సినీ దిగ్గజం విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ముగిశాయి. ఆమె కడచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆమె భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.