రారండోయ్‌ | Osmania University 100 Years Celebration Starts Tomorrow | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Apr 29 2019 12:56 AM | Last Updated on Mon, Apr 29 2019 12:56 AM

Osmania University 100 Years Celebration Starts Tomorrow - Sakshi

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యనిధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఏప్రిల్‌ 30న ఉదయం 9 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, సాయంత్రం 6 గంటలకు బందర్‌ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరిగే రెండు సభలలో శ్రీశ్రీ రచనల ఎనిమిది పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. కొత్తపల్లి రవిబాబు, అదృష్ట దీపక్, ముత్యాల ప్రసాద్, చెరుకూరి సత్యం, విశ్వేశ్వరరావు, పెనుగొండ లక్ష్మీనారా యణ, అరసవిల్లి కృష్ణ, దివికుమార్, వరప్రసాద్, సింగంపల్లి అశోక్‌కుమార్‌ పాల్గొంటారు. వివరాలకు: 9246277375

  • ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ శతాబ్ది సంబరాల సందర్భంగా ఏప్రిల్‌ 29న ఉదయం 10 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాలలో తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఆచార్య ఎస్‌. రామచంద్రం, డా. కె.వి. రమణాచారి పాల్గొంటారు.
  •  శ్రీశ్రీ జయంతి మరియు మేడే సందర్భంగా ఏప్రిల్‌ 30న సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం, శ్రామిక కవిత పుస్తకావిష్కరణ జరుగుతుంది. నిఖిలేశ్వర్, కె.శివారెడ్డి, శిలాలోలిత, వల్లభాపురం జనార్దన్, కె.ఆనందాచారి, కె. చంద్రమోహన్‌ పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహితి.
  •  శ్రీశ్రీ 110 జయంతి వత్సర సందర్భంగా ఏప్రిల్‌ 30న సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ‘శ్రీశ్రీ సినీ గీత జలపాతం’ జరుగుతుంది. ఎల్‌.ఆర్‌. స్వామి, డా. డి.వి. సూర్యారావు, రాంభట్ల నృసింహశర్మ పాల్గొం టారు. నిర్వహణ: మొజాయిక్‌ సాహిత్య సంస్థ.
  • సాహితీ మిత్రులు, విజయవాడ ఆధ్వర్యంలో మే 1న సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రజాశక్తినగర్‌లోని శిఖర స్కూలు నందు ‘కవిత 2018’ ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కర్త: గిరిధర్‌ అరసవల్లి. నిర్వహణ: శ్రీరామ్, అనిల్‌ డ్యాని.
  • డా. వైరాగ్యం ప్రభాకర్‌ సంపాదకత్వంలో రూపొందిన ‘అమ్మ నాన్న ఓ కవిత’ పుస్తకావిష్కరణ మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. దాస్యం సేనాధిపతి, పొట్లూరి హరికృష్ణ, పొత్తూరు సుబ్బారావు, దాస్యం లక్ష్మయ్య పాల్గొంటారు. నిర్వహణ: ఉదయ సాహితి, కరీంనగర్‌.
  •  ‘కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి నిర్వహణ కమిటి’ ఆధ్వర్యంలో మే 26న ఆదివారం నాడు విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణ ఉద్యమం, సాహిత్యం ప్రాసంగికతపై ప్రామాణిక రచనలతో వ్యాస సంకలనం వేయాలని  ప్రజాశక్తి బుక్‌హౌస్‌ నిర్ణయించింది. రచయితలు తమ వ్యాసాలను పంపవలసిన చివరి తేదీ మే 10.  వివరాలకు ఫోన్‌: 9490099057;

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement