శ్రీశ్రీలో మహేశ్‌బాబు? | Mahesh Babu Guest Role in Sri Sri | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీలో మహేశ్‌బాబు?

Published Thu, Jan 14 2016 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

శ్రీశ్రీలో  మహేశ్‌బాబు?

శ్రీశ్రీలో మహేశ్‌బాబు?

చాలా కాలం విరామం తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీ’. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయనిర్మల, నరేశ్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు మెరుపులా కనిపిస్తారనే వార్త ప్రస్తుతం ఫిలిమ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా ‘మనం’లో కనిపించిన తరహాలో, కృష్ణ ఫ్యామిలీ అంతా ఇందులో కనిపించే ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఆ వార్త సారాంశం. మహేశ్ తనయుడు గౌతమ్ కృష్ణ, హీరో సుధీర్‌బాబు కుమారుడు కూడా ఇందులో నటిస్తున్నారట. ఈ వార్తే నిజమైతే అభిమానులకు పండగే పండగ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement