వివాదాస్పద ట్వీట్లపై విచారణ ఎదుర్కోనున్న వర్మ
ముంబై: ట్విట్టర్లో వినాయకుడిని ఎగతాళి చేస్తూ కామెంట్ చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ, వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఐటీ చట్టంలోని 66(ఏ) సెక్షన్, ఐపీసీలోని 295(ఏ), 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది.
జూలై 19 లోగా కోర్టు ముందు హాజరుకావడం కానీ, తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని ఆదేశించింది. గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.