Vijaya nirmala
-
అమ్మ బయోపిక్ రూపొందించాలన్నది నా డ్రీమ్: వీకే నరేశ్
‘‘సినీ పరిశ్రమలో విజయవంతంగా 52 ఏళ్లు పూర్తి చేసుకోవడం హ్యాపీగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలకు, ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రిలీజైన ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వందకోట్ల కలెక్షన్స్‌ను దాటడం మన సక్సెస్. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రూ. 300 కోట్లను దాటుతుందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.ఇందులో నేను చేసిన ముఖ్యమంత్రి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో 2025 బిజీయస్ట్ ఇయర్. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలనూ తీసుకున్నాను. ‘సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్’ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవిగారి పేరుతోప్రారంభించాం. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేశాం.జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లు నా గురువులు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలగారిని చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్,పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించాం. రైటర్ సాయినాథ్గారి సహకారంతో ఆయనపై తయారు చేసిన పుస్తకాన్ని అమ్మగారి (దివంగత ప్రముఖ నటి– దర్శకురాలు విజయ నిర్మల) బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 20న లాంచ్ చేస్తాం. ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డ్స్‌ని ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అమ్మ విజయ నిర్మలగారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది నేనే రాయగలను. ఇక ‘చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాలకు పార్టు 2 చేయాలని ఉంది’’ అని అన్నారు. -
పద్మ అవార్డు కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు: నరేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.పద్మ పురస్కారం కోసం పోరాడతాబీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం -
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
కృష్ణ కుటుంబాన్ని ఎలా ఒప్పించారు..?
-
కృష్ణ గారిని భోజనానికి పిలిచి ఆయన చేత్తో వడ్డించారు ఎన్టీఆర్ గారు
-
విజయనిర్మల గురించి ఎంత చెప్పినా తక్కువే: ఆదిశేషగిరిరావు
-
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన మహిళా డైరెక్టర్.. ఆమె ఇంటిని చూశారా?
విజయనిర్మల ఈ పేరు తెలుగువారి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతలా తన పేరు తెలుగు సినీ పరిశ్రమలో లిఖించుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై మెరిశారు. తన ఏడో ఏటనే మత్స్యరేఖ అనే సినిమా ద్వారా బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 42 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. కృష్ణతో వివాహం ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం కాగా.. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టమని.. అందుకే కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారని తెలిపింది. అంతకుముందే విజయ నిర్మలకు కేఎస్ మూర్తితో వివాహం జరిగింది. వీరికి నరేశ్ సంతానం. ఆమె జూన్ 27న 2019లో కన్నుమూశారు. కాగా.. గతేడాది నవంబర్‌లో కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఎటు చూసిన అవార్డులే అయితే హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని మీరెప్పుడైనా చూశారా? హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో దాదాపు 12 ఏకరాల్లో ఆమె ఇంటిని నిర్మించారు. అప్పట్లోనే డైరెక్టర్‌గా తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. అంతలా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఆమె ఇల్లు కూడా అవార్డులతో నిండిపోయింది. ఆమె అక్కడే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఉండేవారు. ఈ ఇంట్లో ప్రస్తుతం నరేశ్, ఆయన కుమారుడు నవీన్ ఉంటున్నారు. ఆమె ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే గార్డెన్తో అన్ని రకాల వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించారు. అంతే కాకుండా ఆమెకు గిన్నిస్ అవార్డ్ వచ్చిన విషయాన్ని శిలాఫలకం తయారు చేయించారు. -
విజయ నిర్మల ఆంటీ కోపం ఎలా ఉంటుందంటే...!
-
కృష్ణ,విజయనిర్మల నటించిన సినిమానే మళ్ళీ పెళ్లి..నరేష్ షాకింగ్ కామెంట్స్
-
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్‌తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్‌లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్‌పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్‌లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్‌లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్‌గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్‌తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
కృష్ణతో పెళ్లికి విజయ నిర్మల ఆయన కుటుంబాన్ని ఎలా ఒప్పించిందంటే?
ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల కొన్నేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానమిచ్చారు. 'మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టం. కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారు. తర్వాత వాళ్లు మా ఇంట్లోనే ఉన్నారు. షూటింగ్‌కు వెళ్లేముందు కూడా అత్తామామలకు వంట చేసి పెట్టి వెళ్లేదాన్ని. వాళ్లకు నా చేతి వంట అంటే ఎంతో ఇష్టం. మా అత్త చనిపోయే ముందు నా చేతి బెండకాయ కూర, రసం ఉంటే తింటానన్నారు. అదే ఆమె చివరిసారిగా తినడం. కృష్ణగారితో మూడు కాంబినేషన్స్ అయ్యాక ఆయనను డైరెక్ట్ చేస్తానన్నాను. కానీ ఆయన ఆర్టిస్ట్‌గా 100 సినిమాలు పూర్తి చేయు, తర్వాత నాకు నచ్చింది చేయమన్నారు. సరేనని మలయాళం, తెలుగు, తమిళం సినిమాలు చేసుకుంటూ పోయాను. అలా నేను కొచ్చిలో ఉన్నా కూడా కృష్ణగారు నాకోసం కారు తీసుకుని వచ్చేవారు. దాదాపు 80 సినిమాలు పూర్తయ్యాక డైరెక్టర్‌గా అవతారమెత్తాను. మొదట మలయాళంలో ఓ మూవీ డైరెక్ట్ చేశా. తర్వాత తెలుగులో మీనా నవల ఆధారంగా కృష్ణగారితో సినిమా తీశాను. అది చాలా సక్సెస్ అయింది' అని చెప్పుకొచ్చారు విజయ నిర్మల. చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల
-
ఘనంగా గంగమ్మ జాతర
-
‘విశాఖ అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోంది’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని వీఎంఆర్డీఏ ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వెలగపూడి రామకృష్ణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌పై సూచనలు ప్రభుత్వానికి తెలపాలన్నారు. విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా టీడీపీ అడ్డుకుందని అక్కరమాని దుయ్యబట్టారు. -
పనిమనుషులకు ఇళ్లు కట్టించిన విజయ నిర్మల
‘జయ కృష్ణా ముకుందా మురారీ’ చిన్ని కృష్ణుడుగా వెండితెర మీద వేణువు వాయించారు... ‘వస్తాడు నా రాజు ఈ రోజు’ అందమైన కొత్త పెళ్లికూతురిగా అలరించారు.. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’ పార్వతిగా కంటనీరు పెట్టించారు.. ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా’ సూపర్‌స్టార్ కృష్ణ చేయి అందుకున్నారు.. విజయనిర్మల కుమారుడు విజయకృష్ణ నరేశ్ కుమార్ తల్లి గురించి చెప్పిన మాటలు... అమ్మ గుంటూరు జిల్లా నరసరావుపేటలో రామమోహనరావు, శకుంతలమ్మ దంపతులకు పుట్టారు. అమ్మకి నలుగురు అన్నదమ్ములు. అమ్మ ఒక్కర్తే ఆడపిల్ల. అమ్మకి నేను ఒకే ఒక్క కొడుకుని. కాని అందరినీ సొంత పిల్లల్లా చూసుకునేది. పళ్లు లేని ఒక ముసలి డాన్స్ మాస్టర్ దగ్గర అమ్మకు డాన్స్ నేర్పించారట. అమ్మ ఆయనను వెక్కిరించటంతో, ఆయనకు కోపం వచ్చి, డాన్స్ నేర్పించనన్నారట. రావు బాలసరస్వతి గారు వచ్చేసరికి ఏమీ ఎరగనట్టు అమాయకత్వం నటించేదట. ఆవిడ అమ్మకు దూరపు బంధువు. ఆవిడే అమ్మలోని కళాకారిణిని గుర్తించారట. చదువు మీద శ్రద్ధ లేదు కనుక సినిమాల్లోకి ప్రవేశిస్తే బావుంటుందని ఇంట్లో వారు భావించటంతో, ‘పాండురంగ మహాత్మ్యం’ లో కృష్ణుడి వేషంతో సినీ రంగంలో తొలి అడుగు వేసింది అమ్మ. ఎన్టిఆర్ గారు అమ్మ పాదాలకు పారాణి వేసి, నుదుట తిలకం దిద్ది, ఆశీర్వదించారు. అమ్మ సన్నగా ఉందని వెన్నముద్దలు పెట్టించారు. నా బట్టలు కుట్టింది.. నేను చాలా బలంగా పుట్టానట. అమ్మ తన మొదటి సంపాదనతో లాక్టోజెన్ పాల డబ్బా కొందట. కుట్టు మిషన్ కొని, బట్టలు కుట్టిందట నాకు. నేను చిన్నప్పటి నుంచి అమ్మలాగే అల్లరి చేసేవాడినట. స్కూల్‌కి సైకిల్ మీద వెళ్లమనేది. నేను పదో తరగతి ఫెయిలైనప్పుడు బాధపడింది. డాక్టర్ చదివించాలనే అమ్మ కోరిక నెరవేర్చలేకపోయినా, నటుడిగా డాక్టరేట్ అందుకుని, తృప్తి కలిగించాను. నేను రాజకీయాలలోకి వెళ్లటం ఇష్టం లేకపోయినా, ‘వద్దు’ అనకుండా ప్రోత్సహించింది. ఒకసారి షూటింగ్‌కి ఆలస్యంగా వెళ్లినందుకు, ‘‘క్రమశిక్షణ లేకపోతే నాకు నచ్చదు’’ అంది. హీరోయిన్‌తో ఒక టబ్‌లో ఉండే సీన్ అమ్మ ముందు నటించటానికి సిగ్గుపడితే, ‘షూటింగ్ సమయంలో నువ్వు నటుడివని గుర్తుంచుకో’’ అని మందలించింది. ‘చిత్రం భళారే విచిత్రం’ నా పాత్ర చూసి, ‘నీ రెమ్యునరేషన్లో సగం నాకు ఇవ్వాలి’ అని సరదాగా అంది. గడియారాలే నడిపించాయి.. అమ్మకు కాలం విలువ బాగా తెలుసు. అందుకు చిహ్నంగా ఇంటి నిండా గడియారాలు ఉన్నాయి. ‘నాకు కాలం విలువ తెలుసు కనుకనే ఈ రోజు ఇన్ని పనులు ఒకేసారి చేయగలుగుతున్నాను’ అంది. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవటం దగ్గర నుంచి అన్నీ గడియారపు ముళ్లను అనుసరించే చేసేది అమ్మ. ఇప్పటికీ ఈ గడియారాలే నాకు పాఠాలు చెబుతున్నాయి. భువన విజయం.. నన్ను అమ్మ ‘నరే’, ‘నరి’ అనీ, ‘నారీ’ అని పిలిచేది. అమ్మను చిన్నప్పుడు ‘మమ్మీ’ ‘మీరు’ అనేవాడిని. చివరి పది సంవత్సరాలలో అమ్మకి బాగా చేరువయ్యాను. అమ్మ పేరు జత చేసి, ‘విజయకృష్ణ నరేశ్ కుమార్’ అని మార్చుకున్నాను. అమ్మకి దేవాలయం కట్టి, ‘భువన విజయం’ అని పేరు పెట్టాను. ఆవిడ బహు ముఖీనురాలు. ఒక రైతు, ఒక రాజకీయవేత్త, ఒక సోషల్ వర్కర్, ఒక దర్శకురాలు, ఒక నటి, ఒక భార్య, ఒక తల్లి. అమ్మ పాదాలను ప్రింట్ తీసి బంగారు పాదాలు చేయించాను. నన్ను తన జీవిత చరిత్ర రాయమని చెప్పింది అమ్మ. అమ్మను ‘అమ్మ’ అనటం కంటె ‘అమ్మవారు’ అంటాను. ఆవిడకు భూకంపమంత కోపం, భూదేవికున్నంత సహనం ఉన్నాయి. అందంగా వెళ్లిపోవాలనుకున్న ఆవిడ ఆఖరి కోరిక తీర్చుకుని ముత్తయిదువులా వెళ్లిపోయింది. పనివాళ్లను కూడా ప్రేమగా చూసేది. మా దగ్గర పది సంవత్సరాలు పనిచేసిన వాళ్లకి ఇల్లు కట్టించింది. తను వెళ్లిపోయాక కూడా తను చేస్తున్నవన్నీ చేయమని కోరింది. నేను ఆవిడ కోరిక నెరవేరుస్తానన్నాను. వంటల షెడ్యూల్... అమ్మకు గోంగూరమాంసం – గారెలు చాలా ఇష్టం. లొకేషన్లో 30 మందికి వండి వడ్డించేది. ఉమ్మడి కుటుంబంలో వారానికి సరిపడా వంటకు సంబంధించి ఒక టైమ్ టేబుల్ వేసేది. చివరి రోజుల వరకు తన పనులన్నీ తనే చేసుకుంది. అమ్మకు గులాబీలంటే ఇష్టం. నిద్ర లేవగానే ఆ పూలతోనే భగవంతుడిని పూజించేది. గంధంతో చేసిన చీర ఉంది అమ్మకి. నగల కంటె భూమికి విలువ ఇచ్చేది. ఆ భూమే మమ్మల్ని కాపాడింది. పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయపడేది. సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ యాక్టర్స్ అరెస్టు -
హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం
‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్ ఫిలిమ్స్‌పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి. కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ – ఈ ఇద్దరి కాంబినేషన్ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది. అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా... కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది. నాయికగా సావిత్రి ఆఖరి సినిమా! ‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్ మొదలైన ఏయన్నార్ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్ సరసన సావిత్రి హీరోయిన్. తర్వాత మళ్ళీ ఏయన్నార్ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్ ఇయర్స్ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ తెరపై వెలిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్ బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్‌లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్‌గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్’ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్కు మిగిలిన కొత్త తీపిగుర్తు). దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్! ‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్ అన్నారు. సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా... బ్లాక్ అండ్ వైట్ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్సిన్మాల హవాలో కమర్షియల్‌గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్ కుమార్, వెంకట రమణ కుమార్) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్ బ్యానర్ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్.వి.యస్ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే! నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్ దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్‌ల కాంబినేషన్ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏయన్నార్ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్‌తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్‌తో విశ్వనాథ్ మరే సినిమా చేయలేదు. కానీ, ఏయన్నార్‌కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్‌తో కె. విశ్వనాథ్ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్‌ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లయిన యస్.వి.యస్. ఫిలిమ్స్ వారే’’ అన్నారు విశ్వనాథ్. అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు. ఆ సినిమాలన్నీ... ఆయనతోనే! ఎన్టీఆర్‌తో నిర్మాత మిద్దె జగన్నాథరావు స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్‌ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి, ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు. జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్.వి.యస్’ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్ లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్లో 5 సినిమాలు (ఎస్.డి.లాల్ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్.వి.యస్. ఫిలిమ్స్ – ఎన్టీఆర్‌ల కాంబినే షన్‌కు ఊహించని బ్రేక్ పడింది. చిరంజీవి సినిమాకు మూలం! చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్మెంట్ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్ ‘సాక్షి’కి వివరించారు. హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ (చిన్ని) తెలిపారు. అరుదైన రికార్డ్ ఆ జంట సొంతం! ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ మెప్పించింది. ఒక టాప్ హీరో, టాప్ హీరోయిన్ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం. - రెంటాల జయదేవ -
మరో బయోపిక్‌లో..?
అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి, అందరి మెప్పు పొందారు కథానాయిక కీర్తీ సురేష్. ‘మహానటి’లో కీర్తి నటనకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్ మరో బయోపిక్‌లో నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. సూపర్‌స్టార్ కృష్ణ భార్య, ప్రముఖ నటి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కనుందట. ఇందులో విజయ నిర్మల పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. మరి మరో బయోపిక్‌లో కీర్తి కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం
‘‘విజయనిర్మల ఐదారు సినిమాల్లో నటించాక డైరెక్ట్ చేస్తానంది.. వంద సినిమాల్లో నటించి, ఆ తర్వాత డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నాను. ఆమె అలానే చేసింది’’ అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ– విజయనిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినీరెడ్డికి నటుడు కృష్ణంరాజు, హీరో మహేష్‌బాబు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి మలయాళ సినిమా ‘కవిత’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో తీసిన ‘మీనా’ వందరోజులు ఆడింది. మొత్తం 46 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలకి దర్శకత్వం వహించడం ఓ చరిత్ర’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. మహేష్ బాబు మాట్లాడుతూ– ‘‘నా సినిమాల మొదటి ఆట చూసి నాన్నగారు నాతో మాట్లాడేవారు. తర్వాత విజయనిర్మలగారు మాట్లాడి అభినందనలు చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు అభినందించారు.. తర్వాత ఆవిడ మాట్లాడబోతుందనుకుని వెంటనే ‘ఆమె లేరు కదా’ అనే విషయాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. ‘‘మా అమ్మ పేరున నటీనటులకు ప్రతి సంవత్సరం అవార్డు అందించనున్నాం’’ అన్నారు నరేష్ విజయకృష్ణ. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
నానక్‌రామ్‌గూడ : విజయనిర్మల విగ్రహావిష్కరణ
-
విజయనిర్మల విగ్రహావిష్కరణ..
-
విజయనిర్మల విగ్రహావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నటిగా, దర్శకనిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయనిర్మల గతేడాది జూన్ 27న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసంలో ఆమె తొలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత విజయ నిర్మల విగ్రహాన్ని కృష్ణ, మహేశ్‌బాబు, నరేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు దంపతులు, మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, సుధీర్ బాబు, పరుచూరి బ్రదర్స్, గల్లా జయదేవ్, తదితరులు పాల్గొన్నారు. ఘట్టమనేని అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయ నిర్మల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అలసి విశ్రమించిన అలలు అది నా తప్పు కాదు, క్యారెక్టర్ అలాంటిది -
మహిళా దర్శకులకు ఆదర్శం ఆమె!
పురుషాధిక్య సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారమె. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తాను చాటారామె. తెలుగులో భానుమతి, సావిత్రి తరువాత దర్శకత్వం వహించిన మూడో మహిళగా ఖ్యాతిగాంచిన ఆమె మరెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విజయనిర్మల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. -
మహిళా దర్శకులకు ఆదర్శం ఆమె!
-
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
విజయనిర్మల సంతాప సభ
-
విజయనిర్మల సంతాప సభకు సినీ ప్రముఖులు
ఇటీవల మరణించిన నటీ, దర్శకురాలు విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులు సూపర్ కృష్ణ, నరేష్‌తో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొని నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయనిర్మలకు నివాళులర్పించారు. విజయనిర్మల జూన్ 27న కాంటినెంటల్ హాస్పిటల్ చిక్సిల్ పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించిన ఆమె మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. -
కృష్ణను పరామర్శించిన చంద్రబాబు
హైదరాబాద్ : సూపర్‌స్టార్ కృష్ణను రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. శేరిలింగంపల్లి నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసంలో ఆయనను కలిశారు. కృష్ణ, నరేష్, మహేష్ బాబులను పరామర్శించి ఓదార్చారు. విజయనిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..విజయనిర్మల మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని అన్నారు. విజయనిర్మల విలువలు కలిగిన వ్యక్తి అని, ఆవిడకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డు సాధించిందని తెలిపారు. 1999లో విజయనిర్మల టీడీపీ పక్షాన పోటీ చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తదితరులు ఉన్నారు. -
ఆమె జీవిత మంత్రం అదే
గత గురువారం ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. ‘విజయ నిర్మలగారి మరణాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను’ అన్నారు మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్. విజయ నిర్మలను గుర్తు చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు నమ్రత. దాని సారాంశం ఈ విధంగా... ‘‘నా వరకూ ఆమె ఎన్నో స్కిల్స్ ఉన్న ఉమెన్. ఆవిడతో నేను పద్నాలుగేళ్లు ప్రయాణం చేశాను. ఆమె గురించి చెప్పాలంటే.. చాలా కేరింగ్, ఆత్మీయంగా ఉంటారు. ప్రేమ నిండిన మనిషి. డైనమిక్, స్ట్రాంగ్ అయినా కూడా ఫన్ని బాగా ఇష్టపడే వ్యక్తి. కాంప్రమైజ్ కాకూడదు అనేదే తన జీవిత మంత్రం. తన ఆలోచనలు, ఆచరణలను గమనిస్తే తనో నిజమైన విజనరీ అని మనం అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబానికి, తనను ఇష్టపడేవాళ్లకు సపోర్ట్ సిస్టమ్‌గా నిలబడ్డారు. విజయ నిర్మలగారూ... మిమ్మల్ని బాగా మిస్ అవ్వబోతున్నాం. మిమ్మల్ని మళ్లీ చూడలేము అనే విషయాన్నే ఊహించుకోలేకపోతున్నాను’’ అంటూ తన ఎమోషన్ని పంచుకున్నారు. -
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
హైదరాబాద్: అశ్రునయనాల మధ్య సినీనటి, దర్శకురాలు విజయనిర్మల అంతిమయాత్ర నానక్‌రాంగూడలోని ఆమె నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. భర్త కృష్ణ, కుమారుడు నరేశ్, హీరో మహేష్‌బాబు.. విజయనిర్మల పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన ట్రక్‌పైకి తరలించారు. అనంతరం విజయనిర్మల అమర్‌రహే అన్న అభిమానుల నినాదాల నడుమ ఇంటి నుంచి ప్రత్యేక వాహనం ముందు సాగింది. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు, జూనియర్ ఆర్టిస్టులు విజయనిర్మలను కడసారిగా చూసి నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడలోని పోచమ్మ అమ్మవారంటే కృష్ణ, విజయనిర్మల దంపతులకు అత్యంత భక్తి. ఆ ఆలయం వద్దకు రాగానే అంతియ యాత్రను కొద్దిసేపు నిలిపారు. ప్రతియేటా బోనాల సమయంలో విజయనిర్మల తనవంతు సహకారం అందించేవారు. దీంతో గ్రామస్తుల తరఫున స్థానికులు ఆమె పార్థివదేహంపై శాలువా కప్పి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిలుకూరు వరకు యాత్ర సాగింది. నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నానక్‌రాంగూడలోని కృష్ణ, విజయనిర్మల నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.34 గంటలకు చేరుకున్నారు. ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించి కృష్ణ, నరేశ్‌ను ఓదార్చారు. ఏపీ సీఎం వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. సినీనటుడు కృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చిలుకూరులో అంత్యక్రియలు మొయినాబాద్ (చేవెళ్ల): విజయనిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు నానక్‌రాంగూడ నుంచి మొదలైన అంతిమ యాత్ర మధ్యాహ్నం 12.50 గంటలకు చిలుకూరు వ్యవసాయక్షేత్రానికి చేరుకుంది. ఆమె కుమారుడు నరేశ్ ముందు నడిచి కర్మకాండలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం నరేశ్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు కొన్ని నిమిషాల ముందే కృష్ణ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పార్థివదేహాన్ని చితిపై పెట్టే ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.40 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిలుకూరు ఫాంహౌస్‌లో జరిగిన అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సినీ ప్రముఖులు కల్యాణ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయకృష్ణ గార్డెన్లో విజయనిర్మల అంత్యక్రియలు
-
దివికేగిన ‘విజయ’ తార
సాక్షి, హైదరాబాద్ : సినీ దిగ్గజం విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో ముగిశాయి. ఆమె కడచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆమె భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించిన విజయ నిర్మల.. హీరోయిన్గా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికి సాధ్యం కాని విధంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
దివికేగిన ‘విజయ’ తార
-
విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి
-
విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : గురువారం మృతి చెందిన సినీ దిగ్గజం విజయనిర్మల అంత్యక్రియలు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు సమక్షంలో కుమారుడు నరేష్.. విజయనిర్మల చితికి నిప్పటించారు. శుక్రవారం ఉదయం వరకు అభిమానుల సందర్శనార్థం నానక్‌రామ్ గూడ నివాసంలో విజయనిర్మల పార్థివ దేహాన్ని ఉంచారు. ఆమె ఇంటి నుంచి పార్థి దేహాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చి అక్కడ కాసేపు ఉంచి తరువాత విజయకృష్ణ గార్డెన్‌కు తరలించారు. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు. -
ఆమె విజయానికి మీసాల కృష్ణుడే సాక్షి
సాక్షి, కొత్తపేట(తూర్పు గోదావరి) : కథానాయకుడు కృష్ణ – కథానాయకి విజయనిర్మల మధ్య ప్రేమకు పునాది పడింది ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే. 1967 సంవత్సరంలో నందనా ఫిలిమ్స్ (శ్రీరమణ చిత్ర) పతాకంపై బాపు దర్శకత్వంలో సురేష్‌కుమార్, శేషగిరిరావు నిర్మించిన ‘సాక్షి’సినిమాలో వారిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా అవుట్డోర్ షూటింగ్ ఆత్రేయపురం మండలంలో పులిదిండి జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు అనుకున్న గ్రామం గురించి ఓ మ్యాప్ గీసుకున్నారు. అందులో ఓ బల్లకట్టు ఉన్న ఓ కాలువ, కాలువ దగ్గర రేవులో ఓ పెద్ద చెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్లో ఓ చిన్న గుడి, గుడికో మండపం ఉండాలి. గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ శాఖలో పనిచేసి సీలేరు ప్రాజెక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపు, రమణల బాల్యమిత్రుడు, రచయిత బీవీఎస్ రామారావును తమ మ్యాప్‌ను పోలిన ఊరును వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవు పెట్టి అలాంటి ఊరికోసం రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజును ఊరిని వెతికేందుకు సాయమడిగారు. ఆ మ్యాప్‌లో ఊరిని పోలినట్టుగా తమ ఊరు పులిదిండే వుందన్నారు. ఆ సమాచారంతో బాపు, రమణలు పులిదిండి రాగా వారికి రాజు తమ ఇంట్లోనే బస ఏర్పాటుచేశారు. పులిదిండితో పాటు బొబ్బర్లంక, పిచ్చుక లంక, ఆత్రేయపురం, ఆలమూరు, కట్టుంగ తదితర గ్రామాలను పరిశీలించారు. చివరికి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు. ఆ గ్రామంలో చాలా వరకూ షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. అది 1965 ప్రాంతం.. కథలో బాగంగా దర్శకుడు బాపు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సాక్షి సినిమా పూర్తిగా జిల్లాలో పులిదిండి గ్రామంలో చిత్రీకరిస్తున్నారు. తొలిరోజు కథానాయిక విజయనిర్మల, కథానాయకుడు కృష్ణలమీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. విజయనిర్మల అన్న ఫకీర్ పేరుమోసిన రౌడీ. వాడికి వ్యతిరేకంగా ఒక హత్యకేసులో కృష్ణ సాక్ష్యం చెబుతాడు. జైలు నుంచి రాగానే కృష్ణను చంపుతానని ఫకీర్ ప్రతిజ ్ఞచేస్తాడు. ఫకీర్ చెల్లెలు విజయనిర్మల కృష్ణను పెళ్ళి చేసుకోమంటుంది. ఫకీర్ జైలు నుంచి విడుదలయ్యాడని వార్త గ్రామంలో పొక్కింది. విజయనిర్మల తాళిబొట్టును తీసుకువచ్చి, తన మెడలో కట్టమంటుంది. మరి కొద్దిసేపటికి చచ్చిపోయేవాడికి పెళ్లేమిటి? అని కృష్ణ కంటనీరు పెట్టుకుంటాడు... ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా నూరేళ్ళు పచ్చగా..అన్న ఆరుద్ర పాటను బాపు ఒక్కరోజులో చిత్రీకరించారు. షూటింగ్ జరిగిన ఆలయానికి మీసాల కృష్ణుడి ఆలయమని పేరు.. రాజబాబు వచ్చి, ఇది పవర్ఫుల్ టెంపుల్, నిజ జీవితంలో కూడా మీరు దంపతులు అవుతారని ఆయన అన్నాడు. ఆ సమయంలో రాజబాబు ఆ మాటంటే ఏమిటా పిచ్చిమాటలు అని విజయనిర్మల కసిరారు. మూడు నాలుగు సినిమాల తరువాత వారు నిజంగానే దంపతులు అయ్యారు. గోదారమ్మవారిని కలిపింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలోనే విజయనిర్మల అక్కినేని సరసన బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. రెండు విజయవంతమైన సినిమాలే! విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం పడిందని కొత్తపేటకు చెందిన కవి, రచయిత షేక్ గౌస్ తెలిపారు. బాపు దర్శకత్వంలో చిత్రీకరించిన సాక్షి సినిమాలో కృష్ణతో, బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో విజయనిర్మల హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాలు కోనసీమలోనే చిత్రీకరించారు. ఆమె బాపు దర్శకత్వాన్ని గమనించి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నారు. ‘సాక్షి’ సినిమా పరిచయం ద్వారా కృష్ణ – విజయనిర్మల ఒకటైనదీ, ఆమె దర్శకత్వానికి బీజం పడినదీ కోనసీమలోనే అని గౌస్ తెలిపారు. -
విజయనిర్మల అంతిమ యాత్ర ప్రారంభం
-
పోచంపల్లితో విజయనిర్మలకు అనుబంధం
సాక్షి, భూదాన్‌పోచంపల్లి (నల్గొండ): పోచంపల్లితో ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మలకు ఎంతో అనుబంధం ఉంది. 1987లో విజయనిర్మల దర్శకత్వంలో పోచంపల్లిలోని పాత చేనేత సహకార సంఘంలో ‘కలెక్టర్ విజయ’ సినిమా షూటింగ్ జరిగింది. కాగా సంఘంలో వస్త్రాలు కొనుగోలు చేసిన సన్నివేశాలతో పాటు, పల్లె నేపథ్యానికి చెందిన సన్నివేశాలను చిత్రీకరించారు. పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన కృష్ణ, మహేశ్‌బాబు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు భోగ కిరణ్‌కుమార్ విజయనిర్మలతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరలంటే విజయనిర్మల చాలా ఇష్టపడేవారని ఆయన చెప్పారు. ఆమె కోరిక మేరకు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను బహూకరించానని పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన వారిని ఎంతో ఆప్యాయతతో పలకరించేవారని భోగ కిరణ్ తెలిపారు. విజయనిర్మల అకాల మృతి అభిమానులకు తీరని లోటని అన్నారు. అత్యధిక సినిమాలను నిర్మించిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్వరల్డ్ రికార్డుకెక్కిన ఘనత ఆమెకు దక్కిందన్నారు. విజయనిర్మల కుమారుడైన హీరో నరేశ్, అతని కుమారుడు నవీన్‌లకు కూడా పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. -
నిర్మలాకాశం
-
చిలుకూరు ఫాంహౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు
-
కన్నీటి పర్యంతమైన సూపర్ స్టార్ కృష్ణ
-
ధీర విజయ
నటి. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. దర్శకురాలు. అక్కినేని, శివాజీ గణేశన్‌లను కూడా డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌పై తన సంతకం చేసింది. సహచరి. భర్త వేసే ప్రతి అడుగులోనూ భాగమవుతూ తన అడుగు చెరిగిపోకుండా కాపాడుకుంది. తల్లి. కుమారుడి వెన్నంటే ఉండి అతడి కెరీర్‌కు వెన్నెముకలా నిలిచింది. సంపూర్ణ స్త్రీ. సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది. విజయ నిర్మల సార్థక నామధేయి. వెండితెర విజయకేతనం. అన్ని విధాల ధీర విజయ. తెలుగువారి గర్వకారణాలలో తప్పక మెదిలే ఒక గొప్ప స్త్రీ ఉనికి. రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు. బాల సరస్వతి గాయని, నటి. ఆ రోజుల్లో సూపర్‌స్టార్. ఏడేళ్ల వయసులో ఒక రోజు విజయ నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాలసరస్వతి వచ్చి ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లింది. తెల్లవారి లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యం. ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యం. అది ఒక స్టూడియో. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాల నటి కావాలని బాల సరస్వతిని కోరితే విజయ నిర్మలను తీసుకొచ్చి నిలబెట్టింది. ఆ సినిమా పేరు ‘మచ్చరేకై’ (తమిళం). అలా వెండి తెర మీద బుజ్జిపాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది. ఘనమైనది కూడా. జయ కృష్ణా ముకుందా మురారి విజయ నిర్మలకు పన్నెండు పదమూడేళ్లు వచ్చాయి. ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నదే. తల్లి శకుంతల గృహిణే అయినా తండ్రి రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పని చేసేవారు. బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశమొస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు. విమల, విజయనిర్మల ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశమే ‘పాండురంగ మహత్య్మం’లో నటించే అవకాశం. అందులోని ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాటలో విజయ నిర్మల బాలకృష్ణునిగా నటించాలి. ‘మీనా’లో నాగరత్నమ్మ (కృష్ణ తల్లి), కృష్ణ, విజయనిర్మల అది ఎవరి పర్యవేక్షణలో? కృష్ణుడంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పర్యవేక్షణలో. ఎన్టీఆర్ విజయ నిర్మలను ఎంతో ప్రోత్సహించారు. అది చాలా పెద్ద పాట. ప్రతిరోజూ మేకప్‌ను ఆయనే సరిదిద్దడం, కళ్లచివర శంఖు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు. కొన్నిరోజుల షూటింగ్ జరిగింది. ఒకరోజు షాట్లో విజయ నిర్మల కళ్లు తిరిగి పడిపోయారు. రామారావు షూటింగ్ ఆపేశారు. మూడు నాలుగు రోజుల తర్వాత ‘నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది’ అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టితీసి మిగిలిన పాటను సెట్లోకి బయటివారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు. ఆ పాట తెలుగు సినిమాలలో, ఎన్టీఆర్ నటజీవితంలో దాంతోపాటు విజయ నిర్మల నట జీవితంలో కూడా నిలబడింది. ‘దేవదాసు’లో కృష్ణ పిలిచిన కేరళ గాలి తర్వాతి కాలంలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు గడించిన విన్సెంట్ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచారు. ఆయన వాహినిలో పని చేస్తున్నప్పుడు విజయ నిర్మల తండ్రికి స్నేహితుడయ్యాడు. విజయ నిర్మలను చూసి ‘మీ అమ్మాయి కళ్లు బాగున్నాయి. నేను మలయాళంలో ఒక ఘోస్ట్ సినిమా తీస్తున్నాను. ఆ పాత్రకు కళ్లు చాలా ముఖ్యం. హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను’ అంటే తండ్రి అంగీకరించారు. అలా విజయ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా ‘భార్గవి నిలయం’. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అక్కడ డజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈలోపు బి.ఎన్.రెడ్డి నుంచి ‘రంగుల రాట్నం’లో నటించడానికి పిలుపు వచ్చింది.. తెలుగులో తొలిసారి హీరోయిన్గా. ‘రంగుల రాట్నం’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా క్లాసిక్‌గా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది. ఎస్.వి. రంగారావును గెలిచింది తెలుగులో ‘షావుకారు’ను విజయా సంస్థ తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్’గా తీయదలిచింది. తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మలకు ఇచ్చారు. షూటింగ్ తొలిరోజు సెట్‌కు ఎస్.వి. రంగారావు వచ్చారు. విజయ నిర్మలను చూశారు. ‘ఏమిటి... ఈ అమ్మాయా నా మేనకోడలుగా చేసేది. ఏం బాగాలేదు. కె.ఆర్.విజయను పెట్టి తీయండి’ అని వెళ్లిపోయారు. విజయ నిర్మల చాలా అప్సెట్ అయ్యారు. చాన్స్ పోయినట్టే అనుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ విజయా సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఏమిటి... రంగారావు గారు ఒప్పుకున్నారా’ అంటే ‘కాదు.. ఆయననే మార్చేశాం. ఆయన ప్లేస్‌లో ఎస్.వి.సుబ్బయ్యను తీసుకున్నాం’ అని జవాబు వచ్చింది. అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల. అక్కడ కూడా ఆమె దాదాపు డజను సినిమాల్లో నటించారు. వచ్చాడు నా రాజు ఈ రోజు ఆ తర్వాత ఆమె నట జీవితం ఎలా ఉండేదో తెలియదు. కాని బాపు–రమణలు సొంత నిర్మాణ సంస్థ మొదలెట్టి తీసిన ‘సాక్షి’ సినిమాలో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది. కృష్ణ జీవితాన్ని కూడా. వారిరువురూ గోదావరి ప్రాంతంలోని ‘మీసాల కృష్ణుడి’ గుడిలో ‘అమ్మ కడుపు చల్లగా’ పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్ ముగించి బయటకు వస్తుంటే బయటే ఉన్న నటుడు రాజబాబు ‘ఇది మీసాల కృష్ణుడి గుడి. విజయనిర్మల, కృష్ణ చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది’ అని జోస్యం చెప్పారు. మూడు నాలుగు నెలలో అదే నిజమైంది. ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలలో నటిస్తున్న విజయ నిర్మల, కృష్ణ తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ అది ద్వితీయ వివాహమే. పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పెళ్లి ఆ సమయంలో ఇండస్ట్రీలో న్యూస్ క్రియేట్ చేసినా క్రమంగా అందరూ వారి జంటను ఆదరించారు. భర్తను డైరెక్ట్ చేసిన భార్య సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం. సెట్లో నటుడి కన్నా దర్శకుడిదే పై చేయి. కాని కృష్ణ, విజయ నిర్మలల మధ్య ఉండే అవగాహన, సామరస్యం, ప్రొఫెషనలిజమ్ అసాధారణమైనది. అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో కృష్ణ భేషజం లేకుండా, ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు. కృష్ణ సూపర్ డూపర్ హిట్స్‌లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ చేత ‘త్రిబుల్ యాక్షన్’ చేయించి విజయ నిర్మల తీసిన ‘రక్త సంబంధం’ సినిమా సంచలనం. కృష్ణ, విజయనిర్మల ఉన్నది కాసేపే అయినా ఈ సినిమాలు ఒకెత్తయితే ఉన్నది కాసేపే అయినా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు. ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట ‘వస్తాడు నా రాజు ఈరోజు’ ఎంత హిట్టో అందరికీ తెలుసు. విశేషం ఏమిటంటే కృష్ణతో పెళ్లయ్యాక కూడా ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్తబలం’ సినిమాలలో ఆయన చెల్లెలిగా విజయ నిర్మల నటించారు. ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ అభ్యంతర పెట్టకపోవడం వల్ల ‘బుద్ధిమంతుడు’, ‘తాతా మనవడు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’ వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. విజయనిర్మల, జ్యోతిలక్ష్మి కెరీర్‌ను హుందాగా నిలబెట్టుకొని విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు. ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకుని పొందేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా తన ప్రయారిటీస్‌ని ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు. వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు. ఎప్పుడూ డల్‌గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ బ్రైట్‌గా, గ్లామరస్‌గా, కృష్ణ పక్కన ఎనర్జిటిక్‌గా ఆమె కనపడేవారు. సినిమా రంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం. మార్గదర్శి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు. అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం వింత కాదు. కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థంగా నడపడం కచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశం. కృష్ణతో 47 సినిమాలలో తెలుగులో హిట్ పెయిర్స్ చాలా ఉన్నాయి. ఎన్.టి.ఆర్–జయలలిత, అక్కినేని–సావిత్రి, జమున–హరనాథ్... కానీ కృష్ణ–విజయ నిర్మల జోడి చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. వీరిరువురూ కలిసి 47 సినిమాలలో నటించారు. ‘అత్తగారు–కొత్త కోడలు’, ‘టక్కరిదొంగ–చక్కని చుక్క’, బందిపోటు భీమన్న’, ‘అమ్మ కోసం’.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. అయితే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో కృష్ణతో కలిసి గుర్రపు స్వారీ చేయడం, స్టంట్స్‌లో పాల్గొనడం దేనికీ తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల చేశారు. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’ ఈ సినిమాలన్నింటిలో వారి జంట రక్తి కట్టింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల నటన ఎన్నదగినదిగా నిలిచింది. కృష్ణగారిని ఒంటరిని చేసి వెళ్లారని తప్ప బహుశా అభిమానులకు వేరే ఫిర్యాదులుండే అవకాశం లేదు. జీవించినంత కాలం ప్రతిభా తరంగాలను ప్రసారం చేసిన విజయ నిర్మల మరణించాక దివ్య తరంగాలతో కృష్ణగారి సమక్షంలోనే ఉంటారని ఈ అభిమానులే ఊరట చెందుతారు. ఎందుకంటే అదే సత్యం. ఈ బహుముఖ సమర్థురాలికి తెలుగువారి ఘన నివాళి. – కె -
విజయ నిర్మలకు ఘన నివాళి
హైదరాబాద్/మొయినాబాద్(చేవెళ్ల): అలనాటి మేటి నటి, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మలకు చిత్ర పరిశ్రమతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11.40 గంటలకు పార్థివదేహాన్ని నానక్‌రాంగూడలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయ నిర్మలకు కన్నీటి వీడ్కోలు పలికారు. చిరంజీవి, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, మంచు విష్ణు, కోదండరాంరెడ్డి, సుబ్బరామిరెడ్డి, శ్రీకాంత్, దాసరి అరుణ్, కైకాల సత్యనారాయణ, రావు రమేష్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ్, చోటా కె నాయుడు, కోటి, సుధీర్‌బాబు, రాఘవేంద్రరావు, విజయశాంతి, చార్మి, మంచు లక్ష్మి, విజయచందర్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు విజయ నిర్మల భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె భర్త, సూపర్‌స్టార్ కృష్ణ, కుమారుడు నరేష్, మహేష్‌బాబు, నమ్రతలను ఓదార్చారు. పలువురు సంతాపం విజయ నిర్మల మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆమె మరణం కళారంగానికి తీరని లోటు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి తదితరులు విజయ నిర్మల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణను ఓదార్చిన కేసీఆర్ విజయ నిర్మల మరణవార్త తెలియడంతో సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. నానక్‌రాంగూడలోని ఆమె నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. కన్నీటిపర్యంతమైన కృష్ణను ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కేశవరావు, సంతోష్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, రసమయి బాలకిషన్ ఉన్నారు. గురువారం విజయ నిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తున్న కృష్ణను ఓదారుస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో కోట శ్రీనివాసరావు, జమున, గల్లా అరుణ తదితరులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అనారోగ్యంతో కన్నుమూసిన విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో జరగనున్నాయి. చిలుకూరులో ఉన్న ఫాంహౌస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నానక్‌రాంగూడ నుంచి విజయ నిర్మల అంతిమయాత్ర మొదలై మధ్యాహ్నం 12 గంటలకు చిలుకూరు ఫాంహౌస్‌కు చేరుకుంటుందని ఆమె బంధువులు తెలిపారు. -
నిర్మలమైన మనసులు
కృష్ణగారు భర్తగా దొరకడం ఓ వరం నిర్మల ముక్కుసూటి మనిషి. అందుకే ఇష్టం... కృష్ణగారిది నిర్మలమైన మనసు... నిర్మలది మంచి మనసు... ‘సాక్షి’కి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూస్’లో ఇలా కృష్ణ, విజయ నిర్మల పలు విశేషాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. ► కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు? విజయనిర్మల: మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో చూశా. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలోంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నా. మా సినిమాలో ఆయనే హీరో అని తెలిసి సంతోషమేసింది. అదే ‘సాక్షి’ సినిమా. ► ఆ సినిమా అప్పుడే ప్రేమలో పడ్డారు కదా? అవును. ‘సాక్షి’లో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో మీసాల కృష్ణుడు టెంపుల్ సీన్ ఉంది. ఆ గుడిలో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త కడుపు చల్లగా, కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను. ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. ► కృష్ణగారు బిడియస్తులు అనిపిస్తుంటుంది. అసలాయన మీకు ఎలా ప్రపోజ్ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది. విజయ నిర్మల: ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని చంద్రమోహన్ అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అన్నాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అన్నారు. ► మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. మరి మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు? విజయ నిర్మల: (నవ్వుతూ). డేట్ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది (2018) 50వ సంవత్సరం. కృష్ణ: 1969 మార్చి 24 మా పెళ్లి రోజు. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్ చేసి విషెస్ చెబుతారు. మ్యారేజ్ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్ చేసి, చెబుతారు (నవ్వుతూ). విజయనిర్మల: ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుకే డేట్ చెప్పేశారు. ► ఇంతకీ కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం? విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో అన్నట్లు ఉంటారు. అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపోనివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది. ఇక ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను.. లేకపోతే రానని కండీషన్ పెట్టిందట. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్ ఉండేది ఆయనకు. ► కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా. మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు? విజయనిర్మల: దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్లో గ్యాప్ దొరికితే, నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది. ► మీరెందుకు నచ్చారో ఆయన్ను అడిగారా? విజయనిర్మల: ‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు. ► మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి? విజయ నిర్మల: అన్నీ ఇష్టమే. ఆయన కోసం తందూరీ చేయడం నేర్చుకున్నా. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. ► మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా? విజయనిర్మల: ఒకప్పుడు! కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది. ► కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం? విజయనిర్మల: మేమిద్దరం బాగానే ఉంటాం. ఓరకంగా క్లోజ్‌ఫ్రెండ్స్ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. ► డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా? విజయనిర్మల: లేదు. ‘నీకు సౌకర్యంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్ ఉండాలంటారు. హెయిర్ స్టయిల్ విషయంలో మాత్రం కామెంట్ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు (నవ్వుతూ). ► కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు? విజయ నిర్మల: మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజుకి గడియారం కొనిపెట్టారు. ప్యాక్ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్ క్లాక్. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని చాలా ఏళ్లు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు. ► సూపర్‌స్టార్ డ్రెస్‌లన్నీ మీ సెలక్షన్ అన్నమాట? విజయనిర్మల: అవును. సినిమాల కోసం కాస్ట్యూమర్స్ సెలక్ట్ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే కొంటాను. ► మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..? విజయ నిర్మల: సంసారమన్నాక అలకలు కామన్. అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం. ► మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు? విజయ నిర్మల: రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తాం. క్రికెట్ మ్యాచ్ అప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లోనూ టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్. ► ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా? విజయ నిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్ అయ్యాం. బాధ అనిపించలేదు. ► కృష్ణగారు మీ భర్త కావడం వరం అనుకుంటారా? విజయ నిర్మల: కచ్చితంగా. ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం. ► అప్పట్లో కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్ అంటే క్రేజ్. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా? కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు. ► ఎక్కువ సినిమాలు చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆమె కెరీర్ విషయంలో మీ ప్రోత్సాహం గురించి? కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తన నరేషన్ కూడా బావుంటుంది. షాట్స్ కూడా బావుంటాయి. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు మీకెలా అనిపించేది? కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో చేసిన సినిమాల విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైందా? కృష్ణ: ‘దేవదాసు’ సినిమా అప్పుడు కొంచెం డైలమాలో పడ్డాం. ఆ పిక్చర్ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్ చేయండని డిస్ట్రిబ్యూటర్స్ అడిగితే మాకు ఎక్కడ కట్ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీప్రసాద్ వంటి దర్శకులకు షో వేసి చూపించాం. సినిమా చూసి ఎల్వీ ప్రసాద్‌గారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్ చేయమంది? అన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. నేను సినిమా చూసి ఏడవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్ అయిపోయాను’ అని విజయకు కాల్ చేశారు. ► దర్శకురాలిగా చాలా త్వరగా సినిమాలు పూర్తి చేస్తారనే పేరు ఆమెకి ఉంది? కృష్ణ: అవును. ఓ సినిమాకి శివాజీ గణేశన్గారివి 30 రోజులు డేట్స్ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు. ► విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? కృష్ణ: తను చాలా కామ్ పర్సన్. దానికి తగ్గట్టు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్ మీద చాలా కమాండ్ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ముక్కుసూటితనం ఇష్టం. ► కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్ చేస్తారా? విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు. ► కృష్ణగారి బయోపిక్ తీస్తే ఒప్పుకుంటారా? విజయ నిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్ చేయాలి. మహేశ్ కూడా చాలా ఫాస్ట్. సెట్లో చాలా జోక్స్ వేస్తుంటాడు. కృష్ణగారికి జోక్ వేయడం కూడా రాదు. అలా దూరంగా ఉండిపోతారు. -
విజయనిర్మలకు మెగాస్టార్ చిరంజీవి నివాళి
-
విజయకృష్ణ గార్డెన్స్‌లో అంతిమ సంస్కారాలు
సాక్షి, హైదరాబాద్ : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆమె మరణంతో సూపర్‌స్టార్ కృష్ణ, నరేష్ శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు ఉదయం 9 గంటలకు విజయ నిర్మల అంతిమయాత్ర చేపట్టనున్నారు. పదకొండు గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు నరేష్ తెలిపారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల.. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేయగా.. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. -
విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి చేరుకున్నారు. విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భార్య మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను కేసీఆర్ ఓదార్చారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. దాదాపు 20 నిమిషాల పాటు కేసీఆర్ అక్కడే ఉన్నారు. కేసీఆర్ వెంట వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి విజయ నిర్మల పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. గత కొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
విజయనిర్మల మృతి పట్ల ప్రముఖులు సంతాపం
-
విజయ నిర్మల మృతికి ‘ఆటా’ సంతాపం
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) గురువారం ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి అమెరికా తెలుగు సంఘం తరపున అద్యక్షులు పరమేశ్ భీంరెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుతో పాటు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారని అన్నారు. అంతేకాదు నటిగా, దర్శకురాలిగా తెలుగు సినీ కళామతల్లికి విశిష్ట సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, అద్భుతమైన ప్రతిభ చూపగలరని ఆరోజుల్లోనే నిరూపించారని అన్నారు. గత సంవత్సరం అమెరికా తెలుగు సంఘం తరఫున హైదరాబాద్ లో నిర్వహించిన ఆటా వేడుకల్లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించామని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
కన్నీరు మున్నీరైన కృష్ణ
-
విజయనిర్మలకు సినీ ప్రముఖుల నివాళి
-
నేను అమ్మ అని పిలిచేవాణ్ని
-
కన్నీరు మున్నీరైన కృష్ణ
గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికకాయం నానక్‌రామ్ గూడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్చించేందుకు తరలివస్తున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికాయాన్ని ఫిలించాంబర్‌లో కొంత సమయం ఉంచిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విజయనిర్మల మరణంతో ఈ రోజు జరగాల్సిన ‘కల్కి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకతో పాటు రేపు జరగాల్సిన ‘మహర్షి’ సినిమా 50 రోజుల వేడుకలను రద్దు చేశారు. కాగా, విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్‌రామ్‌గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్రపరిశ్రమకు తీరని లోటు
-
శోక సంద్రంలో టాలీవుడ్
విజయ నిర్మల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన ఆమెను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - పవన్ కల్యాణ్ మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. రీసెంట్గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. - జీవితా రాజశేఖర్ ‘11 సంవత్సరాలకే నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తన కుటుంబంగా చేసుకున్న మహానటి, గొప్ప దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం విని షాక్‌కి గురయ్యాను. తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మహిళా దర్శకురాలుగా తన సత్తాచాటిన విజయ నిర్మల గారు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతారు’. - మారుతి తెలగు సినిమా చరిత్రలో ఎందరో దర్శకులు వారి వారి సత్తా చాటుకున్నారు. కాని మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డుని సాధించిన దర్శకురాలు మాత్రం శ్రీమతి విజయనిర్మల గారు ఒక్కరే. సూపర్‌స్టార్ కృష్ణ గారిని, విజయనిర్మల గారిని చూస్తే కడుపు నిండిపోయేది అంత అందంగా వుండేది వారి జంట. అంత అందమైన నటి, నిర్మాత, దర్శకురాలు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారన్న వార్త నమ్మలకపోయాను. - నిర్మాత ఉషా మల్పూరి చిన్న వయసు నుండి మనందరం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమతి విజయనిర్మల గారు సినిమాలు చేయటం మొదలు పెట్టారు. విజయనిర్మల గారికి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. మహనటిగా, గొప్ప దర్శకురాలుగా, ఉత్తమ నిర్మాతగా తమిళ, తెలుగు, మళయాల భాషల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. - దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఐరా క్రియెషన్స్ ప్రోడక్షన్ నెం 1 గా నిర్మించిన ఛలో చిత్రంలో నరేష్ గారు కీలక పాత్రలో నటించారు. ఆ చిత్ర షూటింగ్లో నరేష్ గారు శ్రీమతి విజయనిర్మల గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. విజయనిర్మల గారు పేద కళాకారులకి చేసే సహాయం.. సినిమా అంటే ఎంతో గౌరవం అని.. ముఖ్యంగా తన ఫ్యామిలీ హీరోల చిత్రాలు విజయాలు సాధిస్తే ఎలా సంతోష పడతారో.. మరో హీరో చిత్రాలు విజయం సాధిస్తే కూడా అంతకి మించి సంతోష పడతారు. తెలుగు సినిమా విజయాల బాట నడవాలని ఎప్పూడూ కొరుకుంటారని ఆయన మాతో చెప్పేవారు. - ఐరా క్రియేషన్స్ ఒక వ్యక్తి గురించి దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి చేసిన పని మాత్రమే కాదు వారి గుణం, స్వభావం కూడా అందుకు కారణం. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కి తనవంతు సహాయన్ని ఇప్పటికీ శ్రీమతి విజయనిర్మల గారు అందిస్తున్నారనే వార్త నా హృదయంలో బాగా నాటుకు పోయింది. దర్శకురాలుగా సినిమాలు చేయటమే కాకుండా పేద కళాకారులకి సహయం చేసే గొప్ప లక్షణం ఆమె సొంతం. ఛలో చిత్రంలో నరేష్ గారితో నటించాను. విజయనిర్మల గారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా ఇదే ప్రపంచంగా వుండేవారట.. ప్రతి వారం ఏ సినిమా విడుదలయ్యింది. వాటి ఫలితాలు ఎలా వున్నాయనే డిస్కషన్ శ్రీమతి విజయనిర్మల గారితో వుండేదట అంతలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అందర్ని ఇలా వదిలి వెళ్ళి పోవటం చాలా దురదృష్టకరం. - హీరో నాగశౌర్య ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి యూవీ కృష్ణంరాజు వీరితో పాటు నటులు అల్లరి నరేష్, నాని, కల్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, సుశాంత్, ఆది, కాజల్ అగర్వాల్, ఈషా రెబ్బా, నితిన్, మంచు విష్ణు, మంచు మనోజ్.. దర్శకులు వంశీ పైడిపల్లి, గుణశేఖర్, బీవీయస్ రవి, అనిల్ రావిపూడి.. నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, హారికా హాసిని క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. -
ఆమె ఓ మార్గదర్శి : ఎన్టీఆర్
సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఆమె మరణం టాలీవుడ్‌కు తీరని లోటంటూ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హీరో ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. విజయ నిర్మల గారి జీవితం ఎంతో మందికి మార్గదర్శకం, మరెంతో మందికి ఇన్స్పిరేషన్, ఆ మరణవార్త నన్ను కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (చదవండి : విజయనిర్మల కన్నుమూత) ‘ఇది మా కుటుంబానికి భయానకమైన రోజు. ఓ మార్గదర్శి, ఓ లెజెండ్, మా అమ్మాలాంటి వ్యక్తి విజయనిర్మల దేవుడి దగ్గరకు పయనమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నటి, నిర్మాత మంచు లక్ష్మీ విజయ నిర్మల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయ నిర్మల గారి మరణంలో శోకసంద్రంలో మునిగిపోయిన కృష్ణగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆమె ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. సంపూర్ణ జీవితం అనుభవించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ఆశిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు. (చదవండి : విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి) -
విజయనిర్మల కన్నుమూత టాలీవుడ్లో విషాదం
-
ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత
-
విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా విజయనిర్మల మృతిపై తమ సంతాపాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా నగరంలోని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. విజయనిర్మల మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. -
విజయనిర్మల కన్నుమూత
హైదరాబాద్: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష ఆమె దర్శకత్వం వహించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. విజయనిర్మల నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు మొత్తం అక్కడేవుంచి రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకువస్తారు. శుక్రవారం విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. -
ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము బాబుకు లేదు
సాక్షి, విశాఖపట్నం: ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై అసభ్య వీడియోలు సృష్టించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయిస్తున్నావని, మహిళల పట్ల నీకున్న గౌరవం ఇదేనా చంద్రబాబు అని విశాఖ తూర్పు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ నగర కార్యలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీ భార్య గురించి గొప్పలు చెప్పుకుంటావే... నీ కూతురు వయస్సున్న ఓ మహిళపై గత ఐదేళ్ల నుంచి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నావే.. ఇదేనా నీ సంస్కారం అని చంద్రబాబుపై మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని గొప్పలు చెప్పుకుంటావే ఇదేనా మహిళల పట్ల నీకున్న గౌరవమని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో యూట్యూబ్‌లో ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా వీడియోస్ అప్లోడ్ చేయించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నీ కోడలు బ్రాహ్మణి ఫొటోలు ఎవరైనా పెడితే ఒక మహిళ ఎంత బాధపడుతుందో అర్థమవుతుందన్నారు. నీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవచ్చు రా... అంతేగానీ ఒక మహిళ మీద అసభ్య వీడియోలతో దొంగదారుల్లో రావొద్దుని చంద్రబాబుని హెచ్చరించారు. అసభ్య వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టిన చంద్రబాబు అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. బాబు పాలనలో మహిళలకు రక్షణే కరువైందన్నారు. నీ భార్య, కోడలు వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే మహిళ ఆవేదన తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిని మీ పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని కొట్టించినప్పుడే మహిళలంతా చంద్రబాబుని అసహ్యించుకున్నారన్నారు. పెందుర్తిలో ఒక దళిత మహిళను ఎమ్మెల్యే అనుచరుడు వివస్త్రను చేసి ఈడ్చిన చరిత్ర టీడీపీదని, మరో ఆరు రోజుల్లో రాక్షసపాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేర శిఖామణా.. నారీమణా..మీకు ఎవరు కావాలి..?
ప్రశాంత విశాఖలో మూడు దశాబ్దాల క్రితం నేర చరిత్రను పరిచయం చేసిన వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోనూ కోట్ల రూపాయలతో భీమిలి అభివృద్ధికి బాటలు వేసిన అక్కరమాని విజయనిర్మల వైఎస్సార్సీపీ తూర్పు అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుమస్తా పనితో ప్రారంభించి.. గూండాగిరీ వరకూ ఎదిగి.. ఫైనాన్స్ కంపెనీ పేరుతో జనాల్ని ముంచేసి.. ఆపై మద్యం మాఫియాగా అవతరించిన వెలగపూడి కావాలా.. తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించిన విజయనిర్మల కావాలా? ఈ నిర్ణయానికి ముందు వారికి సంబంధించిన కొన్ని అంశాల్ని పరిశీలిద్దాం.. – విశాఖ సిటీ వెలగపూడి రామకృష్ణ – టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ♦ 30 సంవత్సరాల క్రితం విజయవాడలోని ఏలూరు రోడ్డులో రాగమాలిక ఆడియో షాపులో పగలంతా క్యాసెట్లు అద్దెకిచ్చే పని.. రాత్రయితే అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వెలగపూడి తయారు చేసుకున్నారు. ♦ దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో మూడో నిందితుడయ్యాడు. ఆ తరువాత బెజవాడ నుంచి పారిపోయి విశాఖకు వలసొచ్చి.. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారు చేసే ఓ వ్యాపారి వద్ద పని చేశారు. ఆ తర్వాత ఓ దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ సంస్థలో గుమస్తాగా పని చేశాడు. ♦ షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచాడు. మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి.. జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దంటూ బెదిరించి దౌర్జన్యం చేయించారు. అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. అప్పటి ఏసీపీ రంగరాజు కాళ్లావేళ్లా పడటంతో రౌడీషీట్ తెరవలేదన్న ఆరోపణలున్నాయి. ♦ విశాఖ నగరానికి విజయవాడ రౌడీలు, గూండాలను అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, విశాఖ సంస్కృతికి సంబంధం లేని కోడిపందేలు నిర్వహించారు. దేవినేని నెహ్రూ సోదరుడైన దేవినేని మురళి పేరుతో కబడ్డీ పోటీలంటూ హల్చల్ చేసేవాడు. ♦ 2009లో విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా వెలగపూడి ఎమ్మెల్యే గెలిచారు. అక్కడి నుంచి అతని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోని మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి అండతో వుడా భూములను కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ♦ సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం అమాయక రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బులు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండ సర్వే నం.21/ఏ,బీల్లో 650 గజాల గెడ్డ పోరంబోకు దురాక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని వుడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలకు తెరతీశారు. ♦ విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎదిగిపోయారు వెలగపూడి. మొత్తం నగరంలో 150 వైన్ షాపులు ఉండగా, 50 నుంచి 60 షాపుల్లో భాగస్వామ్యం, బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ♦ పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తూర్పు నియోజకవర్గంలో తాను ఈ ఒక్క మంచి పని చేశాను... అని చెప్పుకునే పరిస్థితి వెలగపూడికి లేదు. రాష్ట్రం మొత్తం మీద తూర్పు నియోజకవర్గంలోనే ఇటీవల ఏకంగా 40 వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే వెలగపూడి ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అక్కరమాని విజయనిర్మల – వైఎస్సార్సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ♦ భీమిలి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా, ఆ తర్వాత ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తూ.. అక్కడ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కరమాని విజయనిర్మల అనతి కాలంలోనే ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ♦ 2005లో భీమిలి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో రిజర్వేషన్ల పరంగా మహిళలకు కేటాయించడంతో అనుకోకుండా విజయనిర్మలకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలై ఉండడంతో టీడీపీ అభ్యర్థిగా గెలుపు అవకాశం తలుపుతట్టింది. ♦ ఆ తర్వాత భీమిలి మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా, చైర్‌పర్సన్‌గా సేవలందించారు. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలోనే ప్రయాణం సాగించారు. ♦ భీమిలి మున్సిపాలిటీ 2005–2010 మధ్య కాలంలో ఏడాదిన్నర కాలం పాటు చైర్‌పర్సన్‌గా, మిగిలిన సమయం వైస్‌చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ♦ ప్రతిపక్ష పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు కూడా భీమిలి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపారు. ♦ భీమిలి మున్సిపాలిటీ ప్రజల్ని దశాబ్దాల కాలంగా మంచినీటి సమస్య వేధించింది. గోస్తనీ నది పూర్తిగా ఎండిపోవడంతో తాగునీరు దొరకడం కష్టమైంది. ఈ సమయంలో విజయనిర్మల తన సొంత డబ్బులతో ప్రజలకు తాగునీటిని అందించి అందరి మన్ననలూ పొందారు. ♦ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.17.50 కోట్ల వ్యయంతో 2005 ఆగస్ట్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి.. పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల మంచినీటి కష్టాలు తీర్చారు. ♦ రూ.50 లక్షల నిధులతో మున్సిపాలిటీ పరిపాలన భవనాన్ని నిర్మించారు. ♦ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సంప్రదింపులు చేస్తూ.. రూ.3.35 కోట్ల నిధులను దగ్గరుండి విడుదల చేయించి.. భీమిలి మున్సిపాలిటీలోని మురికివాడల్లో మంచినీరు, రోడ్లు, పాఠశాలల అభివృద్ధి, తదితర సదుపాయాలు కల్పించారు. ♦ విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల చిట్టాను తయారు చేసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. ♦ తన ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకూ విశ్రాంతి లేకుండా కృషి చేసే అక్కరమాని విజయనిర్మల వంటి విజ్ఞురాలు కావాలా..? వంచనలతో విశాఖలో విషపు సంస్కృతికి తెరతీస్తూ.. లిక్కర్ మాఫియాతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెలగపూడి కావాలా..? ఓటర్లూ ఆలోచించుకోండి. -
‘నీచ రాజకీయాలు బాలకృష్ణ మానుకోవాలి’
విశాఖపట్నం: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాధాకరమని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఒక మహిళ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అని కూడా చూడకుండా లేనిపోనివి కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. టీడీపీ నాయకుల చర్యలతో మానవత్వం ఉన్న తల్లిదండ్రులు మనస్తాపం చెందుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ప్రచారం స్వయంగా హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసం నుంచే జరగడం విచారకరమన్నారు. చంద్రబాబు నాయుడికి ఆడపిల్లలు లేరు..కనీసం బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న ఆలోచన చేయకుండా షర్మిలపై చెడు ప్రచారం సాగించడం బాధాకరమన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు ఇలాంటి నీచరాజకీయాలు మానుకోకపోతే మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారని శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేతప్ప మహిళలపై లేనిపోని నిందలు వేస్తే సహించేది లేదన్నారు. -
వెలగపూడికి ఎదురుగాలి!
విశాఖపట్నం... ప్రకృతి గీసిన అందమైన నగరం. అయితే కొన్నేళ్లుగా విశాఖలో నేరసంస్కృతి విజృంభిస్తోంది.. గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యమైపోయాయి. పాతికేళ్ల క్రితమే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ సంస్కృతికి బీజం వేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయకపోగా అవినీతి, అక్రమాలను ప్రోత్సహించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇదీ వెలగపూడి చరిత్ర విజయవాడలోని ఏలూరు రోడ్డులో మూడు దశాబ్దాల క్రితం రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్లు అద్దెకిచ్చే పని వెలగపూడిది. రాత్రిపూట అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకున్నారు. దేవినేని నెహ్రూ అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యారు. రంగా హత్య దరిమిలా కోస్తా జిల్లాల్లో చెలరేగిన ‘వర్గ’ కక్షల నేపథ్యంలో పారిపోయి విశాఖకు వలసొచ్చారు. తొలుత ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకుని, అనంతరం కిరణ్ యాడ్స్‌లో చిన్న గుమాస్తాగా చేశారు. షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్ కంపెనీ పెట్టి జనాలను నిలువునా ముంచారు. ఈ క్రమంలోనే మద్యం సిండికేట్ వైపు దృష్టిసారించి..జనప్రియ సిండికేట్ వ్యాపారులను టెండర్లు వేయొద్దని బెదిరించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరవాలని చూడగా అప్పటి పోలీసు ఉన్నతాధికారిని బతిమాలుకోవడంతో రౌడీషీట్ తెరవలేదని చెపుతారు. రౌడీ రాజకీయం తెలియని విశాఖ నగరానికి రౌడీలు, గూండాల్ని అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, కోడిపందేలు నిర్వహించేవారు. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఆక్రమణలు 2009లో విశాఖ తూర్పు నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ నేతలెవరూ ముందుకు రాకపోవడంతో వెలగపూడికి ఆ అవకాశం వచ్చింది. పీఆర్పీతో ముక్కోణపు పోటీ వల్ల అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. అక్కడినుంచి అతని అరాచకాలకు అడ్డూ..అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉడా భూములు కాజేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్టార్–2లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం రజకుల్ని ఖాళీ చేయించడం, ఆ భవన యజమాని అడిగినంత డబ్బు ఇవ్వలేదని తిరిగి వారిపైనే దౌర్జన్యం చేయడం.. రుషికొండలో భూ ఆక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని ఉడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఆంధ్రవిశ్వవిద్యాలయ భూముల ఆక్రమణ, వర్సిటీలో వర్గ రాజకీయాలు జొప్పించి కలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే వెలగపూడి నేరచరిత్ర చాంతాడంత ఉంది. లిక్కర్ మాఫియాతో చెలరేగిన వెలగపూడి ఎడ్యుకేషన్ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని అడిక్షన్ సిటీగా మార్చేశారు. లిక్కర్ మాఫియాతో విశాఖలో మద్యం సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. నగరంలో 50 నుంచి 60 షాపుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. బినామీల పేరిట సొంతంగా 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పేదలను కేవలం ఓటర్లుగానే చూస్తూ పండుగలకు, పబ్బాలకు చిల్లర విరాళాలిచ్చి చీప్ లిక్కర్ మత్తులో వారి రక్తాన్ని పీల్చుతున్నారు. ఇదిలా ఉండగా తూర్పు నుంచి ఈమధ్యకాలంలో ఏకంగా 40వేల దొంగఓట్లను ఎన్నికల సంఘం గుర్తించి తొలగించిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో విజయనిర్మల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అక్కరమాని విజయనిర్మల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. భీమిలి మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్, చైర్ పర్సన్ హోదాల్లో పనిచేసి ప్రజామన్నన పొందారు. మహిళలకు ఏ ఇబ్బందులొచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. ఎన్నికల ప్రచారంలో జనం ఇబ్బందులు తెలుసుకుంటూ వారి మద్దతు కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో వెలగపూడిపై విజయనిర్మల గెలుపు తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం : విశాఖపట్టణం తూర్పు మొత్తం ఓట్లు : 2,31,915 పురుషులు : 1,15,295 మహిళలు : 1,16,605 ఇతరులు : 15 - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
తెలుగు సినిమాకి బహూకరిస్తున్నాం
‘‘ఒక వివాహ వేడుకలా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అందమైన విషయాలతో కూడిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇంత మంచి గ్రంథాన్ని మాకు అంకితం చేసినందుకు రచయిత డా. కె.ధర్మారావుకు అభినందనలు’’ అని ‘తెలుగు సినిమా గ్రంథం’ స్వీకర్తలు కృష్ణ, విజయనిర్మల అన్నారు. సినీ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. విశిష్ట అతిథి, దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘484 పేజీల్లో విషయం, మరో 24 పేజీల రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను ఈ గ్రంథంలో బాగా ఆవిష్కరించారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా చరిత్రను ధర్మారావు చక్కగా విశదీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు’’ అన్నారు నటుడు నరేశ్. ఈ సమావేశానికి ముందు గాయకులు టి.లలితరావు, డా. టీవీ రావు కలిసి కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి అలరించారు. రచయిత కె.ధర్మారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా.కీమల ప్రసాదరావు, ఫాస్ గౌరవాధ్యక్షులు ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య ఆదుర్తి సూర్యకుమారి పాల్గొన్నారు. -
మా మంచి పనులు కొనసాగిస్తూనే ఉండాలి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల దంపతులు సంయుక్తంగా ‘సిల్వర్ జూబ్లీ డైరీ – 2019’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మా’ మెంబర్స్‌లో పేద కళాకారుల ఇంటి ఆడపిల్లలకు ‘మా కల్యాణ లక్ష్మి’, ‘మా విద్య’ పథకాలను స్టార్ట్ చేస్తున్నట్లు ‘మా’ బృందం పేర్కొంది. ఈ పథకానికి విజయనిర్మల లక్షా యాభై వేల రూపాయలు, శ్యామల లక్ష రూపాయిలు విరాళం అందించారు. కృష్ణ మాట్లాడుతూ – ‘‘మా’ ఇలాంటి మంచి పనులు కొనసాగించాలి. అసోసియేషన్ సొంత బిల్డింగ్ నిర్మాణం జరగాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘కృష్ణ, కృష్ణంరాజు అంటే ఇండస్ట్రీ తొలినాళ్లలో మూల స్తంభాలు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారంటే డబ్బులు తీసుకోకుండా వాళ్లకు సినిమాలు చేశాం. కృష్ణగారు ఫిల్మ్ కొనిచ్చి సహాయం చేస్తే, నేను భోజనాలు పెట్టించేవాణ్ణి. వర్గబేధాలు లేకుండా సమస్యలు పరిష్కరించాం. ‘మా’ సంస్థ చాలా మందికి ఉపయోగపడుతోంది. ఇంకా బాగా కొనసాగాలి. అలాగే ఓ మంచి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. ‘‘ఈ కార్యక్రమం పెళ్లిలా జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని విజయనిర్మల అన్నారు. ‘‘ఒకే వేదిక మీద కృష్ణ, కృష్ణంరాజుగారిని సన్మానించడం గర్వంగా ఉంది. విజయనిర్మలగారు అద్భుతమైన సినిమాలు తీసి రికార్డ్ సృష్టించారు. ఆవిడను మనందరం సన్మానించుకోవాలి’’ అని శ్యామల అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం 33మంది కళాకారులకు 3000 చొప్పున ఫించను ఇస్తున్నాం. జనవరి నుంచి 5000 ఇవ్వాలనుకుంటున్నాం.‘మా కల్యాణ లక్ష్మి’ ద్వారా 1,16,000 రూపాయలు అర్హులకు అందిస్తాం. ‘మా విద్య’ ద్వారా లక్ష రూపాయిలు అందిస్తాం. త్వరలోనే లండన్‌లో ఓ ఈవెంట్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘అపోలో హాస్పిటల్స్ 14 లక్షలు స్పాన్సర్షిప్ అందించింది. విజయనిర్మలగారు ప్రతి పుట్టిన రోజుకు డొనేషన్ ఇస్తుంటారు. ప్రతి నెలా 15వేలు పంపుతున్నారు’’ అన్నారు ప్రధాన కార్యదర్శి నరేశ్. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: జీవిత సాఫల్య పురస్కారం: సూపర్ స్టార్ కృష్ణ,విజయ నిర్మల
-
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్‌గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్‌గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్‌టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్‌స్టార్‌గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్‌గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్‌కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్‌లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్‌రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్‌ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్‌కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్‌బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్‌గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్‌కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్‌లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్‌లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్‌తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్‌కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్‌కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్‌బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్‌రెడ్డి (అర్జున్‌రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్‌బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్‌బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
లైఫ్‌టైమ్ స్టార్స్
పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో పనిచేస్తారు. కానీ.. కొంతమంది ఎంచుకున్న పనికే వన్నె తెస్తారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల. ఈ పేర్లు ప్రస్తావించకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. ఇక తెలుగు సినిమా చరిత్రలో వీరి పాత్ర చెప్పాలంటే అది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రస్థానం. ఒకరు తిరుగులేని సూపర్స్టా్టర్, మరొకరు కళారంగంలో స్త్రీ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంచుకున్న రంగంలో ఇద్దరూ ఇద్దరే. 1943 మే 31న గుంటూరు జిల్లాలో బుర్రిపాలెంలో వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణ, సూపర్‌స్టార్ కృష్ణగా ఎదగడంలో ఎన్నో ఎత్తుపల్లాలు... ఒడిదుడుకులు... ఇంకెన్నో సాహసాలు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్నపుడు, ‘చేసిన పాపం కాశీకి వెళ్లినా...’ అనే నాటకంతో మొదలైన నటనాభిలాష, 1965లో తేనెమనసులు సినిమాతో హీరోగా వెండితెరకు చేరింది.బంగారు వర్ణంతో మెరిసిపోతూ.. సన్నని మీసకట్టుతో.. అమాయకంగా, అందంగా ఇంట్లో పెద్దకొడుకులా కనిపించే కృష్ణను చూసి తెలుగు ప్రేక్షకులు మురిసిపోయారు. సీతారామరాజు గెటప్ వేసినా... సింహాసనం మీద కూర్చున్నా...కౌబాయ్‌గా కనిపించినా... జేమ్స్ బాండ్‌గా మెరిపించినా... చారిత్రకం, పౌరాణికం, జానపదం, సాంఘికం ఏ జానరైనా, ఏ పాత్ర వేసినా అది సూపర్‌హిట్... అందుకే అతను టాలీవుడ్ సూపర్‌స్టార్ అయ్యారు. హీరోగా కృష్ణ చేసిన తొలి చిత్రమే తెలుగులో పూర్తిస్థాయి కలర్లో తీసిన తొలి సాంఘిక చిత్రం. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తర్వాత ఆయన ఎన్నో విషయాల్లో తొలివ్యక్తిగా నిలిచారు. సాహసానికి చిరునామాగా పేరు తెచ్చుకున్న ఈ బుర్రిపాలెం బుల్లోడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈస్ట్‌మన్ కలర్, కలర్స్కోప్, 70 ఎమ్ ఎమ్, డిటిఎస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పోకడల్ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈ నటశేఖరుడే. ఇక తెలుగువారికి తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ ఆయనే. ఒకే ఏడాది హీరోగా 18 సినిమాలు రిలీజైన ఏకైక సూపర్ బిజీ... సూపర్ స్టార్ ఆయననొక్కరే. కెరీర్లో 25సార్లు ద్విపాత్రాభినయం, ఏడు సార్లు త్రిపాత్రాభినయంతో అలరించిన ఈ సూపర్‌స్టార్ 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా సేవలందించడంతో పాటు పద్మాలయా బ్యానర్‌పై తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు. తొలి నుంచి కాంగ్రెస్ అభిమానిగా ఉన్న కృష్ణ రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1989లో ఏలూరు నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణగారు... రాజీవ్ మరణంతో రాజకీయాలు వదిలేశారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ సూపర్‌స్టార్ ఐదుపదులు దాటిన తర్వాత కూడా మెగా హీరోలతో పోటీ పడి రెండు సార్లు సంక్రాంతి విన్నర్ ట్రోఫీ ఎత్తుకు పోయారు. ఇండస్ట్రీలో పట్టుదలతో కష్టపడితే పెద్ద హీరో అనిపించుకోవచ్చు కానీ... మంచి మనిషి అనిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కృష్ణ అది సాధించారు. విజయనిర్మల వెండితెరపై కృష్ణ విజయనిర్మల ’సాక్షి’ వేదికగానే పరిచయమయ్యారు. 1967లో సాక్షి చిత్రంలో తొలిసారి జంటగా నటించిన వీరిద్దరూ ఆ తర్వాత నిజజీవితంలోనూ ఒకటయ్యారు. తమ కెరీర్లో 47 చిత్రాల్లో కలిసి నటించారు. 11 యేళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు విజయనిర్మల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రెండువందలకు పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించి తిరుగులేని గుర్తింపు సాధించుకున్నారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా, తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పుపొందారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినిమా చరిత్రలోనే ఆ ఘనత సాధించిన ఏకైక కథానాయకుడిగా చరిత్ర సృష్టిస్తే... ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల అరుదైన ఘనతను సాధించారు. వెండితెరపై ఈ కళాజంటది అర్ధశతాబ్దపు ప్రయాణం. కళకు అంకితమై తెరకు గౌరవం పెంచిన ఈ దంపతులను ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తోంది సాక్షి. -
ఫిఫ్టీ..ఫిఫ్టీ
సగం సగం పంచుకుంటే సంపూర్ణం చెందేది ఏంటి?ప్రేమా? కాదు.. కాదు. బాంధవ్యమా? కాదు.. కాదు.సంతోషమా? ఊహూ.. కాదు.మరి సగం సగం చేసుకుంటే పరిపూర్ణం అయ్యేదేంటి?స్నేహం.కృష్ణ, విజయనిర్మలను చూస్తే సంపూర్ణమైన స్నేహం కనబడుతుంది.ఏదైనా పంచుకునే స్నేహంలా అనిపిస్తుంది.ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రెండ్షిప్. 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ‘సాక్షి’తో నెమరువేసుకుంటున్న కృష్ణ, విజయనిర్మల. మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. అసలు మీ మ్యారేజ్ డే ఎప్పుడో తెలుసుకోవాలనిపించింది. దాంతో పాటు మీ లవ్‌స్టోరీ కూడా. అందుకే ఈ ఇంటర్వ్యూ. విజయనిర్మల: (నవ్వుతూ). డేట్ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది 50వ సంవత్సరం. కృష్ణ: 1969 మార్చి 24. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్ చేసి విషెస్ చెబుతారు. మ్యారేజ్ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్ చేసి, ‘రేపు మీ మ్యారేజ్ డే’ అని గుర్తు చేస్తుంటారు (నవ్వుతూ). విజయనిర్మల: ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుకే డేట్ చెప్పేశారు. కృష్ణగారిని మీరు ఫస్ట్ టైమ్ ఎక్కడ చూశారు? ఏమను కున్నారు? విజయనిర్మల: సినిమా ఆఫీస్‌లో చూశాను. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలో నుంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నాను. సినిమాలో హీరో అని తెలియగానే చాలా సంతోషమేసింది. మేమిద్దరం కలసి చేసిన ఫస్ట్ మూవీ ‘సాక్షి’లో మీసాల కృష్ణుడు టెంపుల్ సీన్ ఉంది. ఆ టెంపుల్లో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త కడుపు చల్లగా. కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను. ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించేవారు. ‘ఊరుకో.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు’ అనేదాన్ని. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో కలిసి యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. భార్యాభర్తలుగా ఫస్ట్ వెళ్లిన షూటింగ్ ఏది? విజయనిర్మల: ‘అమ్మ కోసం’ సినిమా షూటింగ్ కోసం వెళ్లాం. మా పెళ్లి తర్వాత అదే ఫస్ట్ సినిమా. మేం పెళ్లి చేసుకుంటామని ఎవరూ ఊహించలేదు. చిత్తూరు నాగయ్యగారైతే. ‘ఇద్దరూ ముచ్చుల్లా ఉంటారు. సెట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎవరి దారిన వాళ్లు కూర్చుంటారు. ఇంత పెద్ద పని చేసుకొచ్చారా? ఎంత ధైర్యం వచ్చింది మీకు?’ అని ఆశ్చర్యపోయారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద టాక్. నేను సెట్లో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాను. ఆయనేమో ఎక్కువగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటారు. అలాంటిది మేం పెళ్లి చేసుకున్నామంటే.. రాసి పెట్టి ఉందనిపిస్తోంది. సో.. ‘సాక్షి’ సినిమా మీ లైఫ్‌లో స్వీట్ మెమరీ అన్నమాట.. విజయనిర్మల: బాపుగారి ‘సాక్షి’లో యాక్ట్ చేయడం వల్ల నాకు రెండు జాక్పాట్లు తగిలాయి. ఒకటి కృష్ణగారు, రెండోది డైరెక్షన్. బాపూగారి వల్లే నేను డైరెక్టర్ని అయ్యాను. ఆయన సాయంత్రాలు షాట్ డివిజన్ చేసుకునేవారు. బొమ్మలు వేసేవారు. ఇవన్నీ ఏంటీ? అని అడిగితే బ్యాక్ షాట్, క్లోజప్ అంటూ అన్ని విషయాలూ క్షుణ్ణంగా వివరించేవారు. నేను ఏ డైరెక్టర్ దగ్గరా పని చేయలేదు. బాపూగారి డైరెక్షన్లో సినిమా చేయడమే నా డైరెక్షన్‌కి ఓ రూట్ అయింది. ఆ విధంగా ‘సాక్షి’ వల్ల రెండు జాక్‌పాట్స్ తగిలాయని అనుకుంటాను. కృష్ణగారు బిడియస్తులు, రిజర్డ్వ్‌గా ఉంటారు. అసలాయన మీకు ఎలా ప్రపోజ్ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది. విజయనిర్మల: నేనున్న గదికి చంద్రమోహన్ వచ్చి ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అని చెప్పాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అడిగారు. విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? కృష్ణ: తను చాలా కామ్ పర్సన్. దానికి తగ్గట్టు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్ మీద చాలా కమాండ్ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ఆ ముక్కుసూటితనం ఇష్టం. విజయనిర్మల: అవి కూడా కాకుండా నేను చేసే వంటలంటే చాలా ఇష్టం. ఏ స్టూడియోలో షూటింగ్ ఉన్నా కూడా వంట చేసి తీసుకువెళ్లేదాన్ని. బాగా తినేవారు. చేపల పులుసు చాలా ఇష్టం. భువనకల్లు దగ్గర మంచి చేపలు దొరుకుతాయి. ఆ చేపల పులుసు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవారు. ఇంట్లో వంటమనిషి ఉన్నా మొన్నటి వరకూ కూడా నేనే చేసిపెట్టేదాన్ని. ఈ మధ్య చేయడం మానేశాను. కానీ చెప్పి చేయిస్తాను. కృష్ణగారు దొరకడం జాక్‌పాట్ అన్నారు. ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి ? విజయనిర్మల: ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను లేకపోతే రానని కండీషన్ పెట్టిందట. పెడితే పెట్టింది. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్ ఉండేది ఆయనకు. అప్పుడు కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్ అంటే క్రేజ్. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా? కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు కలసి యాక్ట్ చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు. ఎక్కువ సినిమాలు (48) చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆమె కెరీర్ విషయంలో మీ ప్రోత్సాహం గురించి? కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు విజయం సాధించాయి. తన నరేషన్ కూడా చాలా బావుంటుంది. షాట్స్ కూడా బావుంటాయి. విజయనిర్మల: నేను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని. నిర్మాత బావుంటే మనం బావుంటాం అనే సిద్ధాంతాన్ని నమ్మినదాన్ని. అందుకని పది పేజీల సీన్‌ని కూడా వెంటనే ఫినిష్ చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఓ సినిమాకి శివాజీ గణేశన్గారివి 30 రోజులు డేట్స్ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు. ‘ఏం కెమెరాలో ఫిల్మ్ ఉందా.. అన్నీ తీసేస్తున్నావు’ అని నాగేశ్వరరావుగారు సరదాగా అనేవారు. విజయ నిర్మలగారి డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు మీకెలా అనిపించేది? కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు. విజయనిర్మల: ఇద్దరం కలసి సీన్ డిస్కస్ చేసుకునేవాళ్లం. సెట్‌కి వచ్చిన తర్వాత మాత్రం ఏమీ అడగరు. ఏదైనా సినిమా అప్పుడు గొడవలు పడ్డ సందర్భం ఏదైనా? విజయనిర్మల: అస్సలు లేదు. ‘దేవదాసు’ సినిమా తీశామని ఏయన్నార్‌గారికి కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే అది ఆయన కెరీర్లో మైల్స్టోన్ సినిమా కదా. కానీ మా సినిమా చూసిన తర్వాత ‘చాలా బావుంది, చాలా బాగా తీశారు’ అని మెచ్చుకున్నారు. దర్శక–నిర్మాత పి.పుల్లయ్య గారు ఏడుసార్లు చూశారు. నా ఫ్యాన్ అయిపోయారు ఆయన. కృష్ణ: ఆ పిక్చర్ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్ చేయండని డిస్ట్రిబ్యూటర్స్ అడిగితే మాకు ఎక్కడ కట్ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీ ప్రసాద్ వంటి దర్శకులకు షో వేసి చూపిద్దాం అన్నాను. ఎల్వీ ప్రసాద్గారేమో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్ చేయమంది? అని అన్నారు. బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసి ఏడవడం నాకిదే ఫస్ట్ టైమ్ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్ అయిపోయాను అమ్మా’ అని విజయకు కాల్ చేశారు. కృష్ణగారు ఎమోషనల్ సీన్స్, యాక్షన్ అన్నీ బాగా చేస్తారు. కానీ డ్యాన్స్ చేయలేరు. నేర్చుకోమని మీరెప్పుడూ చెప్పలేదా? విజయనిర్మల: ఆయన ఎలా చేసినా బావుంటుంది. డ్యాన్స్ చేయక్కర్లేదు. ఇలా స్టిల్ ఇచ్చినా చాలు. ‘నంబర్ వన్’ సినిమాలో బ్రేక్ డ్యాన్స్ చేసేసరికి ఫ్యాన్స్‌కి పిచ్చిపట్టినంత ఆనందం కలిగింది. కృష్ణగారు, మీరు చాలా టూర్స్ వెళ్లి ఉంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయిన ట్రిప్? విజయనిర్మల: కాశ్మీర్. షూటింగ్ కోసం వెళ్లాం. రెండు రోజులు బ్రేక్ వస్తే బోట్లో అలా ట్రావెల్ చేశాం. బోట్ ట్రావెల్ అప్పుడు ఏదైనా మరచిపోలేని సంఘటన? విజయనిర్మల: మేం జాలీగా వెళ్లినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కృష్ణగారికి ఈత రాదు. నాకూ ఈత రాదు. ఓ సినిమాలో నేను బోట్ వెనక దాక్కునే సన్నివేశం ఉంది. గోదావరి ఫ్లో. నాకు చాలా భయంగా అనిపించింది. దూకగానే వెంటనే సేవ్ చేయండని యూనిట్‌తో అన్నాను. దూకాను. ఎవరో పైకి లాగారు. చూస్తే షూటింగ్ చూస్తున్న కుర్రాడు. నేను ప్రమాదవశాత్తు జారిపడ్డాననుకున్నాడు. ఇక చూడండి. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మళ్లీ ఆ సీన్ చేయాలి కదా. ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ ఉన్నా ఎప్పుడూ ఈత కొట్టలేదు. నేర్చుకుందాం అనుకున్నా. నాకు రాలేదు. కృష్ణ: ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ సినిమాలో నేను పులితో ఫైట్ చేసే సీన్ ఉంటుంది. పులి తెప్పించాం. దానికి మత్తు మందు ఇచ్చారు. నరేశ్ ఏమో ఆ పులితో ఫొటో దిగుతానని గొడవ. ఎంత మత్తు మందు ఇచ్చినా.. సడెన్‌గా మత్తు వదులుతుంది. వద్దన్నాం. దగ్గరికెళ్లి ఫొటో దిగాడు. దానికి కొంచెం మత్తు వదిలింది. ఫట్‌మని తోకతో నరేశ్ తలమీద ఒక్కటిచ్చింది. పెద్ద దెబ్బే తగిలింది. 50 ఏళ్ల వైవాహిక జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్‌కు ఏం చెబుతారు? విజయనిర్మల: ఒకరిని ఒకరం ఫుల్‌గా అర్థం చేసుకున్నాం. ఆయనకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలుసు. నాకెందుకు కోపం వస్తుందో ఆయన అర్థం చేసుకోగలడు. అర్థం అయిపోయినప్పుడు గొడవలు రావు. గొడవలు వస్తాయి. రావు అని కాదు. కానీ అవే సర్దుకుంటాయి. అసలు కృష్ణగారికి కోపం వస్తుందా? రాదు. చాలా తక్కువ. కానీ వస్తే మాత్రం భయంకరుడు. వచ్చిందంటే ఆయన అరచేయి చూడండి.. ఇటుక రాయిలా ఉంటుంది. ఫట్ అని వేసేస్తారు. నా మీద ఎప్పుడూ చేయి లేపలేదు. ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా? విజయనిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్ అయ్యాం. ఎప్పుడూ బాధ అనిపించలేదు. కృష్ణ: మహేశ్‌బాబు ఎప్పుడూ మా నాన్న అని చాలా బాగా మాట్లాడతాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ఒక యంగ్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ వచ్చేసింది. కనబడగానే క్లాప్స్ కొట్టేవారు. విజిల్స్ వేసేవారు. ఫస్ట్ సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ‘రాజకుమారుడు’ చేశాడు. స్టార్ హీరోకు ఉన్నంత ఓపెనింగ్స్, స్టార్ హీరోల సినిమాలు ఆడే రేంజ్లో వంద రోజులు ఆడింది ఆ సినిమా (కళ్లల్లో మెరుపుతో). విజయనిర్మల: చాలా మంది హీరోలున్నారు కానీ అందగాళ్లు లేరు. మహేశ్ మంచి అందగాడు. మొన్న వచ్చిన ‘భరత్ అనే నేను’లో మీసాలు పెట్టిన సీన్లో సేమ్ కృష్ణగారిలానే ఉన్నాడు. కృష్ణ: ముందు ‘భరత్ ప్రమాణ స్వీకారం’ అంటూ ఓ వాయిస్ క్లిప్ రిలీజ్ చేశారు. అప్పుడు చాలామంది కృష్ణగారు డబ్బింగ్ చెప్పారు అని అన్నారు. మా ఫ్యాన్స్‌లో చాలామంది మహేశ్‌కి ఫోన్ చేసి మీరు చెప్పారా? నాన్నగారు చెప్పారా? అని అడిగారట. చాలా బావుంది, నా వాయిస్‌లానే ఉంది అని మెచ్చుకున్నాను. విజయనిర్మల: మహేశ్ మంచి బిడ్డ. ఎప్పుడూ ఒకర్ని కసురుకోవడం, కోప్పడటం ఉండదు. నరేశ్‌గారి కెరీర్ గ్రాఫ్ తీసుకున్నా ‘శతమానం భవతి, రంగస్థలం, సమ్మోహనం’.. ఇలా కంటిన్యూస్‌గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు.. విజయనిర్మల: ‘రంగస్థలం’ సినిమాలో చాలా బాగా చేశాడు. నరేశ్ హీరోగా చేసినన్ని రోజులు చేసి ఆ తర్వాత ఖాళీగా కూర్చోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ బాగా రాణిస్తున్నాడు. ఏ క్యారెక్టర్ అయినా చేయాలనుకునే మనస్తత్వం. అందంగా కనిపించే పాత్రలే చేయాలనుకోడు. పాత్రకు తగ్గట్టు ఉంటాడు. కృష్ణ: నరేశ్ మంచి ఆర్టిస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆల్మోస్ట్ నంబర్ 1 పొజిషన్‌కు వచ్చారు. మీరు రిలీజవుతున్న ప్రతి సినిమా చూస్తారా? కృష్ణ: ఇంట్లోనే ఓ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకున్నాం. రీసెంట్ సినిమాలు చూస్తాం. అన్ని సినిమాలు చూస్తే బోర్ కొట్టేస్తుంది. అందుకే సక్సెస్ అయిన సినిమాలు చూస్తాం. సినిమాలు చూడటం ఓకే. చేయాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు? కృష్ణ: కొంచెం బ్యాక్‌పెయిన్ ఉంది. ఇప్పటివరకూ మంచి మంచి సినిమాలు చేసి చిన్న చిన్న వేషాలు వేయడం ఎందుకు అని? అలాగే ‘కృష్ణగారి నడక మారింది’ అని ఆ మధ్య ‘మల్లన్న, బలాదూర్’ సినిమాలప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఎన్నో గొప్ప సినిమాల్లో యాక్ట్ చేసి మళ్లీ ఆ పేరు పోగొట్టుకోవడం ఎందుకు? అనిపించింది. ఆర్టిస్ట్ అన్న తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నా. అందుకే ఆ చిన్న కంప్లైంట్ నాకు పెద్దదిగా అనిపించింది. మానేశా. ఏ చానల్ పెట్టినా రోజూ నాది ఏదో ఒక సినిమా అయినా ప్లే అవుతూనే ఉంటుంది. మంజుల, సుధీర్‌బాబు.. ఇలా మీ ఫ్యామిలీలో ఎవరికి వాళ్లు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తోంది? కృష్ణ: మంజుల చిన్నప్పటి నుంచి మా సినిమా సెట్స్‌కు వస్తుండేది. అలాగే సినిమా మేకింగ్ టెక్నిక్ తెలిసింది. సినిమాలో కూడా యాక్ట్ చేయాలనుకుంది. కానీ ఫ్యాన్స్ వద్దన్నారు. మంజుల హీరోయిన్గా కృష్ణారెడ్డి ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అయితే బెజవాడలో తన కటౌట్‌ని కూల్చేశారు. ఇలాంటి అభిమానులు ఉండటం ఎలా అనిపిస్తుంటుంది? కూతురి ఆశ నెరవేరలేదని బాధపడ్డారా? కృష్ణ: మంజులను నా అభిమానులు తమ సొంత చెల్లెల్లా భావించారు. ‘షో’కు నేషనల్ అవార్డ్ వచ్చాక ఆ సినిమా రిలీజ్ చేసింది. అలాంటి పాత్రలైతే బావుంటుంది. రెగ్యులర్ హీరోయిన్గా అయితే వద్దని ఫ్యాన్స్ అన్నారు. వాళ్లు అంతగా సొంతం చేసుకోవడం హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఫైనల్లీ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మార్నింగ్ త్వరగానే నిద్ర లేస్తాం. లేచిన వెంటనే ఆయన వాకింగ్ చేస్తారు. నేను స్నానం చేసి పూజ చేసుకుంటాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్. లంచ్, డిన్నర్ కరెక్ట్ టైమ్‌కి తీసుకుంటాం. కృష్ణగారి బయోపిక్ తీస్తే ఒప్పుకుంటారా? విజయనిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్ చేయాలి. మహేశ్ కూడా చాలా ఫాస్ట్. సెట్లో చాలా జోక్స్ వేస్తుంటాడు. కృష్ణగారు అవేం చేయరు. అలా దూరంగా ఉండిపోతారు. జోక్ వేయడం కూడా రాదు. కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్ చేస్తారా? విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు. విజయనిర్మల గారిని పెళ్లి చేసుకున్నాక ‘తప్పు చేశాను’ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? కృష్ణ: ఎప్పుడూ అనిపించలేదు. అలాంటి సందర్భాలు తను క్రియేట్ చేయలేదు. విజయనిర్మల: లేదు. మా పిల్లలకు కూడా అనిపించలేదు. వాళ్లు చిన్నప్పటి నుంచి పిన్నీ పిన్నీ అని నాతో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. మంజుల నీళ్లలో పడవ వేసే ఆట నాతో ఆడుకునేది. నేనూ చిన్నపిల్లలా వాళ్లతో ఆడుకునేదాన్ని. ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టపడతారు. – డి.జి. భవాని -
చిట్టితల్లికి జేజేలు
విశాఖ కల్చరల్: ప్రతిభతో.. సేవా దృక్పథంతో.. రాణిస్తున్న మహిళలను సత్కరించారు.. సమాజానికి దశ దిశ నిర్దేశించల మార్గ దర్శకులైన అతివలకు జేజేలు పలికారు.. పురస్కార గ్రహీతల్లో విజయనిర్మల వం టి దర్శక దిగ్గజం నుంచి కలశ మేడపురెడ్డి వంటి నాలుగేళ్ల చిన్నారి వరకు విభిన్న రంగాల వారు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ టూరిజం సంస్థ, జె–వరల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వి–టీఎం ఈవెంట్ మేనేజర్ సంస్థ సీఈఓ వీరూమామ నిర్వహించారు. గిన్నిస్‌బుక్ రికా ర్డుల్లోకెక్కిన సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేక పోవడంతో ఆమె తనయుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రధాన కార్యదర్శి నరేష్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజాగ్ తనకు తల్లిలాంటిదని నరేష్ అన్నారు. ప్రతి మనిషి జీవితంలో రెండుసార్లు పుడతాడు. అమ్మ కడుపులోంచి ఒకసారి, ఎక్కడైతే వృత్తి ప్రారంభమైందో అక్కడ మరోసారి పుడతాడు. ఈ విధంగా వైజాగ్ తన కు తల్లితో సమానమని వివరించారు. తన గురువు జంధ్యాల దర్శకత్వంలో సినీ కెరీర్ నాలుగు స్తంభాలాటతో ప్రారంభమైందన్నారు. విశాఖలోనే తాను నటించిన జంబలకడి పంబ వంటి పలు చిత్రాల షూటింగ్ జరిగి అద్భుత విజయాలు సాధించాయన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, దక్షిణాది సూపర్‌స్టార్ శరత్‌కుమార్, సినీ దర్శకురాలు బి.జయ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేష్, ఏపీ పర్యాటక సంస్థ డైరెక్టర్ పి.ఎస్.నాయుడు, టాలీవుడ్ నిర్మాత బి.ఎ.రాజు, వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్ అధక్షుడు గంట్ల శ్రీనుబాబు, గంటా నారాయణమ్మ ట్రస్ట్ చైర్పర్సన్ గంటా శారద, సురక్ష హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ నటి శ్రీదేవి, సిరియా అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వసంత కోకిల చిత్రంలో ఇళయారాజా స్వరపరిచిన ‘కథగా కల్పనగా..’ పాటను శ్రీదేవి స్మృతిగా ఆలపించారు. సందర్భానికి సరితూగేలా యుగే..యుగే.. నా ధర్మము.. అనే పల్లవితో సాగిన గీతం మహిళల మనోభావాలను ఆవిష్కరించింది. నృత్య ప్రదర్శనల మధ్యలో క్విజ్, దివ్యాంగులు/ ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారి సాంస్కృతిక ప్రదర్శనలు వెరసి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగారూ రూపొందించారు. పురస్కార గ్రహీతలు వీరే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి వి–టీమ్ అంతర్జాతీయ మహిళా పురస్కారాలు స్వీకరించారు. వీరిలో పద్మినీ కచ్చపి (సంగీతం–అమెరికా), నజరత్ హజాన్ (దుబాయ్–శాంతి), హరిక కొలివెలసి (ఏపీ–సంఘ సేవ), బి.జయ (టాలీవుడ్ దర్శకురాలు), కల్పన (సినీ నేపధ్యగాయని), పల్లవి(బుల్లితెర నటి), కలశ మేడపురెడ్డి (చిన్నారి సంఘ సేవకురాలు), శరణి గంటా (నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్), సీతా మాడభూషి (సంప్రదాయ నాట్యం), సనా(టాలీవుడ్ క్యారెక్టర్ నటి), మార్టినా డి–క్రూజ (అడ్వాన్స్ ఎడ్యుకేషన్), జి.లక్ష్మి (పోలీసు), సమలినీ ఫోనిక్సా(శ్రీలంక నటి) ఈ పురస్కారాలందుకున్నారు. కార్యక్రమానికి సౌత్ ఇండియా టైటిల్ విజేత గాయత్రి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
ఆ మాట నాకు పద్మభూషణ్‌తో సమానం – విజయ నిర్మల
‘‘అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో సినిమా తీసిన ఏకైక లేడీ డైరెక్టర్ విజయనిర్మల. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికిపైగా సినిమాల్లో నేను నటించినందుకు సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. నటి–దర్శక–నిర్మాత విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో మంగళవారం జరిగాయి. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏడాది మా ఇంటికి విచ్చేసి, అభిమానాన్ని చాటుకొంటున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గౌరవించిన విజయనిర్మలను త్వరలోనే భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఒకసారి దాసరి నారాయణరావుగారు మా ఇంటికొచ్చారు. నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి.. ‘ఏ స్టార్ హీరోయిన్‌కీ ఈ రేంజ్ క్రేజ్ లేదు’ అన్నారు. ఆ మాట నాకు పద్మభూషణ్ అవార్డుతో సమానం’’ అన్నారు విజయ నిర్మల. ‘‘దాసరి, బాపు వంటి టాప్ డైరెక్టర్స్ తొలి హీరోయిన్ విజయనిర్మలగారు. విజయశాంతిలాంటి స్టార్ హీరోయిన్ని ‘కిలాడి కృష్ణుడు’తో తెలుగు తెరకు పరిచయం చేసిన విజయనిర్మలగారి పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములవడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత బి.ఏ.రాజు. 73వ పుట్టినరోజు సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌కు విజయనిర్మల 73 వేల రూపాయల చెక్ అందించారు. నటుడు నరేశ్, హీరో నవీన్ విజయ్‌కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
పద్మభూషణ్‌కి విజయనిర్మలగారి పేరును ప్రతిపాదిస్తాం
– తలసాని శ్రీనివాస యాదవ్ ‘‘విజయనిర్మలగారు గొప్ప నటి. మంచి దర్శకురాలు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె. విజయనిర్మలగారి పేరును పద్మభూషణ్ పురస్కారానికి ప్రభుత్వం తరపున సిఫార్సు చేయనున్నాం’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు, నటి విజయ నిర్మలకు రాయల్ అకాడమీ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణ, విజయనిర్మలను శాలువాతో సత్కరించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్, ఇతర సభ్యులు శ్రీకాంత్, వేణు మాధవ్, హేమ తదితరులు పాల్గొన్నారు. -
జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు
ఖమ్మం: జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా ముండ్లపాటి విజయనిర్మలకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఫిబ్రవరిలో ఇదే కార్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి.మణిమాలకు జేడీఏగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఈ శాఖలో రాష్ట్రస్థాయిలో ఉపసంచాలకుల వరకు పదోన్నతులు కల్పించారు. దీంతో మన జిల్లాకు రెండు ఉపసంచాలకుల పదవులు భర్తీ అయ్యాయి. జేడీఏ కార్యాలయ ఉపసంచాలకులుగా విజయనిర్మలకు అవకాశం దక్కింది. దీంతో విజయనిర్మలకు జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మణిమాల నుంచి జేడీఏ బాధ్యతలను విజయనిర్మల తీసుకున్నారు. మణిమాల ఏడీఏగా తిరిగి తన విభాగంలోకి వెళ్లారు. -
అభిమానుల మధ్య సూపర్ స్టార్ జన్మదిన వేడుకలు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని ఫాంహౌస్‌లో అభిమానుల మధ్య సూపర్ స్టార్ క్రిష్ణ 74 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలతో పాటూ అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు. భార్య విజయ నిర్మలతో కలిసి కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని క్రిష్ణ అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తాను అభిమానులకు శ్రీశ్రీ సినిమాను కానుకగా ఇస్తున్నానని, సినిమా విజయవంతం చేయాలనీ కృష్ణ కోరారు. విజయ నిర్మల మాట్లాడుతూ అభిమానులు మధ్య ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. -
శ్రీశ్రీ ఆవేశం
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరంలా నిలిచిన మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే సూపర్‌స్టార్ కృష్ణ ‘శ్రీశ్రీ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్‌పై శ్రీసాయిదీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూస్తే మహాకవి శ్రీశ్రీ గుర్తుకొస్తున్నారు. ఆయన తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. దర్శకుడు చెప్పిన దానికంటే అద్భుతంగా తీస్తున్నారు’’ అని అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ‘‘కథ, పాత్రలు నచ్చడంతో కృష్ణగారు, నేనూ కలసి నటిస్తున్నాం. నా 70వ ఏట రీ ఎంట్రీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. ఫిబ్రవరి 12న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
కేసీఆర్‌ను కలిసిన కృష్ణ దంపతులు
-
కేసీఆర్‌ను కలిసిన కృష్ణ దంపతులు
హైదరాబాద్: హీరో కృష్ణ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను సోమవారం సాయంత్రం కలిశారు. కృష్ణ, విజయనిర్మల దంపతులు ఇద్దరూ కలిసి బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు కుమారుడి వివాహం త్వరలోనే ఉండటంతో, ఆ వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించాల్సిందిగా కృష్ణ దంపతులు కేసీఆర్‌ను కోరారు. -
కృష్ణ నటజీవితానికి 50 ఏళ్లు
-
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మల
‘‘ఎడిటర్‌గా నవీన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. నవీన్ నటిస్తున్న ఈ తొలి చిత్రం ట్రైలర్ చూశాను. చాలా ఈజ్‌తో నటించాడు. ఒక మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ నవీన్‌లో ఉన్నాయి. వచ్చే పుట్టినరోజుకు తను మంచి స్టార్డమ్ తెచ్చుకుంటాడు’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ చంటి అడ్డాల ఓ చిత్రం నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ రగుతు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని నవీన్ విజయకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం నాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. కృష్ణ, విజయనిర్మల, జయసుధ సంయుక్తంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘నవీన్ మంచి ఎడిటర్. హీరోగా చేయాలని ఉందనగానే, ప్రోత్సహించాం. మంచి హీరోగా నిరూపించుకోవడానికి రెండేళ్ల పాటు తగిన కసరత్తులు చేసి, రంగంలోకి దిగాడు’’ అని చెప్పారు. నరేశ్ మాట్లాడుతూ - ‘‘ఓ విజయవంతమైన చిత్రానికి కావాల్సిన దమ్మున్న కథతో నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. వేరే నిర్మాతలు నవీన్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చినప్పటికీ చంటి అడ్డాల మీద నమ్మకంతో ఆయన బేనర్లో సినిమా అంగీకరించాం’’ అన్నారు. ఇప్పటి వరకు జరిపిన షెడ్యూల్స్‌తో 70 శాతం సినిమా పూర్తయ్యిందనీ, వచ్చే నెలాఖరుకి మొత్తం పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. నవీన్ శారీరక భాషకు వంద శాతం నప్పే కథ ఇదని దర్శకుడు చెప్పారు. మంచి కమర్షియల్ అంశాలున్న చిత్రమిదని నవీన్ విజయకృష్ణ తెలిపారు.