అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ..'బచ్చలమల్లి క్యారెక్టర్ పేరు నిజమే. కథ మాత్రం నేనే రాసుకున్నా. నా లైఫ్‌లో మా అమ్మ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఈ చిత్రం కూడా మా అమ్మకు రాసిన క్షమాపణ లేఖ. నేను చేసిన తప్పు వల్ల చాలా బాధపడ్డా. నాలాగా ఇంకొకరు బాధ పడొద్దనే ఈ సినిమా ఉద్దేశం. తర్వాత అయినా అమ్మకు చెప్తా. నీ కోసం బచ్చలమల్లి సినిమా తీశానని' అంటూ డైరెక్టర్ మాట్లాడారు.
(ఇది చదవండి: బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్)
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బచ్చలమల్లి ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నరేశ్, అమృత అయ్యర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు హీరో, హీరోయిన్ సైకిల్‌పై వచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment