అలనాటి మేటి నటి, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మలకు చిత్ర పరిశ్రమతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11.40 గంటలకు పార్థివదేహాన్ని నానక్‌రాంగూడలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు.