లోక్‌సభలో నవ్వులు చిందిస్తున్న మోదీ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ.. ట్విటర్‌లో అభిమానులు, కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో వైవిధ్యం ప్రదర్శిస్తారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంటే ఒకింత ఆందోళనకు గురి కావాల్సిందిపోయి మోదీ లోక్‌సభలో దర్జాగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. మెజారిటీ ఉంది కాబట్టి అలా చేశారని అందరికీ తెలుసు.
అదే అంశంపై ఒక అభిమాని ట్విటర్‌లో మోదీని ప్రశ్నించారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరెప్పుడూ నవ్వుతూ కనిపిస్తారెలా..? అని అడిగారు. దానికి మోదీ.. ‘పాయింట్ పట్టేశావ్’అంటూ సరదా సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మరో వ్యక్తి.. అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 దాకా చర్చ కొనసాగింది కదా..! మళ్లీ ఉదయమే షాజహాన్‌పూర్ ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రాగలిగారు.
67 ఏళ్ల వయసులో ఇలా ఉండడం నిజంగా అద్భుతం అంటూ ప్రశంసించారు. ‘125 కోట్ల మీ ఆశిస్సులు ఉన్నాయి కాబట్టే ఇంత హుషారుగా ఉన్నాన’ని ప్రధాని రీట్వీట్ చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించిన సంగతి తెలిసిందే.
Point taken. :) https://t.co/xtFMxxO8M6
— Narendra Modi (@narendramodi) 22 July 2018
The blessings of 125 crore Indians give me great strength. All my time is for the nation. https://t.co/NRHuduHyuw
— Narendra Modi (@narendramodi) 22 July 2018
Comments
Please login to add a commentAdd a comment