‘‘సినీ పరిశ్రమలో విజయవంతంగా 52 ఏళ్లు పూర్తి చేసుకోవడం హ్యాపీగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలకు, ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రిలీజైన ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వందకోట్ల కలెక్షన్స్‌ను దాటడం మన సక్సెస్. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రూ. 300 కోట్లను దాటుతుందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.
ఇందులో నేను చేసిన ముఖ్యమంత్రి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో 2025 బిజీయస్ట్ ఇయర్. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలనూ తీసుకున్నాను. ‘సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్’ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవిగారి పేరుతోప్రారంభించాం. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్‌లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేశాం.
జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లు నా గురువులు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలగారిని చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్,పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్‌నుప్రారంభించాం. రైటర్ సాయినాథ్‌గారి సహకారంతో ఆయనపై తయారు చేసిన పుస్తకాన్ని అమ్మగారి (దివంగత ప్రముఖ నటి– దర్శకురాలు విజయ నిర్మల) బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 20న లాంచ్ చేస్తాం. ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డ్స్‌ని ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అమ్మ విజయ నిర్మలగారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది నేనే రాయగలను. ఇక ‘చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాలకు పార్టు 2 చేయాలని ఉంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment