రాంగోపాల్వర్మపై పోలీసులకు ఫిర్యాదు | katti narsimha reddy police complaint on ram gopal verma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్వర్మపై పోలీసులకు ఫిర్యాదు

Published Tue, Sep 6 2016 10:35 PM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

రాంగోపాల్వర్మపై పోలీసులకు ఫిర్యాదు - Sakshi

రాంగోపాల్వర్మపై పోలీసులకు ఫిర్యాదు

కర్నూలు: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి నంద్యాల టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని నరసింహరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్గోపాల్ వర్మ ట్విట్టర్లో ఉపాధ్యాయులను అవమానిస్తూ... వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కత్తి నరసింహరెడ్డి పోలీసులను కోరారు.

అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ... రామ్గోపాల్ వర్మ సంచలనాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులకు అవమానించడం తగదని వర్మకు నరసింహారెడ్డి హితవు పలికారు. అందువల్ల వర్మపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఏఎస్ఐ బాషాకు ఫిర్యాదు ప్రతిని అందజేసినట్లు నరసింహరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement