Twitterati
-
ట్వీట్లపై ఆంక్షలు.. సమర్ధించిన సీఈవో లిండా యాకరినో
ట్విటర్ యూజర్లు రోజులో చదివే ట్వీట్లపై ఎలాన్ మస్క్ పరిమితులు విధించారు. అయితే, ట్విటర్ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో సమర్ధించారు. స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకు తాత్కాలిక పరిమితిని విధించినట్లు తెలిపారు. జులై 1న నాన్ వెరిఫైడ్ యూజర్లు రోజుకు 600 ట్వీట్లను చదివేందుకు మస్క్ అనుమతిచ్చారు. వెరిఫైడ్ యూజర్లు 6,000, కొత్తగా ట్విటర్‌ను వినియోగిస్తున్న యూజర్లు 300 ట్వీట్లను చదివే వెసలు బాటు కల్పించారు. తాజాగా, ట్విటర్లో చేస్తున్న మార్పులపై లిండా యాకరినో స్పందించారు. ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ తరహా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ సైతం అర్థవంతమైనదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫేక్ యూజర్లకు చెక్ పెట్టేలా స్పామ్ ఖాతాలను అరికట్టేలా చదివే ట్వీట్లపై ట్విటర్ తాత్కాలికంగా పరిమితులు విధించింది. తద్వారా, ప్లాట్‌ఫారమ్ నుండి స్పామ్, బాట్లను తొలగించడానికి తీవ్ర చర్యలు అవసరమని ట్విటర్ నివేదించింది. ఈ చర్యల వల్ల ఫేక్ ట్విటర్ యూజర్లు.. సురక్షితంగా ఉండేందుకు చేసే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకుండా పోతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తటస్థంగా ట్విటర్ మస్క్ ఊహించని నిర్ణయం కొద్ది మంది వినియోగదారుల్ని మాత్రమే ప్రభావితం చేసిందని, ప్రకటనలు మారినప్పటికీ అవి స్థిరంగా ఉన్నాయని ట్విటర్ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ను అందరికి ఆమోదయోగ్యంగా మార్చడంపైనే దృష్టిసారించినట్లు ట్విటర్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి👉 ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి? -
ఆ ఆప్షన్ తొలగింపు..ట్విటర్లో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విటర్లో ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ట్వీట్ చేస్తే .. సదరు ట్వీట్ ఏ ఫోన్ నుంచి ట్వీట్ చేశారో గుర్తించలేమని మస్క్ తెలిపారు. నెటిజన్ చేసిన ఓ ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ఏ మొబైల్ డివైజ్ నుంచి ట్వీట్ చేశారో ఇకపై గుర్తించలేమని వెల్లడించారు. బిలియనీర్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సంస్థలో తీసుకొచ్చిన మరో అప్డేట్ అని పలు నివేదికలు చెబుతున్నాయి. Hallelujah!! https://t.co/i2FyvXPIHO — Elon Musk (@elonmusk) December 18, 2022 మస్క్ గత నెలలో ఏ డివైజ్ నుంచి ట్వీట్ చేసిందో తెలిపే ఆప్షన్‌ను డిజేబుల్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫంక్షన్ స్క్రీన్ స్పేస్ & కంప్యూటర్ కు వృధా అని పేర్కొన్నారు. ప్రతి ట్వీట్ క్రింద ఏ పరికరంలో ట్వీట్ చేశారో తెలిపే ఆప్షన్‌ను డిలీట్ చేస్తున్నాం.మేం ఎందుకు అలా చేశామో కూడా ఎవరికీ తెలియదన్నారు. కాగా,ఈ మార్పు కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ట్విటర్ బ్లూను విడుదల చేసిన వెంటనే వస్తుందని స్పష్టం చేశారు. -
ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే..జాక్ పాట్! ఆపిల్‌కు దిమ్మదిరిగే కౌంటర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విలువైన వస్తువుకు బదులు చీప్‌గా సబ్బులు, ఇతర పనికిరాని వస్తువులు, ఒక్కోసారి రాళ్లు వచ్చిన సంఘటనలు గతంలో చాలా చూశాం. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ గతంలో విస్తృతంగా ట్రోల్ అయింది కూడా. అలాగే ఇటీవలి సేల్‌లో కస్టమర్లకు చివరి నిమిషాల్లో ఆర్డర్లను రద్దు చేసిందంటూ ఫ్లిప్‌కార్ట్ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉదంతం చోటు చేసుకుంది. ఒక వినియోగ దారుడు ఐఫోన్13ని ఆర్డర్ చేస్తే.. దీనికి బదులుగా లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 అందుకోవడం చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్విటర్ యూజర్ అశ్విన్ హెడ్జ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు రియాక్షన్ మాత్రం అల్టిమేట్. ఐఫోన్ 13, 14 అయినా ఒకటేగా పెద్దగా తేడా ఏముంది అంటూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నెటిజన్లు..రెండూ ఒకటేగా..ఆపిల్‌కే అయోమయంగా ఉంది. అయినా వాళ్ల తప్పేముంది.. నిజానికి రెండూ ఒకటేగా అంటూ సెటైర్లతో తమ కసి అంతా తీర్చుకుంటున్నారు. One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ — Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022 Even Apple got confused "ki dono same hi hai" https://t.co/V9HAjh2W5a — Raghav Aggarwal (@Raghav_285) October 5, 2022 Can't blame them, they literally are same devices. 😂 https://t.co/1PZGYFoCDZ — Vaibhav Sharma (@TheVaibhavShrma) October 5, 2022 -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్ పోర్టల్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌లైన్ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. పోర్టల్ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్, రకరకాల మీమ్స్‌తో ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately Tax professionals are not machines. They are working under a lot of stress and tension. Fix 31st August for non audit returns for ever. — K K Atal (@kkatal88) July 26, 2022 #Extend_Due_Date_Immediately #incometaxportal Sitting in office trying to download 26AS/AIS/TIS: pic.twitter.com/ciV0pjGLTg — Atish Paliwal (@atishpaliwal22) July 23, 2022 Clients with pending ITRs looking at their CAs : #Extend_Due_Date_Immediately #Extend_Due_Dates pic.twitter.com/N6yI9CSyyA — Yum (@upsehooon) July 24, 2022 Right now:-#Extend_Due_Date_Immediately#IncomeTaxReturn pic.twitter.com/JO5TJuEDwh — Bhavya (@iconic232001) July 26, 2022 -
ఐపీఎల్-2022 మెగా వేలంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మనోడే !
ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడే టాపిక్‌ని మించి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు మన తెలుగు తేజం గ్రంధి కిరణ్‌కుమార్. ఆటగాళ్లను మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వేలం సందర్భంగా ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు అమలు చేశాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అసలెవరీ కిరణ్ కుమార్.. ఆయన అమలు చేసిన వ్యూహాలు ఏంటీ? రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని మాత్రం అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ఒక వ్యక్తి మాత్రం తన ఎత్తుగడలతో ఫ్రాంచైజీలకు ముచ్చెమటలు పట్టించాడు. తన స్ట్రాటజీతో ఫ్రాంచైజీలకు భారీ నష్టాలను మిగులుస్తూ...ప్లేయర్లకు మంచి ధర వచ్చేలా చేసిన తెలుగు వ్యక్తి ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్. వీరు స్వయాన తెలుగు వారు కావడం విశేషం. పొగడ్తలతో ముంచెత్తిన క్రికెట్ ఫ్యాన్స్..! ఐపీఎల్ యాక్షన్ -2022 క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఆసక్తిగా చూసింది. అభిమానులు తమ ఫేవరెట్ జట్లు ఎవరిని కొనుగోలు చేస్తాయనే విషయంపై ఆసక్తిగా చూశారు. ఈ వేలం పాటలో బాగా హైలెట్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తారు. మిగతా ఫ్రాంచైజీలకు అంతు చిక్కకుండా వేలంలో కిరణ్ వ్యూహాలకు క్రికెట్ అభిమానులు ముగ్దులయ్యారు. అప్పటికప్పుడే తక్కువ ధరకే అమ్ముడయ్యే ప్లేయర్స్‌ను ఎక్కువ ధరకు అమ్ముడయ్యేలా చేశాడు కిరణ్ కుమార్. ఇక డేవిడ్ వార్నర్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకునేలా కిరణ్ కుమార్ కీలక పాత్ర వహించారు. పృథ్వీ షా, కెఎస్ భరత్ లను కూడా మంచి ధరకే కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు. కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్ , ముస్తాఫిజుర్ రెహమాన్. శార్దూల్ ఠాకూర్ విషయంలో కాస్త ఎక్కువగా ఖర్చు చేసినా సరే… కిరణ్ కుమార్ మాత్రం తగ్గేదేలే అంటూ వారిని ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు దక్కేలా చేశారు. ఇక తన స్ట్రాటజీతో వేలంలో కేవలం 4.60 కోట్లకు 19 ప్లేయర్స్ ఢిల్లీకి వచ్చేలా చేశారు. ఈయన దెబ్బకు ఇతర జట్ల ఓనర్లు షాక్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జీఏంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈవో..! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మలికార్జున రావు(జీఎంఆర్) కుమారుడు..కిరణ్ కుమార్. వీరు ప్రస్తుతం జీఏంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సీఈఓ, ఎండీ & డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకి కో-ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. The real game changer of mega auction #IPLAuction #DelhiCapitals All players should thank this man because of him they got more 💸💵for any franchise 🤣🤣#StarSports pic.twitter.com/bs9QXhvtTc — ankit@kumar (@ankitku98643706) February 13, 2022 Use 🧠! #DelhiCapitals are the first team to complete their minimum players' squad. They've bought 19 players with 4.60cr still left in their purse. pic.twitter.com/KIAU8v2CkX — EMPURAAN👑 (@aswin_offcl) February 13, 2022 This man 😂 #IPLMegaAuction2022 #IPL2022Auction #DelhiCapitals pic.twitter.com/uq1gTDpCKG — Akarsh (@akarsh024) February 12, 2022 చదవండి: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..! -
గులాబ్ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరప్రజల్లో గులాబ్ తుపాన్ గుబులు పుట్టిస్తుంది. సాయంత్రం నాలుగంట్ల సమయంలోనే నగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక భారీ వర్షాల పట్ల సోషల్‌మీడియాలో నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా..మరికొంత మంది నెటిజన్లు భారీ వర్షాల నేపథ్యంలో ఎలక్ట్రిక్, జీహెచ్ఎమ్సీ, ట్రాఫిక్ సిబ్బంది చేస్తోన్న చర్యలను మెచ్చుకుంటున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వానను లెక్కచేయకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సిబ్బంది పోల్ ఎక్కి కరెంట్ సరఫరాను మెరుగుపర్చేందుకు చేస్తోన్న కృషికి నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. ట్విటర్లో ఓ నెటిజన్..‘మేము అందరం మీరు చెప్పినట్లుగానే హెల్మెట్స్ పెట్టుకొని బైక్‌లను నడుపుతున్నాం. అసలు ఇక్కడ రోడ్ ఎక్కడ ఉందని ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మరో నెటిజన్ నీళ్లలో బైక్ నడిపితే ఊహలకి.. వాస్తవానికి చాలా తేడా ఉందంటూ .. మీమ్‌ను షేర్ చేశాడు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల ఉండే మూగజీవాలను రక్షించేందుకు పలు టోల్ ఫ్రీ నంబర్లను షేర్ చేస్తున్నారు. Dear Govt.. we are all driving with helmets, but where is the road?🤔#GHMC @KTRTRS @GadwalvijayaTRS @GHMCOnline @trspartyonline @HYDTP #HyderabadRains pic.twitter.com/wBBj9qpm9E — Ahmed | అహ్మద్ | احمد حسین (@iamwithahmed) September 27, 2021 True... 🖐#HyderabadRains @HiHyderabad pic.twitter.com/vg45xerMo3 — Raaz✍🏼🌱 (@Raaz_BRS) September 27, 2021 Real Heroes During rain ❤ We should respect them and treat them in polite way...they too have family Allah hum ki hifazath farmaye#HyderabadRains 💦💦💦 @asadowaisi @KTRTRS @TsspdclCorporat @DRFEVDM pic.twitter.com/0ytYjsIUsI — Mohammed Inayath ulla sharief (@InayathShafi) September 27, 2021 #Hyderabad Please note 👇#HyderabadRains #AnimalSafety pic.twitter.com/vuEBR40Lhe — iamsowmya (@iamsowmya18) September 27, 2021 -
పానీపూరీ కాదు.. పానీ, పూరీ తెచ్చిన రచ్చ!
పానీ పూరీ అంటే తెలియని స్ట్రీట్‌ఫుడ్ ప్రియులు ఎవరుండరు. రోడ్డు పక్కన ఉన్న పానీపురీ బండిని చూశామంటే అంతే సంగతులు..! నోట్లో నీళ్లూరడం ఖాయం. ప్రాంతాన్ని బట్టి పానీపూరీని వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పే, పానీకే పటాషే, ... ఇలా ప్రాంతాలను బట్టి పేరు మారితేనేం? దీని రుచిలో ఉండే మజానే వేరు. కానీ ప్రస్తుతం ఈ పానీపూరీయే ట్విటర్లో కొత్త రచ్చకు దారీ తీసింది. ఈ అంశంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కాగా, ట్విటర్లో ఓ నెటిజన్ గోల్గప్పే, పానీపూరి ఒకటి కాదని చర్చకు తెరలేపింది. ట్విటర్లో ఓ ఫొటోనూ షేర్ చేసింది. ఈ ఫోటోలో గోల్గప్పేకు సూచకంగా అసలైన పానీపూరీ ఫోటో పెట్టగా.. పానీపురీ అంటే గ్లాసులో నీరు ఆ పక్కనే పూరి ఉన్న ఫోటోను ఉంచింది. దీంతో కొంత మంది నెటిజన్లు ఈ ట్వీట్ పై ఆగ్రహానికి గురైయ్యారు. ప్రాంతాలను బట్టి తినే ఆహార పదార్ధాల పేర్లు మారుతుంటాయి. రకరకాల పేర్లతో పిలుచుకుంటాము అందులో తేడా ఏముంది. అందరూ దాన్ని ఇష్టంగానే ఆస్వాదిస్తాం అని ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. తాము పాటిస్తున్న ఆచార వ్యవహారాలే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. In bengal it call puchka in West Bengal, gup chup in jharkhand, chattisgarh, pani ke patashe in Uttar Pradesh, padaka in alli garh. Same dish just different names. — Reena🌝 lost soul 🥳 💐💋✤ (@borahae_bts_0) March 29, 2021 చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్ -
ఈ కార్పొరేట్ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై : వాళ్లిద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వృత్తిపరంగా ప్రత్యర్థులైన ఈ కార్పొరేట్ దిగ్గజాలు వ్యక్తులుగా మంచి స్నేహితులు కూడా. తాజాగా అంతకుమించి తమ మర్యాద పూర్వక ప్రవర్తనతో పలువురికి స్పూర్తిగా నిలిచారు. ఒకరు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి(73) కాగా, మరొకరు టాటా అధినేత రతన్ టాటా (82). మొన్న టాటా ఫోటోకు నెటిజన్లు ఫిదా అవ్వగా, కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాణమిచ్చే ఇన్ఫీ నారాయణ మూర్తి ఫోటోలు తాజాగా వైరలవుతున్నాయి. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు జనవరి 28 న జరిగిన ట్రైకాన్ ముంబై 2020, 11వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రతన్‌టాటాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన వెంటనే తన కంటే వయసులో పెద్దవారైన టాటాకు నారాయణ మూర్తి ఆయనకు పాదాభివందనం చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను, వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్ టాటా. దీంతో నారాయణమూర్తి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పలువురిని అబ్బుర పరుస్తున్నాయి. రెండు అతిపెద్ద ప్రత్యర్థి సంస్థలు, ఇద్దరు అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నారాయణ మూర్తి రతన్ టాటా పాదాలను తాకడం అపూర్వం. ఇంటర్నెట్లో ఇది ఉత్తమమైందంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. టాటా ఆశీర్వాదం కోసం ఆయన పాదాలను తాకడం నారాణమూర్తి వ్యక్తిత్వానికి నిదర్శనమని మరొకరు ట్వీట్ చేశారు. పిల్లల్లో ఇలాంటి గొప్ప సంస్కృతిని జీర్ణింప చేయాల్సిన అవసరం చాలా వుందని ఒక తండ్రిగా తాను భావిస్తున్నానన్నారు. కాగా ఇటీవల రతన్ టాటా తాను యువకుడిగా ఉన్నప్పటి అద్భుతమైన ఫోటోను షేర్ చేసి పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. Life Time Achievement Award to Ratan Tata and Narayana Murthy took Tata's blessings. #RatanTata @RNTata2000 @Infosys_nmurthy #business #WednesdayThoughts #Respect pic.twitter.com/f0NG5TpDeM — Shubham Choudhary (@shub_lakku) January 29, 2020 This picture defines all about humbleness and simplicity, Mr. N R Narayana Murthy touching Mr. Ratan Tata’s feet to seek his blessings. A lesson for all of us. 🙏 #TiEConMumbai2020 #inspirational #RatanTata #NarayanaMurthy pic.twitter.com/NfnGpv4H04 — Arisudan Tiwari (@Arisudan29) January 29, 2020 Two biggest rival company, two most humble businessman. Narayana Murthy touching feet of Ratan Tata is best thing on internet, today. pic.twitter.com/OAjjE6gzba — That Indian girl (@thtsal) January 29, 2020 -
‘స్వీటీ’ కామెంట్‌పై భగ్గుమన్న నెటిజన్లు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి అమర్యాదకరంగా సంభోదించిన వ్యక్తిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా ‘ఎవేక్..ఎరైజ్..డ్రీమ్ నో మోర్’ అనే ఆయన కోట్స్‌ను ట్విటర్లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉటంకిస్తూ ఇవి స్వామి వివేకానంద విరచిత ది ఎవేకెన్డ్ ఇండియా నుంచి తీసుకున్నానని ప్రస్తావించారు. ఈ ట్వీట్‌పై ట్విటర్ యూజర్ సంజయ్ ఘోష్ స్పందిస్తూ ఆమె కరెక్ట్ కోట్‌ను ఉపయోగించలేదనే క్రమంలో స్వీటీ అనే పదం వాడారు. సీతారామన్ వాడిన కోట్స్ కథా ఉపనిషద్ నుంచి సంగ్రహించినవని చెప్పుకొచ్చారు. దీనికి ఆమె బదులిస్తూ మీ ఆసక్తి సంతోషకరమని..1898 ఆగస్ట్‌లో రాసిన ‘ది అవేకెన్డ్ ఇండియా’నుండి ఈ కోట్స్‌ను తాను సంగ్రహించానని వెల్లడించారు. ఏమైనా ఆర్థిక మంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఘోష్ అలాంటి కామెంట్స్ చేయాల్సింది కాదని పలువురు ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. -
బ్రిటన్ రాజ దంపతుల ‘న్యూక్లియర్ బాంబు’ ట్విటర్ గగ్గోలు
లండన్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు హ్యారీ భార్య మేఘన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. విరామం కోసం ఆరు వారాల పాటు కెనడా వెళ్లి తిరిగి వచ్చిన జంటఈ ప్రకటన చేయడం విశేషం డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ నిర్ణయంపై సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఎవరితో సంప్రదించకుండా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా బ్రిటిష్ రాజ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్విటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు. గతరాత్రి వారిద్దరూ న్యూక్లియర్ బాంబు పేల్చారని మరొకరు కమెంట్ చేశారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. అయినా...వారు భరించగలరా ట్వీట్లు, హాస్యోక్తులు, వ్యంగ్యచిత్రాల వరద పారుతోంది. మరోవైపు ఇది రాచకుటుంబానికి చెందినవ్యవహారమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఈ పరిణామంపట్ల క్వీన్ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే వారి కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. View this post on Instagram “After many months of reflection and internal discussions, we have chosen to make a transition this year in starting to carve out a progressive new role within this institution. We intend to step back as ‘senior’ members of the Royal Family and work to become financially independent, while continuing to fully support Her Majesty The Queen. It is with your encouragement, particularly over the last few years, that we feel prepared to make this adjustment. We now plan to balance our time between the United Kingdom and North America, continuing to honour our duty to The Queen, the Commonwealth, and our patronages. This geographic balance will enable us to raise our son with an appreciation for the royal tradition into which he was born, while also providing our family with the space to focus on the next chapter, including the launch of our new charitable entity. We look forward to sharing the full details of this exciting next step in due course, as we continue to collaborate with Her Majesty The Queen, The Prince of Wales, The Duke of Cambridge and all relevant parties. Until then, please accept our deepest thanks for your continued support.” - The Duke and Duchess of Sussex For more information, please visit sussexroyal.com (link in bio) Image © PA A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Jan 8, 2020 at 10:33am PST -
సుష్మాకు నో ప్లేస్ : గుండె పగిలిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నసుష్మా స్వరాజ్ (66)కు మోదీ 2.oలో చోటు దక్కలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు రెండోసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సుష్మాకు అవకాశం దక్కలేదు. అయితే మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తరహాలోనే సుష్మా కూడా కేంద్రమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల రీత్యా తానే స్వయంగా తప్పుకున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ముందుగానే సుష్మా స్వరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్‌కు చోటు దక్కకపోవడంపై ట్విటర్ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వియ్ మిస్ యూ మేమ్ అంటూ విచారం వ్యక్తం చేశారు. మరికొందరైతే మేడం తిరిగి కావాలి..ఈ విషయాన్ని రీట్వీట్ చేయండి.. ట్రెండింగ్ చేయండి..తద్వారా ఆమెను కేంద్రమంత్రిగా వెనక్కి తెచ్చుకుందామటూ ట్వీట్ చేస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు తీరని లోటని మరొక యూజర్ ట్వీట్ చేశారు. కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్‌కు మూత్రపిండ మార్పిడి చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చదవండి : నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్ #sushmaswaraj we want you back mem plzz guys do retweet and make it trending so that mem will return — saksham gupta (@Guptasaksham07G) May 29, 2019 @SushmaSwaraj ji #sushmaswaraj 😢😭😢😭😢😭😢😭 ?????? — Nilesh U.R Dhanure (@DhanureNilesh) May 30, 2019 #SushmaSwaraj will not be part of Modi Cabinet. My heart breaks to hear this.#ModiSwearingIn #ModiSarkar2 — Nidhi Taneja (@nidhitaneja0795) May 30, 2019 Sushma Swaraj is not joining Modi's Cabinet. Huge loss for NRIs and Twitter.#ModiSwearingIn — Jet Lee(Vasooli Bhai) (@Vishj05) May 30, 2019 -
మీరలా ఎలా..? ట్విటర్లో మోదీకి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ.. ట్విటర్లో అభిమానులు, కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో వైవిధ్యం ప్రదర్శిస్తారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంటే ఒకింత ఆందోళనకు గురి కావాల్సిందిపోయి మోదీ లోక్‌సభలో దర్జాగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. మెజారిటీ ఉంది కాబట్టి అలా చేశారని అందరికీ తెలుసు. అదే అంశంపై ఒక అభిమాని ట్విటర్లో మోదీని ప్రశ్నించారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరెప్పుడూ నవ్వుతూ కనిపిస్తారెలా..? అని అడిగారు. దానికి మోదీ.. ‘పాయింట్ పట్టేశావ్’అంటూ సరదా సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తి.. అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 దాకా చర్చ కొనసాగింది కదా..! మళ్లీ ఉదయమే షాజహాన్‌పూర్ ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రాగలిగారు. 67 ఏళ్ల వయసులో ఇలా ఉండడం నిజంగా అద్భుతం అంటూ ప్రశంసించారు. ‘125 కోట్ల మీ ఆశిస్సులు ఉన్నాయి కాబట్టే ఇంత హుషారుగా ఉన్నాన’ని ప్రధాని రీట్వీట్ చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించిన సంగతి తెలిసిందే. Point taken. :) https://t.co/xtFMxxO8M6 — Narendra Modi (@narendramodi) 22 July 2018 The blessings of 125 crore Indians give me great strength. All my time is for the nation. https://t.co/NRHuduHyuw — Narendra Modi (@narendramodi) 22 July 2018 -
క్రికెటర్‌తో నటి ప్రేమాయణం గాల్లోనే....
సాక్షి, ముంబై: ఓ షర్మిలా ఠాగూర్-మన్సూర్ అలీ పటౌడీ, ఓ సంగీత బిజ్లానీ-అజారుద్దీన్, ఓ అనుష్క-విరాట్ కోహ్లీ.. ఇలా బాలీవుడ్ ప్యార్‌లో బోల్డయిన క్రికెటర్లు బోలెడంత మంది. ప్రేమ కథల్లో తేలినవి కొన్నయితే.. తెలీకుండా పోయినవి మరికొన్ని. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా క్రికెటర్‌తో ప్రేమాయాణం నడిపిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా-క్రికెటర్ హర్థిక్ పాండ్యాల మధ్య ఏదో నడుస్తుందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం వారి మధ్య రీసెంట్ గా జరిగిన ట్విట్టర్ సంభాషణే. అసలేం జరిగిందంటే... ఓ సైకిల్ ఫోటోను పోస్ట్ చేసిన పరిణితి.. అమేజింగ్ పార్టనర్‌తో ఫర్ఫెక్ట్ ప్రయాణం కోరుకుంటున్నట్లు... ఓ సందేశం ఉంచింది. దీనికి వెంటనే స్పందించిన క్రికెటర్ హర్ధిక్ బహుశా ఇది బాలీవుడ్ క్రికెట్ లింకులో రెండోదేమో అంటూ ఓ రిప్లై ఇచ్చాడు. దానికి పరిణితి తానేం సమాధానం చెప్పలేనంటూ దాటవేసింది. అంతే అప్పటి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమాయణం నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసేసింది. ఇక వ్యవహారం బాగా ముదిరిపోవటంతో పరిణితి ఓ ట్విట్టర్ వీడియోలో తన సందేశం ఉంచింది. జియోమీ కొత్త ఫోన్ 5ఎక్స్ ప్రచారంలో భాగంగానే తాను పార్టనర్ ట్వీట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చుకుంది. అయితే అలాంటప్పుడు హర్దిక్ ‘క్రికెట్-బాలీవుడ్‘ అంటూ ట్వీట్ ఎందుకు చేశాడంటూ మరికొందరు ఆ అనుమానాలను అలాగే కొనసాగిస్తుంటే.. ఇంకొందరేమో ఆ యాడ్ లో బహుశా ఇద్దరూ కలిసి నటిస్తారేమోనని చెబుతున్నారు. ఆ సంగతి ఏమోగానీ ప్రస్తుతం గోల్ మాల్ 4 చిత్రంలో పరిణితి నటిస్తోంది. For all those who are curious about the on going rumours. Here's the real story behind my new partner -
మాజీ క్రికెటర్‌పై ఇండియన్ ఫ్యాన్స్ గరం
సాక్షి, స్పోర్ట్స్: శ్రీలంక సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఇండియన్స్ గరంగరంగా ఉన్నారు. అసంబద్ధ వ్యాఖ్యల నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ పై ట్విట్టర్లో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆగష్టు 27న పల్లెకల్లె మూడో వన్డే సందర్భంగా లంక ఓటమిని తట్టుకోలేక శ్రీలంక ఫ్యాన్స్ బాటిళ్లను మైదానంలోకి విసిరి రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరగంట సేపు ఆటను నిలిపివేసి అనంతరం తిరిగి ప్రారంభించగా, భారత్ విక్టరీ సాధించింది. అయితే వరసగా ఓటమి పాలవుతున్న తమ జట్టును చూసి మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్ ను అర్జున రణతుంగ ఊరడించే క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడెన్ గార్డెన్ లో 1996లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాన్ని ఉటంకిస్తూ అభిమానులతో రణతుంగ... ‘మీకు నా విన్నపం ఒక్కటే. క్రికెట్ చరిత్రలో మనకంటూ ఓ చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. దయచేసి భారత క్రికెట్ అభిమానుల్లాగా మాత్రం ప్రవర్తించకండి. ఇలాంటి ప్రవర్తనతో లంక టీం పరువు తీయకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో రణతుంగా వార్ ప్రకటించిన ఇండియన్ క్రికెట్ లవర్స్ ట్వీట్లతో రణతుంగపై విరుచుకుపడుతున్నారు. Think before you speak. Indian spectators are matured than srilankans @ArjunaRanatunga — harikrishnaa (@harikrishnaa114) 30 August 2017 @ArjunaRanatunga A man who just have 4 test hundreds in his name (just equal to what our Aswin a batsman Cum bowler has in his name) — Ajay Sharma (@ajay_saraswat18) 30 August 2017 -
నువ్వు మూర్ఖుడివి: టాప్ డైరెక్టర్‌కు తిట్లు
ముంబై: అగ్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా అభ్యంతకర ఫొటో షేర్ చేసి, ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రూపొందించిన ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై’ ఈ లఘుచిత్రం గురించి చెబుతూ సానియా ఫొటో పెట్టి కామెంట్లు చేశారు. టెన్నిస్ ఆడుతుండగా తీసిన ఫొటోను పోస్ట్ చేసి వర్మ.. గతంలో సానియా చెప్పిన విషయాలను కామెంట్లుగా పెట్టారు. స్కార్టులు వేసుకుని టెన్నిస్ ఆడడానికి తన తండ్రి నిరాకరించాడని సానియా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తనకు నచ్చినట్టు జీవించాలను అమ్మాయి గురించి లఘుచిత్రంలో చూపించడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. ఇది షేర్ చేసిన సెకన్లలోనే నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కొంతమంది వర్మకు మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమివుందని ప్రశ్నించారు. వర్మ వ్యాఖ్యలను విశాలదృక్పథంతో చూడాలన్నారు. నెటిజన్లు చేసిన కామెంట్లలో కొన్ని.. భారతీయుల్లా పాకిస్తానీయులు ఊరుకోరు. తన భార్య ఫొటో పెట్టినందుకు షోయబ్ మాలిక్ వచ్చి మిమ్మల్ని దండిస్తాడు. మీరు మంచి ఫిల్మ్‌మేకర్ కానీ తండ్రిగా, మనిషిగా మీరెలాంటివారోనన్న అనుమానం కలుగుతోంది. వర్మ గురించి తెలిసి కూడా అమితాబ్ బచ్చన్ వంటి అగ్రనటులు ఆయనతో ఎందుకు పనిచేస్తారో? నువ్వు మూర్ఖుడివి, పిచ్చిచేష్టలు మానుకో. వర్మ మైండ్‌సెట్ అవమానకరం, మీ పరువు మీరే దిగజార్చుకుంటున్నారు. వర్మ చచ్చిపోవాలి.. అతడి ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ సోదరి, కూతురికి సంబంధించిన ఇలాంటి ఫొటోలు పెడతారా? ఇండియాకు ప్రతిభ ఉన్న దర్శకుడు కావాలి కానీ వివాదస్పద వ్యక్తి కాదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప మరోటి కాదు -
శోభా డే -సుష్మ ఓ సలహా.. రిటార్ట్
-
శోభా డే -సుష్మ ఓ సలహా.. రిటార్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి శోభాడే కి మరోసారి భంగపాటు తప్పలేదు. ఇటీవల రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఈమె మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుద్దేశించి చేసిన ట్విట్ పై పలువురు మండిపడుతున్నారు. నూతన సంవత్సరంగా సందర్బంగా... ట్వీట్స్ ఆపేసి..ప్రశాంతంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాలంటూ శుక్రవారం వివాదాస్పద సలహా ఇచ్చారు. దీంతో ట్విట్టరటీలు విరుచుకుపడ్డారు. నిజానికి ఆ పని చేయాల్సింది మీరేనంటూ పలువురు ట్విట్టర్ వినియోగదారులు శోభాడేకి రిటార్ట్ ఇచ్చారు. సుష్మ ట్విట్టర్లో చాలా చురుకుగా ఉంటూ.. విదేశాలలో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సహాయపడుతున్నారని కొనియాడారు. ఇలాంటి సలహాలు సమాజానికి ఏమాత్రం పనికిరావంటూ ఫైర్ అయ్యారు. ఆమెనుచూసి అసూయ పడకుండా...సుష్మను గౌరవించాలంటూ మరికొంత మంది సూచించారు. కాగా కేంద్రమంత్రి సుష్మ ఇటీవల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ తరువాత కూడా ట్విట్టర్ చురుగ్గా ఉంటూ..విదేశాల్లో ఉంటున్న భారతీయుల వీసా సమస్యలపై స్పందిస్తున్నారు. అలాగే అమెజాన్ డోర్మాట్ల వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. Sushma Swaraj : Resolution for 2017 - Keep calm and stop tweeting. — Shobhaa De (@DeShobhaa) January 13, 2017 -
అర్ణబ్ ఈజ్ కమింగ్ బ్యాక్...ట్విట్టర్ లో సందడి
న్యూఢిల్లీ: 'ఇండియా వాంట్స్ టు నో' అంటూ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఈజ్ కమింగ్ బ్యాక్. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే దృవీకరించినట్టుగా ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తాయి. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో...బాగా పాపులర్ అయిన అర్ణబ్ 'రిపబ్లిక్ ' అనే కొత్త వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'నా కొత్త వెంచర్ పేరు రిపబ్లిక్. నాకు భారత ప్రజల సపోర్ట్ కావాలి' అంటూ ట్వీట్ చేశారంటూ పేర్కొంటున్నారు. మిగతా విషయాలను మరో రెండు వారాల్లో అందించినున్నట్టు పేర్కొన్నారంటున్నారు. 'రిపబ్లిక్' అనే పేరుతో వస్తున్న అర్ణబ్ గోస్వామి కొత్త మీడియా ఛానల్ 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ఛానల్ లైవ్‌లోకి రానుందని సమాచారం. అలాగే ముంబైకి వెలుపల ఈ ఛానల్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తన టీంతో కొత్త వెంచర్ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. ఒక ప్రభావవంతమైన అడ్వర్టైజింగ్ కంపెనీలు ఈ వెంచర్లో భాగం కానున్నాయట. కాగా ది న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో పేరు గడించిన అర్ణబ్ గోస్వామి తన వెంచర్ పేరును ప్రకటించిన గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అభినందనలతో పాటూ, ఛలోక్తులు, వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి. తను పనిచేస్తున్న ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ పదవికి నవంబర్ 1న అర్ణబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. While#Presstitutes r busy in Rapes of PUBLIC There is a ray of hopes EMERGING as #Republic . Best Of Luck -
సోషల్ మీడియా.. ఉతికి ఆరేస్తోంది!
వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరంలో ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి అభాసుపాలైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), అందుకు క్షమాపణ చెప్పినా సోషల్ మీడియా శాంతించడం లేదు. ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు అదే ప్రధాని మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. వాషింగ్ మిషన్‌లో ఉతకడానికి వేసిన బట్టలను మోదీ తదేకంగా చూస్తున్నట్టు, ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు, తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్న బాబా రాందేవ్ యాడ్‌ను చూస్తున్నట్టు, తన తరఫున రిపోర్టింగ్ చేస్తున్న అనుపమ్ ఖేర్‌ను చూస్తున్నట్టు, ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరును గమనిస్తున్నట్టు, చెన్నైలో ఫొటో మార్ఫింగ్ ద్వారా వెలసిన అమ్మ బాహుబలి ఫొటోను తదేకంగా చూస్తున్నట్టు.. ఇలా ఒకటేమిటి.. ఎవరికి తోచినట్టు వారు ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంలో పోటీ పడుతున్నారు. వాటికి సందోర్భోచిత వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. చెన్నై నగరంలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి గురువారం నగరానికి వచ్చిన ప్రధాని మోదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసిన విషయం తెల్సిందే. మోదీ హెలికాప్టర్ విండో నుంచి నగరాన్ని చూస్తున్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో అందులో నుంచి ఏమీ కనిపించడం లేదు. ముందుగా ఇదే ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పీఐబీ, విండో నుంచి నగర పరిస్థితి కనిపించడం లేదని భావించి, నగర పరిస్థితికి సంబంధించిన మరో ఫొటోను ఫొటోషాప్‌లో కట్ అండ్ పేస్ట్ ద్వారా అతికించింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి అంతకుముందు పోస్ట్ చేసిన అసలు ఫొటోను తొలగించింది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా పీఐబీ చేసిన తప్పును ఉతికి ఆరేసింది. అలా చేసినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్టు పీఐబీ వివరణ కూడా ఇచ్చింది. అయినా సరే, సోషల్ మీడియా కూడా మీడియానే కదా! -
'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు
ప్రిన్స్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగే చాన్స్ రావాలనే కానీ లక్షలాది అభిమానులు క్యూలో ఉంటారు. ఈ అవకాశం వస్తే అభిమానులకు పండగే. మహేష్ బాబుతో కలసి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని దేవీశ్రీ ప్రసాదే వెల్లడించారు. మహేష్‌తో కలసి తాను సెల్ఫీ దిగానని, దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు క్లిక్ చేశాడని...ఆయనకు ధన్యవాదాలంటూ దేవీశ్రీ ట్విట్ చేశారు. మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు దేవీశ్రీ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియో శనివారం విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. A selfie wit the Superstar @urstrulyMahesh!! Speciality : Clicked by d Superstar himself !! Thaank U so much sirr!! -
ఏ మౌన్ కీ బాత్ క్యా హై మోదీ!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కుంభకోణాలపై ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పకుండా మౌనం పాటించడం పట్ల ట్విట్టర్లో ఆయనపై చలోక్తులు, విమర్శలు కురిపిస్తున్నారు. 'ఏ మన్ కీ బాత్ నహీ, మౌన్ కా బాత్ క్యా హై బోలో! అని ఒకరు...మోదీని ఫాలో అవడం వల్ల వివిధ దేశాల జాతీయ దినోత్సవాలు, వివిధ రాజకీయ నాయకుల జన్మదినోత్సవాలు తెలుసుకున్నాను తప్ప మరేమీ లేదని మరొకరు. ఆయన ఎక్కడికెళ్లినా ఇచ్చే నివాళులు, వివిధ భాషల్లో ఇచ్చే ట్వీట్లు తప్ప ట్విట్టర్లో ఆయనను ఫాలో అవడం వల్ల నేను నేర్చుకున్నదేమీ లేదని ఇంకొకరు... మోదీ ఇచ్చే ట్వీట్లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మనకు తెలిసిన విషయాలు. రెండోది మనం తెలసుకోవాల్సిన అవసరం లేని విషయాలు... మధ్య తరగతి ఓట్లతో గెలిచిన మోదీ ఇప్పుడు మధ్యతరగతికి చెందిన సమస్యల గురించి అసలే మాట్లాడడం లేదు. మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకు అప్పుడే ఎన్నికల జిమ్మిక్కు ప్రారంభించారు' అంటూ ట్విట్టర్లో విమర్శలు కురిపిస్తున్నారు. 'అన్‌ఫాలో మోదీ... అన్‌ఫాలో మోదీ!... ఎంతైనా ప్రధానమంత్రి కదా అని ఇంతకాలం మోదీని ఫాలో అవుతూ వచ్చాను. ఇక సెలవు. వెనక్కి వెళ్లి ఇలా ఎంతోమందినే అన్‌ఫాలో కావాల్సి ఉంది అని... దేశంలో ఇంత జరుగుతున్నా ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజా సంబంధాలను మెరుగు పర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు అని.... క్లికిజమే ఆయన సిద్ధాంతమని... నేను ఈక్షణమే అన్‌ఫాలో అవుతున్నాను అని... ఆయనను నేనెందుకు ఫాలో అవుతున్నానో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పడే జ్ఞానోదయమయిందనే' విమర్శలతో పాటు కొన్ని తోటివారికి నచ్చజెప్పే ట్వీట్లు కూడా ఉన్నాయి. అప్పుడే తొందరపడి విమర్శిస్తే ఎలా ! కాంగ్రెస్ ప్రభుత్వం 2004, 2009లో అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలను చూశాం. వాటితో పోలిస్తే ఇప్పటి వరకు చూసినవే తక్కువే కదా అని ఒకరు... ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా సరే, దేశ ఆర్థిక వృద్ధి రేటు నాలుగు శాతం పడిపోయేవరకు మనం విమర్శలకు దిగకూడదని మరొకరు... మోదీపై ట్విట్టర్లో విమర్శలు చేసే బదులు నేరుగా లేఖ రాయవచ్చుగదా! అని ఇంకొకరి సలహా... 'నీ సలహా పాటిస్తే నాకు పోస్టులో కొన్ని గులాబీ పూలు. మోదీ సెల్ఫీ ఫొటో వస్తుంది' అంటూ ఓ విమర్శకుడి కొసమెరుపు. అయితే ఎవరెన్ని చెప్పినా.. మోదీకి మాత్రం ట్విట్టర్లో ఇప్పటికీ 1,35,26,072 మంది ఫాలోవర్లు ఉన్నారు. -
'నాన్నను మిస్ అవుతున్నాను..'
వైఎస్ఆర్ జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66 జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తన ట్విట్టర్ లో తన అనుభూతులను పంచుకున్నారు. నా ప్రతి కదలికలో నాన్న గుర్తుకు వస్తున్నారు. నా కష్టంలో వెన్నంటి నిలిచేలా...అన్నింటిలో అండదండగా ఉండేలా కొండంత కుటుంబాన్ని నాకు ఇచ్చారు. ఆయన గొప్పతనం, స్ఫూర్తిదాయకమైన జీవితం, ఆయన అడుగుజాడల్లో నేను నడిచేలా...మరింత ధైర్యాన్ని మీ మద్దతను నాకివ్వండి..' అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు. I miss dad every waking moment. He has left me a large family which stood by me during my difficult times and continues to stands with me. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2015 You all daily give me the courage and support reminding me of his greatness and inspiring me to follow his path. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2015 -
'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది'
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం అని..సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకి ఆర్థం లేదన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్‌కి నా విన్నపం ఒకటే పిల్లిలా ఉండకండి, అభిమానులు మీ నుంచి పులి గర్జనలు కోరుకుంటున్నారని తెలిపారు. మేకకి, మొక్కకితేడా తెలియని సింహం సింహం కాదు అని వర్మ అన్నారు. ఇంకా ఏమన్నారంటే...సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి..తన గర్జనలో అంతరార్ధం కుక్కలకు వివరించకూడదు..సింహం జూ లో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు..కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదని..సింహం గర్జనలో అర్ధం వెతకడం కుక్కల మొరగడంలో లాజిక్ వెతకడం లాంటిది..పవన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉండాలని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్ చేశారు. Pawan oka gharjinche simham ..simham aalochichi gharjisthe aa gharjanakardhamledhu ..ninna speechlo naakanipinchindhidhi..but p k knows btr — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015 Kaani ikkada problem yentante gharjinche simham mekalaaga maatladuthondhi — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015 Sorry pillilaaga maatlatuthondhi — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015 My request to P K Simham is pleeeaase don't be a cat..As fans we expect a Tigers Roar from u — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015 Mekaki mokkaki theda theliyani simham Simhame kaadhu — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015 I wish and hope that p k should be best at what he shud be best about — Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2015