టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
పోటీలో ఆ నలుగురు!
కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.
ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.
ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
డీకే అవసరమా?
ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.
కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment