
సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఆమె మరణం టాలీవుడ్‌కు తీరని లోటంటూ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
హీరో ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. విజయ నిర్మల గారి జీవితం ఎంతో మందికి మార్గదర్శకం, మరెంతో మందికి ఇన్స్పిరేషన్, ఆ మరణవార్త నన్ను కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
(చదవండి : విజయనిర్మల కన్నుమూత)
‘ఇది మా కుటుంబానికి భయానకమైన రోజు. ఓ మార్గదర్శి, ఓ లెజెండ్, మా అమ్మాలాంటి వ్యక్తి విజయనిర్మల దేవుడి దగ్గరకు పయనమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నటి, నిర్మాత మంచు లక్ష్మీ విజయ నిర్మల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయ నిర్మల గారి మరణంలో శోకసంద్రంలో మునిగిపోయిన కృష్ణగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆమె ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. సంపూర్ణ జీవితం అనుభవించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ఆశిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు.
(చదవండి : విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి)