ప్రవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన నటుడు: వర్మ | RGV Says His Power Star Film Will be Releasing in RGVWORLD THEATRE | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో ‘పవర్‌ స్టార్‌’ రిలీజ్‌!

Published Tue, Jul 14 2020 8:27 PM | Last Updated on Tue, Jul 14 2020 9:10 PM

RGV Says His Power Star Film Will be Releasing in RGVWORLD THEATRE - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించిన మరో స్టిల్‌‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రవన్‌కల్యాణ్‌ నటిస్తున్న మెగా మూవీ పవర్‌స్టార్‌ను ఆర్జీవీవరల్డ్‌ థియేటర్‌లో విడుదల కాబోతుంది’’ అంటూ పవర్‌ స్టార్‌లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్న వ్యక్తి గ్లాసును తదేకంగా చూస్తున్న మరో పోస్టర్‌ను షేర్‌ చేశారు. అంతేగాకుండా తన హీరో ప్రవన్‌కల్యాణ్‌ అద్భుతమైన నటుడని, ఇతర స్టార్‌లతో పోలిస్తే ఎంతో పవర్‌ఫుల్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమా విడుదల తేదీని తేదీని మాత్రం వెల్లడించలేదు.(ఆర్జీవీ అదిరిపోయే సమాధానం)

కాగా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆర్జీవీ..  ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. ఇందులో పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని ట్విటర్‌ వేదికగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక పోస్టర్లు విడుదల చేసిన ఆర్జీవీ సోషల్‌ మీడియాలో ఎప్పటికపుడు సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత, మారుతీరావుల కథ ఆధారంగా ‘మర్డర్’‌ , ‘కరోనా వైరస్‌’, ‘ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ’, ‘కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement