IPL 2022 Mega Auction: Twitterati Hail Delhi Capitals Co-Owner Kiran Kumar Grandhi for His Stratergy - Sakshi
Sakshi News home page

IPL Mega Auction 2022: వేలంలో ఫ్రాంఛైజీలకు ముచ్చెమటలు పట్టించిన తెలుగు తేజం

Published Mon, Feb 14 2022 12:46 PM | Last Updated on Mon, Feb 14 2022 3:55 PM

Twitterati Hail Delhi Capitals Co-Owner Kiran Kumar Grandhi For His Stratergy At IPL 2022 Mega Auction - Sakshi

ఐపీఎల్‌ మెగా వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడే టాపిక్‌ని మించి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు మన తెలుగు తేజం గ్రంధి కిరణ్‌కుమార్‌. ఆటగాళ్లను మించిన క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. వేలం సందర్భంగా ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు అమలు చేశాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అసలెవరీ కిరణ్‌ కుమార్‌.. ఆయన అమలు చేసిన వ్యూహాలు ఏంటీ?

రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్‌ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలితే.. కొందరిని మాత్రం అసలు పట్టించుకోకపోవడం విశేషం. ఇక ఐపీఎల్‌ మెగా వేలంలో ఒక వ్యక్తి మాత్రం తన ఎత్తుగడలతో ఫ్రాంచైజీలకు ముచ్చెమటలు పట్టించాడు.  తన స్ట్రాటజీతో ఫ్రాంచైజీలకు భారీ నష్టాలను మిగులుస్తూ...ప్లేయర్లకు మంచి ధర వచ్చేలా చేసిన తెలుగు వ్యక్తి ఎవరంటే  ఢిల్లీ క్యాపిటల్స్‌ కో-ఓనర్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌. వీరు స్వయాన తెలుగు వారు కావడం విశేషం.

పొగడ్తలతో ముంచెత్తిన క్రికెట్‌ ఫ్యాన్స్‌..!
ఐపీఎల్ యాక్షన్ -2022 క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఆసక్తిగా చూసింది. అభిమానులు తమ ఫేవరెట్‌ జట్లు ఎవరిని కొనుగోలు చేస్తాయనే విషయంపై ఆసక్తిగా చూశారు. ఈ వేలం పాటలో బాగా హైలెట్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కో-ఓనర్‌ గ్రంధి కిరణ్ కుమార్ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తారు. మిగతా ఫ్రాంచైజీలకు అంతు చిక్కకుండా వేలంలో కిరణ్‌ వ్యూహాలకు క్రికెట్‌ అభిమానులు ముగ్దులయ్యారు. 



అప్పటికప్పుడే
త​క్కువ ధరకే అమ్ముడయ్యే ప్లేయర్స్‌ను ఎక్కువ ధరకు అమ్ముడయ్యేలా చేశాడు కిరణ్‌ కుమార్‌. ఇక డేవిడ్‌ వార్నర్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకునేలా కిరణ్‌ కుమార్‌ కీలక పాత్ర వహించారు. పృథ్వీ షా, కెఎస్ భరత్ లను కూడా మంచి ధరకే కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు. కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్ , ముస్తాఫిజుర్ రెహమాన్. శార్దూల్ ఠాకూర్ విషయంలో కాస్త ఎక్కువగా ఖర్చు చేసినా సరే… కిరణ్ కుమార్ మాత్రం తగ్గేదేలే అంటూ వారిని ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంకు దక్కేలా చేశారు. ఇక తన స్ట్రాటజీతో వేలంలో కేవలం 4.60 కోట్లకు 19 ప్లేయర్స్‌ ఢిల్లీకి వచ్చేలా చేశారు. ఈయన దెబ్బకు ఇతర జట్ల ఓనర్లు షాక్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన  ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

జీఏంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సీఈవో..!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మలికార్జున రావు(జీఎంఆర్‌) కుమారుడు..కిరణ్‌ కుమార్‌. వీరు ప్రస్తుతం జీఏంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు  సీఈఓ, ఎండీ & డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకి కో-ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.


 

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement