భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్
ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్‌ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారు.
కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది.
చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్
అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాద్‌కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment