సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి అమర్యాదకరంగా సంభోదించిన వ్యక్తిపై నెటిజన్లు ఘాటుగా స‍్పందించారు. స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా ‘ఎవేక్..ఎరైజ్..డ్రీమ్ నో మోర్’ అనే ఆయన కోట్స్‌ను ట్విటర్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉటంకిస్తూ ఇవి స్వామి వివేకానంద విరచిత ది ఎవేకెన్డ్ ఇండియా నుంచి తీసుకున్నానని ప్రస్తావించారు. ఈ ట్వీట్‌పై ట్విటర్ యూజర్ సంజయ్ ఘోష్ స్పందిస్తూ ఆమె కరెక్ట్ కోట్‌ను ఉపయోగించలేదనే క్రమంలో స్వీటీ అనే పదం వాడారు.
సీతారామన్ వాడిన కోట్స్ కథా ఉపనిషద్ నుంచి సంగ్రహించినవని చెప్పుకొచ్చారు. దీనికి ఆమె బదులిస్తూ మీ ఆసక్తి సంతోషకరమని..1898 ఆగస్ట్‌లో రాసిన ‘ది అవేకెన్డ్ ఇండియా’నుండి ఈ కోట్స్‌ను తాను సంగ్రహించానని వెల్లడించారు. ఏమైనా ఆర్థిక మంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఘోష్ అలాంటి కామెంట్స్ చేయాల్సింది కాదని పలువురు ట్విటర్ యూజర్లు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment