ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ | Ram Gopal Varma About Murder Movie | Sakshi
Sakshi News home page

ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ

Published Sun, Nov 8 2020 1:41 AM | Last Updated on Sun, Nov 8 2020 2:14 AM

Ram Gopal Varma About Murder Movie - Sakshi

‘‘నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్‌’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన తాజా చిత్రం ‘మర్డర్‌’ వివాదంలో ఇరక్కుంది. ప్రణయ్, అమృతల ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారనే వివాదం మొదలైంది.

ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు  సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్‌’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్‌ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో  చెప్పాను.  కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement