ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విటర్‌లో ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుంచి ట్వీట్ చేస్తే .. సదరు ట్వీట్ ఏ ఫోన్ నుంచి ట్వీట్ చేశారో గుర్తించలేమని మస్క్ తెలిపారు.
నెటిజన్ చేసిన ఓ ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ఏ మొబైల్ డివైజ్ నుంచి ట్వీట్ చేశారో ఇకపై గుర్తించలేమని వెల్లడించారు. బిలియనీర్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సంస్థలో తీసుకొచ్చిన మరో అప్‌డేట్ అని పలు నివేదికలు చెబుతున్నాయి.
Hallelujah!! https://t.co/i2FyvXPIHO
— Elon Musk (@elonmusk) December 18, 2022
మస్క్ గత నెలలో ఏ డివైజ్ నుంచి ట్వీట్ చేసిందో తెలిపే ఆప్షన్‌ను డిజేబుల్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫంక్షన్ స్క్రీన్ స్పేస్ & కంప్యూటర్ కు వృధా అని పేర్కొన్నారు. ప్రతి ట్వీట్ క్రింద ఏ పరికరంలో ట్వీట్ చేశారో తెలిపే ఆప్షన్‌ను డిలీట్ చేస్తున్నాం.మేం ఎందుకు అలా చేశామో కూడా ఎవరికీ తెలియదన‍్నారు. కాగా,ఈ మార్పు కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ట్విటర్ బ్లూను విడుదల చేసిన వెంటనే వస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment