ఒకే కథతో రెండు సినిమాలు! | RGV to make biopic on Bruce Lee, release it on same time as Kapur's 'Little Dragon' | Sakshi
Sakshi News home page

ఒకే కథతో రెండు సినిమాలు!

Published Tue, May 9 2017 1:45 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

ఒకే కథతో రెండు సినిమాలు!

ఒకే కథతో రెండు సినిమాలు!

ముంబై: మార్షల్‌ ఆర్ట్స్‌ దిగ్గజం బ్రూస్‌లీపై జీవిత కథ ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. బ్రూస్‌లీపై సినిమా తీస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘లిటిల్‌ డ్రాగన్‌’ పేరుతో ప్రఖ్యాత దర్శకుడు శేఖర్‌ కపూర్‌ సినిమా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బ్రూస్‌లీ కుమార్తె షనన్‌లీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు రచనా సహకారం కూడా ఆమె అందిస్తున్నారు. అయితే బ్రూస్‌లీ జీవితకథ ఆధారంగా తీసే సినిమాకు తాను మాత్రమే న్యాయం చేయగలనని రాంగోపాల్‌ వర్మ ప్రకటించారు.

‘బ్రూస్‌లీ గురించి ఆయన కుమార్తె షనన్‌లీ, భార్య లిండాలీ, శేఖర్‌ కపూర్‌ కంటే నాకే ఎక్కువ తెలుసు. బ్రూస్‌లీని దేవుడిలా ఆరాధించిన నేను ఆయన జీవితకథ ఆధారంగా సినిమా తీస్తాను. శేఖర్‌ కపూర్‌ సినిమా విడుదల రోజునే నా సినిమా రిలీజ్‌ చేస్తా. బ్రూస్‌లీ మీదనున్న వీరాభిమానంతోనే సినిమా తీస్తున్నాను, శేఖర్‌ కపూర్‌కు వ్యతిరేకంగా కాదు. ఈ చిత్రానికి నేనైతేనే న్యాయం చేయగలన’ని వర్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement