
ఇటీవల మరణించిన నటీ, దర్శకురాలు విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులు సూపర్ కృష్ణ, నరేష్‌తో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొని నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయనిర్మలకు నివాళులర్పించారు.
విజయనిర్మల జూన్ 27న కాంటినెంటల్ హాస్పిటల్ చిక్సిల్ పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించిన ఆమె మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది.