Andheri court
-
Prithvi Shaw: అసలే దారుణ వైఫల్యం.. పృథ్వీ షాకు మరో భారీ షాక్!
Prithvi Shaw- Sapna Gill- Selfie Row: టీమిండియా యువ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షాకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2023లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న షాకు తాజాగా మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి సప్నా గిల్ అతడిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. కాగా ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ స్టార్ హోటల్ ఆవరణలో పృథ్వీ షా- సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. షాపై దాడి కేసులో సప్నా గిల్ సహా ఆమె వెంట ఉన్న వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షా అసభ్యంగా తాకాడంటూ ఆరోపణలు తాను, తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ తరచుగా ఆ హోటల్‌కు వెళ్తామని.. క్రికెట్ ఫ్యాన్ అయిన శోభిత్ పృథ్వీ షాను సెల్ఫీ అడుగగా అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ‘‘ఠాకూర్ టీనేజర్. తాగుబోతుల ప్రవర్తన ఎలా ఉంటుందో తనకి తెలియదు కదా! నిస్సహాయుడైన ఠాకూర్‌పై ఆ గుంపు దాడి చేయాలని చూసింది. అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గొడవకు దిగి ఠాకూర్‌ను గాయపరుస్తున్న షాను, అతడితో పాటు ఉన్న వాళ్లకు సర్ది చెప్పేందుకు మాత్రమే మధ్యలోకి వెళ్లాను’’ అని సప్నా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకి నెట్టివేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో బుధవారం.. ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించిన సప్నా గిల్.. పృథ్వీ షా, అతడి స్నేహితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బేస్‌బాల్ బ్యాట్‌తో తనను గాయపరచడం సహా తనని వేధించినందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా.. పృథ్వీ షాపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసిన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులపై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సప్నా గిల్ లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా షా ఐపీఎల్ పదహారో సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా 12, 7 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. చదవండి: బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్ -
కంగనకు మరో షాక్
సాక్షి, ముంబై : వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు అయ్యింది. సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ, ఆయన భార్య జరీనా వహబ్.. శుక్రవారం అంధేరీ కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశాడు. తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరిట అసత్య ఆరోపణలు చేస్తున్న కంగనపై కేసు వేసినట్లు ఆదిత్య పంచోలీ ప్రకటించారు . ‘కంగనా నాకు కొన్నేళ్లుగా తెలుసు. కానీ, ఈ మధ్య మీడియాలో ఆమె నా గురించి అభ్యంతరకర ప్రకటనలు చేస్తోంది. నాతోపాటు నా కుటుంబ సభ్యుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నా పరువును బజారుకీడుస్తోంది. నేను ఆమెను హింసించానన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. వాటిని మౌనంగా భరించాల్సిన అవసరం నాకేంటి. అందుకే ఆమెపై కేసు వేశా’ అని ఆయన చెప్పారు. క్రిమినల్ కేసుతోపాటు మరో సివిల్ కేసు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంచోలీ ఆయన భార్య జరీనా వహబ్ తెలిపారు. కాగా, కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలీ పేరును కూడా దావాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినిమాలోకి వచ్చిన కొత్తలో నటుడు ఆదిత్య పంచోలీ ఆమెకు గాడ్ ఫాదర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ రోషన్‌తో అఫైర్ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ఆయన ఆమెను దూరం పెట్టాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో పంచోలీ తనను దారుణంగా హింసించేవాడని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండేది ఆమె సోదరి రంగోలీ మరో బాంబు పేల్చింది. ఆయా ప్రకటనలపై వారిద్దరికీ పంచోలీ ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ.. వారి తరపునుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో ఆయన కేసు వేశారు. ఇప్పటికే బాలీవుడ్లో మద్దతు కరువై ఒంటరి అయిన ఆమె ఈ కేసును ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. -
వివాదాస్పద ట్వీట్లపై విచారణ ఎదుర్కోనున్న వర్మ
ముంబై: ట్విట్టర్లో వినాయకుడిని ఎగతాళి చేస్తూ కామెంట్ చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ, వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఐటీ చట్టంలోని 66(ఏ) సెక్షన్, ఐపీసీలోని 295(ఏ), 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19 లోగా కోర్టు ముందు హాజరుకావడం కానీ, తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని ఆదేశించింది. గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. -
వర్మపై ముంబై కోర్టులో కేసు
ముంబై: హిందువుల దేవుడు విఘ్నేశ్వరుడిని ఎగతాళి చేసేలా వ్యాఖ్యానించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ముంబైలోని అంధేరీ కోర్టులో శనివారం క్రిమినల్ కేసు దాఖలైంది. దీనిని ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ షెట్టీ దాఖలు చేశారు. ‘తన తలనే రక్షించుకోలేని వినాయకుడు ఇతరులను ఏం రక్షిస్తాడ’ని వినాయక చతుర్థి రోజున వర్మ ట్విట్టర్లో ట్వీట్ చేసిన విషయం విదితమే.