సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.
పద్మ పురస్కారం కోసం పోరాడతా
బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment