ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల కొన్నేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానమిచ్చారు.
'మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టం. కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారు. తర్వాత వాళ్లు మా ఇంట్లోనే ఉన్నారు. షూటింగ్‌కు వెళ్లేముందు కూడా అత్తామామలకు వంట చేసి పెట్టి వెళ్లేదాన్ని. వాళ్లకు నా చేతి వంట అంటే ఎంతో ఇష్టం. మా అత్త చనిపోయే ముందు నా చేతి బెండకాయ కూర, రసం ఉంటే తింటానన్నారు. అదే ఆమె చివరిసారిగా తినడం.
కృష్ణగారితో మూడు కాంబినేషన్స్ అయ్యాక ఆయనను డైరెక్ట్ చేస్తానన్నాను. కానీ ఆయన ఆర్టిస్ట్‌గా 100 సినిమాలు పూర్తి చేయు, తర్వాత నాకు నచ్చింది చేయమన్నారు. సరేనని మలయాళం, తెలుగు, తమిళం సినిమాలు చేసుకుంటూ పోయాను. అలా నేను కొచ్చిలో ఉన్నా కూడా కృష్ణగారు నాకోసం కారు తీసుకుని వచ్చేవారు. దాదాపు 80 సినిమాలు పూర్తయ్యాక డైరెక్టర్‌గా అవతారమెత్తాను. మొదట మలయాళంలో ఓ మూవీ డైరెక్ట్ చేశా. తర్వాత తెలుగులో మీనా నవల ఆధారంగా కృష్ణగారితో సినిమా తీశాను. అది చాలా సక్సెస్ అయింది' అని చెప్పుకొచ్చారు విజయ నిర్మల.
చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి
నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి
Comments
Please login to add a commentAdd a comment