శ్రీశ్రీ ఆవేశం | Superstar Krishna's 'SRI SRI' Firstlook | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ ఆవేశం

Published Thu, Dec 10 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

శ్రీశ్రీ ఆవేశం

శ్రీశ్రీ ఆవేశం

అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరంలా నిలిచిన  మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే సూపర్‌స్టార్ కృష్ణ ‘శ్రీశ్రీ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్‌పై శ్రీసాయిదీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో  చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూస్తే మహాకవి శ్రీశ్రీ గుర్తుకొస్తున్నారు.
 
 ఆయన తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. దర్శకుడు చెప్పిన దానికంటే అద్భుతంగా తీస్తున్నారు’’ అని అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ‘‘కథ, పాత్రలు నచ్చడంతో కృష్ణగారు, నేనూ కలసి నటిస్తున్నాం. నా 70వ ఏట రీ ఎంట్రీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. ఫిబ్రవరి 12న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement