Ram Gopal Verma
-
వ్యూహం..
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
టికెట్ రేట్లపై నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల విషయంలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మంచి నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. చర్చలు వంద శాతం సంతృప్తినిచ్చాయి. టికెట్ ధరలు తగ్గించొద్దని చెప్పాను. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని కోరాను. సినీ పరిశ్రమకు ప్రతినిధిగా రాలేదు. ఒక దర్శక, నిర్మాతగా మాత్రమే వ్యక్తిగత వాదన వినిపించాను’ అని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. పవన్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే ఆరోపణలు సరైనవి కావన్నారు. ‘సినీ రంగమంటే ఒకరిద్దరు కాదు. ఈ ఒక్క చర్చతోనే టికెట్ల అంశానికి ముగింపు రాదు. పరిశ్రమలోని వందల మంది అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో మంత్రికి వివరించాను.’ అని చెప్పారు. ఏపీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే థియేటర్లు మూసివేశారన్నారు. కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వాన్ని మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు: మంత్రి పేర్ని నాని టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీలానే సినీ పరిశ్రమలో ఎవరైనా వచ్చి అభిప్రాయాలు తెలపవచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు. వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని అంశాలనే అమలు చేస్తున్నామన్నారు. 2013లో ఇచ్చిన జీవోతో పోలిస్తే రేట్లు పెంచామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చన్నారు. త్వరలోనే ఈ కమిటీ మరోసారి భేటీ అవుతుందన్నారు. కరోనా నేపథ్యంలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించామని చెప్పారు. సంక్రాంతికి సినిమా విడుదలకు ఇబ్బందిపడే వారు వాయిదా వేసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’, రాథే శ్యామ్ విడుదల వాయిదా వేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ పరిస్థితులను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
‘‘నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం ‘మర్డర్’ వివాదంలో ఇరక్కుంది. ప్రణయ్, అమృతల ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారనే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో చెప్పాను. కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు. -
ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’
-
వాస్తవ ఘటనతో...
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రం). శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి ప్రధాన పాత్రల్లో ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ –‘‘ఆ మధ్య జరిగిన ఒక వాస్తవ ప్రేమ హత్య ఉదంతం నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎవరినీ కించపరచాలని ఈ చిత్రాన్ని తీయలేదు.. భావ స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని వాస్తవ ఘటనతో వర్మ రూపొందించారు. మా ట్రైలర్ విడుదలైన కొద్ది సమయానికే విశేష ఆదరణకు నోచుకుంది. ఆగస్ట్‌కి తొలి కాపీ సిద్ధమవుతుంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్, సంగీతం: డిఎస్ఆర్. -
వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి
-
ప్రవన్ కల్యాణ్ అద్భుతమైన నటుడు: వర్మ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించిన మరో స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రవన్‌కల్యాణ్ నటిస్తున్న మెగా మూవీ పవర్‌స్టార్‌ను ఆర్జీవీవరల్డ్ థియేటర్లో విడుదల కాబోతుంది’’ అంటూ పవర్ స్టార్‌లో లీడ్ రోల్లో నటిస్తున్న వ్యక్తి గ్లాసును తదేకంగా చూస్తున్న మరో పోస్టర్‌ను షేర్ చేశారు. అంతేగాకుండా తన హీరో ప్రవన్‌కల్యాణ్ అద్భుతమైన నటుడని, ఇతర స్టార్లతో పోలిస్తే ఎంతో పవర్ఫుల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమా విడుదల తేదీని తేదీని మాత్రం వెల్లడించలేదు.(ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) కాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ.. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో కొత్త సినిమాకు ‘పవర్ స్టార్’ అని పేరు పెట్టాం. ఇందులో పీకే, ఎమ్ఎస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని ట్విటర్ వేదికగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక పోస్టర్లు విడుదల చేసిన ఆర్జీవీ సోషల్ మీడియాలో ఎప్పటికపుడు సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత, మారుతీరావుల కథ ఆధారంగా ‘మర్డర్’ , ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. The hero of POWER STAR Mr. @PrawanKalyan is a FANTASTIC actor more POWERful than any STAR pic.twitter.com/wRhspWoZB5 — Ram Gopal Varma (@RGVzoomin) July 14, 2020 -
పవన్‌ను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డిపై వర్మ ట్వీట్
ముంబై: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిన్న(శనివారం) హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట శ్రీరెడ్డి చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్ సెలబ్రిటీ. ముంబైలో పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని జనాలు సైతం శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. ఇటు శ్రీరెడ్డి నిరసనపై మా అసోషియేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని, మా సభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఈ విషయంలో లీగల్ చర్యలకు సైతం వెనుకాడబోమని మా అధ్యక్షుడు శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. తన డిమాండ్ నెరవేరే వరకూ నిరసన విరమించబోనని నటి శ్రీరెడ్డి ఇదివరకే ప్రకటించారు. Sri Reddy has become a national celebrity..People in Mumbai,who don’t even know Pawan Kalyan are talking about Sri Reddy — Ram Gopal Varma (@RGVzoomin) 8 April 2018 -
వర్మపై నిర్భయ కేసు నమోదు చేయాలి
ఒంగోలు టౌన్: మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ ఫోర్న్ సినిమాలు తీసే రామ్‌గోపాల్‌వర్మపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఐద్వా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యూ.ఆదిలక్ష్మి మాట్లాడుతూ జీఎస్టీ సినిమాలో మహిళలను అసభ్యకరంగా చూపించారన్నారు. ఐద్వా నాయకురాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తుంటే మహిళలపై ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేసే వరకూ మహిళా సంఘాలు చేస్తున్న నిరాహారదీక్షల్లో మహిళా కమీషన్ చైర్పర్సన్ పాల్గొనాలని కోరారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కించపరిచే విధంగా ఫోర్న్ సినిమాలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. రామ్‌గోపాల్‌వర్మ తీసిన జీఎస్టీ సినిమా యువతను పెడద్రోవ పట్టించే విధంగా ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకురాళ్లు కల్పన, రాజేశ్వరి, గోవిందమ్మ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భారతి, మంజుల, యూటీఎఫ్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన మహిళా నేతలు -
‘నాగార్జున నాపై ఎంతో నమ్మకం ఉంచాడు’
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 28 ఏళ్ల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తెరకెక్కిస్తున్న చిత్రం ముహూర్తపు షాట్‌ను సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారని తెలిపాడు. ఈ కథను తాను నాగ్ కు చెప్పిన తరువాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే స్థాయిలో సినిమాను తీయనున్నట్లు పేర్కొన్నాడు. తాను నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తరువాత నాగ్ రియాక్షన్ చూసినపుడు ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగిందని వర్మ చెప్పుకొచ్చాడు. ‘గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది.’ అన్నారు. అన్నపూర్ణ స్టూడియో అంటే తనకు సెంటిమెంట్ అని, డిసెంబర్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నువ్వు మూర్ఖుడివి: టాప్ డైరెక్టర్‌కు తిట్లు
ముంబై: అగ్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా అభ్యంతకర ఫొటో షేర్ చేసి, ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రూపొందించిన ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై’ ఈ లఘుచిత్రం గురించి చెబుతూ సానియా ఫొటో పెట్టి కామెంట్లు చేశారు. టెన్నిస్ ఆడుతుండగా తీసిన ఫొటోను పోస్ట్ చేసి వర్మ.. గతంలో సానియా చెప్పిన విషయాలను కామెంట్లుగా పెట్టారు. స్కార్టులు వేసుకుని టెన్నిస్ ఆడడానికి తన తండ్రి నిరాకరించాడని సానియా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తనకు నచ్చినట్టు జీవించాలను అమ్మాయి గురించి లఘుచిత్రంలో చూపించడం జరిగిందని వర్మ పేర్కొన్నారు. ఇది షేర్ చేసిన సెకన్లలోనే నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కొంతమంది వర్మకు మద్దతు ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమివుందని ప్రశ్నించారు. వర్మ వ్యాఖ్యలను విశాలదృక్పథంతో చూడాలన్నారు. నెటిజన్లు చేసిన కామెంట్లలో కొన్ని.. భారతీయుల్లా పాకిస్తానీయులు ఊరుకోరు. తన భార్య ఫొటో పెట్టినందుకు షోయబ్ మాలిక్ వచ్చి మిమ్మల్ని దండిస్తాడు. మీరు మంచి ఫిల్మ్‌మేకర్ కానీ తండ్రిగా, మనిషిగా మీరెలాంటివారోనన్న అనుమానం కలుగుతోంది. వర్మ గురించి తెలిసి కూడా అమితాబ్ బచ్చన్ వంటి అగ్రనటులు ఆయనతో ఎందుకు పనిచేస్తారో? నువ్వు మూర్ఖుడివి, పిచ్చిచేష్టలు మానుకో. వర్మ మైండ్‌సెట్ అవమానకరం, మీ పరువు మీరే దిగజార్చుకుంటున్నారు. వర్మ చచ్చిపోవాలి.. అతడి ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ సోదరి, కూతురికి సంబంధించిన ఇలాంటి ఫొటోలు పెడతారా? ఇండియాకు ప్రతిభ ఉన్న దర్శకుడు కావాలి కానీ వివాదస్పద వ్యక్తి కాదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప మరోటి కాదు -
ఈరోజు మీకు సర్ ప్రైజ్ ఇస్తా: వర్మ
హైదరాబాద్: తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం ఏంటన్నది అప్పడే చెప్పకుండా కాస్త సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు వర్మ. అయితే వర్మ ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే నేటి(శుక్రవారం) సాయంత్రం 5.30 గంటల సమయం వరకు వేచి చూడక తప్పదు. 'నా ట్విట్టర్ ఫాలోయర్స్ అందరికీ నేటి సాయంత్రం 5:30 గంటలకు ప్లీజెంట్లీ అన్ ప్లీజెంట్ సర్ ప్రైజ్ (సంతోషకరమైన విషాద వార్త) ఇవ్వబోతున్నానని' దర్శకుడు వర్మ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. వర్మ చేసిన ట్వీట్ ను ఆయన ఫాలోయర్లు రీట్వీట్ చేస్తున్నారు. ఏం సర్ ప్రైజ్ ఇస్తారో చెప్పాలని మరికొందరు వర్మ ట్వీట్ కు రిప్లైలు వెల్లువలా వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో లేటెస్ట్ గా వచ్చిన సర్కార్ 3 అంతగా ఆకట్టుకోలేకపోయింది. వర్మ ఏం బాంబు పేల్చనున్నాడా అని మరికొందరు ఫాలోయర్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. All my twitter followers are going to get a pleasantly unpleasant surprise at 5.30 pm today — Ram Gopal Varma (@RGVzoomin) 26 May 2017 -
ఒకే కథతో రెండు సినిమాలు!
ముంబై: మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్లీపై జీవిత కథ ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. బ్రూస్లీపై సినిమా తీస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘లిటిల్ డ్రాగన్’ పేరుతో ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ సినిమా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బ్రూస్లీ కుమార్తె షనన్లీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు రచనా సహకారం కూడా ఆమె అందిస్తున్నారు. అయితే బ్రూస్లీ జీవితకథ ఆధారంగా తీసే సినిమాకు తాను మాత్రమే న్యాయం చేయగలనని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘బ్రూస్లీ గురించి ఆయన కుమార్తె షనన్లీ, భార్య లిండాలీ, శేఖర్ కపూర్ కంటే నాకే ఎక్కువ తెలుసు. బ్రూస్లీని దేవుడిలా ఆరాధించిన నేను ఆయన జీవితకథ ఆధారంగా సినిమా తీస్తాను. శేఖర్ కపూర్ సినిమా విడుదల రోజునే నా సినిమా రిలీజ్ చేస్తా. బ్రూస్లీ మీదనున్న వీరాభిమానంతోనే సినిమా తీస్తున్నాను, శేఖర్ కపూర్‌కు వ్యతిరేకంగా కాదు. ఈ చిత్రానికి నేనైతేనే న్యాయం చేయగలన’ని వర్మ పేర్కొన్నారు. -
'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా
విజయవాడ: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ డీజీపీ సాంబశివరావుని శుక్రవారం కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రామ్‌గోపాల్‌వర్మ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్‌పై వర్మ సెటైర్
ప్రముఖులపై పొగడ్తలు, సెటైర్లు లేదా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పడ్డాడు. ఇందుకు చిల్డ్రన్స్ డే సందర్భమైంది. కేజ్రీవాల్‌కు హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ వర్మ ట్వీట్ చేశాడు. సాధారణంగా చిన్న పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెబుతారు. అలాంటిది వర్మ ఢిల్లీ సీఎంకు చెప్పడంపై నెటిజెన్లు స్పందించారు. కేజ్రీవాల్ దేశంలోనే అతిపెద్ద కంప్లెయిన్ బాక్స్ అని, అందుకే ఆయనకు వర్మ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పారని ఓ నెటిజెన్ స్పందించాడు. కేజ్రీవాల్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం వర్మ మరిచాడా లేక కావాలనే వదిలేశాడా? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సినీ, రాజకీయ ప్రముఖులపై సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేసే వర్మ ఈసారి కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశాడు. Happy Children's Day to @ArvindKejriwal — Ram Gopal Varma (@RGVzoomin) 14 November 2016 -
రాంగోపాల్‌వర్మపై పోలీసులకు ఫిర్యాదు
కర్నూలు: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి నంద్యాల టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని నరసింహరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్లో ఉపాధ్యాయులను అవమానిస్తూ... వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కత్తి నరసింహరెడ్డి పోలీసులను కోరారు. అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ సంచలనాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులకు అవమానించడం తగదని వర్మకు నరసింహారెడ్డి హితవు పలికారు. అందువల్ల వర్మపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఏఎస్ఐ బాషాకు ఫిర్యాదు ప్రతిని అందజేసినట్లు నరసింహరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది. -
వివాదాస్పద ట్వీట్లపై విచారణ ఎదుర్కోనున్న వర్మ
ముంబై: ట్విట్టర్లో వినాయకుడిని ఎగతాళి చేస్తూ కామెంట్ చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ, వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఐటీ చట్టంలోని 66(ఏ) సెక్షన్, ఐపీసీలోని 295(ఏ), 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19 లోగా కోర్టు ముందు హాజరుకావడం కానీ, తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని ఆదేశించింది. గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. -
'ముత్తప్ప ముందు దావూద్ ఎంత!'
'గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరు' గా పేరుపొందిన ముత్తప్ప రాయ్ నేరజీవితంలోని నాటకీయతతో పోల్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత డాన్లు పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే లాంటి వాళ్ల జీవితాల్లోని నాటకీయత ఎందుకూ పనికిరానిది' అంటూ తన తాజా చిత్రం 'రాయ్' ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న 'రాయ్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను ఎంపికచేశారు. అయితే అనివార్యకారణాలవల్ల సుదీప్ స్థానంలో వివేక్ ఒబెరాయ్ ని రాయ్ పాత్రకోసం ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ సినిమాకు నిర్మాత. బెంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్ యువకుడిగా ఉన్నప్పుడు నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి, డాన్ గా ఎదిగాడు. తనపై హత్యాయత్నం జరగటంతో దుబాయ్ పారిపోయిన రాయ్.. అక్కడ దావూద్ తో కలిసి నేరాలు కొనసాగించారు. 2002లో అనూహ్యంగా ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన ముత్తప్ప 2008లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యాడు! 'జయ కర్ణాటక' ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అటు హోటల్ వ్యాపారాల్లోనూ రాణిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్ చిత్రమే 'రాయ్'. -
'పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. టేపులతో రండి'
'బివేర్.. మరో రెండు రోజుల్లో సమ్మర్ హీట్ పీక్స్ కు వెళ్లబోతోంది. ఆకాశంలో సూర్యుడి ప్రతాపంతోకాదు, బాక్సాఫీస్ దగ్గర పవన్ కల్యాణ్(పీకే) సినిమా'సర్దార్ గబ్బర్ సింగ్ (ఎస్జీఎస్)' సృష్టించబోతోన్న ప్రభంజనంతో!'.. ఫిల్మ్ నగర్ లోనేకాదు పీకే సినిమాతో రిలేట్ అయిన ప్రతిఒక్కరి నోటా ఇదే మాట! ఇక మెగా కుటుంబానికి వీరాభిమానినని(!) చెప్పుకునే రామ్ గోపాల్ వర్మదీ దాదాపు ఇదే మాట. మామూలుగానే పీకేపై ట్వీట్ల బాణాలు కురిపించే వర్మ.. ఎస్జీఎస్ రిలీజ్ అవుతోందంటే ఊరుకుంటాడా! మళ్లీ వదిలాడు.. 'పీకే ఫ్యాన్స్.. మీరంతా దూరాలు కొలిచే టేపులతో థియేటర్లకు రండి' అని సలహా ఇస్తున్నాడు వర్మ. ఎందుకు? ఇంకెందుకు.. ఎస్ జీఎస్ రిలీజ్ అవుతోన్న థియేటర్ల దగ్గర టికెట్లకోసం జనం కట్టిన క్యూ లైన్లు ఎంత పొడుగుంటాయో కొలవడానికి. 'బాహుబలి విడులైన రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టికెట్లకోసం జనం 1.5 కిటోమీటర్ల దూరం క్యూ కట్టారు. ప్రభాస్ కే అంత దూరం క్యూ కడితే, ఇక పీకే కోసం ఏ రేంజ్ లో క్యూకడతారో చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్లపై ఉగాది(8న) పండుగనాడు విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో భారీ స్థాయిలో విడుదలవుతోన్న రెండో చిత్రంగా రికార్డులకెక్కనుంది. ఓవర్సీస్ లో దాదాపు 800 స్క్రీన్లు, హిందీలో మరో 800 స్క్రీన్లపై చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక తెలుగులో రమారమి రెండున్నరవేల పైచిలుకు స్క్రీన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యే అవకాశంఉంది. I think PK fans from all over should come with measuring tapes,measure the q and prove to the whole world that PK is bigger than Prabhas — Ram Gopal Varma (@RGVzoomin) 5 April 2016 Compared to 1.5 kilometre long line for Bahubali on 1st day outside Prasad I max..very curious how many kilometres long line SGS will have — Ram Gopal Varma (@RGVzoomin) 5 April 2016 -
రాక్షసుణ్ణి నిద్రలేపాను!
‘‘ఈ సినిమాకు ముందు సి. కల్యాణ్‌గారు నన్ను కలిసి ‘నువ్వు చేయాల్సిన సినిమాలివి కావు’ అంటూ రెండు గంటలు క్లాస్ పీకారు. నా నుంచి డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారన్నారు. చిరంజీవిగారి ‘కొట్టండి, తిట్టండి..’ అనే ఓ పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఓ పాట రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాటిట్యూడ్‌తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్రలేపా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం ‘ఎటాక్’. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్ మేకింగ్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఓ యూనివర్సిటీ లాంటి వ్యక్తి. కల్యాణ్‌గారి బ్యానర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని మంచు మనోజ్ తెలిపారు. ఈ వేడుకలో కథానాయికలు సురభి, పూనమ్ కౌర్, లైన్ నిర్మాత ప్రసాద్ గుమ్ములూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సహ నిర్మాత మలినేని లక్ష్మయ్య చౌదరి, గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవికి 60 ఏళ్లా? నాకు నచ్చలేదు: వర్మ
హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి శనివారంతో 60 ఏళ్లలోకి ప్రవేశించనున్నారు. ఈ వేడుకని ఘనంగా జరపాలని చిరంజీవి సన్నిహితులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికర విషయాలను ట్విట్ చేశారు. 'చిరంజీవి గారూ మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు..దీన్ని ప్రచారం చేసి ఆర్భాటంగా 60 ఏళ్లు వచ్చాయని అందరికి చెప్పడం అంతకన్నా నచ్చలేదు.. అభిమానులకు మీరు ఎప్పుడు 26 ఏళ్ల యువకుడే' అంటూ ట్విట్ చేశారు. చిరంజీవిని ఉద్దేశించి కాదు కానీ.. మామూలుగా షష్టిపూర్తి అనేది కుటుంబ పెద్ద అనే బాధ్యతల నుంచి తప్పించడానికి సన్నిహితులు చేసే ఒక కార్యక్రమం అని అన్నారు. నేను మొదటిసారిగా చిరంజీవిని చూసినప్పుడు అయన వయస్సు 26 ఏళ్లు అని తెలిపారు. ఎప్పటికీ మీరు 26 ఏళ్ల యువకుడులానే ఉండాలి..మీరు షష్టిపూర్తి జరుపుకోవడానికి ఒప్పుకోవడం అభిమానులను చాలా బాధించిందన్నారు. Not in context of Mega but Shastipurthi I think is near and dear ones conspiracy to forcibly retire the head of the family — Ram Gopal Varma (@RGVzoomin) August 21, 2015 Chiranjeevigaru I hate it that u became 60 yrs old nd I hate it more that ur people are advertising it but u wil be forever 26 for us fans — Ram Gopal Varma (@RGVzoomin) August 21, 2015 -
'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి'
హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమాని ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులందరం అనుకుంటున్నామని అన్నారు. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక వేళ చిరంజీవి కాకపోతే ఆ సినిమాకి దర్శకత్వం పవన్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాహుబలిని మించుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ దర్వకత్వంలో మెగా స్టార్ చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా..అని నేను నిజాయితిగా మెగా అభిమానులను అడుగుతున్నాను అంటూ ట్విట్ చేశారు. రాంచరణ్ నిర్మాతగా, పవన్ దర్శకత్వంలో మెగాస్టార్ నటనతో మెగాబాహుబలి తెరకెక్కించవచ్చని అన్నారు. Ram Charan producing,Pawan kalyan directing nd Mega star acting wil make 150 into MegaBahuBali nd I think Mega family owes this to Mega fans — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 Only thing whch can create high of 150th is if Mega star directs himself..any other director will make us fans feel its lesser than Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 If not Megastar Pawan Kalyan shud direct..Pawan Kalyan directing Mega star's 150th will make it bigger than 2 Bahubalis — Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2015 -
'దేవుడే కాపాడలేక పోయాడు'
హైదరాబాద్: భగవంతుడు తన భక్తులనే కాపాడలేకపోయినపుడు పాపం సీఎం చంద్రబాబునాయుడు ఎలా కాపాడగలుగుతాడు అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్విట్స్ చేశాడు. పుష్కరాల్లో మరణించిన వారి విషయంలో అందరు చంద్రబాబునాయుడిని నిందిస్తున్నారన్నారు. కానీ భగంతున్ని మాత్రం ఎవరు నిందించడం లేదన్నారు. పుష్కరాలకు వచ్చిన అమాయక భక్తుల ప్రాణాలను ఎందుకు భగవంతుడు కాపాడలేకపోయాడన్నాడు. ఎందుకంటే బతికున్న మిగతా భక్తుల కంటే మరణించినవారు తక్కవగా దేవున్ని ప్రార్థించారేమో అని తెలిపారు. If God himself couldn't save his own devotees what can poor C B Naidu do? — Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 For the pushkara deaths How come everybody blames only Poor C B Naidu and nobody blames God? — Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 Why din't God stop those poor devotees from being killed in pushkaras..is it becos they prayed lesser than other devotees who stayed alive? — Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2015 -
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '
హైదరాబాద్: మెగా వీరాభిమానులందరం బాహుబలి సినిమాను మించి చిరంజీవి 150వ చిత్రం ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. బాహుబలిని మించి చిరు 150వ సినిమా లేకపోతే.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన దానికంటే మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ ట్విట్ చేశారు. రాజమౌళి తప్ప మరే ఇతర దర్శకులు చిరు 150వ సినిమాకి న్యాయం చేయలేరని భావిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళితే..మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిల కాంబినేషన్ అంతరిక్షాన్ని అందుకుంటుందని అన్నారు. I truly think except for Rajmouli nobody can do justice to Mega stars 150th film..with any other director it will be ULTRA MEGA THANDA — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Rajmouli Prabhas can go sky high Mega star Rajmouli can go space high ..Any other director will pull 150 down to earth — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 As the biggest fan of Mega Star me nd millions of his other fans want to see his 150th film bigger than the biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Mega star does not pitch his 150th film bigger than Bahubali it will be a bigger mistake than starting Praja Rajyam party — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 -
'బాహుబలిని చిరు అధిగమిస్తేనే'
హైదరాబాద్: బాహుబలి చిత్రం రికార్డును చిరంజీవి 150 వ చిత్రం అధిగమిస్తేనే ఏడేళ్ల మెగా అభిమానుల నిరీక్షణకు ఫలితం ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రం బాహుబలి చిత్రాన్ని అధిగమించాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిరంజీవి నటించే తదుపరి చిత్రాన్ని నిర్మాతలు బాహుబలికన్నా భారీగా నిర్మించలేకపోతే.. మెగా అభిమానులు నిరాశకు లోనవుతారన్నారు. మెగా స్టార్ నటించబోయే 150వ చిత్రం ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ చిత్రంగా కాకుండా బాహుబలిని కూడా అధిగమించాలన్నారు. The seven year anxious nd hungry wait of all fans of Mega can be only satisfied if the 150th is bigger than the biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015 Mega star's 150th cannot be the 2nd biggest also ...it has to be bigger than the biggest of biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015 Mega star's 150 th has to be biggest ever nd makers shud not make mistake of making it lesser than Bahubali or it can b Mega disappointment — Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2015