Sri Sri
-
కరవు పాట
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు. ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి. ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు. కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. ‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు. నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్. నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’ -
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
90 సెకన్లలో మానవ చరిత్ర
-
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
వ్యధార్థ జీవుల యథార్థ కవి
శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు. ‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది. స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు. అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా. – డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి (నేడు శ్రీశ్రీ జయంతి) -
సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు ‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది. -
తీరని దాహం
History Of Poetry: మనకు చిన్నప్పటి నుంచే కవిత్వంతో పరిచయం ఏర్పడుతుంది. తల్లులు పాడే లాలిపాటల్లో సంగీత మాధుర్యమే కాదు, కవన మర్మమూ ఉంటుంది. బుడిబుడి అడుగుల వయసులో బడిలోకి అడుగుపెట్టాక, అక్కడ చెప్పే నీతిపద్యాలు కవిత్వం కాక మరేమిటి? వాల్మీకిని పూజిస్తారు, కాళిదాసును కొలుస్తారు, వేమనను పొగుడుతారు, గురజాడను గురువులా ఆరాధిస్తారు, శ్రీశ్రీని నెత్తినెత్తుకుని మరీ ఊరేగుతారు. తమ ఇళ్లలోని కుర్రాళ్లెవరైనా కవిత్వం గిలికితే మాత్రం కసురుకుంటారు, చిన్నబుచ్చుతారు. ‘కవిత్వమూ కాకరకాయలూ కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ఎందుకొచ్చిన వెర్రిమొర్రి రాతలు’ అంటూ కవిత్వం రాసే కుర్రకారును ఈసడించుకునే మర్యాదస్తుల మంచిలోకం మనది. ఆరంభ దశల్లో నానా రకాల దూషణ తిరస్కారాదులను తట్టుకుని, కవిత్వంలో స్థితప్రజ్ఞతో ముందుకుసాగే ధీరులే కవియోధులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఆటుపోట్లను తాళలేని అర్భకులు అదే చరిత్రలో ఆనవాలైనా లేకుండా కొట్టుకుపోతారు. కవిత్వంలో కాకలుతీరినా, దక్కాల్సిన గుర్తింపు దక్కని కవిపుంగవులూ తక్కువేమీ కాదు. అసలు కవిత్వం ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం దుస్సాధ్యం. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?/ చంద్రికలనేల వెదజల్లు చందమామ?/ ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?/ ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్నాడు కృష్ణశాస్త్రి. ప్రకృతి« సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి. ‘ఎందుకు?’ అని ప్రశ్నించినంత తేలికగా వాటికి సహేతుకంగా సమాధానం చెప్పడం కుదరదు. కవిత్వం కూడా కవికి సహజధర్మం. సత్కవుల ఘనతను కీర్తించడమూ, కుకవులను నిందించడమూ ఒకానొక కాలంలో కవిత్వ సంప్రదాయంగా ఉండేది. ఇప్పుడైతే కవులుగా చలామణీ అవుతున్న అకవులను కనీసం విమర్శించే పరిస్థితులు కూడా సాహితీలోకంలో లేవు. ఇంగ్లిష్ కవివరేణ్యుడు షెల్లీ తన ‘ఎ డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ’ వ్యాసంలో ‘కవులు ఈ ప్రపంచానికి ఎన్నికవని శాసనకర్తలు’ అన్నాడు. ఆయన కవులను బాగానే వెనకేసుకొచ్చాడు. కవుల గురించి షెల్లీ వకాల్తా పుచ్చుకున్నాడు సరే, మరి కవిత్వం గొప్పదనమేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బహుశా అలాంటి వారికి సమాధానంగానే కాబోలు గ్రీకు తత్త్వవేత్త ప్లేటో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలోనే ‘చరిత్ర కంటే కవిత్వమే పరమసత్యానికి చేరువగా ఉంటుంది’ అని తేల్చిచెప్పాడు. ‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. అలవాటు పడితే ఒకపట్టాన తీరని దాహమది! ఒకసారి కవిత్వంలో మునిగాక ఒడ్డున పడటం అంత తేలిక కాదు. మునకీతలు కొడుతూ ముందుకు సాగాల్సిందే! కొందరు బాల్యంలోనే కవిత్వంలో పడతారు. ఇంకొందరు యౌవనావస్థలో కవిత్వంలో పడతారు. కవిత్వంలో పడ్డవారు కవిత్వాన్ని తమ ప్రియతముల కంటే గాఢంగా ప్రేమిస్తారు. ‘వాణి నా రాణి’ అన్నాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. పదిహేనో శతాబ్దిలో ఆయన ఆ మాట అంటే, ఆనాటి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఇరవయ్యో శతాబ్ది ‘అహంభావ’కవి పఠాభి ‘కైత నా దయిత’ అంటే జనాలు పెద్దగా ఆశ్చర్యపడిపోలేదు. ఇన్ని శతాబ్దాల వ్యవధిలో కవిత్వంలోనూ మార్పులు వచ్చాయి, కవుల్లోనూ మార్పులు వచ్చాయి, కవిత్వాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించే పాఠకుల్లోనూ మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినా, కవిత్వానికి గల మౌలిక లక్షణం ఒక్కటే! దాని గురించే– ‘కవిత్వం ఒక ఆల్కెమీ/ దాని రహస్యం కవికే తెలుసును/ కాళిదాసుకు తెలుసు/ పెద్దన్నకి తెలుసు/ కృష్ణశాస్త్రికి తెలుసు/ శ్రీశ్రీకి తెలుసు’ అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈ మర్మం కనిపెట్టిన తిలక్‌కి మాత్రం కవిత్వంలోని ఆల్కెమీ తెలీదనుకోగలమా? తిలక్‌కి కూడా కవిత్వ రహస్యం తెలుసు. అందుకే ఆయన ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగలిగాడు. కవిత్వం గురించి చాలా చరిత్రే ఉంది. చరిత్రలో కవిత్వానికి తనదైన పాత్ర ఉంది. అయితే, చరిత్ర కంటే ఘనమైనది కవిత్వమేనంటాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ‘చరిత్ర కంటే కవిత్వం మెరుగైనది, మరింత తాత్తికమైనది. కవిత్వం విశ్వజనీనమైన విషయాన్ని వెల్లడిస్తుంది. చరిత్ర నిర్దిష్టమైన విషయాన్నే వెల్లడిస్తుంది’ అన్నాడాయన. ఎంతైనా ప్లేటో శిష్యుడు కదా! చాలామంది కవులు ‘కృత్యాద్యవస్థ’ను ఎదుర్కోవడం కద్దు. ఈ అవస్థ ఆదిలోనే కాదు, అంతంలోనూ ఉంటుందంటారు కొందరు. కవిత రాయడం మొదలుపెట్టిన ఏ కవీ తన కవితను ముగించడు, దానిని అర్ధాంతరంగా వదిలేస్తాడనే అభిప్రాయమూ ఉంది. ‘ఒక కవిత ఎన్నటికీ పూర్తి కాదు, అర్ధాంతరంగా విడిచిపెట్టబడుతుందంతే!’ అంటాడు ఫ్రెంచ్ కవి పాల్ వాలెరీ. కవిత్వానికీ సత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. అలాగని కవిత్వం నిండా సత్యవాక్కులే ఉంటాయనుకోవడానికి లేదు. కవిత్వం ధ్వనిప్రధానమైన కళ. స్తుతినింద, నిందాస్తుతి, శ్లేషలాంటి నానా అలంకార ప్రయోగాలు ఉంటాయి. ‘కన్నొక్కటి మిగిలెగాని కంతుడు గావే’నని ఒక కవి నేర్పుగా ఎత్తిపొడిస్తే, తనను పొగిడాడనుకొని మురిసిపోయాడు మతిలేని మారాజొకడు. ఒక్కొక్కసారి కవి మాటలు అబద్ధాల్లా కూడా అనిపించవచ్చు. అది కవి పొరపాటు కాదు. ‘ఎల్లప్పుడూ నిజాలే చెప్పే అబద్ధాలకోరు కవి’ అన్నాడు ఇంగ్లిష్ కవి జీన్ కాంక్టో. అదీ సంగతి! -
టెక్సాస్‌లో శ్రీశ్రీకి ఘన నివాళి
ఫ్రిస్కో (టెక్సాస్) : ప్రవాస భారతీయులు టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో మహాకవి శ్రీశ్రీకి నివాళులు అర్పించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. మహాప్రస్థానంలోని 40 కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డాక్టర తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ... శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలంనుండి వెలువడ్డ వివిధ రచనలలోని ముఖ్య అంశాలను వివరించారు. ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలో అనంత్ మల్లవరపు, ఎంవీఎల్ ప్రసాద్, అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వల, విశ్వనాధం పులిగండ్ల, డాక్టర్ నక్త రాజు, రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడ తదితరులు పాల్గొన్నారు. -
కవితాగ్ని
-
శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం
శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. 1940లో విడుదలైన కాలచక్రంలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం కొన్ని మార్పులతో ఉపయోగించబడినా, దాన్ని ఆయన తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. 1950లో ఆర్.ఎస్.జునార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆహుతి డబ్బింగ్ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. సినిమా కోసం శ్రీశ్రీ యెక్కువ పాటలు రాసిన మొదటి చిత్రం 1952లో విడుదలైన మరదలు పెళ్లి. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్ చిత్రాలకు, 80 డబ్బింగ్ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసినా, సంఖ్యాపరంగా డబ్బింగ్ పాటలే యెక్కువ కావడం విచిత్రం! బహుముఖంగా చిత్రగీతాలు రాసిన శ్రీశ్రీ ఆ రంగంలో అనేక ధోరణులకు ఆద్యులూ అగ్రగణ్యులూ అయ్యారు. మాతృకకు మక్కికి మక్కి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ‘లిప్‌సింక్’ను పాటించి, తెలుగు నుడికారంతో డబ్బింగ్ రచనలు చేసి, దానికొక ఒరవడి ప్రవేశపెట్టారు. వామపక్ష భావజాలంతో సామ్యవాద గీతాలను రాసి సినీ పరిశ్రమలో చైతన్య గీతాలకు అంకురార్పణ చేశారు. తెలుగు సినిమాల్లో యెక్కువ దేశభక్తి గీతాలను రచించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనాల్లో ముందుగా వెలువడి, ఆ తరువాత పాటలుగా సినిమాలకెక్కినవి పాతికకుపైనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా అగ్రతాంబూలం శ్రీశ్రీదే. ఆకలిరాజ్యం, మహానది సినిమాల్లో కథనాయకుడు(కమల్‌హాసన్) మహోద్రేకంగా శ్రీశ్రీ కవితల్ని ఉటంకించడం తెలుగు సినీకవుల్లో ఆయనకు మాత్రమే దక్కిన ఘనత. కవిత్వంలో ఛందోబందోబస్తులను ఛట్‌ఫట్ చెయ్యమన్న శ్రీశ్రీ అనేక సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించారు. బొబ్బిలి యుద్ధంలో మధురాతి మధురమైన జావళీని రాసి తనకు చేతకాని ప్రక్రియ లేదని నిరూపించారు. తన పాటల్లో తనకు నచ్చినది మాత్రం ‘పంతాలు పట్టింపులు’లోని ‘ఇనుకోరా, ఇనుకోరా, ఈ మల్లన్న మాటే ఇనుకోరా’గా ప్రకటించారు. ఆరాధనలోని ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ప్రేమగీతంలో ఆ చెలి యెవరని ఓ విమర్శకుడు ప్రశ్నిస్తే , ఆ చెలి కమ్యూనిజమని చమత్కరించారు. శ్రీశ్రీ పేరు చెప్పగానే మూడు ముఖ్యమైన పాటలు గుర్తొస్తాయి. అవి– తెలుగు సినిమా పాటకు మొదటి జాతీయ పురస్కార గౌరవాన్ని దక్కించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’. బతుకు మీద విరక్తితో ఆత్మహత్యకు పూనుకొన్న ఓ వ్యక్తిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి పూర్ణాయువును పోసిన వెలుగు నీడలు చిత్రంలోని ‘కలకానిది విలువైనది’. ఓ కన్నడ ప్రేక్షకుణ్ని సైతం కేవలం ఆ పాట కోసం ఇరవై సార్లు ఆ సినిమా చూసేలా చేసిన పునర్జన్మ చిత్రంలోని ఓ సజీవ శిల్పసుందరీ. శ్రీశ్రీ నిజాయితీ, నిబద్ధత గల సహృదయ కవి. తెలుగు వీర లేవరా పాటలో సింహాలై గర్జించాలి అనే చోట వ్యాకరణ దోషం వుందని తనే చెప్పి ఆ తర్వాత సవరించుకున్నారు. కలకానిది పాటలోని రెండు పంక్తుల భావం ఆ పాట తమిళ వెర్షన్ రాసిన నారాయణ కవిదనీ ఆ ఘనత తనకు చెందదనీ ప్రకటించారు. దేవత చిత్రంలోని బొమ్మను చేసి ప్రాణము పోసి పల్లవి వీటూరిదని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 30 ఏప్రిల్ 1910న జన్మించిన శ్రీశ్రీ 15 జూన్ 1983న అస్తమించారు. ఆయన అవసాన దశలో రాసిన నేటిభారతంలోని అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అనే విప్లవ గీతం ఆయనకు ప్రభుత్వమిచ్చిన ఏకైక నంది పురస్కారం– అది ఆ తర్వాత వచ్చిన అనేక స్వాతంత్య్ర సంబంధిత గీతాలకు స్ఫూర్తినిచ్చింది. -పైడిపాల -
శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి నేడు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన అభ్యుదయ రచనల ద్వారా చాటిచెప్పారు. ఆయన రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలుగా నిత్యం వెలుగుతూనే ఉంటాయి.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. -
తిక్కన సినిమా శ్రీశ్రీ తీస్తే!
1969 ఫిబ్రవరి 16. నెల్లూరు టౌన్హాల్లో వర్ధమాన సమాజం ఏర్పాటు చేసిన తిక్కన జయంతి సభ. ‘మహాత్మ కథ’ కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరిని గాంధీజీ శతజయంతి సందర్భంగా తిక్కవరపు రామిరెడ్డి సన్మానిస్తున్నారు. ఈ సభాధ్యక్షులెవరనుకున్నారు? విప్లవ కవి శ్రీశ్రీ! విచిత్రంగా లేదూ! నెల్లూరు పత్రికలు శ్రీశ్రీ ఉపన్యాసాన్ని వివరంగా రిపోర్టు చేశాయి. తిక్కనను ప్రజాకవిగా శ్రీశ్రీ అభివర్ణించాడు. ప్రజాకవి కనుకనే ‘ఆంధ్రావళి మొదముం బొరయ’ మహాభారతం రచించానని తిక్కన అనగలిగాడన్నాడు. నన్నయ శైలితో భారతానువాదం ఆరంభించి క్రమంగా తిక్కన శైలిలాగా పరిణమించేటట్లు ఎర్రన భారతశేషం పూరించాడని, ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ అని శ్రీశ్రీ మెచ్చుకొన్నాడు. తిక్కన అనువాదంలో 75 శాతం తెలుగు పదాలే వాడాడని, నన్నయ అర్జునుణ్ణి ఇంద్రనందనుడు, శ్వేతవాహనుడు, సక్రందన నందనుడు అని పేర్కొంటే, తిక్కన కవ్వడి, వివ్వచ్చుడు, కర్రి వంటి తెలుగు పదాల్లో చెప్పాడని శ్రీశ్రీ అన్నాడు. పద్మవ్యూహాన్ని ‘తమ్మిమొగ్గరం’ అని తిక్కన మాత్రమే అనగలడని, తిక్కన వాడిన తెలుగు పదాలు పరిశీలిస్తే ఎంత క్లిష్టమైన భావాన్నయినా తెలుగులో చెప్పవచ్చని, తెలుగు పదసంపద గొప్పదని శ్రీశ్రీ అన్నాడు. నన్నయది పొయెట్రీ దట్ ఈజ్ సంగ్ అని, తిక్కన్నది పొయిట్రీ దట్ ఈజ్ స్పోకెన్ అని శ్రీశ్రీ వర్ణించాడు. తిక్కనలో నన్నయ కవితలోని చమత్కృతులు, తళుకుబెళుకులు ఉండవు. తిక్కన కవిత్వంలో డ్రమెటిక్ ఇన్సైట్ ఉంటుంది. కృష్ణుడు రాయబారం వెళ్లే సమయంలో తన తలవెంట్రుకలను చూపి, ‘‘ఇవి దుస్ససేను వ్రేళ్ళం/ దవిలి సగము త్రెవ్విపోయి తక్కినయవి’’ అని ద్రౌపది అంటుంది. ఈ ఘట్టంలో తిక్కన ఎక్స్ట్రీమ్ క్లోజప్‌లో ఆమె కురులను చూపుతాడు. విరుద్ధభావాల సంఘర్షణ లోంచి వెలువడిన ఒక సమన్వయభావాన్ని తిక్కన తన కవిత్వంలో ప్రతిపాదించాడని శ్రీశ్రీ భావించాడు. హరిహరుల నిద్దరినీ కలిపి ఒక కాంపోజిట్ ఇమేజ్‌గా– హరిహరనాథ స్వామిగా రూపకల్పన చేయడంలో ఈ ప్రక్రియ తనకు గోచరించిందన్నాడు. శ్రీశ్రీ తన ఉపన్యాసంలో తిక్కన జీవితం మీద తాను రాసిన స్క్రీన్‌ప్లే గురించి వివరించాడు. మనుమసిద్ధి మహారాజు భారతానువాదం పూర్తి చేయించాలనే దీక్షతో, నన్నయ పద్యాన్ని ఒక తాటాకు మీద రాయించి, అటువంటి పద్యమే ఇంకొకటి రాయమని కవులందరికీ పంపాడట. వెలయాలి ఇంట్లో ఊయల మీద కూర్చొని విలాసంగా తాంబూల చర్వణం చేస్తున్న తిక్కన వద్దకు ఈ తాళపత్రాన్ని తెచ్చి చూపించారట. తిక్కన పద్యం రాసి పంపకుండా ఆ తాళపత్రం మీద తాంబూలం వేసుకొన్న నోటితో ఉమ్మి వేశాడట! భటులు ఆ పత్రాన్ని మనుమసిద్ధికి చూపించారు. ఆగ్రహంతో ఉన్నపళంగా తిక్కనను పిలిపించి సంజాయిషీ అడిగాడు రాజు. నన్నయ్య ఉచ్చిష్టంతోనే కదా భారతం పూర్తిచెయ్యగలిగేది, నేను తాంబూల రాగంతో కాస్త మెరుగులు దిద్దగలనని సూచించాను తప్ప, అవమానించడానికి కాదని తిక్కన అన్నట్లు శ్రీశ్రీ ఆ దృశ్యాన్ని రాశాడట. తిక్కన సంసార జీవితాన్ని త్యాగం చేసి జీవితాన్ని భారతానువాదానికే వినియోగించినట్లు, వృద్ధాప్యంలో భారతం పూర్తయిన తర్వాత, ఆ రాతప్రతిని భార్య చేతిలో పెట్టి ‘దీన్ని నీ బిడ్డగా భావించు’ అని తిక్కన అనివుంటాడని శ్రీశ్రీ ఊహ చేశాడు. -కాళిదాసు పురుషోత్తం (సౌజన్యం: పెన్న ముచ్చట్లు) -
రారండోయ్
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యనిధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఏప్రిల్ 30న ఉదయం 9 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, సాయంత్రం 6 గంటలకు బందర్ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో జరిగే రెండు సభలలో శ్రీశ్రీ రచనల ఎనిమిది పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. కొత్తపల్లి రవిబాబు, అదృష్ట దీపక్, ముత్యాల ప్రసాద్, చెరుకూరి సత్యం, విశ్వేశ్వరరావు, పెనుగొండ లక్ష్మీనారా యణ, అరసవిల్లి కృష్ణ, దివికుమార్, వరప్రసాద్, సింగంపల్లి అశోక్‌కుమార్ పాల్గొంటారు. వివరాలకు: 9246277375 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ శతాబ్ది సంబరాల సందర్భంగా ఏప్రిల్ 29న ఉదయం 10 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఆచార్య ఎస్. రామచంద్రం, డా. కె.వి. రమణాచారి పాల్గొంటారు. శ్రీశ్రీ జయంతి మరియు మేడే సందర్భంగా ఏప్రిల్ 30న సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం, శ్రామిక కవిత పుస్తకావిష్కరణ జరుగుతుంది. నిఖిలేశ్వర్, కె.శివారెడ్డి, శిలాలోలిత, వల్లభాపురం జనార్దన్, కె.ఆనందాచారి, కె. చంద్రమోహన్ పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహితి. శ్రీశ్రీ 110 జయంతి వత్సర సందర్భంగా ఏప్రిల్ 30న సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ‘శ్రీశ్రీ సినీ గీత జలపాతం’ జరుగుతుంది. ఎల్.ఆర్. స్వామి, డా. డి.వి. సూర్యారావు, రాంభట్ల నృసింహశర్మ పాల్గొం టారు. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ. సాహితీ మిత్రులు, విజయవాడ ఆధ్వర్యంలో మే 1న సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రజాశక్తినగర్‌లోని శిఖర స్కూలు నందు ‘కవిత 2018’ ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కర్త: గిరిధర్ అరసవల్లి. నిర్వహణ: శ్రీరామ్, అనిల్ డ్యాని. డా. వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో రూపొందిన ‘అమ్మ నాన్న ఓ కవిత’ పుస్తకావిష్కరణ మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. దాస్యం సేనాధిపతి, పొట్లూరి హరికృష్ణ, పొత్తూరు సుబ్బారావు, దాస్యం లక్ష్మయ్య పాల్గొంటారు. నిర్వహణ: ఉదయ సాహితి, కరీంనగర్. ‘కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి నిర్వహణ కమిటి’ ఆధ్వర్యంలో మే 26న ఆదివారం నాడు విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణ ఉద్యమం, సాహిత్యం ప్రాసంగికతపై ప్రామాణిక రచనలతో వ్యాస సంకలనం వేయాలని ప్రజాశక్తి బుక్‌హౌస్ నిర్ణయించింది. రచయితలు తమ వ్యాసాలను పంపవలసిన చివరి తేదీ మే 10. వివరాలకు ఫోన్: 9490099057; -
వార్షికం
ఈ వార్షికం ప్రతీ యేటా ఇచ్చే పద్మ అవార్డుల గురించి కాదు. ఇవ్వని పద్మ అవార్డుల మీద నా స్పందన గురించి. ‘వార్షికం’ అనే మాటలో వైదికంగా దుర్మార్గమయిన అర్థం. ఇంక కెలకను. చాలాసార్లు ఈ అవార్డులు పూర్తిగా చచ్చిపోయిన వారికో, లేదా సగంసగం పోతున్న వారికో ఇవ్వడం రివాజు. అయితే ఈ సంవత్సరం చాలా కారణాలకి ఆనందించదగ్గ విషయం– మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ. సాహితీపరులకిచ్చే సత్సాంప్రదాయం, ఓ సినీ గేయ రచయితకి– అందునా సీతారామశాస్త్రికి ఇవ్వడం చాలా హర్షణీయం. ఈ అవార్డులు సాధారణంగా ఇంత దూరం ప్రయాణం చెయ్యవు. కానీ ఇదేమిటి! శాస్త్రిగారి పేరు పక్కన ‘తెలంగాణ’ అన్న మాట ఉంది. వారి పేరుని తెలంగాణ ప్రభుత్వం సూచించిందా? ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వానికి అంత తీరిక లేదు. అలనాడు బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పద్మ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారి సినీ రచయిత వైరముత్తు పద్మభూషణ్. ఏమయినా తెలం గాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. శాస్త్రిగారి గొప్పతనానికి ఒకే ఒక మచ్చుతున కని ఉటంకించాలని ఉంది. 1992లో నేనూ, జేవీ సోమయాజులు, పద్మనాభం, తులసి ప్రభృతులం అమెరికా వెళ్లాం. నేను ‘మనిషి గోతిలో పడ్డాడు’ అనే నాటికని రాశాను. గోతిలో పడిన మనిషిని చూసి రక రకాల సామాజిక స్థాయిలకు చెందిన వ్యక్తులు అతని స్థితిని విశ్లేషిస్తారు. చివరికి అతనికి సహాయం చెయ్యకపోగా పెద్ద బండ రాయితో చంపుతారు. అక్కడొక పాట ఉంటే ముగింపు బాగుంటుందని మాకనిపించింది. ఎలాంటి పాట ఉండాలి? అనుకోలేదు. అప్పుడు మా శ్రీనివాస్ బతికే ఉన్నాడు. నేను పాట చేయిస్తానన్నాడు. సీతారామశాస్త్రి దగ్గరికి పరిగెత్తాడు. కథ చెప్పాడు. న్యాయంగా ఎలాంటి పాట రాయాలి? చచ్చిపోతున్న వ్యక్తి– సమాజ స్వార్థానికి బలి అయిన వ్యక్తి ఆర్తనాదం. శ్రీశ్రీ ఆవేశంగా ‘ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన....’ అంటారేమో! వేటూరి ‘ఈ అపరభీష్ముల రాజ్యంలో ఎందరో బృహన్నలలు...’ అంటారేమో! ఆత్రేయ ‘ఈ స్వార్థపరుల ప్రపంచంలో తలపగిలిన దీనుడు...’ అంటారేమో! సీతారామశాస్త్రిని నేనెప్పుడూ కలవలేదు. చావు బతుకుల్లో ఉన్న మనిషి– గోతిలో కొన ఊపి రితో ఉన్నాడు. అతని మాట... శాస్త్రి అన్నాడు కదా... ‘నాకెంతో సంతోషంగా ఉంది నాకెంతో ఆనందంగా ఉంది చరిత్ర లోతెంతో కొలవగలిగినందుకు తలెత్తి పాతాళం చూడగలిగినందుకు...’ విశీర్ణమైన మనిషి పాతాళంలో చచ్చిపోతూ– మానవాళి నీచత్వపు లోతుల్ని చూశానని నవ్వుకున్నాడట! నిర్ఘాంతపోయాను. సిరివెన్నెల– ఓ కవితను– పది సాధారణమైన ఆలోచనల స్థాయిని చీల్చి ముందుకు వెళ్తాడు. అక్కడా అతను మొదటి పల్లవి. అతనికి పద్మశ్రీ తెలుగు కవితకి పట్టాభిషేకం. మన తెలుగువారికి మనల్ని చూసి మనం గర్వపడే సహృదయం లేదు. తమిళులకీ, బెంగాలీలకీ అది సొత్తు. ఈ దేశంలో ఓ మహానటి ఉన్నారు. కృష్ణవేణి. ఆమెకి 94 సంవత్సరాలు. మిత్రులు రావికొండలరావుగారు నాకు మెసేజ్ పంపారు. తన ఆరవ యేటనుంచే నటనా రంగంలో కాలుమోపి, మీర్జాపురం రాజావారి ఇల్లాలుగా సినీ నిర్మాత అయి ఓ మహానుభావుడు ఎన్టీఆర్‌నీ, ప్రతినాయక పాత్రలు ధరించిన పద్మవిభూషణ్ అక్కినేనిని హీరోగా ‘కీలుగుర్రం’లో పరిచయం చేసిన విదుషీమణి– నా చిన్నతనంలో ‘లక్ష్మమ్మ’ని తన్మయులమై చూసిన గుర్తు ఇంకా చెరిగిపోలేదు– కృష్ణవేణి గారిని ఇంకా తెలుగుజాతి గౌరవించుకోలేదు. చెన్నైలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రముఖ రచయిత– ఆనాడు పద్మ అవార్డుకి నోచుకోని కన్నదాసన్ విగ్రహం ఉంది. మన ఆత్రేయకీ, పింగళికీ లేదు. ఎన్.ఎస్. కృష్ణన్ విగ్రహం ఉంది. మన రేలం గికీ, శివరావుకీ లేదు. పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి గౌరవానికి సెమ్మంగుడి అభిరుచి పెట్టుబడి అంటారు. మహా గాయకుడు అన్నమాచార్యను ఆకాశంలో నిలిపిన అజరామరమైన కీర్తనలు చేసి, తన జీవితాన్నే ఒక ఉద్యమం చేసుకున్న బాలకృష్ణ ప్రసాద్ వంటి శిష్యుడిని సమర్పించిన నేదునూరిని ఈ జాతి గౌరవించుకోలేదు. మన గొప్పతనాన్ని చూసి మాత్రమే కాదు, చూపి, నెత్తికెత్తుకుని గర్వపడటం జాతి సంస్కారం. ఏపీ ప్రభుత్వం అలాంటి పనిచెయ్యదేం? ఏ కూడలిలోనో ఓ రమణారెడ్డి, ఓ సముద్రాల, ఓ వేటూరి పలకరించరేం? తమిళనాడులో సంగీత కళానిధులూ, పద్మశ్రీలూ ఎటుచూసినా కనిపిస్తారు. ‘మా మహనీయుల్ని ఆకాశంలో నిలిపే ఉపకారం మీరు చేసిపెట్టండయ్యా’ అని చరిత్ర చెప్తూంటే– సిగ్గుతో తలవంచుకుని వారి మధ్యనుంచి నడుచుకుపోతూంటాను. -
శ్రీశ్రీ విగ్రహం దుస్థితిపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యంపై ఓ పత్రికలో వచ్చిన ఫొటో వార్తపై హై కోర్టు స్పందించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖ కవి శ్రీశ్రీ విగ్రహం కూలిపోయే దశలో ఉన్న విషయాన్ని ఆ పత్రిక ఫొటో రూపంలో వార్త ఇచ్చింది. కథనాన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు పిల్‌గా పరిగణించి, తగిన ఆదేశాలు జారీ చేసే విషయంలో నిర్ణయం నిమిత్తం పిల్ కమిటీ ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. రిజిస్ట్రీ ఫొటో కథనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ ముందు ఉంచింది. కథనాన్ని పరిశీలించిన ఆయన దానిని సుమోటో పిల్‌గా పరిగణించాలంటా ఆదేశాలిచ్చారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చా రు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. -
రాసిస్తాను ఏనాటికైనా
శ్రీశ్రీ కొన్ని సందర్భాల్లో చేసిన సరదా వ్యాఖ్యలు, చమత్కారపు జవాబులు ఈ వారం సాహిత్య మరమరాలుగా ఇస్తున్నాం. శ్రీశ్రీని రేడియో కోసం ఒక నాటకం రాసివ్వమని ఒకాయన తరచూ అడుగుతున్నారు. అయినా శ్రీశ్రీ రాసివ్వడం లేదు. మళ్లీ ఒకరోజు ఆయన పలకరించి, ఇంకా రాయలేదని అంటే– ‘ఏనాటికైనా రాసిస్తాను’ అని శ్లేషగా జవాబిచ్చారు శ్రీశ్రీ. ఏమీ తోచక ఓసారి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు శ్రీశ్రీ. అక్కడో మిత్రుడు ‘ఊరికా?’ అని పలకరించాడు. ‘ఊరికే’ అని సమాధానమిచ్చారు శ్రీశ్రీ. శ్రీశ్రీ దగ్గర ఆ సమయంలో డబ్బుల్లేవు, చెప్పులు పాతబడిపోయినై. ఓ రోజు పాండీబజార్లో ఉత్తికాళ్లతోనే నడుస్తూ ఒకతనికి కనబడ్డారు. ‘ఏం గురువు గారూ, చెప్పుల్లేకుండా తిరుగుతున్నారు?’ అన్నాడతను. అతడితో అసలు విషయం చెప్పలేరు. అందుకని– ‘చెప్పుకొనలేక’ అని బదులిచ్చారు. ఒక పెద్దాయన తమ లైబ్రరీని చూడమని శ్రీశ్రీని ఆహ్వానించారు. సందర్శన అనంతరం విజిటర్స్ బుక్‌లో ఏదైనా రాయమని కోరారు. ‘ఈ లైబ్రరీని దినదినాభివృద్ధి కోరను’ అని రాయడం ఆపారు శ్రీశ్రీ. అప్పటికే నిర్వాహకుడి ముఖం మాడిపోయింది. ‘క్షణక్షణాభివృద్ధి కోరతాను’ అని ముగించారు. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
శ్రీశ్రీ స్ఫూర్తితో డమరు ధ్వని
గురజాడ అస్తమించిన తరువాత, ఆయన ముత్యాల ‘సరళి’ని అనుసరించినట్టే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ అడుగుల, పరుగుల లయగతులను అందుకున్నారు చాలామంది. వారిలో, ‘సీరపాణి’ పేరుతో ‘డమరు ధ్వని’ కవితాసంపుటిని ప్రకటించిన బుడితి బలరామనాయుడొకరు. పెద్దగా, ఆయన కవిత్వం ప్రచారానికి రాలేదు. కారణాలు తెలీదు కానీ, అచ్చయింది ఆ ఒక్క సంపుటి మాత్రమే! దీనికి ‘నమ్మకం’ పేరుతో, ఆరుద్ర ముందుమాట రాశారు. ‘రుధిరంలో అనలద్యుతి ధమనుల్లో ఢమరు ధ్వని’ గల అభ్యుదయ కవి, అని సీరపాణిని ప్రశంసించారు. ‘సమత ఇతని కవితకు ప్రాణం. అది ముందు తరాలకు, కవి ఇచ్చే గోదానం’ అన్నారు. మహాప్రస్థానం’ వెలువడిన 39 ఏళ్ల తరువాత, ‘ఢమరు ధ్వని’ వెలువడింది. మహాప్ర స్థానం వెలువడిన, తొమ్మిదేళ్ల తరువాత, బొబ్బిలి ప్రాంతంలోని కామందొరవలస గ్రామంలో కవి జన్మించాడు. ‘శ్రీకాకుళం సాయుధ పోరాటం’ దశ నాటికి, ఆయన వయసు 21–23 ఏళ్లు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘భాషాప్రవీణ’ చదువుతున్న రోజుల్లో, చాసో, అనిశెట్టి వంటి పెద్దల పెంపకంలోకి వెళ్లాడు. వారివల్ల శ్రీశ్రీ కవిత్వ శక్తి పరిచయమైతే, శ్రీకాకుళం పోరాటగడ్డ స్వయంగా అతనిదే! నిరంతరం శ్రీశ్రీని ఆవాహన చేసుకోవడానికే, కవితాధ్యానం చేశాడా? అనిపిస్తుంది, ‘ఢమరు ధ్వని’ చదివితే! మహాప్రస్థానంలో ‘జ్వాలాతోరణం’, ఢమరు ధ్వనిలోని ‘సమతా సంగీతం’లో కనిపిస్తుంది. ‘జగన్నాథుని రథచక్రాలు’ అతని ‘అగ్నిగీతం’లో శబ్దిస్తాయి. చివరకు, ‘కొంపెల్ల’ కోసం శ్రీశ్రీ అనుభవించిన కవిత్వవేదన, సీరపాణి ‘కన్నీటిలేఖ’లో ప్రతిఫలిస్తుంది. ఒక్క మాటగా చెప్పాలంటే, శ్రీశ్రీ ‘ఢంకాధ్వానం’, శంఖారావం’తో కలసి సీరపాణి ‘ఢమరు ధ్వని’ వినిపించాడా! అనిపిస్తుంది. ‘ఏమన్నది? ఏమన్నది? ప్రకృతి మాత ఏమన్నది? యుగయుగాల నాదు తప: ఫలమే మానవుడన్నది’ అని చెప్పి, ‘అగ్ని కేకేసింది, అందరూ కదలండి’ అని పిలుపునిచ్చిన సీరపాణి, ‘చరాచరం క్రియేషన్, మహాత్ముడొక కొటేషన్, కవిత కొక్కటే ప్రాణం, కదిలించే ఇమోషన్’ అని కవిత్వ రహస్యాన్ని విడమరిచారు. ‘అందుకో ఆదర్శాల బ్రెన్గన్, పాటల తూటాలు బిగించి, పేల్చీవోయ్ ధన్, ధన్’ అని సందేశాన్ని ముగించాడు. కానీ, చదివిన ప్రతిసారి, కొత్త ప్రకంపనలను అది ప్రారంభిస్తూనే వుంటుంది. అతడు ‘ఢమరు ధ్వని’ తరువాత, మరేమీ రాయకుండా, ఆరుద్ర నమ్మకాన్ని కొనసాగించకపోయినా, ఆనాటి యువకవితరంపై మహాకవి ప్రభావాన్ని మరోసారి నిరూపించడానికి, నమ్మకమైన ప్రతిధ్వని ‘ఢమరు ధ్వని’. u నల్లి ధర్మారావు -
కొత్త రచనల కాంతిలో శ్రీశ్రీ
ఉత్తమ కవికి ప్రతి రచనా ఒక సృజన సూర్య బింబం. అందులో ప్రయోగశీలతకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీశ్రీ. 2018 వారి నూట ఎనిమిదో జయంతి వత్సరమే కాకుండా 35వ వర్ధంతి ఏడాది కూడా. ఇరవయ్యో శతాబ్దాన్ని పెనవేసుకుని తన రచనలను, ప్రపంచ గతులపై పెరిగే అవగాహనతో, దాదాపు పందొమ్మిది భిన్న ప్రక్రియల్లో రాసిన వారు శ్రీశ్రీ. వచనంలోనూ, పద్యం లోనూ కొత్త పోకడలు, పదాల సృష్టి, దేశాదేశాల్లో కవిత్వం ఎలా కొత్త పుంతలు తొక్కిందో తాను ఆకళింపు చేసుకుంటూ, తెలుగు సాహిత్యం లోనికి ఆయా ధోరణులను ప్రవేశ పెట్టడంలో నిత్య క్రియాశీలత, ఇవీ శ్రీశ్రీ మార్కు విక్రమార్క పరాక్రమాలు. రచనల్లో వారు ప్రస్తావించిన దేశ కాలాల నామ సూచి ఒక చోట చేర్చి, వాటి సాంస్కృతిక, చారిత్రిక, మనో వైజ్ఞానిక, శాస్త్రీయ, నాటక రంగ, అలాగే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంఘటనలు, భౌగోళిక విశేషాలు ఇవన్నిటి నామావళి సచి త్రంగా వివరిస్తే, అదే ఒక వెయ్యి పేజీలకు మిం చిన శ్రీశ్రీ మేధో మాపనం అవుతుంది. తృతీయ సహస్రంలో, ఒక రచయిత బుద్ధి కొలతకు నూతన కొలబద్దలెన్నో ఏర్పడుతున్నాయి. అందులో అత్యంత ఉపయోగకరమైనది ఈ మేధో మాపనం. విశాఖలో శ్రీశ్రీ కళ్ళూ, కవితల వాకిళ్లూ నిత్యం కొండలు, కడలి సాక్ష్యంగా సజీవాలు. మహాప్రస్థానం బెంగాలీలో రచన అయితే, ఈ పాటికి డిజైనర్ ఎడిషన్ వేసేవారు. మహా ప్రస్థానం కలిగించే ఒక లోకోత్తర అనుభవానికి, ఇంకా మనం దూరంగానే ఉన్నాము. టాగూర్ 150వ జయంతికి మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంతి, టాగూర్ ఫోటో చేత ధరించి నివాళి యాత్రలో ముందు నడిచింది, గురజాడ, శ్రీశ్రీ ఎవరికీ మనం ఇలా గౌరవాలు ఇవ్వము. శ్రీశ్రీలో ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లూ, పదులకొద్దీ ప్రొఫెసర్లూ, భాషావేత్తలు, భిన్న వయస్కుల పౌర సమాజం, ప్రపంచం అంత నిండుగా ఉన్నారు. అందుకే ఆయన రచనలు, కొత్త నిర్మాణాలు చేస్తాయి భావనాలోకంలో. రచయిత్రి జగద్ధాత్రి చేసే పరిశోధన ప్రస్తావనతో విశాఖలో, మహాకవి నూతన లభ్య రచనల పరిచయ సభ జరుగుతున్నది. విశాఖ శ్రీశ్రీ జన్మస్థలంగా, మహాప్రస్థాన మాతృభూమిగా, ఈ కొత్త రచనల కాంతిలో శ్రీశ్రీ సృజన సూర్య బింబ దీప్తులు, మరింత వర్ణ సంభరితం కావాలన్న ఉత్పాదక యాత్రలో, తెలుగు వారి ఆకాంక్షలు, ఆశీస్సులు కోరుతున్నాము. జూన్ 14 సాయంత్రం ఆరు గంటలకు, విశాఖ పౌర గ్రంథాలయంలో, మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహణలో జరుగనున్న సభలో ఈ నూతన రచనలను, రాష్ట్ర సీపీఐ నాయకులు జె.వి.సత్యనారాయణమూర్తి లోకార్పణ చేస్తారు. పలు రంగాల ప్రముఖులు పాల్గొనే సభలో వక్తలు ఈ రచనల పరి చయం చేస్తారు. రామతీర్థ, ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
రారండోయ్
జలజం సత్యనారాయణ అనుసృజన ‘కబీర్ గీత’ ఆవిష్కరణ ఏప్రిల్ 30న సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: ధ్వని ప్రచురణలు, మహబూబ్‌నగర్. మల్లిపురం జగదీశ్ కథాసంపుటి ‘గురి’ ఆవిష్కరణ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో జరగనుంది. ప్రచురణ: స్నేహ కళాసాహితి. శ్రీశ్రీ జయంతి సభ ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో సాయంత్రం 5:30కు జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ శ్రీశ్రీ జయంతి సభ ఏప్రిల్ 30న నెల్లూరు, టౌన్హాల్లో సాయంత్రం 7 గంటలకు జరగనుంది. నిర్వహణ: శ్రీశ్రీ ప్రగతి ట్రస్టు, నెల్లూరు. కవిత–2017 ఆవిష్కరణ మే 1న విజయవాడలోని శిఖర స్కూల్లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. సంపాదకులు: కొండేపూడి నిర్మల, జి.లక్ష్మీనరసయ్య. నిర్వహణ: సాహితీ మిత్రులు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ రచన ‘భాష–భాషాభివృద్ధి’ ఆవిష్కరణ, మండలి బుద్ధప్రసాద్‌కు అంకితోత్సవం మే 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరగనున్నాయి. 39 మంది కవుల ‘ఒక జ్ఞాపకం’ పుస్తకావిష్కరణ మే 3న మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ లయన్స్ క్లబ్ భవనంలో జరగనుంది. ఎండ్లూరి మానస కథా సంపుటి ‘మిళింద’ ఆవిష్కరణ మే 5న సాయంత్రం 5 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది. నిర్వహణ: ఛాయా రిసోర్స్ సెంటర్, రోష్ని ప్రచురణలు. కవి శివారెడ్డిపై అచ్చయిన కవితలతో తేనున్న సంకలనానికి కవితలను పంపాలని సంపాదకులు కోరుతున్నారు. మెయిల్: ethakotas@yahoo.com -
శ్రీశ్రీ అలభ్య అనువాద రచన (యక్షగానం) భాగ్యలక్ష్మి
మహాకవి శ్రీశ్రీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా, ఒక అదనపు కారణానికి కూడా ఈ పండుగ వేడుక హెచ్చింది. విరసం వారూ, తరువాత మనసు ఫౌండేషన్ వారూ వేసిన శ్రీశ్రీ సమగ్ర రచనలు లేదా సంపూర్ణ లభ్య రచనల సంకలనాల శ్రద్ధాపూర్వక కృషి తరువాత కూడా మరొక శ్రీశ్రీ రచన, లభ్యం అయ్యింది. అది రాసిన శ్రీశ్రీకి 34 ఏళ్ళు. ఒక ఏడాది ముందరే జరిగిన ఈ రచన, తన ప్రపంచ సాహిత్య అధ్యయన స్వభావానికి దీటుగానే ఉన్నది. ఈ రచన అచ్చు అయింది 26 మార్చ్ 1944 ఆనందవాణి పత్రికలో, భాగ్యలక్ష్మి (యక్షగానం) పేరిట. ఇది అనువాద కవిత కావడం మరొక విశేషం. ఇరవై మూడేళ్ళ రడ్యార్డ్ కిప్లింగ్ (1865 – 1936) రచన ‘ద మాస్క్ ఆఫ్ ప్లెంటీ’కి యేడాది క్రితం నేను చేసిన యధాశక్తి తర్జుమా) అని శ్రీశ్రీ పాదసూచి పెట్టారు. ఇంతకుముందు శ్రీశ్రీ అనువాదాలు ఎక్కువగా వచ్చిన ఖడ్గసృష్టిలో కానీ, శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరిట మనసు ఫౌండేషన్ వారి బృహత్ ప్రచురణలో కానీ ఈ రచన లేదు. శ్రీశ్రీ అనువాదాలను అధ్యయనం చేసే వారికి, వారి సాహిత్య ప్రియులకు, తెలుగు సాహిత్య చరిత్రకు ఇదొక కొత్తగా లభ్యమైన వనరు. శ్రీశ్రీ రచనల సేకరణలో అనితర సాధ్యమైన కృషి చేసిన చలసాని ప్రసాద్ గారిని స్మరించడం కూడా ఈ సందర్భానికి శోభను ఇస్తుంది. శ్రీశ్రీ సంపూర్ణ లభ్య రచనల కృషిలో రెండు మూడు తరాల సాహిత్యాసక్తులు, సాహిత్య వేత్తలు, సేకర్తలు కలిసి పని చేసి సాధించిన ఫలితంలో ఇదొక అదనపు అక్షర అక్షయ నిధి. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనానికి పుష్కలమైన అవకాశం.కిప్లింగ్ ఆంగ్ల కవిత లాహోర్ నుంచి నడిచే పత్రిక ‘ది పయనీర్’లో 26 అక్టోబర్ 1888 నాడు ప్రచురణ. బ్రిటిష్ రాణి పాలనలో భారత జన జీవనంపై ఇదొక విలువైన రచన. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ విచారణ కమిషన్ తీరు తెన్నులపై, కిప్లింగ్ అంటే ఫ్రెంచ్ భాషలో ఒక పల్లీయ వినోద ప్రదర్శన గానూ, అలాగే అసలు విషయం దాచిపెట్టే కుహనా నివేదికల ప్రహసనంపై ఆంగ్ల భాషలో ఝ్చటజు అన్న అర్థంతోనూ ఈ రచన, పాలకుల ధోరణిపై విమర్శగా చేశాడు. అలా చూస్తే, బ్రిటిష్ ఇండియా సాహిత్యంలో ఒక ప్రధాన రచన అయిన దీన్ని శ్రీశ్రీ 75 ఏళ్ల ముందర తెలుగులోకి తెచ్చారు. యధాశక్తి తర్జుమా అన్నారు కనుక 1888 మూలం, 1943 తెలుగు అనువాదం, నిశిత పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. రైతు జీవితాలు 1888 నాటికి ఎలా ఉన్నాయో, కిప్లింగ్ చెప్పగా, అంతకన్నా మరింత గడ్డుగా స్వాతంత్య్రానంతర భారతంలో ‘మార్చాము’ కనుక – దాదాపు శతాబ్దపున్నర కిందటి ఈ భారతీయ సమాజ రచన ఆనాడే అక్కడే ఉండిపోకుండా, 75 ఏళ్ల కిందట వెలుగులోకి తెలుగులోకి తెచ్చిన మహాకవి శ్రీశ్రీ సృజన దర్శనానికి వందనాలు. సేకరణ, లఘువ్యాఖ్య: రామతీర్థ (అవతారిక:– భారతీయ ప్రభుత్వం వారు దేశంలో యోగక్షేమాల భోగట్టా తియ్యడానికొక ప్రత్యేక సంఘాన్ని నియోగించారు. నిక్షేపం లాగ దేశం భాగ్యభోగాలతో తులతూగుతోందని ప్రభుత్వం వారు పసికట్టారు). రంగం:– భూలోకస్వర్గం – అనగా సిమ్లా శిఖరం. భారతీయ ప్రభుత్వం భాగ్యలక్ష్మి వేషంలో పాడుకుంటూ ప్రవేశం. టకోరా; సన్నాయి మేళాల నేప«థ్య గానం. రైతు బ్రతుకే మధురం! ఆహా రైతు బ్రతుకే మధురం పగలూ, రాత్రీ, పాడీ పంటా రాజ్యమేలే రాజులకన్నా రైతు బ్రదుకే సులభం! ఆహా రైతు బ్రదుకే సుభగం (తొహరా) సాక్షాత్తూ మనదేశం స్వర్గమే అని మా ఉద్దేశం పుణ్యభూమి కాదటండీ వేరే భూకైలాసం ఉన్నాదటండీ! జరూరుగా తమరొక నివేదిక తయారుచేసి పారేస్తే చాలిక! శతసహస్ర భారత నరనారీమణులు శక్రచాప శబలిత తేజోఘృణులు చిత్రచిత్ర వర్ణాలతో వీరి పరిస్థితి చిత్రించండి సముజ్వల సుందరాకృతి (హిమాలయ పర్వతాలు దిగి సమర్థులైన పరిశీలన సంఘంవారు దయచేస్తారు.) తురుష్క వేత్ర హస్తుడు – యోగక్షేమాల భోగట్టా తీశారా? దేశం నాడిపరీక్ష చేశారా? చక్కని భాషలో నివేదిక రాశారా? సమాచారమేదో మా నెత్తిని కొట్టండి. ఆవులూ గేదెలూ దూడలూ దున్నలూ అమాం బాపతు లెక్కలు కట్టండి ఫస్టు క్లాసులో యమ్మే ప్యాసయిన బాబూజీనొకడ్ని పట్టండి కట్టలు కట్టలుగా కాగితాల కుప్పలతో గెజెటీర్లకి గెజెటీర్లే నిండుతాయి: విష్కంభం అనంతాకాశం నించి అశరీరవాణి (జంత్ర వాద్యాల సంగీతంతో) బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను ఆకసము రక్తాగ్ని కుండము భూమి నల్లని బొగ్గుకుంపటి మండుగాడుపు టెండవేడికి మరిగి కాలం భగీల్మన్నది యముని కారెనుబోతు మెడలో ఇనుపగంటలు నవ్వినట్లుగ దిగుడుబావి దిగాలుమన్నది పైరు పంటలు బావు రన్నవి ఇంకిపోయిన ఏటి కడుపున ఇసుక దిబ్బలు గొల్లుమన్నవి పరమపద సోపాన పథమున పాము నోట్లో పడ్డ రైతూ! ఎవరికై చేయెత్తి ప్రార్థన? ఎవరి కర్మల కెవరు కర్తలు చూడు పడమట సూది బెజ్జపు మేర కూడా మేఘ మంటదు ఇంత వర్షపు చినుకు కోసం చూచి కన్నులు సున్న మైనవి ఏడుపెందుకు వెర్రి బిడ్డా ఎవరు నీ మొర లాలకింతురు చచ్చిపోయిన గొడ్డు నడుముకు చచ్చినట్టే నిద్రపోవోయ్! (విజయ గర్వంతో విర్రవీగుతూ సిమ్లా నగరానికి పరిశోధక సంఘంవారి పునరాగమనం. సింహ శాబకాన్ని వెంటబెట్టుకొని వస్తూన్న భరతపుత్రుని వేషంతో. అస్వస్థతగా వున్న భారతదేశం చికిత్స పొందుతున్న సూచనగా నుదుటికి పలాస్త్రీ, మోకాళ్లకి పట్టీలు) సంఘసభ్యుల సంగీతం:– తిరిగాము తిరిగాము గోవిందారామ దేశమంతా మేము గోవిందా రాజుల్ని చూశాము గోవిందారామ రైతుల్ని చూశాము గోవిందా చూశాము చూశాము గోవిందారామ దేశసౌభాగ్యాన్ని గోవిందా మాయ రోగాలేవి గోవిందారామ మచ్చుకైనా లేవు గోవిందా చావనే మాటైన గోవిందారామ స్మరియించగా రాదు గోవిందా శిస్తుగా ప్రజలెల్ల గోవిందారామ మస్తుగా బలిశారు గోవిందా సకల సంపదలతో గోవిందారామ తులతూగుతున్నారు గోవిందా. (నాట్యం) కాపులూ కరణాలు రాజులూ రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులూ మాల మాదిగలు పిండార్లు థగ్గులూ జైనులూ జాట్లు సర్కారు దయవల్ల గోవిందారామ చల్లగా వున్నారు గోవిందా తిని తిరిగి హాయిగా గోవిందారామ తెగ బలిసి పోయారు గోవిందా గో‘ఓ’వింద! (ఇండియా ప్రభుత్వం తెల్ల శాటిన్ రెక్కలతో ఎగిరివచ్చి అమెరికన్ రోడ్డు తంబురా మీటుతూ స్వస్తి వాచకం–) ప్రజ లేకగ్రీవమ్ముగ పంచభక్ష్య రసాన్నములు పర్వత శిఖరాగ్రమ్ముల ప్రశాంతముగ పవ్వళించి ఆరగించు దృశ్యమ్మును ఆక్షి పేయమగునట్లుగ చూచుచుంటకంటె వేరె సుఖమున్నదె శుభమున్నదె? పరిశోధక సంఘసభ్య పావనమూర్తులకు జయము ఫలియించెను మీరు పడిన పరిశ్రమము ధన్యులొహో కిరాయి మేళం – బాకాలూదుతూ:– గొప్ప గొప్ప కామందులపై వారి బంధుమిత్రాదులపై భగవంతుని కరుణారసామృతం ప్రవహించక తప్పదు మరి వానలూ వరదలూ వచ్చినా కరువూ కాటకం కలరా వచ్చినా పేదవాళ్ల సొమ్మేం బోయింది ఆదమరిచి నిద్రపోతే సరి పేదవాళ్లు సుఖంగానే వున్నారని భాగ్యవంతులు నిర్ణయించేశారు గొప్ప గొప్ప వారందరికీ జయం వారి చుట్టూ తిరిగే వారందరికీ జయం పేదవాళ్ల కెందుకూ భయం? ప్రాణమున్నన్నాళ్లు బతుకుతారు నయం! Rudyard Kipling రాసిన The Masque of Plenty కి ఏడాది క్రితం నేను చేసిన యథాశక్తి తర్జుమా. –శ్రీశ్రీ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీ శ్రీ
-
సాహిత్య మరమరాలు
ఒకసారి శ్రీరంగం శ్రీనివాసరావూ, అబ్బూరి వరద రాజేశ్వరరావూ విశాఖపట్నంలో సముద్రతీరానికి బయల్దేరారు. ‘నువ్వెప్పుడైనా లైట్‌హౌస్ పైకి వెళ్లి సముద్రాన్ని చూశావా?’ అడిగాడు దారిలో వరద. దీపస్తంభాన్ని ఎన్నేళ్లనుంచో చూస్తున్నప్పటికీ అది ఎక్కి సముద్రాన్ని చూడొచ్చన్న ఆలోచన అంతకుముందు రాని శ్రీశ్రీ ఆశ్చర్యపోయాడు. దాని పైకెక్కటం ఎలా అని అడిగాడు. సరాసరి పొన్నాంబళ్ దగ్గరికి పోయారు. అతడు వరదకు పరిచయం. ‘ఇదే ఆఖరు’ అంటూ అతడు ఇద్దరినీ మెలికలు తిరుగుతూ పోయిన మెట్ల మీది నుంచి పైకి తీసుకుపోయాడు. శ్రీశ్రీ సముద్రం వంక చూస్తూ నిశ్చలంగా నిలబడిపోయాడు. తదేక దృష్టితో చూస్తున్నాడు. ఈలోగా వరద బైనాక్యులర్స్ ఇచ్చాడు. అందులోంచి చూశాడు. చూస్తున్నాడు. చూస్తున్నాడు. శ్రీశ్రీ ముఖకవళికలు మారిపోయినై. హఠాత్తుగా ‘పడండి ముందుకు, పడండి తోసుకు పైపైకి’, ‘ఫెళ ఫెళా విరుచుకుపడండి’ ‘వండర్ఫుల్’ అన్న మాటలు ఆయన నోటినుంచి వచ్చినై. కిందికి మెట్లు దిగుతుండగా, ‘ఆ కెరటాల్ని దగ్గరినుంచి చూశావు కదా, ఎలా విరుచుకుపడుతున్నాయో; అంత భయంకర దృశ్యాన్ని చూడటం నాకిదే మొదటిసారి’ అన్నాడు శ్రీశ్రీ. అ తరంగాల్ని చూస్తూ అన్న ఆ మాటలే మరో రెండేళ్లకు మరో రూపంలో శ్రీశ్రీ ప్రసిద్ధ కవితలోని పంక్తులుగా నిలిచినాయి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీ శ్రీ.
-
శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో ప్రత్యేక గౌరవం!
ఆధ్యాత్మిక సేవా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 37 కోట్లమంది ప్రజలకు చేరువైన ఆయన్ను ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించగా ప్రస్తుతం బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి యూనియన్ ప్రత్యేక హానరరీ ఫెలోషిప్ ను అందించి సత్కరించింది. హింసలేని సమాజాన్ని సృష్టించడంకోసం, ప్రపంచశాంతికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి సంఘం (ఎన్ఐఎస్ఏయు) ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా యోగా, మెడిటేషన్, ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి పరచేందుకు కృష్టి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ ప్రత్యేక సత్కారాన్ని అందించినట్లు ఎన్ఐఎస్ఏయు ఓ ప్రకటనలో తెలిపింది. రవిశంకర్ కృషి ప్రపంచ శాంతికి మరింత సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. వసుదైక కుటుంబం, సత్యమేవ జయతే అన్న సూత్రంతో, ప్రపంచదేశాలను ఒకే కుటుంబంగా మార్చాలన్న శ్రీ శ్రీ అసాధారణ ప్రయత్నాన్ని అక్కడి విద్యార్థులు కొనియాడుతున్నారు. ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందిస్తూ.. అదే మార్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత శ్రీ శ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వంలో నడవాలని బ్రిటన్ లో నివసిస్తున్న భారత విద్యార్థులంతా ఆశిస్తున్నట్లు ఎన్ ఐ ఎస్ ఏ యు అధ్యక్షుడు సనం ఆరోరా తెలిపారు. -
స్వర్ణోత్సవ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ కృష్ణ స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’కి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేశ్ ఇంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’కు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, సీనియర్ నరేశ్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఈ చిత్రానికి మహేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు సంతోషం వెలిబుచ్చారు. ఇటీవలే ఈ చిత్రం పాటలు కూడా భారీగా జరిగిన ఒక వేడుకలో విడుదలయ్యాయి. ‘‘పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు ముప్పలనేని శివ తెలిపారు. -
‘శ్రీశ్రీ’ ఆడియో వేడుక
-
ఆ ఇద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను: సూపర్‌స్టార్ కృష్ణ
‘‘తెలుగులో తొలి కౌబాయ్ సినిమా సహా ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కృష్ణది. అందుకే, రెబల్‌స్టార్ నేను కాదు కృష్ణే. అతను నిర్మాతల మనిషి మాత్రమే కాదు.. ఏటా 12-14 సినిమాలు చేసి, పరిశ్రమలో కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి’’ అని రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్ సిరాజ్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఇ.ఎస్. మూర్తి స్వరపరిచిన ఈ చిత్రం పాటలనూ, ప్రచార చిత్రాన్నీ గురువారం హైదరాబాద్‌లో మహేశ్‌బాబు ఆవిష్కరించారు. హీరోగా కృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శాలువా, సన్మానపత్రంతో కృష్ణను సత్కరించారు. కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘తేనెమనసులు’ ద్వారా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను హీరోని చేస్తే, ‘గూఢచారి 116’ ద్వారా నాకు మాస్ ఇమేజ్ తెచ్చి, 50 ఏళ్లు కెరీర్‌ని నడిపే బలం ఇచ్చారు నిర్మాత డూండీ. వారినెప్పటికీ మర్చిపోలేను. ఈ ‘శ్రీశ్రీ’ యాభై ఏళ్ల కెరీర్లో ఓ మైలురాయి’’ అన్నారు. ‘‘అందరి కన్నా కృష్ణగారికి అతి పెద్ద అభిమానిని నేనే. నాలుగు నెలల క్రితం ‘శ్రీశ్రీ’లో నాన్న గారి గెటప్ ఫోటో చూసి, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎగ్జయిట్ అయ్యా. చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అనిపిస్తోంది’’ అని మహేశ్‌బాబు అన్నారు. విజయనిర్మల మాట్లా డుతూ - ‘‘చాలా ఏళ్ల తర్వాత నేనూ, కృష్ణగారూ కలసి నటించాం. ఇప్పటివరకూ మేమిద్దరం కలసి 48 సినిమాలు చేశాం. ఇంకా రెండు సినిమాలు చేస్తే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, సంగీత దర్శకుడు ఇ.ఎస్. మూర్తి, నటులు నరేశ్, హీరో సుధీర్ బాబు, సినీ ప్రముఖులు కోదండరామిరెడ్డి, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మనం. తెలుగు తెర మీద సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఈ సినిమా, నటవారసత్వం కొనసాగిస్తున్న చాలా మంది హీరోలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా కుంటుబాల నుంచి ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నారు అభిమానులు. అలా ఫ్యామిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానుల కోరిక తీరనుందన్న టాక్ వినిపిస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్రోల్లో నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి, కృష్ణ సతీమణి విజయనిర్మల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, మహేష్ తనయుడు గౌతమ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిత్రయూనిట్ కన్ఫామ్ చేయకపోయినా శ్రీ శ్రీ సినిమాలో ఘట్టమనేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కనిపించనున్నారని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. -
శ్రీశ్రీలో మహేశ్‌బాబు?
చాలా కాలం విరామం తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయనిర్మల, నరేశ్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు మెరుపులా కనిపిస్తారనే వార్త ప్రస్తుతం ఫిలిమ్నగర్లో హల్చల్ చేస్తోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా ‘మనం’లో కనిపించిన తరహాలో, కృష్ణ ఫ్యామిలీ అంతా ఇందులో కనిపించే ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఆ వార్త సారాంశం. మహేశ్ తనయుడు గౌతమ్ కృష్ణ, హీరో సుధీర్‌బాబు కుమారుడు కూడా ఇందులో నటిస్తున్నారట. ఈ వార్తే నిజమైతే అభిమానులకు పండగే పండగ. -
శ్రీశ్రీ ఆవేశం
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరంలా నిలిచిన మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే సూపర్‌స్టార్ కృష్ణ ‘శ్రీశ్రీ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్‌పై శ్రీసాయిదీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ - ‘‘టైటిల్ చూస్తే మహాకవి శ్రీశ్రీ గుర్తుకొస్తున్నారు. ఆయన తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. దర్శకుడు చెప్పిన దానికంటే అద్భుతంగా తీస్తున్నారు’’ అని అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ‘‘కథ, పాత్రలు నచ్చడంతో కృష్ణగారు, నేనూ కలసి నటిస్తున్నాం. నా 70వ ఏట రీ ఎంట్రీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. ఫిబ్రవరి 12న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. -
శ్రీశ్రీ జరిపిన పుస్తకావిష్కరణ
20-5-1980. అది మద్రాసు మహానగరం. టి.నగర్‌లోని జి.ఎన్.బెట్టీ రోడ్, మహాలక్ష్మీ క్లబ్. సాయంత్రం 6 గంటలు. సంకు గణపతిరావు అతిథులందరినీ వేదికపైకి ఆహ్వానించి, సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్యకు మైకు అందించారు. ఆయన తన కంచుకంఠంతో సభను ఉద్దేశించి ఉపన్యసించారు. ఆ తరువాత శ్రీశ్రీ ‘మానవులం’ పుస్తకావిష్కరణ చేశారు. ఆ రోజులలో మినీ కవితలను యువకులు జోరుగా రాస్తున్నారు. ‘మానవులం’లో నేను రాసిన ఒక ఖండికను చదివారు. ‘నేను కవితా వామనుణ్ణి / నా మొదటి పాదం విశ్వనాథపైన నా రెండవ పాదం శ్రీశ్రీపైన / నా మూడవ పాదం ఆత్రేయమీద పెట్టాను అందుకే నేను ఎదగనివాణ్ణి / కవితా వామనుణ్ణి’. దీని గురించి శ్రీశ్రీ పదిహేను నిమిషాలకు పైగా వ్యాఖ్యానించారు. నాకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు చాటిచెప్పారు. ఆయనకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆనాటి సభకు నయగార కవి ఏల్చూరి సుబ్రహ్మణ్యం వారి శ్రీమతితో వచ్చారు. కొసరాజు, ముళ్లపూడి వెంకటరమణ, ఎమ్వీయల్, పి.బి.శ్రీనివాస్, కాకరాల, దేవిప్రియ కూడా సభకు విచ్చేసి, అందరూ తలో పది నిమిషాలకు పైగా మాట్లాడారు. ఎమ్వీయల్ మాట్లాడుతూ, ఇటువంటి రచనలు అలిశెట్టి ప్రభాకర్ రాస్తున్నాడని కొన్నింటిని ఉటంకించి సభకు వివరించారు. పి.బి.శ్రీనివాస్ ‘మానవులం’ మీద రాసిన సమీక్షను అందరికీ చదివి వినిపించారు. సభ రెండు గంటల్లో ముగుస్తుందని కొంగర జగ్గయ్య మలి ఉపన్యాసం చేశారు. పాత్రికేయుడు సంకు గణపతిరావు వందన సమర్పణ గావించారు. ఆ సభ విశేషమేమిటంటే శ్రీశ్రీ ఎన్నడూ లేని విధంగా పట్టు పీతాంబరాలలో వచ్చారు. సభ కిటకిటలాడింది. కె.ప్రభాకర్; ఫోన్: 9440136665 -
చిన్న మల్లెత్తు మాట
మే 19న గుడిపాటి వెంకటాచలం జయంతి శ్రీశ్రీని తూకం వెయ్యడం తేలిక. ప్రభుత్వ తూనికలు, కొలతల విభాగం వారు చక్కగా ప్రామాణీకరించి ఇచ్చిన కిలో, అర కిలో, పావు కిలో రాళ్లలా అందరి దగ్గరా ఒకే విధమైన రాళ్లు ఉంటాయి. అయినా సరే, శ్రీశ్రీని కొలిచే రాళ్లు తన దగ్గర లేవన్నాడు చలం. ఏమిటర్థం? తూనికలు, కొలతలకు అందని ఏ భార రహిత పర్వత శిఖరాలనో శ్రీశ్రీ కవిత్వంలో అధిరోహించి, అనుభూతి చెంది ఉండాలి చలం! చలాన్ని తూకం వెయ్యడం కష్టం. ఏం? రాళ్లు లేవా? ఉన్నాయి. అందరి దగ్గరా ఉన్నాయి. అయితే అవన్నీ ప్రభుత్వం వారు ముద్ర వేసి, జారీ చేసిన విధంగా ఒకే రకమైన రాళ్లు కాదు. చలం కోసమని ఎవరికి వారు సొంతంగా నూరి ఉంచుకున్న రాళ్లు. చలంపై విసరడానికి తప్ప, చలాన్ని తూచడానికి పనికి రాని రాళ్లు! అందుకే చలాన్ని తూచే రాళ్లు ఈ తెలుగు నేలలో కనిపించవు. ఎలా మరి చలాన్ని దొరకపుచ్చుకోవడం! రాళ్లే కావాలా? పూలు లేవా? అలాగని తక్కెడలో పువ్వేసుకుని వచ్చిన ప్రతి మనిషికీ చలం ‘టిల్ట్’ కాడు. చలాన్ని తూచేవారు సకలగుణ సంపన్నులై ఉండకూడదు! ‘‘ఆ వింత మృగం సృష్టిలో ఉండడానికి వీల్లేదు’’ అంటాడు సకలగుణ సంపన్నత గురించి చలం. స్త్రీ సౌందర్యానికీ, స్త్రీ ఔన్నత్యానికీ మోకరిల్లని జన్మ అసలు మగజన్మే కాదంటాడు చలం... ఎన్ని సుగుణాలు, ఎంత అధికారం ఉన్నవాడినైనా. చలానికి ఎండాకాలాలు ఇష్టం. ఆ కాలాల్లో వీచీ వీయని మధ్యాహ్నపు సోమరి గాలులు అతడిలో స్త్రీల గురించిన ఆలోచనల దుమారం రేపుతాయి. ఆ కాలాల్లో పూసే మల్లెపూలు అతడిని తన దగ్గరలేని అనేకమంది స్త్రీలలో ఏకకాలంలో వివశుడిని చేస్తాయి. చలం మల్లెపూలు గుచ్చుతాడు. మల్లెమాల మెడలో వేసుకుంటాడు. ఎవరైనా ఇస్తే మల్లెమొగ్గల్ని జేబులో వేసుకుంటాడు. మగువ లంటే పడి చచ్చిపోయినట్లే ఉంటుంది, మల్లెల కోసం అతడు పడే అరాటం. ‘‘... సాయంత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు; అర్ధరాత్రులు విచ్చి, జుట్టు పరిమళంతో కలిసి నిద్రలేపి, రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు; దేహాల మధ్య, చేతుల మధ్య నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు; అలసి నిద్రించే రసికత్వానికి నవజీవనమిచ్చే ఉదయపు పూలు; రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు’’ అంటాడు చలం.జీవితంలోని అతడి ధైర్యం కూడా ఈ పూలే! ‘‘ఎండా కాలపు దక్షిణ గాలి, తెల్లారకట్ట అలసట నిద్ర, లేవొద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి, మల్లెపూల పరిమళం... అన్నీ ఒకటిగా కలిసి జ్ఞాపకం వస్తాయి... లోకం సారవిహీనమని అధైర్య పడినప్పుడల్లా’’ అంటాడు. స్త్రీ గా వికసించిన పసి సౌందర్యాన్ని పొందలేక చలం పడే యాతన, మల్లెమొగ్గను... అది తన ఎదలోనే విచ్చుకున్నా గమనించక నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత అతడు పడే పశ్చాత్తాపం ఒకే తీవ్రతలో ఉంటాయి. ‘‘... నిన్న, చిన్నప్పుడు నేనెరిగిన పిల్ల పెద్దదై చూడ్డానికి వచ్చింది. వెళ్లేటప్పుడు లేచి నుంచుని వెనక్కి తిరిగేటప్పుడు ఆ నడుం నుంచి మెడ వరకు ఆమె చూపిన కదలిక ఏ మాటలు, ఏ గీతలు, ఏ రంగులు క్యాచ్ చెయ్యగలవు? అంత గొప్ప ఫ్లాష్‌ని చూపి నా కళ్లని చెద రకొట్టిందని ఆమెకే తెలీదు. అట్లాంటప్పుడు ఏం చెయ్యగలం? ఒకవేళ సిగ్గు, అభిమానం వదిలి ఆమెకి నా మీద ఉన్న కాన్ఫిడెన్సు భగ్నం చేసుకుని ఆ పిల్లని కావిలించుకుంటే చేతికి ఏమి అందుతుంది? లక్ష్మీబాయి పాడుతోంది. ఇప్పుడు ఆమెని కావిలించుకుంటే ఆ సంగీత మాధుర్యం నాకెంత దొరుకుతుందో, నిజమైన అందం కూడా అంతే దొరుకుతుంది’’ అని గట్టిగా గుండెను పట్టుకుంటాడు చలం. చిన్న పువ్వు కూడా అతడిని ఏడిపిస్తుంది. అంత లేబ్రాయపు శక్తిహీనుడు సౌందర్య ఆస్వాదనలో. ‘‘... ఒకరోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లె మొగ్గని వదల్లేక, జేబులో వేసుకుని మరిచిపోయినాను. సాయంత్రం కాలవగట్టు దగ్గర మల్లెపూల వాసన వేసి చుట్టూ వెతికాను, తోట ఉందేమోనని. చివరికి నా జేబు అని గుర్తుపట్టి చూస్తే, తెల్లగా పెద్దదిగా విచ్చుకుని నా వేళ్లని పలకరించింది. నా జేబులో మరిచిపోయిన నా మల్లెమొగ్గ! కళ్లంబడి నీళ్లు తిరిగాయి’’ అని విలపిస్తాడు. చలం ధీరుడైన ‘మార్టిర్’. కానీ, బతికివున్నన్నాళ్లూ దుర్బలుడై స్త్రీ కాళ్లను చుట్టేసుకున్నాడు. స్త్రీకి ఏం కావాలో ప్రపంచానికి తెలియజెప్పాడు. స్త్రీలో తనకేం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేకపోయాడు. పూలలో స్త్రీలను చూసుకున్నాడు. మల్లెపూలలో మరీనూ. చలం పుట్టిందీ, పోయిందీ ఈ మల్లెల మాసంలోనే కావడం ప్రకృతి కారుణ్యమే అనుకోవాలి. ప్రకృతి అంటే స్త్రీ అని కూడా కదా! -
ఆయన చివరి ఆకాంక్షను ధిక్కరించాను...
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... అని పాట రాశారు శ్రీశ్రీ. ఆయనను ఆయనలాగే ప్రేమించి చివరి వరకూ తోడు నిలిచారు సరోజా శ్రీశ్రీ. ఆంధ్రుల అభిమాన కవి జీవితంలో భాగమయ్యి ఆయనను అతి దగ్గరగా గమనించే అదృష్టం ఆమెది. శ్రీశ్రీ 105వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఇవి.... నేను శ్రీశ్రీగారికి అసిస్టెంట్‌గా వచ్చి అర్ధాంగిగా సెటిల్ అయ్యాను. ఆయనను ‘గురు’ అని పిలిచేదాన్ని. ఆ మాటకు కోపం వచ్చేది. అయినా ఊరుకునేవారు. నేను శ్రీశ్రీగారితో 150 డబ్బింగ్ చిత్రాలకు పని చేశాను. మాటలు, పాటలు ఆయనే రాసినా డైలాగ్ డెరైక్టర్ యు.సరోజ అని టైటిల్స్‌లో వేసేవారు. రాసిన ప్రతిపాటా నాకు వినిపించేవారు. డబ్బింగ్ పాటల విషయంలో మాత్రం నేను సవరణలు చెప్పేదాన్ని. లిప్ మూమెంట్‌కి సరిపడాలి కదా. ఎక్కడకు వెళ్లినా వెంట తీసుకువెళ్లేవారు. కుళ్లు కాలవ దగ్గర నుంచి లండన్ దాకా ఆయన వెంట వెళ్లాను. ఆయన నా దారికి ఎప్పుడూ అడ్డు రాలేదు. మా చెల్లెలి భర్త రాజబాబు. అతనికి శ్రీశ్రీ గారంటే చెప్పరానంత ఇష్టం. శ్రీశ్రీగారు విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బుట్టలతో పూలు తెచ్చి ఎంత హడావుడి చేసేవాడో. సినీ పోరాటం : శ్రీశ్రీగారు మొదటి నుంచి సినీరంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది ఆయనకు అవకాశాలు రాకుండా చూశారు. అయితే అన్నపూర్ణ, జగపతి, విశ్వశాంతి, పిఎపి, సురేష్ సంస్థలు అండగా నిలిచాయి. ఇవన్నీ మా సొంత సంస్థల కిందే లెక్క. ముఖ్యంగా కృష్ణగారి సోదరుడు జి. హనుమంతరావు మాకు చాలా కో ఆపరేటివ్‌గా ఉండేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారికి శ్రీశ్రీ గారంటే ప్రాణం. అయితే శ్రీశ్రీ గారి బలహీనతను ఆసరాగా తీసుకుని పాటలు రాయించుకున్న చాలామంది ఒక్క ఐదు రూపాయలు కూడా చేతికి ఇచ్చేవారు కాదు. ఆ సమయంలో నేను ఆయన పాటకు డబ్బులు ఇచ్చేవరకు పోరాటం చేశాను. పిల్లలంటే ప్రాణం : ఆయనను ఒక తండ్రిగా వర్ణించడానికి మాటలు చాలవు. పిల్లలంతా ఆయన నెత్తి మీద తాండవం చేసినా చిరాకు వచ్చేది కాదు. ఆయన దగ్గర అంత చనువు వాళ్లకి. తండ్రిని ‘నువ్వు’ అని పిలవడం నాకు నచ్చేది కాదు. ఆయన మాత్రం ‘మీరు’ అని పిలిపించద్దు ‘నువ్వు’ అని పిలిస్తేనే చనువుగా అనిపిస్తుందనేవారు. పిల్లలకు నేనంటే భయం. ‘పిల్లల్ని అంత చదువులు చదివిస్తున్నావు. రేపు నేను వాళ్ల మీద ఆధారపడాలనా’ అనేవారు. పసి బాలుడు : ఆయనకు భోజనం దగ్గర మూడే రకాలు ఉండాలి. వాటితో పాటు పక్కన ఉప్పు, ఆవకాయ ఉంటే చాలు. అయితే అన్నం వడ్డించాక కంచంలోకి చూస్తూ ‘సరోజా! ముందర ఏది తినాలి?’ అని ఆయన అడుగుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేవి. ‘అయ్యో! ఈయనకు అన్నం తినడం కూడా రాదే. ఎంత అమాయకులు’ అనుకునేదాన్ని. బట్టలు ఎలా ఉంటే అలానే కట్టుకునేవారు. చిరిగిపోయాయని, పొట్టిగా ఉన్నాయని ఆలోచించేవారు కాదు. పైగా ‘నా బట్టలు ఎవడిక్కావాలి. నా కవిత్వం కావాలి కానీ’ అనేవారు. తల కింద పుస్తకాలు చుట్టూ పెన్నులు కాగితాలు పెట్టుకుని పడుకునేవారు. ఇవీ సరదాలు... : చిల్లరంతా తీసి లెక్కపెట్టుకోవడం ఆయనకు సరదా. అంతా లెక్కపెట్టాక డిబ్బీలో వేసేవారు. శ్రీశ్రీ గారికి 733 నంబరంటే ఇష్టం. ఆయన ఫోన్ నంబర్లో చివరి మూడు సంఖ్యలు అవే. ఇప్పటికీ నేను చివరి మూడు సంఖ్యలు వాటినే తీసుకున్నాను (044 - 24939733). పప్పు అద్దిన చేకోడీలు ఆయనకు చాలా ఇష్టం. గులాబ్‌జామ్, మైసూర్‌పాక్, పులిహోర, సేమ్యాపాయసం, అల్లప్పచ్చడి, నువ్వు పచ్చడి కలిపి తినేవారు. ఆయనకు అద్దాలంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద అద్దాలు గోడకు రెండు వైపులా అమర్చి మధ్యలో కూర్చుని ఆనందించేవారు. కవితాకన్య... : ఆరాధన చిత్రంలోని ‘నా హృదయంలో నిదురించే చెలి’ పాటలోని చెలి ఎవరు అని శ్రీశ్రీ గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం, ‘ఆ చెలి మరెవరో కాదు నా కవితాకన్య’ అన్నారు. శ్రీశ్రీ కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి అజంతా. ఈ మాట అనలేదు... : ఆయన ఎన్నడూ ‘దేవుడు లేడు’ అనలేదు. ‘దేవుడు ఉంటే ప్రత్యక్షం అవ్వడు. అదొక శక్తి. ఆ శక్తి ఎవ్వరికీ కనిపించదు. నాకు ప్రజలే దేవుళ్లు, వీళ్ల కోసమే నా చరిత్ర, నా రచనలు. నీకు ఆకలి వేస్తే నీ నామాల దేవుడు అన్నం పెడతాడా’ అనేవారు. పూర్తి చెకప్...: డా. పి. సత్యనారాయణ, డా.కృష్ణన్ అనే ఇద్దరు డాక్టర్లు ప్రతి సంవత్సరం శ్రీశ్రీ గారికి నఖశిఖ పర్యంతం చెకప్ చేసేవారు. శ్రీశ్రీగారు వారిని ఎందుకని ప్రశ్నించేవారు. అందుకు వారు, ‘ప్రపంచానికి మీరు కావాలి. మీకు మీరు కావాలి. మా కోసం మేం చేస్తున్నాం’ అన్నారు. అందరికీ శ్రీశ్రీ గారంటే అంత ప్రాణం. మరణానంతర కాంక్ష... : ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను దగ్గర ఉండి సేవలు చేస్తుంటే ‘తిండి తిప్పలు లేకుండా నాతో కూర్చున్నావు. పిల్లల్ని కూడా చూసుకోవట్లేదు’ అనేవారు. ‘ఎందుకలా భయపడతావు. గుండు పెట్టి పేల్చినా కూడా నేను చావను’ అన్నారు. ఎవరికైనా మరణం తప్పదు. ఆయన కూడా తనువు చాలించారు. శ్రీశ్రీగారి చివరి ఆకాంక్షను నేను ధిక్కరించాను. మరణించాక ఆయన శరీరాన్ని విశాఖపట్టణంలో ఆసుపత్రి వారికి ఇవ్వాలని శ్రీశ్రీగారి ఆకాంక్ష. కాని నేను ఆయన శరీరాన్ని ఇవ్వలేకపోయాను. మెదడు దగ్గర నుంచి ఒక్కో భాగాన్ని వాళ్లు కోసేస్తారనే వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోయాను. పిల్లలు కూడా వారించారు. అలా ఆయన చివరి కోరికను నేను ధిక్కరించాను. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఏంటి నాయనా... ఆయన చాలా మృదువైన మనిషి. నవ్వు చాలా బావుంటుంది. భలే నవ్వేవారు. ఆయన నవ్వుతుంటే చెవులు, బుగ్గలు, గుండె దగ్గర ఎర్రబడేది. అంతటి సుకుమారులు ఆయన. ఆయనకు బాగా కోపం వస్తే, ‘ఏంటి నాయనా’ అని గొణుక్కునే వారు. -
పతంజలి-మోహన్
పురస్కార ప్రదానం పతంజలి తన తొలి నవల ‘ఖాకీవనం’ను శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రిలకు అంకితం ఇచ్చాడుగానీ వాస్తవానికి ఆయన గురజాడ స్కూల్‌కి నిజమైన వారసుడు. కన్యాశుల్కంలో గిరీశం లెక్చర్ అంతా విన్నాక బండివాడు ‘అయితే మా వూరి పోలీసుకు ఎప్పుడు బదిలీ అవుతుంది’ అని అడుగుతాడు. ఒక రకంగా ఆ మాటకు కొనసాగింపే పతంజలి ఖాకీవనం. పోలీసు వ్యవస్థపై పతంజలి వేసిన ఇరవయ్యవ శతాబ్దపు అత్యుత్తమ చురక- ఖాకీవనం. దీని ఛాయ ఆయన కథ ‘చూపున్న పాట’లోనూ ఆ తర్వాత ‘పిలక తిరుగుడు పువ్వు’లోనూ కనిపిస్తుంది. పిలక తిరుగుడు పువ్వులో ఆఖరున పోలీసు ప్రభువు ఇలా అంటాడు- ‘ఆలమండ గ్రామస్తులందరికీ భూమి ఎలాగుందో అర్థం అయిందా లేదా? జాగ్రత్తగా వినండి. భూమి గుండ్రంగా లేదు. బల్లపరుపుగా కూడా లేదు. భూమి నా టోటీ లాగుంటాది. భూమి పోలీసోడి లాఠీ లాగుంటాది.’... ప్రపంచస్థాయి రచన చేయడంలో గురజాడ తర్వాత పతంజలి పేరు చెప్పాలి. పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, రచయితగా తన యాభై ఏడేళ్ల జీవితంలో పతంజలి సాధించిన అభివృద్ధి రేటు గమనించినా ఆయన పక్కన నంబర్ టు నంబర్ త్రీ అంటూ వేరే ఎవరినైనా నిలబెట్టడం కష్టం. గురజాడ ఒక గిరిశాన్ని చిత్రించి ఊరుకుంటే మనుషులందరిలో దాగిన గిరీశాల సామూహిక దర్శనం చేయించినవాడు పతంజలి. అందుకు ఉదాహరణ ‘గోపాత్రుడు’. భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా అంటూ ఆల్బర్ట్ కామూ స్థాయిలో ఒక తాత్విక విరోధాభాష సాధించినవాడు పతంజలి. లోకం మీద వ్యంగ్యపు అక్షౌహిణులను నడిపించి దుర్మార్గపు వ్యవస్థల మీద కురుక్షేత్ర యుద్ధం చేసిన సాహిత్య సరోత్తమ సేనాని ఆయన. మరి అలాంటి రచయిత మీద తొలి పురస్కారం ఎవరికిస్తాం? ఇంకెవరికి? చిత్రకారుడు మోహన్కే. రాతలో పతంజలి చేసిన పని చిత్రకారుడిగా మోహన్ గీతలో చేశాడు. కార్టూనిస్టుగా ఆయన రాజకీయ నాయకులకు పెట్టిన వాతలు, పోస్టర్లతో ఉద్యమాలకు ఊదిన ఊపిరులు, భిన్న సందర్భాలలో చేసిన రచనలు పతంజలి వలే మోహన్‌ను కూడా ప్రజల పక్షాన నిలబెట్టాయి. హాస్యం, వ్యంగ్యం అనే పచ్చి బెత్తాలతో వ్యవస్థను చక్కదిద్దే పని చేశాయి. అందుకే విశాఖలో ఉత్సవం. ఈ ఆదివారం (మార్చి 29) పతంజలి జన్మదినం సందర్భంగా విజయనగరంలో మోహన్‌కు పురస్కార ప్రదానం. ఈ సందర్భంగా ‘పతంజలి సాహిత్యావలోకనం’ పేరిట మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో సభ. విశాఖ మ్యూజియంలో 28, 29 తేదీలలో మోహన్ చిత్రాల ప్రదర్శన. ఒక రాతను తలచుకుని, ఒక గీతను నమస్కరించుకునే ఈ ఉత్సవానికి అందరికీ ఆహ్వానం. - రామతీర్థ -
చావుతప్పినా తోవ మారని కాంగ్రెస్
ప్రతిపక్షమే లేదన్నట్టు వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉన్న వాటిని ఖతం చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా బీజేపీ తోనూ, టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొని నడవనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్లు నడిపినా ప్రయోజనం ఉండదు. డేట్లైన్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ గురించి మహాకవి శ్రీశ్రీ ఒకచోట రాసిన పంక్తులు గుర్తొ చ్చాయి- రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ వారం రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తుంటే. పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట తిరిగి పుంజుకునేదెప్పుడు... ఫలానా అప్పుడు, ఫలానా అప్పుడు అని అస్సలు సాధ్యం కాని విషయాలను గురించి ఆ పద్యంలో చెపుతాడు మహాకవి. ఒక సందర్భంలో కాంగ్రెస్ పరిస్థితి మీద శ్రీశ్రీ రాసిన కవిత అది. అయితే తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు ఆ పూర్వ వైభవం పలుమార్లు వచ్చింది. పోయింది కూడా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఆనాడు మహాకవి రాసినట్టే ఉంది, కనుకనే ఈ ప్రస్తావన. ఆ రోజుల్లో, అదీ మహాకవి శ్రీశ్రీ కాబట్టి ఏం రాసినా, అందులో ఎలాంటి భాష వాడినా చెల్లింది. కాని ఇప్పుడు వాటిని తిరిగి ఇక్కడ రాయ డం సభ్యత కాదని భావించడం వల్లనే ఆ పద్యం పూరించలేకపోతున్నాను. అది ప్రతిపక్షం కర్తవ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రెండు ప్రభుత్వాల మీదా ఇక పోరాటం మొదలుపెట్టాలని తీర్మానించుకుని తొలి దశ ఉద్య మాన్ని మొన్న ప్రకటించాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అయినప్పుడు వాటిని వ్యతిరేకించి పోరాడాల్సిన బాధ్యత ప్రతి పక్షాలదే. చట్టసభల్లోనూ, వాటి వెలుపలా ఈ పోరాటాలు జరగాలి. అయిన దానికీ, కానిదానికీ ప్రభుత్వాలను విమర్శించడం వాటి మీద విరుచుకు పడటం కాకుండా, ఎక్కడైతే ప్రజలకు నష్టం జరుగుతున్నదో, ఎక్కడైతే ప్రజా ధనం దుర్వినియోగం అవబోతున్నదో అక్కడ ఏ మినహాయింపులూ, వెనకకు తగ్గడాలూ లేకుండా ప్రతిపక్షాలు పోరాడవలసిందే. అన్ని వేళలా అన్ని సమ స్యల మీద ప్రజలే స్వయంగా వచ్చి ఉద్యమాలు చేయరు. ఆ పని చెయ్యాల్సింది ప్రతిపక్షాలే. మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకున్న ప్పుడు శాసన వ్యవస్థలో ప్రాతినిధ్యం దృష్ట్యా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షం. తెలంగాణ చట్టసభలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, మజ్లిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బీజేపీకి కొద్దిపాటి ప్రాతినిధ్యం ఉన్నా, మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం మాత్రం ఈ అయిదు సంవత్సరాల్లో లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన తీరు ప్రజా స్వామ్య బద్ధంగా లేకపోయినా, ఆ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతల పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నా, అక్కడి బీజేపీ నాయకుల చేతులు అధికార పగ్గాలతో కట్టేసినట్టే అయింది. మిత్రధర్మం అనండీ, సంకీర్ణ ధర్మం అనండీ! ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నోరు విప్పి మాట్లాడే స్థితిలో ఇవాళ లేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. నిజానికి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్ అయినా, బీజేపీ నిలబడకపోతే, గట్టిగా సమర్థించకపోతే తెలంగాణ రాష్ర్టం ఏర్పడేది కాదు. ‘చిన్నమ్మను, నన్నూ గుర్తుపెట్టుకోండి!’ అని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అభ్యర్థించినా చెలిమికి సిద్ధపడని టీఆర్ఎస్ సిద్ధపడలేదు. ఆ వైఖరితోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పట్ల బీజేపీకి ఉన్న మొహమాటాలు, తెలంగాణ విషయంలో లేకుండా చేశాయి. పైగా తనకు బద్ధ శత్రువైన మజ్లిస్‌కు అధికార పార్టీ అందిస్తున్న స్నేహహస్తం కూడా బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్‌లో లేని రాజకీయ అవకాశాలను ఇచ్చింది. తెలంగాణలో మెత్తబడుతున్న కమలం? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారతీయ జనతా పార్టీ రాష్ర్ట ప్రభుత్వం మీద కొంత విమర్శనాత్మకంగా వ్యవహరించినా, రాను రాను ఆ పార్టీ వైఖరిలో అధికార పక్షం పట్ల కొంత మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ నుంచి కొత్తగా వెలువడుతున్న దినపత్రికకు ఆది వారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం స్పష్టం చేసినట్టే కనిపించింది. ‘ప్రభుత్వాన్ని తొందరపడి విమర్శించం!’ అన్నారు కిషన్‌రెడ్డి. ఎవరైనా చెయ్యాల్సింది అదే. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షం, అందునా కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ వంటి పార్టీ బాధ్యతగా వ్యవహరించవలసిందే. కానీ అదే ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు మరోమాట కూడా అన్నారు, ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌వి మంచి నిర్ణయాలే’ అని. 2019లో స్వతంత్రంగా పోరాడి గెలవడం తమ పార్టీ లక్ష్యం అని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. అంటే ఈ అయిదు సంవత్సరాలూ బీజేపీ శక్తియుక్తులన్నీ పార్టీని బలోపేతం చెయ్యడం మీదనే కేంద్రీకరిస్తుందని అర్ధం. ఆ పని ప్రారంభించామని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. తప్పు లేదు. కానీ ఈ ఏడు మాసాల కాలంలో తెలంగాణ ముఖ్య మంత్రి అన్నీ మంచి నిర్ణయాలే తీసుకున్నారన్న కిషన్‌రెడ్డి మాటలు మాత్రం రాజకీయ పరిశీలకులలో పలు సందేహాలు కలిగించే విధంగా ఉన్నాయి. నాయకుల పరస్పర విరుద్ధ వైఖరులను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ బాట పట్టిందేమో అన్న సంశయం కలగక మానదు. బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి స్వరం ఒక లాగా వినిపిస్తే, ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వరం అందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ ఇంటర్వ్యూని బట్టి అర్థం అవుతున్నది. నిన్నటి దాకా కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, సమగ్ర సర్వే నుంచి మొదలై గోల్కొండ కోట మీద జెండా వందనం జరిపిన దగ్గర నుంచి నిన్నటి వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చే ప్రతిపాదన వరకు చేసిన తీవ్ర విమర్శలన్నీ ఏమయ్యాయి? తాము పొరపాటుగా విమర్శించాం, ఇప్పుడు ఆ పొరపాటును సరిచేసుకున్నాం అని కూడా చెబితే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చిన వాళ్లు అవుతారు. మంచిని ఆహ్వానిస్తాం, తప్పు చేస్తే విడిచి పెట్టం అనాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వానివి అన్నీ మంచి నిర్ణయాలే అనడం విడ్డూరం. చట్టసభలో సంఖ్య రీత్యా తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీ కాకపోవచ్చు కానీ, ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎది గిన పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న ఈ వైఖరి ఇతర పక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు లాభించేదే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మిత్ర పక్షంగా ఉండి అధికారంలో భాగస్వామి కూడా అయిన బీజేపీ తెలం గాణకు వచ్చే సరికి తన వైఖరి కొంత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకో వడం చూస్తే 2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో జెండా ఎగురవేయాలన్న మోదీ, అమిత్‌షా ద్వయం వ్యూహం భవిష్యత్తు ఏమిటో బీజేపీ పెద్దలే ఆలో చించుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకునే క్రమంలో బీజేపీ ప్రస్తావన వచ్చినందునే ఈ విషయాల ప్రస్తావన. అందరినీ కలుపుకుని పోవడమే మార్గం మరోసారి కాంగ్రెస్ పార్టీ గత వారం ప్రారంభించిన రెండు రాష్ట్రాల ఆందో ళనల దగ్గరికి వద్దాం. రాష్ర్ట విభజన భారాన్ని మోస్తూ నడవలేక నడుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో, తీవ్రమైన అనైక్యత, అంతర్గత కుమ్ములాటలను వెంట వేసుకుని కుంటుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనల బాట పట్టింది. తెలంగాణలో ప్రజావసరాలను లెక్క చెయ్యకుండా ఆస్పత్రిని 70 కిలోమీటర్ల దూరం తరలించి ఆ స్థలంలో రాష్ర్ట సచివాలయ నిర్మాణానికి సంకల్పించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో రాజభవన్, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభు త్వంలో భాగస్వామిగా ఉండి కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతి పత్తి సాధించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న సర్కార్ వైఖరికి నిరసనగా కోటి సంతకాల ఉద్యమం... ఈ రెండూ తప్పనిసరిగా ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రభుత్వ వైఖరుల పట్ల ప్రతిఘటనే. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలను ఇందుకు అభినందించాల్సిందే. ఇక్కడా అక్కడా ప్రతిపక్షాలను రవ్వంత కూడా ఖాతరు చేయని నాయకులే పాలకు లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచీ అక్కడి ప్రధాన ప్రతిపక్షం ప్రతి సమస్య మీదా తనదైన పద్ధతిలో స్పందిస్తూనే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి దాకా ఆందోళన సాగిస్తూనే ఉంది. 66 మంది శాసన సభ్యులు ఉన్నా; తమకూ, ప్రతిపక్షానికీ ఐదు లక్షల ఓట్లే తేడా ఉన్నా ప్రతిపక్షమే లేదని భ్రమల్లో నివసిస్త్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉన్న ప్రతి పక్షాలను ఖతం చేసే కార్యక్రమం ప్రధానంగా ఎంచుకున్న తెలంగాణ ముఖ్య మంత్రుల ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా రాజకీయంగా బీజేపీతోనూ టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొనిపోనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్లు నడిపినా ప్రయోజనం ఉండదు. datelinehyderabad@gmail.com -
ఎవరి రచనలంటే ఇష్టం?
నాకు చదవడం తెలిశాక చంకన పెట్టుకుని తిరిగిన పుస్తకాలు రెండు. ఒకటి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, రెండు హెచ్చార్కె ‘రస్తా’. శ్రీశ్రీ- చూడు చూడు నీడలు, బాటసారి కవితలు చాలా ఇష్టం. కాలక్రమంలో చాలామంది రచయితలు తెలిశారు. పుస్తకాలు పరిచయమయ్యాయి. నెరూడ, బోర్హెస్, లోర్క, మయకొవెస్కి, పాస్టర్న్యాక్, విస్వావ పింబోర్స్క, పీటర్ ల ఫార్జ్ (ఖీజ్ఛి ఆ్చ్చఛీ ౌజ ఐట్చ ఏ్చడ్ఛట’ జ్చఝ్ఛ), మహమౌద్ దర్విష్, మాయా ఆంజెలౌ, ల్యాంగ్సన్ హ్యూస్, ఖలిల్ జిబ్రన్... వీరి రచనలంటే ఇష్టం. తెలుగులో అయితే సరళమైన భాషలో రాసినవి ఎక్కువ ఇష్టపడతాను. ఏ యాసలో ఉన్నా సరే. ‘90లలో ఐడెంటిటీ పాలిటిక్స్‌పై వచ్చిన కవితల్ని ఎక్కువ ఇష్టపడేదాన్ని. రేవతీదేవి ‘శిలాలోలిత’ చాలా ఇష్టం. ఇక ఇప్పుడు చాలామంది అద్భుతంగా రాస్తున్నారు. వాళ్లలో నా ఫేవరెట్ రైటర్ కాశిరాజు. ఎందుకంటే మా ఊర్లో చలికాలంలో వేసుకునే చలిమంటలో నుంచి వచ్చె కమ్మని వాసనేస్తాయి అతని కవితలు/కథలు. కవితైనా, కథైనా పెయింటింగ్, స్కల్ప్టింగ్లాంటి కళే అని నమ్ముతాను. కాదేదీ కవితకనర్హం... అనేమాట నిజమే అయినా కవితా వస్తువు ఎలాంటి ఆర్భాటాల అవసరం లేకుండా మనస్సులోకి సూటిగా దూసుకెళ్లగలగాలి. అలాగే కన్నీళ్లు కార్చకుండా కన్నీళ్ల గురించి రాయకూడదు. నీలి ఈకల పిట్టను చూడకుండా దాని ఈకల మెరుపు గురించి రాయకూడదు. అలా రాసిన కవితల్లో ఇంటెగ్రిటి ఉండదు. - మమత కొడిదెల (ఇటీవల ‘ఇస్మాయిల్ పురస్కారం’ (అమెరికా)కి ఎంపికైన సందర్భంగా ‘వాకిలి’- వెబ్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. మమత కొడిదెల తక్కువగా రాసినా స్థిరంగా రాస్తున్న కవయిత్రి. గతంలో సత్యజిత్ రే కథలను తెలుగులో అనువాదం చేశారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు) -
సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు
పాటల రచయిత వెన్నెలకంటి విజయవాడ : ఆయన పాట యువతీ యువకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. లాలి పాట రాసినా, ప్రేమ, విరహగీతాలు రచించినా, ప్రబోధ గీతాలకు అక్షర రూపం ఇచ్చినా ఆయన ముద్ర కనపడుతుంది. సినీ కవిగా 25 ఏళ్ల ప్రస్థానానికి చేరుకున్న ఆయనే వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. విజయవాడలో ఆదివారం జరిగిన మహాకవి శ్రీశ్రీ పాటల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. కల్చరల్ : సినీ కవిగా మీ ప్రస్థానం సంతృప్తికరంగా సాగుతోందా? వెన్నెలకంటి : ఇక్కడ ఒక విషయం చెప్పాలి... కవిగా నా సినీ జీవితం ఎప్పుడూ సంతృప్తి కరంగానే సాగింది. నాకు సంబంధించినంత వరకు నా నిర్మాతలు, దర్శకుల నుంచి ఎప్పుడూ ఒత్తిడులకు లోను కాలేదు. సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు. కల్చరల్ : తెలుగు సినీ కవుల్లో పాండిత్యంగలవారు చాలా మంది ఉన్నారు. అరుుతే కేవలం ముగ్గురికే జాతీయ వార్డులు వచ్చాయి. మిగిలినవారికి రాకపోవడానికి కారణం? వెన్నెలకంటి : అవార్డుల కమిటీలో మన తెలుగువారు లేక పోవడమే ప్రధాన కారణం. పాటల్లో సాహిత్యపు విలువలు ఉన్నా, సంబంధిత కమిటీ వారికి అవగాహన లేక పోవడం, మిగతా భాషల వారితో పోలిస్తే మనకు మన భాషపై మమకారం లేకపోవడమూ కారణమే. కల్చరల్ : సినీ సాహిత్యం నేడు బూతు వానలో తేలిపోవడంపై మీ స్పందన? వెన్నెలకంటి : యువకుల భావజాలం మారుతోంది. అందుకు తగిన విధంగానే సినిమాలు తయారవుతున్నాయి. బూతయినా, శృంగారమైనా కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కల్చరల్ : సినీగీతాల్లో శబ్ధ కాలుష్యం పెరిగిపోతోంది. సాహిత్యం కనపడటంలేదు కదా? వెన్నెలకంటి : ఏ వస్తువైనా డిమాండ్‌ను బట్టి తయారవుతుంది. తెలుగు సినీగీతాల పరిస్థితీ అంతే. అయినా అంత నిరాశాజనకంగా మాత్రం తెలుగుపాటలు లేవు. మంచి పాటలు అరుదుగా వస్తూనే ఉన్నాయి. కల్చరల్ : పాట కలకాలం నిలవాలంటే..? వెన్నెలకంటి : సంగీతం, సాహిత్యం, సందర్భం. గాన మాధుర్యం అన్నీ కలవాలి. ఆ గీత జాతకం బాగుండాలి. కల్చరల్ : మీకు నచ్చిన సినీ కవి ఎవరు? వెన్నెలకంటి : మంచి సాహిత్యం, అంతకుమించిన పదలాలిత్యంతో హృదయాన్ని తట్టిలేపే గుబాళింపుతో పాటలురాసే కవి ఎవరైనా నాకు ఇష్టులే. కల్చరల్ : సినీ కవిగా శ్రీశ్రీ గురించి చెప్పండి వెన్నెలకంటి : ఆయనదంతా ఓ యుగం. ప్రభోదాత్మక గీతాలు, విరహగీతాలు, ఒకటేమిటి శ్రీశ్రీ ఏది రాసినా జంఝామారుతమే. అనుకరించ, అనుసరించలేనిది శ్రీశ్రీ బాణి. కల్చరల్ : మీకు నచ్చిన పాట ఏదీ అంటే అన్నీ నాకు నచ్చినవే అంటారు చాలా మంది. మరి మీరేమంటారు? వెన్నెలకంటి : నేను సినీ కవిగా నిలబడటానికి వచ్చాను. బ్యాంకు ఉద్యోగిని కావడంతో ఆర్థిక చిక్కులు లేవు. మంచిపాట కావాలి అంటూ నిర్మాతలు వచ్చినప్పుడు వారి తృప్తి మేరకు చాలానే రాశాను. ‘మామయ్య అన్న పిలుపు’ పాట అంటే చాలా ఇష్టం. -
శ్రీశ్రీ ప్రస్థానం
-
యువతా మేలుకో.. నువ్వే ఏలుకో..!
యువత అంటే.. ‘అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు.. తరతరాల నిశీధి దాటే చిరు వేకువజాడ.. ఎవరని ఎదురే నిలిస్తే.. తెలిసే బదులు.. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పుకణం.. కాలం తరిమిందో.. శూలంలా ఎదిరిస్తుంది.. సాయం సరదా పడితే.. సమరమై గెలుస్తుంది.. ఫెళఫెళ ఉరుమై ఉరుముతూ.. జిగి ధగధగ మెరుపై వెలుగుతూ.. పెను నిప్పై నివురును చీల్చేస్తుంది...’ అన్నారు ఓ గేయ రచయిత. అలాంటి యువతకు మహాకవి శ్రీశ్రీ ఏమని సందేశమిచ్చారంటే.. ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం,, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి... కదం తొక్కుతూ.. పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ... ఎముకలు కుళ్లిన.. వయసు మళ్లిన.. సోమరులారా చావండి. నెత్తురు మండే.. శక్తులు నిండే సైనికులారా రారండి... బాటలు నడచీ.. పేటలు కడచీ.. కోటలన్నిటిని దాటండి... ప్రభంజనంలా హోరెత్తండి.. భావ వేగమున ప్రసరించండి... త్రాచుల వలెనూ.. రేచులవలెనూ ధనుంజయునిలా సాగండి...’ అంటూ మహాకవి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొచ్చారు. రాష్ట్ర విభజన.. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న కుమ్మక్కు రాజకీయూల వల్ల ఘనచరిత్ర తమదని చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలు ప్రజావిశ్వాసం కోల్పోయూరు. చేష్టలుడిగి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక యంగ్ డైనమిక్ లీడర్ అవసరమని యువత భావిస్తోంది. జిల్లా ఓటర్లలో 54 శాతంగా ఉన్న యువతపైనే రాజకీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉంది. రాజకీయూలను శాసించే స్థారుకి ఎదిగిన యువ ఓటర్లు ఏమనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు.. పథకాలు ఎలా ఉండాలని భావిస్తున్నారు.. గత ప్రభుత్వాల పనితీరుపై వారేమనుకుంటున్నారనే అంశాలపై ‘సాక్షి' బృందం యువతను కదిలించింది. -
‘తెల్ల’క్రౌర్యం లోతు చూపిన ‘నల్ల’బావి
చల్లారిన సంసారాలూ/మరణించిన జనసందోహం/అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి- అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడక్కడ ‘నల్లోళ్ల’ చరిత్రను తిరగతోడుతున్నారు. ఇంగ్లిష్‌వాడి దుర్మార్గాన్ని కళ్లారా చూపుతున్నారు. అజ్నాలా- అమృత్‌సర్‌కు 32 కిలోమీటర్లలో ఉంది. పెద్ద ఊరేమీ కాదు. కానీ చరిత్రలో దానికో ప్రత్యేకత ఉంది. ఇప్పుడా ఊరికి జనం తాకిడి ఎక్కువైంది. వారిలో చరిత్రకారులు, జర్నలిస్టులు మొదలు పురావస్తు శాఖ అధికారుల వరకు అందరూ ఉన్నారు. అక్కడి అవశేషాలను చూస్తే .. 156 ఏళ్ల కిందట భారత సైనికుడు పెట్టిన పొలికేక ఇంకా మార్మోగుతున్నట్టే ఉంటుంది. 1857 మే 10.. మీరట్‌లో సిపాయీలు ఈస్టిండియా కంపెనీ సైనికాధికారులపై తిరగబడ్డారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా ఖ్యాతి గాంచిన ఆ సిపాయీల తిరుగుబాటు ఎందరికో స్ఫూర్తి. 1857 జూలై 30.. లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) మియాన్ మిర్ కంటోన్మెంట్‌లోని 26వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 502మంది భారత సైనికులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రెజిమెంట్ నుంచి తప్పించుకుని అజ్నాలా మీదుగా పంజాబ్ చేరుకుని మీరట్ చేరాలన్నది వ్యూహం. విషయం తెలిసిన బ్రిటిష్ అధికారులు పంజాబ్‌లోని తమ అధికారులకు వర్తమానం పంపారు. ఆ మర్నాటి రాత్రికి రావీ నది తీరాన ‘దాదియన్ సోఫియన్’ గ్రామం వద్ద భారత సైనికులను పట్టుకున్నారు. ఆ నిశివేళ నెత్తురు ఏరులై పారింది. 220 మంది భారత సైనికుల్ని కాల్చి చంపి రావీలో పడేశారు. మిగిలిన 282 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆనాటి పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫ్రెడ్రిక్ హెన్రీ కూపర్ ఆదేశం మేరకు అజ్నాలా తహశీల్దారు కార్యాలయానికి తరలించారు. అక్కడో చిన్న గదిలో (ఇప్పటికీ ఉంది)వీళ్లను కుక్కారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయి కొందరు కన్నుమూశారు. తరువాత పది మంది చొప్పున తీసుకువచ్చి 237 మందిని కాల్చేసి అక్కడకు దగ్గర్లోని బావిలో విసిరేశారు. (ఈ దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షి, అజ్నాలా వాసి జగ్జీత్సింగ్ తన 95 ఏళ్ల వయస్సులో 1928లో జియానిహీరా సింగ్ దర్ద్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన సమాచారం ఇది) మిగతా 45మందిని సజీవంగానే ఆ బావిలో పడేసి పూడ్చేశారు. ఆ బావి పేరే కాలియన్వాలా ఖూ (నల్లోళ్ల బావి). ఈ మారణకాండకు ఆదేశాలిచ్చిన హెన్రీ కూపర్ సైతం -ఆ చిన్న గదిలో అంతమందిని ఎలా బంధించారో తెలియక విస్తుపోయానని తన ‘క్రైసిస్ ఇన్ పంజాబ్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. కాలక్రమంలో అదే స్థలంలో గురుద్వారా వెలిసింది. ఆ తరువాత 42 ఏళ్లకు ఆ గురుద్వారా పక్కన ఓ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు పునాదులు తీస్తున్నప్పుడు ఎముకలు, కపాలాలు బయటపడ్డాయి. ఇది అపశకునంగా భావించిన ప్రబంధక్ కమిటీ ఈ విషయాన్ని అమృత్‌సర్‌లోని చరిత్రకారుడు సురేందర్ కొచ్చర్, గురునానక్ విశ్వవిద్యాలయంలోని పురావస్తు శాఖకు తెలిపింది. సురేందర్ కొచ్చరే 2012 డిసెంబర్లో శోధన మొదలుపెట్టి బ్రిటిష్ కాలపు మృత్యుకుహరం ఇదేనని తేల్చారు. ఇందుకోసం పాత గురుద్వారాను కూల్చి వేసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న తవ్వకాలు ప్రారంభించి మార్చి 2న పూర్తి చేశారు. ఇక్కడ దొరికిన వాటిని అజ్నాలా గురుద్వారా షాహిబ్గంజ్లో ప్రదర్శనకు పెట్టారు. ఇప్పుడా బావి పేరును షహీదాన్వాలా ఖూ (అమరవీరుల బావి)గా మార్చారు. ఈ తవ్వకాల్లో 90 కపాలాలు, కపాలాలున్న 26 ఆస్తిపంజరాలు, ఈస్టిండియా కంపెనీ రూపాయి నాణాలు 70, మూడు బంగారు పతకాలు, నాలుగు బంగారు కడియాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. బయటపడిన సైనికుల అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీళ్ల పేర్ల జాబితాను ఆంగ్లేయ పాలకులు నాశనం చేయడంతో అసలు వీరే ప్రాంతం వారో తేల్చాలని చరిత్రకారులంటున్నారు. వీళ్లు పంజాబీలు కాదని, పర్బానీలని కొందరు వాదిస్తుంటే మరికొందరు పశ్చిమబెంగాల్ లేదా కేరళ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారంటున్నారు. వీళ్లు ఏ ప్రాంతానికి చెందిన వారైనా దేశం కోసం పోరాడిన యోధులయినందున అంత్యక్రియలు నిర్వహించి అస్తికలను గోవింద్వాలా షాహిద్ లేదా హరిద్వార్‌లో నిమజ్జనం చేయాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ కోరుతోంది. బావి ఉన్న ప్రాంతంలో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ దురంతానికి నేటి బ్రిటన్ క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరో చీకటి కోణం బయటపడింది. సాధ్యమైనంత మేర వీటిని నమోదు చేయడం చరిత్రకారుల పని. స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుని, దేశ హితానికి పాటుపడడమే వారికి మన తరం సమర్పించే నిజమైన నివాళి. - అజ్నాలా నుంచి ఎ.అమరయ్య -
కార్మిక సిద్ధాంతి
సంక్షిప్తంగా... కార్ల్ మార్క్స్ ‘‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’’. శ్రీశ్రీ కదా అన్నారీమాట. అవును 1938లో ఆయన రాసిన ‘దేశ చరిత్రలు’ కవితలో. బహుశా ఆయన కార్ల్‌మార్క్స్ నుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. 1848లో మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యం కూడా ఇలాంటిదే. ‘‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’’ అన్నారు మార్క్స్. మ్యానిఫెస్టో ముగింపు వాక్యం కూడా మనం చాలాసార్లు విన్నదే! ‘‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’’. ఇదీ శ్రీశ్రీ నినాదంలా ఉంటుంది కానీ, నిజానికి మార్క్స్ అందించిన విప్లవనాదం. మనకు శ్రీశ్రీ ఎలాగో, శ్రీశ్రీకి మార్క్స్ అలాగ! ఆమాట కొస్తే ప్రపంచంలోని ప్రతి విప్లవ ‘శ్రీశ్రీ’కి మార్క్సే స్ఫూర్తి ప్రదాత. నేడిది మార్క్స్‌ను తలచుకోవలసిన సందర్భం. 1883 మార్చి 14న తన 64వ యేట ఆయన మరణించారు. ఆయన మాత్రమే మరణించారు. ఎంగెల్స్‌తో కలిసి ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అవన్నీ కమ్యూనిస్టులకు వేదాల వంటివి. ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ కమ్యూనిస్టులకు భగవద్గీత అయితే ‘దస్ క్యాపిటల్’ బైబిల్ వంటిది. మార్క్స, ఎంగెల్స్ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్క్స ప్రభావం ఎంగెల్స్పై ఎంతగా ఉండేదంటే ఎంగెల్స్ జీవితాంతం మార్క్స్ అనుచ రుడిగానే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్ సైద్ధాంతికంగా బలవంతుడ య్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢ కాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్! కార్ల్ హైరీచ్ మార్క్స్ 1818 మే 5న పశ్చిమ జర్మనీలోని ట్రియర్‌లో జన్మించారు. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్ తన భార్యాపిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కొలోన్లోని ఒక ఉదారవాద వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలిసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే ఆయన అతివాద కమ్యూనిస్టుగా మారారు. ఆ క్రమంలోనే ఏంగె ల్స్తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. చివరి దశలో మార్క్స్ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య మర ణించాక మార్క్స్ బాగా కుంగిపో యారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు. లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఎంగెల్స్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంత లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని గద్గదస్వరంతో అన్నారు. వర్తమానంలో మార్క్సిజానికి స్థానం లేనట్లు కనిపించవచ్చు. కానీ వర్తమానాన్ని ప్రభావితం చేసే ప్రతి ఇజంలోనూ మార్క్సిజం ఒక పునాది రాయిగా తప్పక ఉంటుంది. -
సినీ మాయలోళ్లు
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇది ఇంద్రజాలానికి కూడా వర్తిస్తుంది. కాగితపు ముక్క, బ్లేడు ముక్క, పేకముక్క.. కాదేదీ మేజిక్కుకి అనర్హం. అయితే తెలియాల్సిందల్లా రెప్పపాటులో ప్రేక్షకులను మాయ చేయడమే. వాస్తవానికి ఇంద్రజాలం తెలిసినవారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ, వారు చేసే ఆ మేజిక్ చూసినప్పుడు ఎంచక్కా మనక్కూడా ఆ విద్య తెలిస్తే బాగుండు అనుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలు చందమామ కావాలని మారాం చేసినప్పుడో, ప్రేయసికి ఇవ్వాలనుకున్న గులాబీ దొరకనప్పుడో మేజిక్ తెలిస్తే చటుక్కున సృష్టించేయొచ్చుగా అనుకోకుండా ఉండరు. ఇలా సందర్భానికి తగ్గట్టు మేజిక్ తెలిసుంటే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది పనిగట్టుకుని ఆ విద్యను నేర్చుకుంటారు. అదే వృత్తిగా స్వీకరించేవాళ్లూ ఉంటారు. అలాగే ప్రవృత్తిగా చేసుకునేవాళ్లూ ఉంటారు. అలాంటి కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోతున్నవారు సినిమా పరిశ్రమలో తెరవెనుకా, తెరపైనా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినవారే. సినిమా కళతో పాటు వారికి మేజిక్ అనే కళ కూడా తెలుసు. నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఆ సినీ మేజిక్ కళాకారుల గురించి తెలుసుకుందాం... తెరపై ఇందజ్రాలికుడుగా: నాటితరం ప్రేక్షకులను ఓ స్థాయిలో నవ్వించిన అద్భుతమైన హాస్యనటుడు రమణారెడ్డి.. తన కామెడీతో మేజిక్ చేసిన రమణారెడ్డికి నిజంగా కూడా మేజిక్ తెలుసు. ఎంతో పట్టుదల, క్రమశిక్షణతో నేర్చుకుని ప్రజల ముందు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బ్లేడు ముక్కను అమాంతంగా మింగేసి, ప్రేక్షకులను అబ్బురపరిచేవారు రమణారెడ్డి. ఆయన చేసే ఈ రిస్కీ మేజిక్‌ను అప్పట్లో ఎంతో ఉత్కంఠగా చూసేవారట. ఇంకా పలు వస్తువులతో ఆయన మేజిక్ చేసేవారు. వెండితెరపైన ఆయన ‘అక్కాచెల్లెలు’ చిత్రంలో మెజిషియన్‌గా చేశారు. ఆయన కలం ఓ మేజిక్: ఆరుద్ర వాడే కలానికి ఏదో మేజిక్ ఉంది. ఆ కలం నుంచి జాలువారిన ప్రతి కవితా, పాటా ఓ మేజిక్కే. అదే కలంతోనే ఆయన మేజిక్ చేసేవారు. ఇష్టమైన పువ్వు పేరు తల్చుకోమని అడిగేవారట. ఆ తర్వాత పేపర్ మీద పెన్నుతో ఏదైనా రాసి, వాసన చూడమనేవారట ఆరుద్ర. వాసన చూడగానే ఆ పువ్వు తాలూకు పరిమళం ముక్కుపుటాలను తాకేదని ఆ అనుభూతి పొందినవారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ముక్కలతో మేజిక్: హాస్యం అపహాస్యం కాకుండా కుటుంబమంతా కలిసి ఆస్వాదించదగ్గ చక్కని కామెడీ చిత్రాలను అందించిన జంధ్యాల నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉండేవారు. జంధ్యాల చమత్కారాలు బాగుంటాయని ఆయన స్నేహితులు అంటుంటారు. అలాగే, తీరిక చిక్కినప్పుడు పేకముక్కలు, అగ్గిపుల్లలతో ఆయన బోల్డన్ని మేజిక్కులు చేసేవారనీ అవన్నీ రసవత్తరంగా ఉండేవని చెబుతుంటారు. జంధ్యాల తీసే సినిమాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఆయన మేజిక్ కూడా అదే విధంగా ఉండేదట. భలే మాయలోడు: వెండితెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించే రాజేంద్రప్రసాద్‌కి మేజిక్ తెలుసు. ‘మాయలోడు’ సినిమాలో బోల్డన్ని మాయలు చేసిన రాజేంద్రుడు నిజంగా కూడా కొన్ని మేజిక్‌లు చేస్తుంటారు. మేజిక్ అంటే తనకు వచ్చిన కళను చేసుకుంటూ పోవడం కాదు. కొన్ని చమత్కారాలు జోడించాలి. హావభావాలు పలికించాలి. వీటిలో దిట్ట అయిన రాజేంద్రప్రసాద్ చేసే మేజిక్స్ భలే పసందుగా ఉంటాయట. రబ్బర్ బ్యాండ్స్‌తో: ఆడవాళ్లు జడలకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లే శరత్‌బాబు మేజిక్‌కి ఆయుధాలు. వాటితో శరత్‌బాబు చేసే మేజిక్కులు వీక్షకులను అబ్బురపరుస్తాయి. శరత్‌బాబుకి ఉన్న ఈ ప్రతిభ తెలుసుకుని, ఆయన్ను కదిలిస్తే... రబ్బర్ బ్యాండ్స్‌తో బోల్డన్ని ప్రదర్శనలు ఇస్తారట. - డి.జి. భవాని -
శ్రీశ్రీ చెప్పిన జోక్...
శ్రీశ్రీ చెప్పిన జోక్... ప్రముఖుల హాస్యం శ్రీశ్రీ అనగానే పోటెత్తిన ఆవేశం గుర్తుకు వస్తుంది. పిడికిలి బిగిసిన చప్పుడు వినిపిస్తుంది. కవిత్వం త్రినేత్రమైన సందర్భాలు గుర్తుకు వస్తాయి. కవిత్వంలో సరే, వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఎలా ఉండేవారు? రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండేవారు! అని అనిపిస్తుంది గానీ ఆయనలో చల్లని చమత్కారం ఎక్కువ. సందర్భానుసారంగా హాస్యాన్ని పుట్టించడంలో శ్రీశ్రీ దిట్ట. ఒక ప్రసంగంలో శ్రీశ్రీ చెప్పిన జోక్... ‘‘ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారనుకుంటాను. డాక్టర్ల మీద ఒక జోక్ ఉంది. ఇది నా జోక్ కూడా కాదు. కృష్ణశాస్త్రిగారిది. జోక్స్ అంటే నిజానికి హర్ట్ కాకూడదు. న్యాయంగా తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. కాబట్టి..ఐ వుడ్ జస్ట్ లైక్ టు రీ టెల్ ఏ జోక్. ఆయన ఏమన్నారంటే - ‘ఏవండీ ఈమధ్య మీరు వైద్యం మానేసి కవిత్వం మొదలుపెట్టారట నిజమేనా?’ అని ఒక డాక్టర్ని అడిగితే- ‘అవునండీ నిజమే. వైద్యం మానేశాను. కవిత్వం రాస్తున్నాను’ అన్నాడట. ఆయన ‘సరే ఏదైతేనేంలెండి మనుషులను చంపడానికి’ అన్నాడట!’’ మంత్రతంత్రాలపై నియంత్రణ కొత్త చట్టం మంత్రాలకు చింతకాయలు రాలతాయనే ఆశావహులు ప్రతి దేశంలోనూ ఉంటారు. బహ్రెయిన్‌లో మాత్రం వారి సంఖ్య ఎక్కువ. మంత్రాలకు చింతకాయలేమి ఖర్మ... ఆకాశంలో చుక్కలు కూడా రాలతాయనేది వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకమే ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రాజ్యంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ఒకావిడ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి ‘‘నేనంటే నా భర్త గడగడ వణికి పోవాలి. నా మాటకు ఎదురు చెప్పకూడదు’’ అంది. ‘‘భర్తకు పెట్టే భోజనంలో నీ రక్తాన్ని కలుపు’’ అని టెర్రిఫిక్ సలహా ఇచ్చాడు మాంత్రికుడు. ఆమె అలాగే చేసింది. ఆ తరువాత ఏమైంది? ఆమె పిచ్చాసుపత్రిలో ఉంది. మాంత్రికుడు జైల్లో ఉన్నాడు! ‘‘మూఢనమ్మకాల గురించి అవగాహన కలిగించంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది’’ అని నిప్పులు చెరుగుతున్నాడు పార్లమెంట్ సభ్యుడు బుకైస్. నష్టనివారణ చర్యల్లో భాగంగా చేతబడులపై ఉక్కుపాదం మోపడానికి ఇటీవల కఠినచట్టం అమల్లోకి తెచ్చింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఫ్రైడ్ ఫుడ్‌ను ముట్టను ఫుడ్ ఫిలాసఫీ తిండి కలిగితే కండ కలదోయ్... అంటారు. మరి కండలవీరుడు హృతిక్‌రోషన్‌కు ‘తిండి’ గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఆయన ‘ఫుడ్ ఫిలాసఫీ’ ఆయన మాటల్లోనే... ఏం తింటున్నాను... అనేదాని మీద స్పష్టమైన అవగాహన పెంచుకుంటాను. వాటిలో ఉండే పోషకాలను గురించి తెలుసుకుంటాను. ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాకుండా ‘టైమ్ టేబుల్’ను అనుసరిస్తాను. {ఫైడ్ ఫుడ్‌ను ముట్టను. ఎన్నో దేశాల్లో ఎన్నోరకాల వంటకాలు తిన్నా... భారతీయ వంటకాలు అంటేనే ఇష్టం. ఇండియన్ స్టయిల్లో తయారు చేసిన దాల్, చావల్, మటన్, చికెన్, కూరగాయలతో చేసిన వంటకాలు అంటే ఇష్టం. ఇండియన్ కాకుండా నేను ఇష్టపడే ఇతర దేశాల వంటకాలు... ఇటాలియన్, మెక్సికన్, చైనీస్. రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్లను. మనకు బాగా ఇష్టమైన వంటకాల్లో ఆరోగ్యానికి సరిపడనివి ఉండవచ్చు. వాటిని వదులు కోవడం అంటే త్యాగం చేసినట్లు కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు. బుజ బుజ నెల్లూరు ఊరు-పేరు పూర్వం ఉదయగిరిని రాజధానిగా చేసుకుని నెల్లూరు జిల్లాను ఆర్కాట్ నవాబు పరిపాలించేవారు. ఆ సమయంలో నెల్లూరుకు చెందిన ఓ పండితుడు దివాణానికి చేరుకుని తన పాండిత్యంతో నవాబును మెప్పిస్తాడు. ‘ఏం వరం కావాలో కోరుకో’ అనడంతో ఆ పండితుడు నెల్లూరును రాసివ్వమని కోరుకుంటాడు. సరే అంటాడు నవాబు. ఆ సమయంలో మహామంత్రి దేశపర్యటన నిమిత్తం వెళ్లి ఉంటారు. తిరిగి వచ్చిన మహామంత్రికి విషయం తెలుస్తుంది. అత్యంత ఆదాయం వచ్చే నెల్లూరును పండితుడికి రాసిస్తే ఖజానాకు గండిపడుతుందని చెప్తాడు. మంత్రి ఆలోచనతో నెల్లూరుకు కూత వేటు దూరంలో ఓ పది గుడిసెలు నిర్మించి ఆ ప్రాంతానికి ‘బుజ్జి నెల్లూరు’ అని పేరు పెట్టి పండితుడికి రాసిస్తాడు. కాలక్రమేణా బుజ్జినెల్లూరు బుజబుజనెల్లూరుగా మారిందని చెబుతారు. - కారణి మురళీకృష్ణ , నెల్లూరు గమనిక: కొన్ని ఊర్ల పేర్లు, వాడల పేర్లు విచిత్రంగా ఉంటాయి. అయితే వాటి వెనుక ఏదో ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. మీకు తెలిసిన అలాంటి ఊరు వాడల పేరు వెనక కథలను రాసి పంపండి.