ట్విటర్ యూజర్లు రోజులో చదివే ట్వీట్లపై ఎలాన్ మస్క్ పరిమితులు విధించారు. అయితే, ట్విటర్ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో సమర్ధించారు. స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకు తాత్కాలిక పరిమితిని విధించినట్లు తెలిపారు.
జులై 1న నాన్ వెరిఫైడ్ యూజర్లు రోజుకు 600 ట్వీట్‌లను చదివేందుకు మస్క్ అనుమతిచ్చారు. వెరిఫైడ్ యూజర్లు 6,000, కొత్తగా ట్విటర్‌ను వినియోగిస్తున్న యూజర్లు 300 ట్వీట్‌లను చదివే వెసలు బాటు కల్పించారు.
తాజాగా, ట్విటర్‌లో చేస్తున్న మార్పులపై లిండా యాకరినో స్పందించారు. ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ తరహా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ సైతం అర్థవంతమైనదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫేక్ యూజర్లకు చెక్ పెట్టేలా
స్పామ్ ఖాతాలను అరికట్టేలా చదివే ట్వీట్‌లపై ట్విటర్ తాత్కాలికంగా పరిమితులు విధించింది. తద్వారా, ప్లాట్‌ఫారమ్ నుండి స్పామ్, బాట్‌లను తొలగించడానికి తీవ్ర చర్యలు అవసరమని ట్విటర్ నివేదించింది. ఈ చర్యల వల్ల ఫేక్ ట్విటర్ యూజర్లు.. సురక్షితంగా ఉండేందుకు చేసే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకుండా పోతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
తటస్థంగా ట్విటర్
మస్క్ ఊహించని నిర్ణయం కొద్ది మంది వినియోగదారుల్ని మాత్రమే ప్రభావితం చేసిందని, ప్రకటనలు మారినప్పటికీ అవి స్థిరంగా ఉన్నాయని ట్విటర్ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ను అందరికి ఆమోదయోగ్యంగా మార్చడంపైనే దృష్టిసారించినట్లు ట్విటర్ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment