన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఎక్స్.కామ్ కల్పిస్తుంది. మానిటైజేషన్ నిబంధనలకు లోబడి చేసే ట్వీట్లకు క్రియేటర్లు ‘యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్’ కింద భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. క్రియేటర్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ (ట్వీట్లతో డబ్బులు) సంపాదించేందుకు క్రియేటర్లు ఎక్స్ ప్రీమియం సభ్యుడై ఉండాలి. గత 5 నెలల్లో మీరు చేసిన పోస్ట్ లపై కనీసం 3 మిలియన్ ఆర్గానిక్ ఇంప్రెషన్స్, కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్? -
ట్వీట్లపై ఆంక్షలు.. సమర్ధించిన సీఈవో లిండా యాకరినో
ట్విటర్ యూజర్లు రోజులో చదివే ట్వీట్లపై ఎలాన్ మస్క్ పరిమితులు విధించారు. అయితే, ట్విటర్ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో సమర్ధించారు. స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకు తాత్కాలిక పరిమితిని విధించినట్లు తెలిపారు. జులై 1న నాన్ వెరిఫైడ్ యూజర్లు రోజుకు 600 ట్వీట్లను చదివేందుకు మస్క్ అనుమతిచ్చారు. వెరిఫైడ్ యూజర్లు 6,000, కొత్తగా ట్విటర్‌ను వినియోగిస్తున్న యూజర్లు 300 ట్వీట్లను చదివే వెసలు బాటు కల్పించారు. తాజాగా, ట్విటర్లో చేస్తున్న మార్పులపై లిండా యాకరినో స్పందించారు. ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ తరహా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ సైతం అర్థవంతమైనదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫేక్ యూజర్లకు చెక్ పెట్టేలా స్పామ్ ఖాతాలను అరికట్టేలా చదివే ట్వీట్లపై ట్విటర్ తాత్కాలికంగా పరిమితులు విధించింది. తద్వారా, ప్లాట్‌ఫారమ్ నుండి స్పామ్, బాట్లను తొలగించడానికి తీవ్ర చర్యలు అవసరమని ట్విటర్ నివేదించింది. ఈ చర్యల వల్ల ఫేక్ ట్విటర్ యూజర్లు.. సురక్షితంగా ఉండేందుకు చేసే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకుండా పోతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తటస్థంగా ట్విటర్ మస్క్ ఊహించని నిర్ణయం కొద్ది మంది వినియోగదారుల్ని మాత్రమే ప్రభావితం చేసిందని, ప్రకటనలు మారినప్పటికీ అవి స్థిరంగా ఉన్నాయని ట్విటర్ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ను అందరికి ఆమోదయోగ్యంగా మార్చడంపైనే దృష్టిసారించినట్లు ట్విటర్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి👉 ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి? -
ట్విట్టర్ కొత్త సీఈవో లిండా యక్కరినో... ఎలోన్ మస్క్ స్థానంలో
ట్విట్టర్ కు కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు లిండా యక్కరినో. ఈ మేరకు ఆమె తన లింక్డ్ఇన్ అకౌంట్లో తన బయో గురించిన వివరాలను అప్డేట్ చేసి ట్విట్టర్ సీఈవో అని రాశారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించి... ప్రఖ్యాత సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ కు సీఈవోగా లిండా యక్కరినోను నియమిస్తూ ఎలోన్ మస్క్ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆమె అధికారికంగా ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ లిండా తన లింక్డ్ ఇన్ బయో వివరాల్లో ట్విట్టర్ సీఈవో అని పొందుపరిచారు. ఆమెపై పూర్తి నమ్మకముంది... ఎలోన్ మస్క్ లిండా యక్కరినో గతంలో ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఎన్బీసీలో ఆమె ప్రకటనల విభాగానికి శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. ట్విట్టర్ సీఈవోగా ఆమె పేరును ప్రకటించినప్పుడు ఎలోన్ మస్క్ దూరదృష్టి నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయనతో కలిసి ట్విట్టర్‌ను మరింత ముందుకు తీసుసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని తెలిపారు లిండా. అదే సమయంలో లిండా సామర్థ్యంపై పూర్తి నమ్మకముందని ట్విట్టర్ ప్రకటనల మార్కెట్లో ఆమె కొత్త ఒరవడి సృష్టించగలరని ఎలోన్ మస్క్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆమెతో పాటు ఎన్బీసీ యూనివర్సల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన జో బెనారోక్ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇది కూడా చదవండి: "గొప్ప నాయకుడివి"... ప్రధాని మోదీ ప్రశంస -
ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం!
ట్విటర్ సీఈవోగా లిండా యక్కరినో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తును సృష్టించే మస్క్ నుంచి తానెంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆ ప్రేరణే ట్విటర్ భవిష్యత్‌ను మార్చేందుకు దోహదపడుతుందని అన్నారు. గత అక్టోబర్‌లో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. నాటి నుంచి సీఈఓగా మస్క్ కొనసాగుతూ వచ్చారు. తాజాగా, లిండాను ట్విటర్ సీఈవోగా నియామకాన్ని పరోక్షంగా ప్రకటించారు. అయితే ట్విటర్ సీఈవోగా మస్క్ తనని నియమించనున్నారంటూ నివేదికలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో లిండా తొలిసారి మాట్లాడారు. Thank you @elonmusk! I’ve long been inspired by your vision to create a brighter future. I’m excited to help bring this vision to Twitter and transform this business together! https://t.co/BcvySu7K76 — Linda Yaccarino (@lindayacc) May 13, 2023 ‘ఉజ్వలమైన భవిష్యత్తును సృష్టించేలా మస్క్ నుంచి ప్రేరణ పొందాను. ఈ విజన్‌ను ట్విటర్లో కొనసాగించేలా, వ్యాపారాన్ని కలిసి మార్చడంలో సహాయ చేయడంలో సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఎన్బీసీ యూనివర్సల్‌కు అడ్వర్టైజింగ్ చీఫ్‌గా లిండా సుధీర్ఘకాలంగా పనిచేశారు. ఆ సంస్థలో అడ్వర్టైజింగ్ విభాగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నానని, ట్విట్టర్ 2.0ని రూపొందించడానికి యూజర్ ఫీడ్‌బ్యాక్ చాలా కీలకమని అన్నారు. చదవండి👉 ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి? -
ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి?
ట్విటర్ సీఈవోగా లిండా యక్కరినో (Linda Yaccarino) దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాను అనుకుంటున్నట్లుగా ట్విటర్‌ను మరింత లాభదాయంగా మార్చేందుకు లిండా నాయకత్వం అవసరమని మస్క్ భావించినట్లు సమాచారం. కాబట్టే ఆమెను సీఈవోగా నియమించేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదిలకు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా లిండాను ఎంపిక చేయడంపై ఆమెకున్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►లిండా యక్కరినో ఎన్‌బీసీయూ యూనివర్సల్ (NBCUniversal)లో 10 సంవత్సరాలకు పైగా వివిధ విభాగాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా అడ్వటైజింగ్ సేల్స్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. ఆ సంస్థకు చెందిన పికాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌లను లాంచ్ చేయడంలో ఆమెదే కీలక పాత్ర. ►వార్నర్ బ్రదర్స్‌కు చెందిన టర్నర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో దాదాపూ 19 ఏళ్ల పాటు సుధీర్ఘంగా పనిచేశారు. నెట్వర్క్ ప్రకటన విక్రయాల కార్యకలాపాలను డిజిటల్ మాద్యమంలో రంగ ప్రవేశం చేయించిన ఘనత లిండాకే దక్కుతుంది ►పెన్ స్టేట్ యూనివర్శిటీలో లిండా లిబరల్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తి చేశారు. ►గత నెలలో మియామీలో జరిగిన అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో యక్కరినో మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. సమావేశంలో, లిండా చప్పట్లతో మస్క్‌ను స్వాగతించారు. అతని పనితీరును ప్రశంసిస్తూనే ‘స్నేహితుడు’, ‘మిత్రుడు’ అని సంబోదిస్తూ అందరికి ఆశ్చర్యానికి గురి చేశారు. ►అయితే, ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు లిండాకు అన్నీ అర్హతలున్నాయి. ఆమె ఎంపిక సరైందేనని యాడ్ ఫోంటెస్ మీడియాలో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపడుతున్న లౌ పాస్కాలిస్ అన్నారు. లిండాకు ఎలాన్ మస్క్ నాయకత్వంలో పనిచేయాలని ఎందుకు అనిపించిందో అర్ధంకాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్ సంచలనం, నా కొడుకు బ్రెయిన్లో ఈ చిప్‌ను అమర్చుతా? -
ట్విటర్‌కు మహిళా సీఈవో, ఎంపిక చేసిన ఎలాన్ మస్క్.. ఆమె ఎవరంటే?
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ట్విటర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారా? ఆయన స్థానంలో మహిళను సీఈవోగా నియమించనున్నారా? ఆరు నెలలుగా నాన్చుతూ వచ్చిన మస్క్ కొత్త సీఈవో పదవిపై క్లారిటీ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నారు ట్విటర్ బాస్. మరో ఆరు వారాల్లో కొత్త మహిళా సీఈవోని నియమించనున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఆమె ఎవరు? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks! My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops. — Elon Musk (@elonmusk) May 11, 2023 ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఎన్బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటీవ్ లిండా యక్కరినో త్వరలో ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. నియామకంపై ఆమెను సంప్రదించగా.. వివరణ ఇవ్వలేదు. రూ.3.37లక్షల కోట్లు పెట్టి.. గత ఏడాది మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసింది. నాటి నుంచి ట్విటర్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఒకానొక సమయంలో సంస్థలోని మార్పులు కారణంగా ఆఫీస్‌లోనే నిద్రపోవాల్సి వస్తుంది అంటూ వర్క్‌పై తన డెడికేషన్ ఎలా ఉందో చెప్పకనే చెప్పారు. సీఈవో పదవి నుంచి వైదొలగాలా? మార్పులు చేర్పులు కొనసాగుతుండగా.. డిసెంబర్ నెలలో మస్క్ చేసిన ట్విట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి వైదొలగాలా? అని నెటిజన్లను ప్రశ్నించగా.. అందుకు 57.5 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ఆ పోల్ దెబ్బకు ట్విటర్ 50 శాతానికి పైగా నష్టపోయింది. Should I step down as head of Twitter? I will abide by the results of this poll. — Elon Musk (@elonmusk) December 18, 2022 చర్చాంశనీయంగా ఎలాన్ మస్క్ ప్రకటన 2022 ప్రారంభం నుండి రోజువారీ వినియోగదారులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రకటనలలు భారీగా తగ్గాయి. ఫలితంగా అక్టోబర్ నుండి ట్విటర్ ఆదాయం 50శాతానికి తగ్గిందని మస్క్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పాటు ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అట్టర్ ప్లాప్ అయ్యింది. వేలాది ఉద్యోగులను తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అనుమతించారు. ఇలా ట్విటర్ స్వరూపాన్ని మార్చేసిన మస్క్ తాజాగా కొత్త సీఈవోని తెస్తున్నట్లు ప్రకటన చేయడం చర్చానీయాంశంగా మారింది. చదవండి👉 ‘నిద్ర పోండి..సంపాదించండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం!