Little Dragon
-
ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు
కోలీవుడ్‌లో సంగీత పయనాన్ని ప్రారంభించిన ఏఆర్. రెహ్మాన్ ఆ తరువాత టాలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్ చిత్రాలకు తన సంగీత మాధుర్యాన్ని అందించే స్థాయికి ఎదిగారు. ఆంగ్ల చిత్రం స్లమ్డాగ్తో ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ సంగీత మాంత్రికుడు మరోసారి అంతర్జాతీయ స్థాయి చిత్రానికి సంగీతం అందించడానికి రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారంటే ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు. కరాటే కింగ్ బ్రూస్లీ పేరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సజీవం అని వేరే చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఏ నటుడు చేయనటువంటి సాహసాలు బ్రూస్లీ చేశాడు. అలాంటి బ్రూస్లీ జీవిత చరిత్ర వెండి తెరకెక్కుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్‌కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. ఆ బ్రహ్మాండ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో శేఖర్‌కపూర్ స్వయంగా వెల్లడించారు. ఆ చిత్రానికి లిటిల్డ్రాగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంగీతంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఏఆర్. రెహ్మాన్ సినీ కేరీర్లో ఈ లిటిల్ డ్రాగన్ చిత్రం మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఒకే కథతో రెండు సినిమాలు!
ముంబై: మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్లీపై జీవిత కథ ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. బ్రూస్లీపై సినిమా తీస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘లిటిల్ డ్రాగన్’ పేరుతో ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ సినిమా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బ్రూస్లీ కుమార్తె షనన్లీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు రచనా సహకారం కూడా ఆమె అందిస్తున్నారు. అయితే బ్రూస్లీ జీవితకథ ఆధారంగా తీసే సినిమాకు తాను మాత్రమే న్యాయం చేయగలనని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘బ్రూస్లీ గురించి ఆయన కుమార్తె షనన్లీ, భార్య లిండాలీ, శేఖర్ కపూర్ కంటే నాకే ఎక్కువ తెలుసు. బ్రూస్లీని దేవుడిలా ఆరాధించిన నేను ఆయన జీవితకథ ఆధారంగా సినిమా తీస్తాను. శేఖర్ కపూర్ సినిమా విడుదల రోజునే నా సినిమా రిలీజ్ చేస్తా. బ్రూస్లీ మీదనున్న వీరాభిమానంతోనే సినిమా తీస్తున్నాను, శేఖర్ కపూర్‌కు వ్యతిరేకంగా కాదు. ఈ చిత్రానికి నేనైతేనే న్యాయం చేయగలన’ని వర్మ పేర్కొన్నారు. -
డ్రాగన్ హంగామా
బొమ్మలు తెరపై మాట్లాడి, ఆడి పాడే 2డి యానిమేషన్ చిత్రాల అనుభూతిని మళ్లీ రుచి చూపించడానికి వస్తున్న చిత్రం ‘లిటిల్ డ్రాగన్’. గోలి శ్యామల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీజర్‌ను విడుదల చేశారు. జపాన్, భారత్ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కడుపుబ్బా న వ్విస్తుందని శ్యామల తెలిపారు.