IPL 2022 Auction: Yash Dhull Bought by Delhi Capitals for RS 50 Lakhs - Sakshi
Sakshi News home page

IPL 2022 Mega Auction: టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే!

Published Sun, Feb 13 2022 4:32 PM | Last Updated on Sun, Feb 13 2022 6:24 PM

Yash Dhull Bought By Delhi Capitals For INR 50 Lakhs - Sakshi

టీమిండియా అండ‌ర్‌-19 కెప్టెన్ యష్ ధుల్  ఐపీఎల్‌లో అరంగ‌ట్రేం చేయ‌నున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో యష్ ధుల్‌ను  రూ. 50 ల‌క్ష‌ల‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అత‌డి కోసం పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్  పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కి ఢిల్లీ యష్ ధుల్‌ను కైవ‌సం చేసుకుంది. ఇక అండ‌ర్‌-19 ప్ర‌పంచ క‌ప్‌ను య‌ష్ ధుల్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో యష్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ న‌మోదు చేశాడు.

అదే విధంగా య‌ష్‌ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధ‌ర ద‌క్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. డేవిడ్ మ‌ల‌న్‌,మార్నస్‌ లబుషేన్‌, ఇయాన్‌ మోర్గాన్‌,సౌరభ్‌ తివారి,ఆరోన్‌ ఫించ్ వంటి స్టార్ ఆట‌గాళ్లు రెండో రోజు వేలంలో అమ్ముడు పోలేదు.

చ‌ద‌వండి: IPL 2022 Auction: చేత‌న్ సకారియాకి బంపర్ ఆఫర్.. అప్పుడు 1.2 కోట్లు.. ఇప్ప‌డు ఏకంగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement