ప్రతిభకు సాక్షి పురస్కారం | Sakshi Excellence Awards 2017 | Sakshi
Sakshi News home page

ప్రతిభకు సాక్షి పురస్కారం

Published Sun, Aug 12 2018 1:59 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Sakshi Excellence Awards 2017

కె. రామచంద్రమూర్తి, కె.విశ్వనాథ్, కృష్ణ, విజయ నిర్మల, సాక్షి చైర్‌ పర్సన్‌ వై.ఎస్‌.భారతి, రాణీ రెడ్డి

సాక్షి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్‌ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్‌ సినిమాకు విశ్వనాథ్‌గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి కృతజ్ఞతలు. – కృష్ణ

సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్‌గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్‌ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల

కృష్ణగారికి లైఫ్‌టైమ్‌ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్‌ నుంచి ఒక పెద్ద సూపర్‌స్టార్‌గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్‌ ఓనర్‌గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్‌ అడిగారు. ‘సార్‌ డైలాగ్స్‌ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్‌

అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్‌టైమ్‌ డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్‌ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్‌కి చాలా థ్యాంక్స్‌. సినిమా సక్సెస్‌లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు.
– సందీప్‌రెడ్డి వంగా

‘మెల్లగా తెల్లారిందోయ్‌’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్‌ ఉండాలని డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న, నిర్మాత ‘దిల్‌ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్‌ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్‌’ పాటను ఫైనలైజ్‌ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్‌ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి

‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్‌కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రధన్‌ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్‌.– రేవంత్‌

మా టీమ్‌ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్‌ స్ట్రగుల్‌ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్‌ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్‌.  – సంకల్ప్‌ రెడ్డి

‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్‌ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్‌ అయ్యారు. ఎక్స్‌లెన్స్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్‌గారే. సాక్షి మేనేజ్‌మెంట్‌కి, చైర్‌పర్సన్‌ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ

సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్‌బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్‌వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్‌ శంకర్, శేఖర్‌ కమ్ముల, అనిల్‌ రావిపూడి, వేణు శ్రీరామ్‌) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్‌ చేస్తారు. – ‘దిల్‌’  రాజు

సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికీ  తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్‌)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్‌ చేసిన దర్శకుడు హారీష్‌ శంకర్‌గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్‌లో ఒక సైకిల్‌ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్‌పర్సన్‌ భారతి మేడమ్‌కు ధన్యవాదాలు. – రావు రమేశ్‌

భారతిమేడమ్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్‌మెంట్‌ బాగుంటుంది. తన చానల్‌ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్‌ వాయిస్‌ అనే నేను నమ్ముతాను. ఫస్ట్‌ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్‌ రీచ్‌ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్‌ అందరి సక్సెస్‌ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్‌. – శేఖర్‌ కమ్ముల

సాక్షికి థ్యాంక్స్‌. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్‌. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్‌లకు ఇంకా థ్యాంక్స్‌. – సెంథిల్‌ కుమార్‌

విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్‌ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్‌’ రాజు గారు చాలా ప్యాషనైట్‌ ప్రొడ్యూసర్‌. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్‌లో ఉంటుంది. ‘దిల్‌’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్‌ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. స్మైల్‌తో లీడ్‌ చేశారు. కొన్ని సార్లు నేను  షూటింగ్‌కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్‌కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్‌ రిలీజ్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్‌ ది ఇయర్‌ కాదు. మూవీ ఆఫ్‌ ది డెకేడ్‌ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్‌ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్‌బాబు

అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్‌ టు సాక్షి. దర్శకుడు శేఖర్‌ కమ్ములగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శక్తికాంత్‌ కార్తీక్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్‌గారిని ఫస్ట్‌ టైమ్‌ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ

ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి, హీరో విజయ్‌ దేవరకొండ, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్‌. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్‌ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌... థ్యాంక్స్‌ ఎ లాట్‌. – షాలినీ పాండే


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ లిస్ట్‌ 2017
జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ

జీవిత సాఫల్య పురస్కారం:  శ్రీమతి విజయ నిర్మల

మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ చిరంజీవి: (ఖైదీ నంబర్‌ 150)

మోస్ట్‌ పాపులర్‌ మూవీ ఆఫ్‌ ద ఇయర్‌:  బాహుబలి –2

మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల: (ఫిదా)

మోస్ట్‌ పాపులర్‌ యాక్ట్రెస్‌ ఆఫ్‌ ద ఇయర్‌: షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి)

మోస్ట్‌ పాపులర్‌ కమేడియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: అలీ (ఖైదీ నంబర్‌ 150)

స్పెషల్‌ జ్యూరీ అవార్డు: ‘దిల్‌’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు)
 
మోస్ట్‌ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: తమన్‌ (మహానుభావుడు)

డెబ్యూడెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సందీప్‌రెడ్డి (అర్జున్‌రెడ్డి)

మోస్ట్‌ క్రిటికల్లీ అక్లైమ్డ్‌ మూవీ ఆఫ్‌ ది ఇయర్‌: ఘాజీ

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ ఆఫ్‌ ద ఇయర్‌ : సెంథిల్‌ కుమార్‌ (బాహుబలి –2)

మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (ఫీమేల్‌): ఎమ్‌.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా

మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌ ఆఫ్‌ ద ఇయర్‌(మేల్‌) : రేవంత్‌ (తెలిసెనే నా నువ్వే: అర్జున్‌రెడ్డి)

మోస్ట్‌ పాపులర్‌ లిరిసిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి)

ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్‌లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి.


రాహుల్‌ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్‌


వై.ఎస్‌. భారతి, శేఖర్‌ కమ్ముల


‘దిల్‌’ రాజు, సందీప్‌ రెడ్డి


రాహుల్‌ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్‌


‘దిల్‌’ రాజు, డి.సురేశ్‌బాబు


రాశీ ఖన్నా, సంకల్ప్‌ రెడ్డి, వైఈపీ రెడ్డి


అలీ, ‘దిల్‌’ రాజు


కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు 


రావు రమేశ్, డి.సురేశ్‌బాబు


ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి


కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement