కేజ్రీవాల్‌పై వర్మ సెటైర్‌ | Ram Gopal Verma wishes Arvind Kejriwal 'Happy Children's Day' | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై వర్మ సెటైర్‌

Published Mon, Nov 14 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

కేజ్రీవాల్‌పై వర్మ సెటైర్‌

కేజ్రీవాల్‌పై వర్మ సెటైర్‌

ప్రముఖులపై పొగడ్తలు, సెటైర్లు లేదా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఈ సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పడ్డాడు. ఇందుకు చిల్డ్రన్స్ డే సందర్భమైంది. కేజ్రీవాల్‌కు హ్యాపీ చిల్డ్రన్స్‌ డే అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. సాధారణంగా చిన్న పిల్లలకు చిల్డ్రన్స్‌ డే శుభాకాంక్షలు చెబుతారు. అలాంటిది వర్మ ఢిల్లీ సీఎంకు చెప్పడంపై నెటిజెన్లు స్పందించారు.

కేజ్రీవాల్‌ దేశంలోనే అతిపెద్ద కంప్లెయిన్‌ బాక్స్‌ అని, అందుకే ఆయనకు వర్మ చిల్డ్రన్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారని ఓ నెటిజెన్‌ స్పందించాడు. కేజ్రీవాల్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం వర్మ మరిచాడా లేక కావాలనే వదిలేశాడా? అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. సినీ, రాజకీయ ప్రముఖులపై సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్‌ చేసే వర్మ ఈసారి కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement