'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం' | Mahesh babu, Gautham cameo roles in krishna come back film sri sri | Sakshi
Sakshi News home page

'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'

Published Sat, Jan 16 2016 10:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'

'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'

అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మనం. తెలుగు తెర మీద సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఈ సినిమా, నటవారసత్వం కొనసాగిస్తున్న చాలా మంది హీరోలకు ఇన్సిపిరేషన్గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా కుంటుబాల నుంచి ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నారు అభిమానులు. అలా ఫ్యామిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానుల కోరిక తీరనుందన్న టాక్ వినిపిస్తోంది.

లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్రోల్లో నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి, కృష్ణ సతీమణి విజయనిర్మల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, మహేష్ తనయుడు గౌతమ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిత్రయూనిట్ కన్ఫామ్ చేయకపోయినా శ్రీ శ్రీ సినిమాలో ఘట్టమనేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కనిపించనున్నారని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement