ఈరోజు మీకు సర్ ప్రైజ్ ఇస్తా: వర్మ | director Ram Gopal Verma is going to surprise followers | Sakshi
Sakshi News home page

ఈరోజు మీకు సర్ ప్రైజ్ ఇస్తా: వర్మ

May 26 2017 3:31 PM | Updated on Sep 5 2017 12:03 PM

ఈరోజు మీకు సర్ ప్రైజ్ ఇస్తా: వర్మ

ఈరోజు మీకు సర్ ప్రైజ్ ఇస్తా: వర్మ

తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ తన అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

హైదరాబాద్‌: తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ తన అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం ఏంటన్నది అప్పడే చెప్పకుండా కాస్త సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు వర్మ. అయితే వర్మ ఇచ్చే ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసుకోవాలంటే  నేటి(శుక్రవారం) సాయంత్రం 5.30 గంటల సమయం వరకు వేచి చూడక తప్పదు.

'నా ట్విట్టర్ ఫాలోయర్స్ అందరికీ నేటి సాయంత్రం 5:30 గంటలకు ప్లీజెంట్లీ అన్ ప్లీజెంట్ సర్ ప్రైజ్ (సంతోషకరమైన విషాద వార్త) ఇవ్వబోతున్నానని' దర్శకుడు వర్మ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. వర్మ చేసిన ట్వీట్ ను ఆయన ఫాలోయర్లు రీట్వీట్ చేస్తున్నారు. ఏం సర్ ప్రైజ్ ఇస్తారో చెప్పాలని మరికొందరు వర్మ ట్వీట్ కు రిప్లైలు వెల్లువలా వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో లేటెస్ట్ గా వచ్చిన సర్కార్ 3 అంతగా ఆకట్టుకోలేకపోయింది. వర్మ ఏం బాంబు పేల్చనున్నాడా అని మరికొందరు ఫాలోయర్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement