సాక్షి, హైదరాబాద్ : సినీ దిగ్గజం విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ముగిశాయి. ఆమె కడచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆమె భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించిన విజయ నిర్మల.. హీరోయిన్‌గా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికి సాధ్యం కాని విధంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment