సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ టీ20 వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖరారు చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
అలాగే అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..
మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా..
అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా..
అత్యధిక స్ట్రయిక్‌రేట్ కలిగిన కెప్టెన్‌గా..
రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా..
రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..
అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు.
నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్‌లు కూడా పట్టాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు అంటున్నారు.
పంత్ వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైందనుకుంటే సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానంలో కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ రేసులో రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిలార్డర్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి ఖాయం.
శాంసన్‌ను తృణీకరించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజూ సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజూ అని ఓ ట్వీట్ చేశారు. సంజూ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలఖరులోగా టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment