osmaniya
-
రారండోయ్
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యనిధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఏప్రిల్ 30న ఉదయం 9 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, సాయంత్రం 6 గంటలకు బందర్ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో జరిగే రెండు సభలలో శ్రీశ్రీ రచనల ఎనిమిది పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. కొత్తపల్లి రవిబాబు, అదృష్ట దీపక్, ముత్యాల ప్రసాద్, చెరుకూరి సత్యం, విశ్వేశ్వరరావు, పెనుగొండ లక్ష్మీనారా యణ, అరసవిల్లి కృష్ణ, దివికుమార్, వరప్రసాద్, సింగంపల్లి అశోక్‌కుమార్ పాల్గొంటారు. వివరాలకు: 9246277375 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ శతాబ్ది సంబరాల సందర్భంగా ఏప్రిల్ 29న ఉదయం 10 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఆచార్య ఎస్. రామచంద్రం, డా. కె.వి. రమణాచారి పాల్గొంటారు. శ్రీశ్రీ జయంతి మరియు మేడే సందర్భంగా ఏప్రిల్ 30న సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం, శ్రామిక కవిత పుస్తకావిష్కరణ జరుగుతుంది. నిఖిలేశ్వర్, కె.శివారెడ్డి, శిలాలోలిత, వల్లభాపురం జనార్దన్, కె.ఆనందాచారి, కె. చంద్రమోహన్ పాల్గొంటారు. నిర్వహణ: తెలంగాణ సాహితి. శ్రీశ్రీ 110 జయంతి వత్సర సందర్భంగా ఏప్రిల్ 30న సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ‘శ్రీశ్రీ సినీ గీత జలపాతం’ జరుగుతుంది. ఎల్.ఆర్. స్వామి, డా. డి.వి. సూర్యారావు, రాంభట్ల నృసింహశర్మ పాల్గొం టారు. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ. సాహితీ మిత్రులు, విజయవాడ ఆధ్వర్యంలో మే 1న సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రజాశక్తినగర్‌లోని శిఖర స్కూలు నందు ‘కవిత 2018’ ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కర్త: గిరిధర్ అరసవల్లి. నిర్వహణ: శ్రీరామ్, అనిల్ డ్యాని. డా. వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో రూపొందిన ‘అమ్మ నాన్న ఓ కవిత’ పుస్తకావిష్కరణ మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. దాస్యం సేనాధిపతి, పొట్లూరి హరికృష్ణ, పొత్తూరు సుబ్బారావు, దాస్యం లక్ష్మయ్య పాల్గొంటారు. నిర్వహణ: ఉదయ సాహితి, కరీంనగర్. ‘కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి నిర్వహణ కమిటి’ ఆధ్వర్యంలో మే 26న ఆదివారం నాడు విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణ ఉద్యమం, సాహిత్యం ప్రాసంగికతపై ప్రామాణిక రచనలతో వ్యాస సంకలనం వేయాలని ప్రజాశక్తి బుక్‌హౌస్ నిర్ణయించింది. రచయితలు తమ వ్యాసాలను పంపవలసిన చివరి తేదీ మే 10. వివరాలకు ఫోన్: 9490099057; -
రాష్ట్రమంతా పీజీకి ఒకే ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యు యేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ చాన్స్లర్ల (వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లోని 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు వేర్వేరుగా పీజీ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కేయూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా..తెలంగాణ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉస్మానియా వర్సిటీయే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థిక భారంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా రెండు యూనివర్సిటీలపైనా నిర్వహణ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పీజీ ఎంట్రెన్స్ నిర్వహించాలన్న ఆలోచనన ఎప్పటినుంచో ఉన్నత విద్యామండలి మదిలో ఉంది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి అన్ని వర్సిటీల వీసీల ఆమోదముద్ర పడింది. రానున్న విద్యా సంవత్సరంలో (2019–20) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించే బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్షకు చైర్మన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంను నియమించారు. కమిటీలో మిగతా వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఎంట్రెన్స్ టెస్టు కన్వీనర్‌ను నియమించే బాధ్యతను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రంకు అప్పగించారు. -
కేయూ వీసీ మనోడే
ఆర్.సాయన్నది కొరట్పల్లి రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌గా నియామకం డిచ్పల్లి : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఆయన డిచ్పల్లి మండలం కొరట్పల్లికి చెందినవారు. సోమవారం వీసీగా ఉత్తర్వులు వెలువడగా.. అదే రోజు కేయూలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేయూలో మూడేళ్లపాటు వీసీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జూనియర్ లెక్చరర్ నుంచి.. కోరట్పల్లికి చెందిన ఆర్.సాయన్న 1955 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా, 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1991 నుంచి 1999 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి కొద్దికాలం క్రితం రిటైరయ్యారు. ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్‌డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో బోధించారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనాlపత్రాలను సమర్పించారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. పరిపాలనానుభవం.. 1991లో సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చూశారు. అకడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000 వరకు వ్యవహరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యుడి, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడు పనిచేశారు.