శోక సంద్రంలో టాలీవుడ్‌ | Tollywood Pay Condolence To Vijaya Nirmala | Sakshi
Sakshi News home page

శోక సంద్రంలో టాలీవుడ్‌

Published Thu, Jun 27 2019 10:13 AM | Last Updated on Thu, Jun 27 2019 11:42 AM

Tollywood Pay Condolence To Vijaya Nirmala - Sakshi

విజయ నిర్మల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన ఆమెను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
- పవన్‌ కల్యాణ్‌

మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. రీసెంట్‌గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది  పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు.
- జీవితా రాజశేఖర్‌

‘11 సంవ‌త్సరాల‌కే న‌టిగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని త‌న కుటుంబంగా చేసుకున్న మ‌హాన‌టి, గొప్ప ద‌ర్శకురాలు శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి హ‌ఠాన్మర‌ణం విని షాక్‌కి గుర‌య్యాను. తెలుగు సినిమా అంటే మ‌గ‌వారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మ‌హిళా ద‌ర్శకురాలుగా త‌న స‌త్తాచాటిన విజ‌య‌ నిర్మల గారు చ‌రిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతారు’.
- మారుతి

తెల‌గు సినిమా చ‌రిత్రలో ఎంద‌రో ద‌ర్శకులు వారి వారి స‌త్తా చాటుకున్నారు. కాని  మ‌హిళా ద‌ర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డుని  సాధించిన ద‌ర్శకురాలు మాత్రం శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారు ఒక్కరే. సూప‌ర్‌స్టార్ కృష్ణ గారిని, విజ‌య‌నిర్మల గారిని చూస్తే క‌డుపు నిండిపోయేది అంత అందంగా వుండేది వారి జంట‌. అంత అంద‌మైన న‌టి, నిర్మాత‌, ద‌ర్శకురాలు తిరిగిరాని లోకాల‌కి వెళ్ళిపోయారన్న వార్త న‌మ్మలక‌పోయాను.
- నిర్మాత ఉషా మల్పూరి

చిన్న వయ‌సు నుండి మ‌నంద‌రం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారు సినిమాలు చేయ‌టం మొద‌లు పెట్టారు. విజ‌య‌నిర్మల గారికి సినిమా త‌ప్ప వేరే ప్రపంచం లేదు. మ‌హ‌న‌టిగా, గొప్ప ద‌ర్శకురాలుగా, ఉత్తమ నిర్మాత‌గా త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాల భాష‌ల్లో త‌న‌కంటూ ప్రత్యేకత చాటుకున్నారు.
- దర్శకుడు వి.ఐ. ఆనంద్‌

ఐరా క్రియెష‌న్స్ ప్రోడ‌క్షన్‌ నెం 1 గా నిర్మించిన ఛ‌లో చిత్రంలో న‌రేష్ గారు కీల‌క పాత్రలో న‌టించారు. ఆ చిత్ర షూటింగ్‌లో న‌రేష్ గారు శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి గురించి ఎన్నో తెలియ‌ని విష‌యాలు చెప్పారు. విజ‌య‌నిర్మల గారు పేద క‌ళాకారుల‌కి చేసే స‌హాయం.. సినిమా అంటే ఎంతో గౌర‌వం అని.. ముఖ్యంగా త‌న ఫ్యామిలీ హీరోల చిత్రాలు విజ‌యాలు సాధిస్తే ఎలా సంతోష ప‌డ‌తారో.. మ‌రో హీరో చిత్రాలు విజ‌యం సాధిస్తే కూడా అంత‌కి మించి సంతోష ప‌డ‌తారు. తెలుగు సినిమా విజ‌యాల బాట న‌డ‌వాల‌ని ఎప్పూడూ కొరుకుంటార‌ని ఆయ‌న మాతో చెప్పేవారు.
- ఐరా క్రియేషన్స్‌

ఒక వ్యక్తి గురించి ద‌శాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి చేసిన ప‌ని మాత్రమే కాదు వారి గుణం, స్వభావం కూడా అందుకు కారణం. మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌కి త‌న‌వంతు స‌హాయ‌న్ని ఇప్పటికీ శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారు అందిస్తున్నారనే వార్త నా హృద‌యంలో బాగా నాటుకు పోయింది. ద‌ర్శకురాలుగా సినిమాలు చేయ‌ట‌మే కాకుండా పేద క‌ళాకారుల‌కి స‌హ‌యం చేసే గొప్ప ల‌క్షణం ఆమె సొంతం. ఛ‌లో చిత్రంలో న‌రేష్ గారితో న‌టించాను. విజ‌య‌నిర్మల గారి గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా ఇదే ప్రపంచంగా వుండేవార‌ట‌.. ప్రతి వారం ఏ సినిమా విడుద‌ల‌య్యింది. వాటి ఫ‌లితాలు ఎలా వున్నాయ‌నే డిస్కష‌న్ శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారితో వుండేద‌ట అంతలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అంద‌ర్ని ఇలా వ‌దిలి వెళ్ళి పోవ‌టం చాలా దుర‌దృష్టక‌రం.
- హీరో నాగశౌర్య

ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- సీనియర్‌ నటుడు, మాజీ కేంద్రమంత్రి యూవీ కృష్ణంరాజు

వీరితో పాటు నటులు అల్లరి నరేష్‌, నాని, కల్యాణ్ రామ్‌, రానా దగ్గుబాటి, సుశాంత్‌, ఆది, కాజల్‌ అగర్వాల్‌, ఈషా రెబ్బా, నితిన్‌, మంచు విష్ణు, మంచు మనోజ్‌.. దర్శకులు వంశీ పైడిపల్లి, గుణశేఖర్‌, బీవీయస్‌ రవి, అనిల్‌ రావిపూడి.. నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలు సోషల్‌ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement