
హైదరాబాద్ : సూపర్‌స్టార్ కృష్ణను రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. శేరిలింగంపల్లి నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసంలో ఆయనను కలిశారు. కృష్ణ, నరేష్, మహేష్ బాబులను పరామర్శించి ఓదార్చారు. విజయనిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..విజయనిర్మల మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని అన్నారు. విజయనిర్మల విలువలు కలిగిన వ్యక్తి అని, ఆవిడకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డు సాధించిందని తెలిపారు. 1999లో విజయనిర్మల టీడీపీ పక్షాన పోటీ చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment