'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది' | I wish and hope that p k should be best at what he shud be best about verma twitts | Sakshi
Sakshi News home page

'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది'

Published Wed, Jul 8 2015 6:58 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది' - Sakshi

'గర్జించే సింహం పిల్లిలా మాట్లాడుతోంది'

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం అని..సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకి ఆర్థం లేదన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్కి నా విన్నపం ఒకటే పిల్లిలా ఉండకండి, అభిమానులు మీ నుంచి పులి గర్జనలు కోరుకుంటున్నారని తెలిపారు. మేకకి, మొక్కకితేడా తెలియని సింహం సింహం కాదు అని వర్మ అన్నారు.
ఇంకా ఏమన్నారంటే...సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి..తన గర్జనలో అంతరార్ధం కుక్కలకు వివరించకూడదు..సింహం జూ లో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు..కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదని..సింహం గర్జనలో అర్ధం వెతకడం కుక్కల మొరగడంలో లాజిక్ వెతకడం లాంటిది..పవన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉండాలని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement