ఐపీఎల్-2022 మెగా వేలం దిగ్విజయంగా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌ను ఢిల్లీ 10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
అతడితో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను రూ.6. 50 కోట్లకు, డేవిడ్ వార్నర్‌ను రూ.6. 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు కగా, ఏడుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటిల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్
రిషభ్ పంత్: రూ. 16 కోట్లు
శార్దుల్ ఠాకూర్: రూ. 10 కోట్ల 75 లక్షలు
అక్షర్ పటేల్ : రూ. 9 కోట్లు
పృథ్వీ షా: రూ. 7 కోట్ల 50 లక్షలు
నోర్జే : రూ. 6 కోట్ల 50 లక్షలు
మిచెల్ మార్ష్ : రూ. 6 కోట్ల 50 లక్షలు
డేవిడ్ వార్నర్: రూ. 6 కోట్ల 25 లక్షలు
ఖలీల్ అహ్మద్: రూ. 5 కోట్ల 25 లక్షలు
చేతన్ సకారియా: రూ. 4 కోట్ల 20 లక్షలు
రోవ్‌మన్ పావెల్: రూ. 2 కోట్ల 80 లక్షలు
కోన శ్రీకర్ భరత్ : రూ. 2 కోట్లు
కుల్దీప్ యాదవ్: రూ. 2 కోట్లు
ముస్తఫిజుర్: రూ. 2 కోట్లు
మన్‌దీప్ సింగ్: రూ. 1 కోటి 10 లక్షలు
కమలేశ్ నాగర్‌కోటి: రూ. 1 కోటి 10 లక్షలు
లలిత్ యాదవ్: రూ. 65 లక్షలు
యశ్ ధుల్: రూ. 50 లక్షలు
ప్రవీణ్ దూబే: రూ. 50 లక్షలు
సీఫెర్ట్: రూ. 50 లక్షలు
లుంగి ఎన్‌గిడి: రూ. 50 లక్షలు
విక్కీ ఓస్త్వాల్ : రూ. 20 లక్షలు
సర్ఫరాజ్ ఖాన్: రూ. 20 లక్షలు
అశ్విన్ హెబర్: రూ. 20 లక్షలు
రిపాల్ పటేల్ : రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment