Sakshi Excellence Awards
-
నాలుగు అవార్డులు దక్కించుకున్న పుష్ప
-
బెస్ట్ పీపుల్స్ ఛాయిస్ ఆఫ్ ది ఇయర్ గా బలగం మూవీ కి
-
తేజసజ్జాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. అంతా 'హనుమాన్' వల్లే!
-
డైరెక్టర్ సుకుమార్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు
-
అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డ్
-
Sakshi Excellence Awards 2025 : సందడిగా సాగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ (ఫోటోలు)
-
'సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్' (2023–24) అందుకున్న సినీ స్టార్స్ (ఫోటోలు)
-
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
Movie Director Venu: బలగం తర్వాత వచ్చే మూవీ ఎలా ఉంటుంది అంటే..?
-
Sakshi Excellence Awards 2025: మిరాయ్ సినిమా పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ
-
నేడు సాక్షి అవార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు. సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. -
సేవాభావాన్ని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నో రంగాల్లో సేవ చేస్తున్నవారు నిజజీవితంలో తారసపడుతున్నప్పటికీ.. అందులో ఉత్తమమైన వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న ‘సాక్షి’కృషి అద్భుతమని ప్రశంసించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు ‘సాక్షి’మీడియా గ్రూప్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ.. వైఎస్ భారతిరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు.ఈ కృషిని అభినందించాల్సిందే..సమాజంలో ఎలాంటి ఫలాలను ఆశించకుండా సేవచేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని.. ఆ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. వారి జీవితం సమాజంలోని ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎక్సలెన్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ‘సాక్షి’మీడియా గ్రూప్ పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోందని.. ఈ కృషిని అభినందించాల్సిందేనని చెప్పారు.‘‘ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఆషామాషీ కాదు. సేవ చేసేవారిని గుర్తించడం, వారి సేవతో సమాజంలో వస్తున్న మార్పును విశ్లేషించడం ద్వారా విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు అతిపెద్ద సవాలు..’’అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపిక చేసిన విధానం అద్భుతంగా ఉందని జ్యూరీ సభ్యులను అభినందించారు. పదేళ్ల అవార్డుల ప్రదానోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షణ తదితర కేటగిరీలలో తొమ్మిది మందికి గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇక్ఫాయ్ యూనివర్సిటీ డైరెక్టర్లు కె.ఎల్.నారాయణ, కె.ఎస్.వేణుగోపాల్‌రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పోతూరి, సాక్షి సీఈవో, డైరెక్టర్లు, ఎడిటర్ పాల్గొన్నారు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ : మీ అభిమాన తారలకు ఓటేయండి
‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం’ అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరిస్తుంది సాక్షి మీడియా గ్రూప్. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల’ కోసం ఓటింగ్‌ని ఆహ్వానిస్తోంది. సినిమా రంగంలో వివిధ కేటగిరీలకు అవార్డులను అందించే అవకాశం మీకే ఇస్తుంది. మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అండ్ బెస్ట్ మూవీస్‌ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మేమిచ్చిన కేటగిరీలలో ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలించి మీకు నచ్చిన వారిని నామినేట్ చేయండి. మీరిచ్చే ఓటింగ్‌తో విజేతలను ప్రకటించి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తో వారిని సత్కరించడమే కాకుండా విన్నర్స్ ఎంపికలో పాల్గొన్న వారిని లక్కీ డ్రా తీసి అతిరథ మహారథుల సమక్షంలో జరిగే ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్లో మీరు పాల్గొనే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మీ అభిప్రాయాన్ని మా వాట్సాప్ నెంబర్ 8977738781 ద్వారా కూడా తెలియజేయొచ్చు.ఓటింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 Party 2
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 Party 1
-
'సాక్షి ఎక్సలెన్స్' అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
Sakshi Excellence Awards 2023 : కన్నులపండువగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు (ఫొటోలు)
-
ప్రతిభా పురస్కారాల సాక్షిగా..
'నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. పూట గడవని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... అలాగే పిన్న వయస్సులోనే ప్రతిభ చూపేవారు... తమ ప్రతిభను సమాజ హితం కోసం... దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు... ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు ఎందరో... ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... సత్కరించి గౌరవిస్తోంది. ఇందులో భాగంగా 9వ ఎడిషన్‌కు సంబంధించిన ‘సాక్షి’ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో నవంబర్ 16, గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.' లాన్స్‌నాయక్ బొగ్గల సాయి తేజస్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) చిత్తూరుజిల్లాలోని ఎగువ రేగడ పల్లి గ్రామానికి చెందిన యువతేజం బొగ్గల సాయితేజ బాల్యం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌లో ఆర్మీజవాన్ గా చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. స్వల్పకాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయితేజ. అతని శక్తియుక్తులను గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్... ఆయనను తన వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. అయితే... అనూహ్యంగా 2021 డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సోదరుడు మహేష్ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్ లాన్ ్స నాయక్ సాయితేజకు సెల్యూట్ చేస్తూ సాక్షి ఎక్సలెన్ ్స – మరణానంతర పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది సాక్షి మీడియా గ్రూప్. తల్లిదండ్రుల స్పందన: మా సాయితేజ చిన్నప్పటి నుంచే దేశం గురించి ఆలోచించేవాడు. దేశసేవ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనే సొంతంగా వెళ్లి ఆర్మీలో సెలక్ట్ అయ్యాడు. అక్కడ దేశం కోసం అమరుడయ్యాడు. కొడుకు మీద మీద ప్రేమతో గుడికట్టి, మేమూ ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాం. ఈ అవార్డు మాకు నిత్య స్మరణీయం. పంతంగి భార్గవి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (ఎడ్యుకేషన్) పంతంగి భార్గవి తండ్రి ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చదువుల తల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పట్టి చిక్కుప్రశ్నలు పరిష్కరించే మెళకువలను ఆకళింపు చేసుకుంది భార్గవి. కరోనా మహమ్మారి విరుచుకుపడినా మనోధైర్యం కోల్పోకుండా ఆన్ లైన్ క్లాసుల ద్వారా సాధన కొనసాగించింది. జేఈఈ అడ్వాన్ ్సడ్ ఎగ్జామ్‌లో ర్యాంక్ సాధించి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్‌లో చేరింది... సాధన చేస్తే సాధ్యం కానిదేమీ లేదని నిరూపించిన భార్గవిని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎడ్యుకేషన్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. భార్గవి సోదరి స్పందన: మా అమ్మానాన్న మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను బీటెక్ చేసి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు. చెల్లికి ఇంత గొప్ప పురస్కారం లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. పార్టిసిపేటరి రూరల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ (ప్రొ. ఎస్వీ రెడ్డి, ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది పార్టిసిపేటరి రూర ల్ డెవలప్మెంట్ ఇన్షియేటివ్ సొసైటీ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయం, పర్యావరణం, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మెళకువలు నేర్పిం చి, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు పది వేల నుంచి 25 వేల వరకు అధికంగా ఆదాయం చేకూరుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఈ సొసైటీ ని ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం లాభదాయకమే. ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త వంగడాలతో శ్రద్ధగా సేద్యం చేయాలి. రైతులకు నేను చెప్పే మాట ఒక్కటే... ‘రసాయన ఎరువులకు బదులు గ్రీన్ లేబుల్ ఉన్న పెస్టిసైడ్స్‌ని వాడాలి’. తెలుగు నేలకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చిన ఈ అవార్డు అమ్మ ప్రశంసలా ఉంది. కేడర్ల రంగయ్యఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కొమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ... తన ఇద్దరు పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషిఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280 కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. సామాజిక రుగ్మతలైన బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్‌షాపులు తొలగింపు కోసం నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల భవితకు పాటుపడుతున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎక్సలెన్్స ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: పిల్లలను చైతన్యవంతం చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చన్నది నా ఆలోచన. నాకు భార్య çసహకారం ఉంది. సాక్షి పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని సాధిస్తా. సునీల్ యల్లాప్రగడ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) కాంపోజిట్ మెటీరియల్స్‌తో సరికొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. రైల్వేస్, ఆటోమోటివ్, విండ్, మెరైన్, డిఫెన్ ్స తదితర సంస్థలకు అవసరమైన డిజైన్, టూలింగ్, కాంపోజిట్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తోంది. ట్రియోవిజన్ ఉత్పత్తులు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రసాయనాలు, మంటల నుంచి రక్షణ కల్పిస్తాయి. తుప్పుపట్టవు. దేశీయంగానే కాకుండా గ్రీస్, యుఏఈ, నైజీరియా తదితర దేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ట్రియోవిజన్ . కాంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ యల్లాప్రగడను సాక్షి స్మాల్ / మీడియం స్కేల్ – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: మేం తయారుచేస్తున్న ఉత్పత్తులను స్వదేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సాక్షి మీడియా సంస్థ సత్కరించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొమెర అంకారావు (జాజి) ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఇండివిడ్యువల్) పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావుకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రోజూ అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం... మొక్కలు నాటడం అలవాటు. అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేయడం, వేసవిలో మొక్కలకు నీళ్లుపోసి సంరక్షించడం, వారంలో నాలుగు రోజులు అడవుల్లోనే సంచరించడం, రెండురోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం అభిరుచులు. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పంట పండించి పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. అంకారావు నిస్వార్థ సేవకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వన్యప్రేమికుడైన అంకారావు ఉరఫ్ జాజిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: ఈ పని చేస్తే అవార్డులు వస్తాయని కూడా తెలియదు. సుచిర్ ఇండియా నుంచి సంకల్పతార, దయానంద సరస్వతి సంస్థ నుంచి వృక్షమిత్ర, చెన్నై ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్æ పురస్కారాలందుకున్నాను. అవార్డులు వస్తాయని పనిచేయలేదు, అవార్డులు రాకపోయినా పని ఆపను. డాక్టర్ చినబాబు సుంకవల్లి (ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్) క్యాన్సర్ సోకి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు డాక్టర్ చినబాబు సుంకవల్లి. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ ముప్పు తప్పించవచ్చనే ఆలోచనతో 2013లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆర్థికస్తోమత లేని రోగులకు అవసరమైన వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మురికివాడలు, పల్లెలు, పట్టణాలు, గిరిజన తండాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది ఈ ఫౌండేషన్. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు లక్షమందికి వైద్య పరీక్షలు చేశారు. క్యాన్సర్ రోగులకు తనవంతు సేవ చేస్తున్న సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లిని సాక్షి ఎక్సలెన్ ్స ఇన్ హెల్త్ కేర్ అవార్డ్‌తో పురస్కరించింది. పురస్కార గ్రహీత స్పందన: వైద్యరంగంలో చికిత్స మాత్రమే కాదు, అంతకుమించిన సేవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ధైర్యం చెప్పి సాంత్వన కలిగించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చైతన్యవంతం చేయడం వంటివి. మా సేవలను గుర్తించి సాక్షి ఇచ్చిన ఈ అవార్డు రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుంది. నెలకుర్తి సిక్కిరెడ్డి (యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్) తన ఆటతీరుతో జాతీయ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న నెలకుర్తి సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు. తల్లి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు పేరెంట్స్. ఆమెకు బ్యాడ్మింటన్‌లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోరమైన శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్పకాలంలోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. 2007లో కెరీర్లో తొలి అంతర్జాతీయ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో పాల్గొంది. బ్యాడ్మింటన్ లో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడల్లో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్ ్స యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కెరీర్ మొదలు పెట్టిన తొలిరోజుల్లో ప్రారంభమైన సాక్షి, మొదటి నుంచి నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రతి అవార్డూ దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిదే. సాక్షి పురస్కారం అర్జున అవార్డు మరోసారి అందుకున్నంత ఆనందాన్నిస్తోంది. జాస్పర్ పాల్ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల జాస్పర్పాల్.... 2014లో ఒక ఘోర రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అది దేవుడు తనకు ఇచ్చిన పునర్జన్మగా భావించిన జాస్పర్ ఆ క్షణమే ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. నిలువ నీడ లేని వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 2017లో సెకండ్ ఛాన్ ్స ఫౌండేషన్ స్థాపించారు. పుట్‌పాత్‌లపై నిస్సహాయంగా పడి ఉన్న వృద్ధులను చేరదీసి.. జీవిత చరమాంకంలో వారికి ఊరట కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి ఆశ్రయం కల్పించారు. 300 మందిని తిరిగి వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. హైదరాబాద్‌లో జాస్పర్ నిర్వహిస్తున్న షెల్టర్‌హోమ్స్‌లో సుమారు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు...ఫ్రీ హాస్పిటల్ ఫర్ ది హోమ్‌లెస్ పేరుతో నిలువ నీడలేని వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న జాస్పర్ పాల్ని సాక్షి యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ అవార్డు వరించింది. పురస్కార గ్రహీత స్పందన: తొమ్మిదేళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. రకరకాల కారణాలతో వృద్ధులను వారి పిల్లలు వదిలేయడం గమనించాను. ఒంటరి వృద్ధులను చూసినప్పుడు బాధగా అనిపించేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలని ఓల్డేజీ హోమ్ ఏర్పాటు ద్వారా ఎందరో వృద్ధులను కాపాడగలిగాను. దీన్ని సాక్షి గుర్తించి అవార్డు ఇవ్వడం... పెద్దల ఆశీస్సులు లభించినంత ఆనందంగా ఉంది. డాక్టర్ పద్మావతి పొట్టబత్తిని ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ వైకల్యం ఆమె అభిరుచిని అడ్డుకోలేకపోయింది. సంకల్పం ఆమెకు కొత్తదారి చూపింది. ఆవిడే పద్మావతి పొట్టబత్తిని. పసితనంలో పోలియో బారినపడ్డా, చెక్కుచెదరని మనోబలంతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తనలోని కళాభిరుచికి రెక్కలు తొడిగి రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్యాంగుల కోసం ఒక సంస్థను ఏర్పాటుచేసి వారికి కంప్యూటర్స్, నృత్యం, సంగీతం, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్న పద్మావతిని పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న పద్మావతిని ఎక్సలెన్ ్స ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: చిన్ననాటి నుంచి ఆర్టిస్టుగా ఉండటం వల్ల నాలాగా కళాకారులు అవ్వాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలనుకున్నాను. నేను ఎదుర్కొన్న సమస్యలు మిగతావారు ఫేస్ చేయకూడదని వారికి మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నా కృషిని గుర్తించి, ఈ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉంది. డా. బి. పార్థసారథి రెడ్డి, ఛైర్మన్ (హెటిరో డ్రగ్స్) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ (సుధాకర్ రెడ్డి, హెటిరో గ్రూప్ డైరెక్టర్) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో ఫార్మాస్యూటికల్స్ తమ విభిన్నమైన ఉత్పత్తులతో పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ పరంగా దేశవిదేశాల్లో విశేషమైన గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే డ్రగ్స్‌ను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్ చికిత్సలో వినియోగించిన ఔషధాలను పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధాల ఉత్పత్తికి అంకితమై, విశేష కృషి చేస్తున్న హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా. బి.పార్థసారథి రెడ్డిని బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ లార్జ్‌స్కేల్ అవార్డుతో సత్కరించింది సాక్షి. స్పందన: (సుధాకర్ రెడ్డి, డైరెక్టర్, అవార్డు అందుకున్నారు) మా వంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన ఔషధాల తయారీలో ముందుంటున్నాం. అదే నిబద్ధతతో ప్రయోగాలను కొనసాగిస్తూ మందులను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (కార్పొరేట్) (ఎమ్.వెంకట నారాయణ రెడ్డి, సీఈవో) వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం నెక్ట్స్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ... క్లీన్ఎనర్జీతో ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణాకోర్సుల నిర్వహణతోపాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్ ఆఫ్– గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న నెక్స్ట్ ఎరా ఎనర్జీ రీసోర్సెస్ ప్రతినిధి ఎస్. వెంకట నారాయణరెడ్డిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ – కార్పొరేట్ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: సాక్షి సంస్థ మా సర్వీస్‌ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఊహించని సంతోషం. సేవ చేసే వారిని గుర్తించి గౌరవించడం పెద్ద బాధ్యత. సాక్షి అంత పెద్ద బాధ్యతను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయం. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ) (ఉదయ్ పిలాని, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మోయినాబాద్. హానికారకమైన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీ సైక్లింగ్ చేయడం అనే బృహత్కార్యాన్ని తన భుజాన వేసుకుంది ఈ క్లబ్. గత పదేళ్లుగా విశాఖలోని బీచ్, అపార్ట్మెంట్స్, మార్కెట్ ప్రాంతాల్లో ఇండియా యూత్ ఫర్ సొసైటీతో కలిసి జీవీఎం సహకారంతో ఒక ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్‌షాప్స్ ఫలితంగా ప్రజల్లో ఆశాజనకమైన మార్పు అంకురిస్తోంది. పుడమితల్లిని కాపాడుకునేందుకు తోడ్పాటునందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ పిలానిని ఎక్సలెన్ ్స ఇన్ ఎన్విరాన్ మెంట్ కన్సర్వేషన్ – ఎన్జీవో అవార్డ్‌తో సత్కరించింది సాక్షి. పురస్కార గ్రహీత స్పందన: పర్యావరణంపై చూపే ప్రేమ ఈ రోజు ఇంతమంది ముందుకు తీసుకువచ్చింది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు సత్కారం మా రోటరీ క్లబ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ అవార్డు ఒక మైల్స్టోన్ లాంటిది. కృష్ణ కుమ్మరి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు యువశాస్త్రవేత్త కృష్ణ కుమ్మరి. స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం...దానికితోడు చిన్నతనంలో సోకిన పోలియో. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ... తిరుపతిలో డిప్లొమో, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ఇక చాలు అనుకోలేదు... 2018లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. చంద్రయాన్ – 3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ విభాగంలో పనిచేసి ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్ 3 ప్రయోగంతో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కృష్ణని యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్. పురస్కార గ్రహీత స్పందన: ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఇస్రో వరకు వెళ్లాను. కానీ, అవార్డులు నన్ను వరిస్తాయని ఊహించలేదు. ఇంత గొప్ప వేదికపైన సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్గీయ సి.ఆర్. రావు తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ పద్మ విభూషణ్ డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావ్... కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎం.ఎ. స్టాటిస్టిక్స్ చదివి... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్లో డైరెక్టర్‌గానూ, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించి 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్ ్స పురస్కారాన్ని అందుకున్నారు. భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్–2023 అవార్డును అందుకున్నారు సీఆర్ రావు. 102 ఏళ్ల వయసులో ఇటీవలే తుదిశ్వాస విడిచారు. గణాంక శాస్త్రంలో ఆయన అందించిన విశేషమైన సేవలను స్మరించుకుంటూ ఎక్సలెన్ ్స ఇన్ ఎన్ ఆర్ఐ అవార్డ్‌తో గౌరవించింది సాక్షి మీడియా గ్రూప్. డాక్టర్ సిఆర్ రావు మేనల్లుడు డాక్టర్ యు.యుగంధర్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ –ఏఐఎమ్ఎస్సిఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్) అవార్డును స్వీకరించారు. -
ఆనందం.. భావోద్వేగం ‘సాక్షి’గా...
ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డు ఎవరికైనా బోలెడంత ఆనందాన్నిస్తుంది. ఎక్సలెన్స్‌ని అభినందిస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్ పలువురు చిత్రరంగ ప్రతిభావంతులకు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులు అందించినప్పుడు అవార్డు గ్రహీతల్లో ఆ ఆనందమే కనిపించింది. నవంబర్ 16న ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల వేడుక ఆనందం,భావోద్వేగాలతో సంబరంగా జరిగింది. ఆ వేడుక విశేషాలు ఈ విధంగా... కైకాల లక్ష్మీనారాయణ, శ్యామలా దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, వాడ్రేవు పద్మావతీ దేవి, వై.ఎస్. భారతీ రెడ్డి, స్రవంతి, ఆదిశేషగిరి రావు ► మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకంటే నా తొలి చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలై 55 ఏళ్లయిన సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. కళలు, కళాకారుల పట్ల ‘సాక్షి’ ఎంతో ఔన్నత్యంతో వ్యవహరిస్తుందనడానికి ప్రతీక ఈ పురస్కారాలు. ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నందుకు నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో సంతోషపరిచింది. – ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి (జీవన సాఫల్య పురస్కారం) ► నా భర్త మహేశ్ (మోస్ట్ పాపులర్ యాక్టర్ – ‘సర్కారువారి పాట’) గారి తరఫున ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు గ్రూప్‌కి, జ్యూరీ మెంబర్స్‌కి థ్యాంక్స్. ఈ గుర్తింపు, గౌరవం ఇచ్చిన మా ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. – నమ్రతా శిరోద్కర్ ► ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులవేడుకకు నేను హాజరు కావడం ఇదే తొలిసారి. నైన్త్ ఎడిషన్ రన్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు. భారతీ మేడమ్‌కి, ‘సాక్షి’కి ధన్యవాదాలు. ‘దిల్’ రాజు అన్నగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మోర్ స్పెషల్. – నిర్మాత అభిషేక్ అగర్వాల్ (క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ – ‘కార్తికేయ 2’) ► ఈ అవార్డు గురించి మాట్లాడే ముందు నేను ఓ ఎమోషనల్ ఘటన గురించి చెబుతాను. ‘బెంగాల్ టైగర్’ సినిమా చేసిన తర్వాత నా చేతిలో సినిమాలు లేనప్పుడు, నేను ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు తిరిగి నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో, రవితేజగారికి ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డుని నేను ఆయనకు అంకితం చేస్తున్నాను. ఏం చేయాలో తెలియని ఓ దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నప్పుడు, ఇక జీవనం కొనసాగించడం చాలా దుర్లభమేమో అనే స్థితిలో... నేను, నా ఫ్యామిలీ ఈ భూమి నుంచి, జనం నుంచి దూరం కావాలని.. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి బాధాకరమైన ఘటన అది. ఆ తర్వాతి రోజు రవితేజగారు ఫోన్ చేసి, ‘ఎక్కడ ఉన్నావ్’ అన్నారు. ‘ఇంట్లో ఉన్నాను సార్’ అన్నాను. ‘వెళ్లి సినిమా చెయ్’ అన్నారు. ఆ సినిమా పేరు ‘ధమాకా’. నేను, నా కుటుంబం ఈ రోజు సజీవంగా ఉన్నామంటే దానికి కారణం మాస్ మహారాజా రవితేజ సార్. ‘సాక్షి’ టీవీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో పాటలు రాశాను. జగన్మోహన్ రెడ్డిగారికి అంకితం చేశాను. అలా నన్ను ప్రోత్సహించినందుకు, జగన్ సార్‌కి, ‘సాక్షి’ మీడియాకి రుణపడి ఉన్నాను. – భీమ్స్ (పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ – ‘ధమాకా’) ► ‘‘నాకు వచ్చిన తొలి అవార్డు ఇది. ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. పాట తల్లి కొంగు పట్టుకుని వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నన్ను ఆదరించిన సినీరంగం, అభిమానించిన ప్రేక్షకులు, నాకు అవకాశాలిచ్చిప్రోత్సహించిన దర్శక–నిర్మాతలు, హీరోలు.. సంగీత దర్శకులు... అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ‘డీజే టిల్లు’లో నాకు పాట రాసే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు రామ్ మిరియాల, దర్శకుడు విమల్ కృష్ణ, హీరో సిద్ధు, నిర్మాతలు చినబాబు, వంశీగార్లకు కృతజ్ఞతలు. మరిన్ని మంచి పాటలు రాస్తాను. – కాసర్ల శ్యామ్ (మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ – ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్) ► ఈ రోజు ఇంతమంది పెద్దల ముందు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్గారంటే నాకు చాలా అభిమానం. అలాంటిది శ్యామలాదేవిగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ‘బింబిసార’లో ఈ పాట (నీతో ఉంటే చాలు... ) పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కీరవాణిగారికి థ్యాంక్స్. ‘సాక్షి’ అవార్డు నాకు చాలా స్ఫూర్తినిస్తుంది.. యాజమాన్యానికి ధన్యవాదాలు. – మోహనా భోగరాజు (మోస్ట్ పాపులర్ సింగర్) ► ఇది నా తొలి అవార్డు. నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని అవార్డులు గెలుచుకున్నా సరే.. ‘డీజే టిల్లు’, ఈ అవార్డు నాకు స్పెషల్. ఈ సినిమాను మేం కరోనా టైమ్‌లో చిత్రీకరించాం. చాలామంది వారి వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టారు. మానసికంగా కాస్త ఒత్తిడికి లోనైనా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్లు ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టకపోయినట్లయితే ఈ అవార్డుతో నేను ఇప్పుడు ఇక్కడ నిల్చునేవాణ్ణి కాను. వారందరికీ థ్యాంక్స్. ‘ఏంటి మీ అబ్బాయి పదేళ్లుగా ఖాళీగా ఉన్నాడా?’ అనే మా చుట్టుపక్కలవారి ప్రశ్నలను భరిస్తూ, నన్నుప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను ఈ కథను చెప్పినప్పుడు, ఈ కథను, నాలోని పిచ్చిని నమ్మి చాన్స్ ఇచ్చిన సిద్ధుకు, నిర్మాతలు చినబాబుగారు, వంశీ అన్న, ముఖ్యంగా త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. – విమల్‌కృష్ణ (డెబ్యుడెంట్ డైరెక్టర్ – ‘డిజే టిల్లు) ► ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ‘సాక్షి’ టీమ్‌కు ధన్యవాదాలు. నా కెరీర్లో తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ నాకు స్పెషల్ ఫిల్మ్. రాజు (‘దిల్’ రాజు)గారికి థ్యాంక్స్. నా తొలి సినిమాకు దర్శకుడు హర్ష కొనుగంటి, అనుపమా పరమేశ్వరన్ చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్న చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ఆశిష్ రెడ్డి (డెబ్యుడెంట్ లీడ్ యాక్టర్ – ‘రౌడీ బాయ్స్’) ► ‘‘మా టీమ్ అందరికీ ‘మేజర్’ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, రిలీజ్ సమయంలో ఎలాంటి ఎమోషన్‌తో ఉన్నామో.. ఇప్పుడూ అదే ఎమోషన్‌తో ఉన్నాం. గ్రేట్ సోల్జర్‌కు మేం చేయగలిగిన ట్రిబ్యూట్‌గా ఈ సినిమా చేశాం. మహేశ్‌బాబుగారు, నమ్రత మేడమ్, శరత్, అనురాగ్, సోనీ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా స్నేహితుడు హీరో అడివి శేష్‌కు. వీరందరూ ‘మేజర్’ సినిమాకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. – శశికిరణ్ తిక్క (క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ – ‘మేజర్’) ► కృష్ణగారు ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా చూసి, నన్ను ఇంటికి పిలిస్తే వెళ్లాను. ‘నీ సినిమా చూశానయ్యా.. బాగా చేశావ్. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్’ అన్నారు. ‘మీ అందం ముందు మాది ఎంత సార్.. మీరు సిమ్లా ఆపిల్లా ఉంటారు’ అని నేను అనగానే ఆయన మురిసిపోయారు. అలాంటి కృష్ణగారి తమ్ముడు ఆది శేషగిరిరావుగారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని అనుకోలేదు. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డ్స్‌కి థ్యాంక్స్. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు నా ఒక్కడిదే కాదు.. నా టీమ్ అందరిదీ. – అలీ (పాపులర్ ఓటీటీ ఫిల్మ్ – (‘అందరూ బాగుండాలి..అందులో నేనుండాలి’) ► ‘‘ఇటీవలే ధనలక్ష్మీ (మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి) గారితో ఓ గంట మాట్లాడాను. ఏంటి శేష్.. నెలకు ఒకసారే మాట్లాడుతున్నావ్.. రెండు నెలలకు ఒకసారే కలుస్తున్నావ్ అన్నారు. బెంగళూరుకు ఏదో ఒక బహుమతితో వస్తానమ్మా అన్నాను. ఈ ‘సాక్షి’ అవార్డు ఓ చక్కని బహుమతి. కొన్ని రోజుల్లో బెంగళూరు వెళ్తున్నాను. సందీప్ అమ్మగారికి ఈ అవార్డు ఇస్తాను. సందీప్ ఉన్నికృష్ణన్ చేసిన త్యాగానికి ఇదొక చిన్న అభినందనలాంటిది. ఆయన దేశం కోసం చేసిన సేవలకు, త్యాగంతో దేశాన్ని నిలబెట్టిన దానికి నేను ఎప్పుడూ థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో.. అలా నేను సందీప్‌గారికి అభిమానిని. ఆయన మంచి మానవతావాది. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్యూ సార్.. జై హింద్. ‘మేజర్’కి నాకు అవకాశం కల్పించిన మహేశ్ సార్, నమ్రత మేడమ్‌లకు, ‘మేజర్’ను ్రపారంభించిన నిర్మాత అనురాగ్‌కు, ఈ జర్నీని నిజం చేసిన దర్శకుడు శశికి థ్యాంక్స్. – అడివి శేష్ (జ్యూరీ స్పెషల్ అవార్డు – ‘మేజర్’) ► నన్ను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ‘సాక్షి’ టీమ్‌కు ధన్యవాదాలు. విజేతలకు శుభాకాంక్షలు. రెండేళ్లుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. క్యాన్సర్‌తో పోరాడాను. ఇప్పుడు నార్మల్‌గా ఉంది. ఈ వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది. త్వరలోనే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను. కెమెరాపై నాకున్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇటీవలే నేను ‘యామిని క్యాన్సర్ ఫౌండేషన్’ను ఆరంభించాను. మహిళల ఆరోగ్యం, జెనెటిక్ కాన్సర్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం. – నటి హంసానందిని ► అవార్డ్స్ ఫంక్షన్స్‌లో గ్రహీతలు అవార్డులు తీసుకున్నప్పుడు ఎమోషనల్ స్పీచ్‌లు ఇస్తే.. దీనికి ఎందుకు ఇంత చేస్తున్నారు? అనుకునేదాన్ని. అలా అనుకున్నందుకు ఇప్పుడు గిల్ట్‌గా ఫీలవుతున్నాను. ఇప్పుడు ఇలా ఓ వేదికపై అవార్డు తీసుకుంటుంటే.. అవార్డులు ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది. ఈ అవార్డుతో ‘మసూద’ సినిమాను నాకు మరింత స్పెషల్‌గా చేసిన ‘సాక్షి’కి, భారతి మేడమ్‌కి ధన్యవాదాలు. ‘గంగోత్రి’ సినిమా (చైల్డ్ ఆర్టిస్ట్) విడుదలై 20 ఏళ్లయింది. ఇప్పుడు బెస్ట్ డెబ్యుడెంట్ లీడ్ యాక్ట్రస్ అవార్డు తీసుకున్నాను. మా దర్శకుడు సాయికిరణ్, తిరువీర్, నిర్మాత రాహుల్గార్లు.. ఇలా టీమ్ అందరికీ «థ్యాంక్స్. ‘మసూద’కు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మాకుప్రోత్సాహాన్నిచ్చింది. – కావ్యా కల్యాణ్‌రామ్ గడచిన ఏడాది నుంచి ఈ ఏడాది వరకూ తెలుగు సినిమా రంగం ఎందరో ప్రముఖులను కోల్పోయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్, ప్రజానటి జమున, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్ నటులు శరత్‌బాబు, చంద్రమోహన్, చలపతిరావు, ఎం. బాలయ్య, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న, నటుడు–నిర్మాత రమేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు వి. సాగర్, రచయిత కందికొండ... ఇలా ఎందరో. వీరి మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి, నివాళులు అర్పించింది ‘సాక్షి’. దివంగత ప్రముఖుల్లోని కొందరి కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. ఈ ప్రత్యేక నివాళి కార్యక్రమంలో పాల్గొన్న వారి స్పందన... ► ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ‘సాక్షి’ సంస్థకి, భారతిగారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాన్నగారితో పాటు ఇక్కడ వీడియోల్లో చాలా మంది పెద్దవాళ్లను చూపించారు. వారిని లేట్ (చనిపోయిన) అనలేం. వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. మీరు ఇచ్చిన ఈ గౌరవం,ప్రోత్సాహం, ప్రేమ, అభిమానానికి మా కుటుంబంలోని అందరం మళ్లీ మళ్లీ ‘సాక్షి’కి, భారతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ ► ఈ అవార్డు కృష్ణగారిది. ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి, వారి టీమ్‌కి కృతజ్ఞతలు, అభినందనలు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో ప్రతి ఏడాది ఒక విశిష్టత కనిపిస్తుంటుంది. కేవలం సినిమా వాళ్లకే కాకుండా ఎన్నో రంగాల వారికి అవార్డులు ఇవ్వడం సంతోషం. నేను ఎన్నో అవార్డు వేడుకలు చూశాను కానీ, తొలి నుంచి ‘సాక్షి’లో వైవిధ్యం ఉంటుంది.. ఇందుకు హృదయపూర్వకంగా వారికి అభినందనలు. – సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత జి. ఆదిశేషగిరి రావు ► ఈ రోజు ‘సాక్షి’, భారతి గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక నా మనసుకు బాగా దగ్గరైంది. ఈ ఏడాది సినీ రంగానికి చాలా పెద్ద నష్టం జరిగింది. అమ్మ కూడా ఈ ఏడాది దూరం అయిపోయారు. ‘నా కళ్ల ముందే ఇంతమంది వెళ్లిపోతున్నారు.. నా టైమ్ ఎప్పుడొస్తుందో’ అంటుండేవారు అమ్మ. అంతేకాదు.. అమ్మ మరో మాట కూడా అనేవారు. ‘ఒక ఆర్టిస్ట్‌కి మరణం ఎప్పుడూ ఉండదు.. తరతరాలుగా వాళ్లని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని. ‘సాక్షి’ అవార్డు అనేది ఆమెకు నిజమైన నివాళి. థ్యాంక్యూ టు సాక్షి. – ప్రజానటి జమున కుమార్తె స్రవంతి ► ఐదేళ్లు వెనక్కి వెళితే.. కృష్ణంరాజుగారు, నేను ఇదే వేదికని అలంకరించాం. ఆయనకి భారతిగారు ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు ఇచ్చారు. అలాగే కృష్ణంరాజుగారి చేతుల మీదుగా రామ్‌చరణ్‌కి, మరికొందరికి అవార్డులు ఇప్పించారు భారతిగారు. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేం. ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నటీనటులకు మరణం లేదు.. ఎందుకంటే ఎంతోమంది అభిమానులను, వారసులను, కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. వీళ్లందరిలోనూ వాళ్లు ఉంటారు. కృష్ణంరాజు, కృష్ణ, వైఎస్ రాజశేఖర రెడ్డిగార్లు... వీళ్లందరికీ మరణం లేదు. అన్ని రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని సత్కరించడం భారతిగారి గొప్పతనం.. సంస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి.. కృష్ణంరాజుగార్ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. కృష్ణంరాజుగారి ఆశయాలు ఎన్నో ఉన్నాయి.. ఆయన వారసుడిగా వాటన్నింటినీ ముందుకు తీసుకెళతాడు మా ప్రభాస్. అలాగే కృష్ణగారి అబ్బాయి మహేశ్ బాబు కూడా ఎంతో మంది చిన్నారుల వైద్యానికి సాయం చేస్తున్నారు. ఇలా వాళ్ల వారసులు మనలోనే ఉన్నారు కాబట్టి వారికి మరణం లేదు. ‘ఒక పత్రికను నడపడం అంటే మామూలు విషయం కాదు.. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది భారతిగారు చాలా సింపుల్‌గా ఉంటూ ఆ సంస్థని ఎంతో ముందుకు తీసుకెళ్లారు.. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి’ అంటుండేవారు కృష్ణంరాజుగారు. ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారతిగారిని కోరుతున్నాను. – రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ► అందరికీ నమస్కారం. నాన్నగారికి ఈ అవార్డు ఇచ్చినందుకు భారతిగారికి, ‘సాక్షి’కి అభినందనలు తెలుపుకుంటున్నాను. – కైకాల సత్యనారాయణ తనయుడు కైకాల లక్ష్మీనారాయణ ► అందర్నీప్రోత్సహిస్తూ ఎన్నో ఏళ్లుగా అవార్డులు ఇస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి ధన్యవాదాలు. కళాకారులైనా, సంఘ సేవకులైనా.. అవార్డులనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందాన్ని ప్రతి ఏడాది అందరికీ పంచుతున్న ‘సాక్షి’కి అభినందనలు. – దర్శకుడు వీవీ వినాయక్ ► విభిన్న రంగాలవారిని ఎంపిక చేసి, అవార్డులు ఇచ్చి,ప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతిగారికి థ్యాంక్స్. ‘కశ్మీరీ ఫైల్స్’తో ఇండియా మొత్తం హల్చల్ చేసిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మా కంటే ఎంతో ముందున్నాడు. గ్రేట్ ఫిల్మ్ ‘మేజర్’. ఇండియా మొత్తం ‘మేజర్’ సినిమాను అప్రిషియేట్ చేశారు. వీరితో పాటు ఇంకా అవార్డు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. – నిర్మాత ‘దిల్’ రాజు ► సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు. – నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) -
Sakshi Excellence Awards: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం. అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతి భావంతులను గుర్తించి 'సాక్షి'ఎ క్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. 'సాక్షి' వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన 'జ్యూరీ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా 'సాక్షి' ఎక్స లెన్స్ అవార్డుల కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2022కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 15, 2023 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించ అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సం స్థల తరపున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి జ్యూరీ ప్రత్యేక ప్రశంస' కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించ డం, సేవలను కొనియాడటం, సాధనను అభి. సందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని 'సాక్షి' అభిలషిస్తోంది. 'సాక్షి' చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23256134 నంబర్‌పై గాని మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com (చదవండి : సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం) కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– NGO యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – NGO -
‘సాక్షి’మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు: కే. విశ్వనాథ్
అగ్ర దర్శకుడు, కళా తపస్వీ కే. విశ్వనాథ్ (92) ఇక లేరనే విషయం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన విశ్వానాథ్.. ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు. 2015లో ఆయనకు ‘సాక్షి’ మీడియా సంస్థ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినే ‘సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును ప్రధానం చేసింది. (చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు) సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దర్శకుడు శేఖర్ కమ్ముల కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరో వైష్ణవ్ తేజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరోయిన్ కృతి శెట్టి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరోయిన్ రష్మిక మందన కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
దర్శకుడు సుకుమార్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం
నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో అక్టోబర్ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు. మరుప్రోలు జస్వంత్ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి) – స్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్‌లోని సుందర్ బని సెక్టార్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు. అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!! మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు. డాక్టర్ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు నాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్ ఫార్మింగ్‌కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సహదేవయ్య–విక్టోరియా : ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ – నవజీవన్ సంస్థ, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది. ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి: ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. యునైటెడ్ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీ¯Œ రెవల్యూష¯Œ నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం. అనిల్ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్ కో గ్రూప్ – ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్కోగ్రూప్. ఈ కంపెనీ అధినేతలు అనిల్ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్‌ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత. పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్‌లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్‌రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్‌ని ఇలాగే కొనసాగిస్తాను. అక్షత్ సరాఫ్ : (రాధా టీఎమ్‌టీ) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ 1960లో శ్రీ రాధేశ్యామ్ జీ షరాఫ్ టి.ఎమ్.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్.టి. కంపెనీ డైరెక్టర్ అక్షత్ షరాఫ్.హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది. ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. పి.జ్ఞానేశ్వర్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్ బ్రిగేడ్‌గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు. ఎర్త్ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్ లీడర్లను తయారు చేయాలనేది నా లక్ష్యం. నిఖత్ జరీన్ : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ బాక్సింగ్ రింగులో పవర్ ఫుల్ పంచ్‌లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది. తను హైదరాబాద్‌లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్ టీమ్‌లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్ కప్‌లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. షేక్ సాదియా అల్మాస్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది. పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ చాంపియన్ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙ డాక్టర్ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లి: యంగ్ అచీవర్ ఆఫ్ ఇది ఇయర్ (ఎడ్యుకేషన్) తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్‌లో ఆరితేరడంతో మాంటెగ్న్ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూనే అమెరికన్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్‌ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి : తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు. వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్ సమయంలో లక్షలాది పేషెంట్లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్ తయారీకి సహకారంలోనూ డాక్టర్ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం. రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్‌కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్‌గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్షిప్ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది. అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్‌కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు. కారింగుల ప్రణయ్: యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) అదిలాబాద్ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం. సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) షీమాక్స్ ఎక్స్పర్ టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది. కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ గ్రీన్ రివల్యూషన్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు. చిన్నాలమ్మ: స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ఫార్మింగ్ కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్‌తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్‌డ్యామ్ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్ డ్యామ్‌లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్‌లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్ స్కాలర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డాక్టర్. నాగేశ్వర్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
లీలా లక్ష్మా రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
దర్శకుడు సుధీర్ వర్మ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పవర్ లిఫ్టింగ్ సదియా అల్మాస్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సాత్విక్ సాయిరాజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
తెలుగు ఎన్నారై రవి పులి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. పరి నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
గ్రీన్కో గ్రూప్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
నవజీవన్ సంస్థ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సుంకరి చిన్నప్పల నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్. కర్రి రామారెడ్డి కి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పాలడుగు జ్ఞానేశ్వర్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
" సాక్షి మీడియా గ్రూప్ ప్రస్థానం " AV వీడియో
-
మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నేషనల్ క్రష్... సోషల్ మీడియాలో వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజే వేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా నటిగా గుర్తింపు దక్కించుకున్న భామ టాలీవుడ్ సినిమాలో తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రంలో ఆమె 'రారా సామి.. బంగారు సామి' అంటూ సాగే పాటతో యూత్‌ను ఊర్రూతలుగించింది. తాజాగా రష్మిక మరోసారి శ్రీవల్లి అవతారమెత్తింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్లో మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టింది. మరో నటి కృతి శెట్టితో కలిసి వేదికపై రారా సామి అంటూ పుష్ప సినిమాను గుర్తుకు తెచ్చింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టిన్గా ఉండే ఈ భామ ఇటీవలే మాల్దీవుల్లో వ్యాకేషన్‌కు వెళ్లి వచ్చింది. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 34 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. ఆమె ఫోటోలు, రీల్స్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప -2'లో నటిస్తోంది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో 'వారిసు', సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను', రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రాల్లో కూడా కనిపించనుంది. రష్మిక ఇటీవలే అమితాబ్ బచ్చన్ సరసన 'గుడ్‌బై'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. Rashmika Mandanna and Krithi Shetty Dance For Saami Saami Song | Watch Sakshi Excellence Awards 2021 on 29 October 2022 at 5PM on Sakshi TV#SakshiExcellenceAwards2021 #SakshiAwards #RashmikaMandanna #KrithiShetty #SaamiSaamiSong #PushpaMovie #AlluArjun @alluarjun @iamRashmika pic.twitter.com/cRFIxXVS09 — Sakshi (@sakshinews) October 29, 2022 -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్‌పర్సన్‌గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2021 సినిమా విభాగం
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2021-సినిమా విభాగం.. నామినేషన్లు ఇలా!
ప్రతిభ, నైపుణ్యం, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీసి గౌరవించి సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. 2021 సంవత్సరానికి సంబంధించి సినిమా విభాగంలో వివిధ కేటగిరీలకు అవార్డులను మీరే ఎంచుకోండి. మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అండ్ బెస్ట్ మూవీస్‌ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మేమిచ్చిన కేటగిరీలలో ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలించి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి వాట్సాప్ ద్వారా జవాబును పంపించండి. మీరిచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతలను ప్రకటించి సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తాం. ఉదా: మీ ఫేవరెట్ యాక్టర్‌ను సెలెక్ట్ చేసి.. Best Actor- హీరో పేరు టైప్ చేసి వాట్సాప్ చేయండి. మీ సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్ నెంబర్: 73311 55521 సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్-2021 (For films released in the year 2021) 1. MOST POPULAR ACTOR ⇒ అల్లు అర్జున్- పుష్ప ⇒ బాలకృష్ణ- అఖండ ⇒ రవితేజ- క్రాక్ ⇒ నాని- శ్యామ్ సింగరాయ్ 2. MOST POPULAR MOVIE ⇒ పుష్ప ⇒ అఖండ ⇒ జాతిరత్నాలు ⇒ శ్యామ్ సింగరాయ్ 3. MOST POPULAR DIRECTOR ⇒ సుకుమార్- పుష్ప ⇒ గోపీచంద్ మలినేని- క్రాక్ ⇒ బొమ్మరిల్లు భాస్కర్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ⇒ కె.వి. అనుదీప్- జాతిరత్నాలు 4. DEBUTANT LEAD ACTOR ⇒ వైష్ణవ్ తేజ్- ఉప్పెన ⇒ ప్రదీప్ మాచిరాజు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ⇒ తేజ సజ్జ- జాంబీ రెడ్డి 5. DEBUTANT LEAD ACTRESS ⇒ జాతిరత్నాలు- ఫరియా అబ్దుల్లా ⇒ పెళ్లిసందడి- శ్రీలీల ⇒ ఉప్పెన- కృతీశెట్టి ⇒ రొమాంటిక్- కేతిక శర్మ 6. DEBUTANT DIRECTOR ⇒ బుచ్చిబాబు సన- ఉప్పెన ⇒ విజయ్ కనకమేడల- నాంది ⇒ అశ్విన్ గంగరాజు- ఆకాశవాణి ⇒ సుజనా రావు- గమనం 7. CRITICALLY ACCLAIMED MOVIE ⇒ లవ్ స్టోరీ- శేఖర్ కమ్ముల ⇒ నాంది- విజయ్ కనకమేడల ⇒ రిపబ్లిక్- దేవ కట్టా 8. CRITICALLY ACCLAIMED DIRECTOR ⇒ శేఖర్ కమ్ముల- లవ్ స్టోరీ ⇒ రాహుల్ సాంకృత్యాయన్- శ్యామ్ సింగరాయ్ ⇒ క్రిష్- కొండ పొలం 9. MOST POPULAR MUSIC DIRECTOR ⇒ దేవిశ్రీ ప్రసాద్- (పుష్ప, ఉప్పెన) ⇒ తమన్- (అఖండ, క్రాక్, వకీల్ సాబ్) ⇒ రథన్- (జాతిరత్నాలు) ⇒ మిక్కీ జె. మేయర్- (శ్యామ్ సింగరాయ్) 10. MOST POPULAR ACTRESS ⇒ సాయి పల్లవి- లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ⇒ రష్మిక- పుష్ప ⇒ శ్రుతీ హాసన్- క్రాక్ ⇒ తమన్నా- సీటీమార్ 11. MOST POPULAR OTT FILM ⇒ సినిమా బండి ⇒ అద్భుతం ⇒ ఆకాశవాణి ⇒ నిన్నిలా నిన్నిలా 12. MOST POPULAR SINGER ( MALE ) ⇒ సిద్ శ్రీరామ్ (శ్రీవల్లి... - పుష్ప) (ఆనందం మదికే... - ఇష్క్) (లెహరాయి... - మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్) ⇒ జావేద్ అలీ (నీ కన్ను నీలి సముద్రం... ఉప్పెన) ⇒ రామ్ మిర్యాల (చిట్టీ... జాతిరత్నాలు) (పుట్టెనే ప్రేమ... గల్లీ రౌడీ) ⇒ శివం (దాక్కో దాక్కో మేక... పుష్ప...ది రైజ్) 13. MOST POPULAR SINGER ( FEMALE ) ⇒ మంగ్లీ (సారంగ దరియా... లవ్ స్టోరీ) (ఊరంతా... రంగ్ దే ) ⇒ ఇంద్రావతీ చౌహాన్ (ఊ అంటావా... పుష్ప... ది రైజ్) ⇒ మోహనా భోగరాజు (మగువా మగువా... వకీల్ సాబ్) (అమ్మ సాంగ్... అఖండ) (నీటి నీటి సుక్కా... టక్ జగదీశ్) ⇒ మౌనికా యాదవ్ (సామి సామి- పుష్ప... ది రైజ్) 14. MOST POPULAR LYRICIST ⇒ చంద్రబోస్ (పుష్ప... ది రైజ్ -సింగిల్ కార్డ్) (పెళ్లి సందడి -సింగిల్ కార్డ్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా (నీలి నీలి ఆకాశం..) (ఈశ్వరా... ఉప్పెన) ⇒ సుద్దాల అశోక్ తేజ (సారంగ దరియా... లవ్ స్టోరీ) ⇒ రామజోగయ్య శాస్త్రి ( మగువా మగువా... వకీల్ సాబ్)- (చిట్టి... జాతిరత్నాలు) ⇒ శ్రీమణి (లెహరాయి... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్) ⇒ మిట్టపల్లి సురేందర్ (నీ చిత్రం చూసి... లవ్ స్టోరీ) ⇒ పెంచలదాస్ (భలేగుంది బాల... - శ్రీకారం) -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రోమో
-
‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు’లకు ఎంట్రీల ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం’ అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల’ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2021కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డులఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు జూలై 10, 2022 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–23256134 నంబర్‌పై గానీ, మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com కేటగిరీలు ఇలా.. ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– ఎన్జీఓ యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
-
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
-
ఈ అవార్డు ఆయనకే అంకితం: స్వేరోస్
-
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
-
Prof B Koteswara Rao Naik: ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా..
-
సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్
-
Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు ‘సాక్షి’
-
Sakshi Excellence Awards అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్ డేనియల్ ఎలమటి
-
Sakshi Excellence Awards: మరింత మందికి సేవ చేసే అవకాశం
-
పేదరికాన్ని నిర్మూలించడంలో ‘నాంది ఫౌండేషన్’ సేవలు భేష్!
-
ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయి
-
జీవితంలో ఇదో గొప్ప గౌరవం
-
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం
-
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. -
‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా డాక్టర్ చావా సత్యనారాయణ
వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. -
సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ ’ అవార్డును లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ స్థాపకుడు సుబ్బు పరమేశ్వరన్ అందుకున్నారు. విద్యార్థి దశలోనే పిల్లలకి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అందించేందుకు నడుం బిగించింది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో అనుసంధానమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సామాజిక, మనోవైజ్ఞానిక బోధనల విధానాలపై ఉపాధ్యాయులకు కూడా ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. 2016లో హైదరాబాద్‌లో ఆవిర్భవించిన ఈ సంస్థ ఇప్పటి వరకు దేశంలోని 200 పాఠశాలలకు చెందిన 13 వందల మంది ఉపాధ్యాయులు, 42,500 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. అందరూ విస్మరించిన ఒక మౌలికమైన సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడం ద్వారా విద్యార్థుల బహువిధ నిపుణతల కోసం లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. గర్వించే క్షణం ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. సాక్షికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు, ప్రైవేటు లో బడ్జెట్ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాం. -
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్‌కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
సేవకు వందనం: ‘యంగిస్తాన్ ఫౌండేషన్’కు సాక్షి పురస్కారం
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్–సోషల్ సర్వీస్’ అవార్డును యంగిస్తాన్ ఫౌండేషన్ స్థాపకుడు అరుణ్ డేనియల్ ఎలమటి అందుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 2014లో హైదరాబాద్‌లో ‘యంగిస్తాన్ ఫౌండేషన్’ ను స్థాపించారు అరుణ్. కోవిడ్ వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తిండి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 20 లక్షల మందికి ఆహారం అందించింది ఈ సంస్థ. నల్లమల అటవీప్రాంతంలో అష్టకష్టాలు పడుతున్న గిరిజన కుటుంబాలకు నెలవారీ వంటసామాను సరఫరా చేశారు. మూగజీవాలకు కూడా ఆహారాన్ని అందించి వాటిపట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా మానసిక ఆరోగ్యం, గృహహింస, లింగవివక్ష, బ్రెస్ట్ క్యాన్సర్ తదితర విషయాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. సేవకు స్ఫూర్తి సేవా రంగంలో ముందుకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాకు చాలా థ్యాంక్స్. ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవడానికి, మరింత మందికి సేవలు అందించడానికి ఈ పురస్కారం స్ఫూర్తిని ఇస్తుంది. – అరుణ్ డేనియల్ కుమార్, యంగిస్తాన్ -
ఈ అవార్డు ఆయనకే అంకితం: స్వేరోస్
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును తెలంగాణ స్వేరోస్ సంస్థ తరపున శాయన్న అందుకున్నారు. చదువు అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడం కాదు. నాలెడ్జ్‌తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, మోరల్ సైన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ వంటి పాఠ్యేతర అంశాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండాలి. అందుకోసమే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఆ స్ఫూర్తితో 1984లో ‘స్వేరోస్’ పేరుతో విద్యార్థులే నిజామాబాద్ లో ఒక బృందంగా ఏర్పడి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్, విలేజ్ లెర్నింగ్ సెంటర్స్, వొకేషనల్ ట్రయినింగ్ సెంటర్స్, స్వేరోస్ సర్కిల్ వంటి వాటి ఏర్పాటుతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది స్వేరోస్. ఆయనకే అంకితం పేదల బతుకుల బాగు కోసం కృషి చేస్తున్న మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి ఈ అవార్డును మాకు అందించారు. దీనికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థలో నన్ను భాగస్వామి చేసినందుకుగాను ఈ అవార్డును ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గారికి అంకితం చేస్తున్నా. – శాయన్న,స్వేరోస్ ఇంటర్నేషనల్ -
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
సాక్షి మీడియా గ్రూప్ అందించిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ పురస్కారాల్లో భాగంగా మోస్ట్ పాపులర్ డైరెక్టర్(ఎఫ్ 2) అవార్డును అనిల్ రావిపూడి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎఫ్ 2’ నా కెరీర్‌కు ఒక గేమ్ చేంజర్లా ఫీల్ అవుతాను. ఈ సినిమా నాకు సర్ప్రైజులు ఇస్తూనే ఉంది. ఇది కూడా (‘సాక్షి’ అవార్డు) ఓ సర్ప్రైజ్. ఈ ప్యాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టి, చక్కగా పని చేసుకుంటున్నాం. ఇలాంటి టైమ్‌లో ‘సాక్షి’ యాజమాన్యం అవార్డ్స్ ఇవ్వటం అనేది మా అందరికీ ఒక బూస్టింగ్‌లా అనిపించింది. నాకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నాకు జంధ్యాలగారు, ఈవీవీగారంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే త్రివిక్రమ్‌గారి సినిమాలు చూసి, ఆయన రాసే స్టైల్, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం. మా జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ వాళ్లు తీసిన సినిమాలు మా మైండ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే ఉంటాయి. ‘థ్యాంక్యూ సో మచ్ సార్.. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
Sakshi Excellence Awards: ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్’ అవార్డును నాంది ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ కె సతీష్ కుమార్ అందుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి నిస్వార్థంగా ఆవిర్భవించినదే.. ‘నాంది’ ఫౌండేషన్. ఎ.పి., తెలంగాణతో సహా దేశంలోని 17 రాష్ట్రాలలో ఇంతవరకు 70 లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ‘నాంది’ 1998లో హైదరాబాద్‌లో ఆవిర్భవించింది. పేదరికాన్ని నిర్మూలించే ఒక శక్తిగా అవతరించింది. ఆదివాసీ వ్యవసాయదారులకు చేయూతనిచ్చి, వారితో చేతులు కలిపి లక్ష మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు తెచ్చింది. ‘అరకు కాఫీ’తో దేశానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది. అల్పాదాయ కుటుంబాల్లోని 4 లక్షల మంది బాలికలకు విద్యను అందించింది. బాధ్యత పెంచింది సాక్షి మీడియా గ్రూప్‌కు, న్యాయ నిర్ణేతల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల విద్యార్ధుల కోసం మేం చేస్తున్న కృషి ఫలాలు మరింత మందికి అందాలని కోరుకుంటున్నాం. – కె. సతీష్ కుమార్, ఆరకు ఫైనాన్స్ మేనేజర్ -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
Sakshi Excellence Awards: సాక్షి మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌కు బెస్ట్ డెబ్యూ యాక్టర్, నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ ‘దొరసాని’ మూవీతోనే టాలీవుడ్‌కి పరిచయం కావడం విశేషం. అవార్డుల గురించి వారి మాటల్లోనే.. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్: ఆనంద్ దేవరకొండ ‘సాక్షి’ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. ‘దొరసాని’ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఈ ప్యాండమిక్‌లో వచ్చిన సినిమాకి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రెండేళ్లలో నాది ఒక సినిమా థియేటర్లో (దొరసాని), ఇంకోటి (మిడిల్ క్లాస్ మెలోడీస్) ఓటీటీలో విడుదలయ్యాయి. ‘దొరసాని’ టీమ్ మధుర శ్రీధర్ సార్, సురేష్ బాబుగారు, కో స్టార్ శివాత్మిక అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చినందకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టీమ్’ అన్నే రవి సార్, డైరెక్టర్ వినోద్, ఆనంద్ ప్రసాద్‌గారు, ఆదిత్యలకు స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చేస్తున్నాను. మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది: శివాత్మిక నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ‘సాక్షి’కి నా కృతజ్ఞతలు. ‘దొరసాని’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మధుర శ్రీధర్ గారికి, ఎస్. రంగినేనిగారికి, సురేష్‌బాబుగారికి, కేవీఆర్ మహేందర్గారికి, ధీరజ్గారికి, నా కో యాక్టర్ ఆనంద్కి కూడా ధన్యవాదాలు. నా మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘అమ్మా నాన్నా.. అక్కా’ (జీవిత–రాజశేఖర్–శివాని) మీ దగ్గర్నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాను. -
స్పర్శ్ హాస్పీస్కు సాక్షి అవార్డు.. ‘గొప్ప గుర్తింపు’
Sakshi Excellence Awards: సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ అవార్డును స్పర్శ్ హాస్పీస్ తరఫున సీఈఓ డా.రామ్ మోహన్‌రావు అందుకున్నారు. స్పర్శ్ హాస్పీస్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ మరణాన్ని ఎలాగూ తప్పించలేం కానీ మరణ యాతనను తగ్గించవచ్చనే ఆలోచనతో ‘రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 2011లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది ‘స్పర్శ్ హాస్పీస్’ సంస్థ. అవసాన దశలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని అందిస్తోంది. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీమ్ సభ్యులు వారి ఇళ్లకే వెళ్లి సపర్యలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 9 ఏళ్లలో 3300 మంది రోగులకు సేవలందించింది స్పర్శ్ హాస్పీస్. ఈ గుర్తింపుతో మరింత మందికి సేవలు సమాజానికి చేస్తున్న మంచి సేవకు గొప్ప గుర్తింపు. పదేళ్లుగా జీవితపు ఆఖరి దశలో ఉన్న 4వేల మంది రోగులకు అండగా నిలిచి, వారి అంతిమదశలో కష్టాలను నివారించాం. సాక్షి లాంటి సంస్థల గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరింత మందికి సేవ చేయగలుగుతాం. – డా.రామ్ మోహన్‌రావు, సిఇఓ, స్పర్శ్ హాస్పీస్ -
స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు.. ఫొటోలు
-
Prof B Koteswara Rao Naik: ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా..
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్ అందుకున్నారు. నల్లమల పర్వత ప్రాంతంలోని ఓ కుగ్రామంలో మొలకెత్తిన జ్ఞానవృక్షం ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్. ప్రొఫెసర్ నాయక్ ఇప్పటివరకు 70 గొప్ప పరిశోధనా పత్రాలను వివిధ విద్యాలయాలకు సమర్పించారు. ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ లో ఆయన ఆరితేరినవారు. వినూత్నత, సాంకేతిక నిర్వహణలో నిపుణులు. ‘టెక్నో ఆంట్రప్రెన్యూర్షిప్’లో పరిపూర్ణత గలవారు. ఆయన సమర్పించిన సిద్ధాంత పత్రాలు యు.ఎస్.ఎ. జపాన్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, అబు–దాబి, థాయ్‌లాండ్‌ల విశ్వవిద్యాలయాలకు కరదీపికలయ్యాయి. మాటల్లో వర్ణించలేను తల్లిదండ్రుల సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం వారి సంతోషాన్ని చూడడం జీవితకాలపు సంతోషం అందించింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఇంతమందిని గుర్తించి, సన్మానించడం సాధారణ విషయం కాదు. సాక్షి గ్రూప్‌కి, జ్యూరీకి ధన్యవాదాలు. – ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావు నాయక్ -
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్‌బాబుకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్‌ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు కూడా థ్యాంక్స్. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్‌గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్‌బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్’. – వంశీ పైడిపల్లి, మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ (మహర్షి) మహేశ్ వెన్నెముకగా నిలిచారు ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్. నాకెప్పుడూ ఓ ఎగై్జట్‌మెంట్ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్‌గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్‌ఫుల్‌గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్‌గారితో కూడా మా బ్యానర్లో హ్యాట్రిక్ సాధించాం. – నిర్మాత ‘దిల్’ రాజు, మోస్ట్ పాపులర్ మూవీ (మహర్షి) -
Aligireddy Praveen Reddy: రైతు బిడ్డకు సాక్షి పురస్కారం..
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఫామింగ్’ అవార్డును ములుకనూరు సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అందుకున్నారు. ప్రవీణ్‌రెడ్డి రైతు బాంధవుడు. అరవై ఏళ్ల ‘యువ’ కర్షకుడు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామ రైతుబిడ్డ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి. వ్యవసాయంలో డిగ్రీ చదివారు. మేనేజ్మెంట్లో పీజీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రైతు సంక్షేమ సంస్థలకు ప్రవీణ్‌రెడ్డి ప్రెసిడెంటుగా, వైస్ ప్రెసిడెంటుగా ఉన్నారు. ఆసియాలోని ఉత్తమ సహకార సంఘాలలో ములుకనూరు సొసైటీ ఒకటి. ఆ సొసైటీకి 1987 నుంచీ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. సొసైటీ తరఫున 18 గ్రామాల్లోని 7,600 మంది రైతులకు సమగ్ర సేవలు అందిస్తున్నారు. ఆ సొసైటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్రవీణ్ రెడ్డి. రైతు సాయానికి భరోసా గత 62 ఏళ్ళ నుంచి రైతులకు అండదండగా ఉన్నాం. మా ప్రాంతంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా సంభవించలేదు. ఈ కృషిని సాక్షి గుర్తించడం ఎంతో సంతోషం సంతృప్తి ఇచ్చింది. ఈ స్ఫూర్తితో ఆర్ధికంగా బలోపేతం అయేందుకు గ్రామీణ ప్రాంత రైతులకి మరింతగా సహకారం అందిస్తాం. – అలిగెరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రెసిడెంట్, ముల్కనూర్ కో ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ -
నాన్నకి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్, దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు 2020 ఇచ్చి సత్కరించింది. దీని గురించి ఆయన తనయుడు గాయకుడు ఎస్పీ చరణ్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటాల్లోనే.. ‘సాక్షి యాజమాన్యం నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు ఇచ్చారు. ఇందుకు పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాం. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మా మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి మా కుటుంబసభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాన’ని తెలిపాడు. -
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం: అమర జవాను సతీమణి
Sakshi Excellence Awards: దేశ సేవకు అంకితమై.. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర జవాను బాబూరావుకు ‘సాక్షి’ నివాళి అర్పించింది. వీర సైనికుడి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు(‘మరణానంతర’ పురస్కారం)’ను ప్రకటించింది. హైదరాబాద్‌లో సెప్టెంబరు 17న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అమర జవాను సతీమణి ప్రియ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వీర జవాను బాబూరావు ‘మరణానంతర’ పురస్కారం కుటుంబాలకు దూరంగా అనుక్షణం ప్రమాదపుటంచుల్లో విధులు నిర్వర్తిస్తూ భరతమాత రక్షణకు తమ జీవితాలను అంకితం చేస్తారు జవాన్లు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు కూడా పాతికేళ్ల ప్రాయంలోనే అస్సాం రైఫిల్స్ లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్నారు బాబూరావు. అక్కడ టెర్రరిస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన భీకర పోరులో తీవ్రగాయాలు పాలై అమరుడయ్యారు. అంతకు ఎనిమిది నెలల ముందే బాబూరావుకు వివాహం అయింది. దేశం కోసం.. పురస్కారం సైనికునిగా దేశానికి అందించిన సేవలకు, త్యాగానికి గాను నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. –ప్రియ, అమర జవాన్ బాబూరావు సతీమణి చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
ఈ అవార్డుతో ఇంకా చేయాలనే ప్రోత్సాహం లభించింది: సింగీతం
Sakshi Excellence Awards: కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఇందులో భాగంగా 2019గాను జీవితసాఫల్య పురస్కారంతో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని సత్కరించింది. అయితే వివిధ కారణాలతో ఆయన వేడుకకి రాలేకపోయారు. ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అవార్డు అందుకున్నారు. అనంతరం అవార్డు గురించి సింగీతం సాక్షితో మాట్లాడాడు. ఆయన మాటాల్లోనే.. ‘ముందుగా జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు మా కాంట్రిబ్యూషన్ ఉంది. అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్‌గా మిగతా రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘సాక్షి’ వారు నాకు ప్రదానం చేసిన ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగినట్లుగా భావిస్తున్నాను. ఇంకా కాంట్రిబ్యూషన్ చేయాలన్నది ఇప్పుడు నా మెయిన్ ప్లాన్. నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ‘ఇంకా చెయ్’ అనేవారు నాకు కావాలి. ఇప్పుడు ఈ అవార్డుతో నాకింకా చేయాలనే ప్రోత్సాహం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలవడం ఒక ఆనందం. కానీ ఈ అవార్డు ఫంక్షన్‌కు రావాలని నేను ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేని పరిస్థితి. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాని’ అన్నారు. మేం ఏం చేస్తే ఈ అవకాశం వస్తది: దర్శకుడు గుణశేఖర్ సింగీతం శ్రీనివాసరావు తరఫున అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘పెద్దాయన సింగీతం శ్రీనివాస రావు గారు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అందుకుంటూ కూడా... ‘ఇంకా నాకు ఎంతో కంట్రిబ్యూట్ చేయాలనిపిస్తోంది’ అన్న తర్వాత మాలాంటివాళ్లం ఇంకా ఎంత కంట్రిబ్యూట్ చేస్తే మాకిలాంటి అవకాశం వస్తది! ఆయన అవార్డును ఆయన తరఫున నేను అందుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్.’ అన్నాడు. -
‘అల వైకుంఠపురములో’కు అవార్డు వస్తదనుకోలేదు: అల్లు అర్జున్
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలకు సాక్షి’ మీడియా గ్రూప్ 2019, 2020 సంవత్సరాలకు గాను ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురములో’గాను బెస్ట్ యాక్టర్ అవార్డు(2020) అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు అవార్డులంటే చాలా ఇష్టం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. మా బ్రదర్ తమన్‌ని నాకు వన్ బిలియన్ ప్లే అవుట్స్ కావాలని ఏ ముహూర్తాన అడిగానో..! అంటే.. వందల కోట్ల సార్లు పాట ప్లే అవ్వాలని.. ఇప్పటికి దాదాపు 300 కోట్ల సార్లు ప్లే అయింది... ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వడమే కాదు.. 2020 లాస్ట్‌లో ఎవడు సిక్సర్ కొడతాడో ఆడే మొత్తం డికేడ్ అంతా కొట్టినట్టు. ఆల్బమ్ ఆఫ్ ద డికేడ్... థ్యాంక్యూ తమన్. ఆల్బమ్‌లో ‘మల్లెల మాసమా...’ రాసిన సీతారామ శాస్త్రిగారికి, ‘రాజుల కాలం కాదు.. రథము, గుర్రము లేదు’ అని రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి , ‘రాములో రాముల..’ పాట రాసిన కాసర్ల శ్యామ్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానంటే నాకు లాంగ్వేజ్ అంతగా రాదు.. కానీ లిటరేచర్ వేల్యూ బాగా తెలుసు. వచ్చే జనరేషన్ నాలా తెలుగు మాట్లాడకూడదు... చాలా బాగా మాట్లాడాలి (నవ్వు..). త్రివిక్రమ్గారిలా మాట్లాడాలనుకోండి. మా ప్రొడ్యూసర్ చినబాబుగారికి, వంశీగారికి, మా నాన్న అల్లు అరవింద్, బన్నీ వాసుకి థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే... నాలుగైదేళ్లుగా ఇలాంటి ఒక పెద్ద హిట్టు పడాలి, ఇండస్ట్రీ రికార్డో లేదా ఆల్ టైమ్ రికార్డో పడాలి.. అనుకుంటూ ప్రతిసారీ సినిమా చేసేవాణ్ణి. అయితే రాలేదు. ప్రతిసారీ అలాగే అనుకుంటాం.. ఈసారి అన్నీ వదిలేసి సరదాగా ఒక సినిమా చేద్దాం అనుకుని చేస్తే.. ఆ సినిమానే ఆల్‌టైమ్ రికార్డ్, బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది సినిమాకే కాదు.. లైఫ్‌కి కూడా మంచి పాఠం. అదేంటంటే మన లైఫ్‌లో అద్భుతం రావాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కాదు.. వదిలేయాలి, వదిలేసినప్పుడే అద్భుతం వస్తుంది. మీ లైఫ్‌లో కూడా ఏదైనా అద్భుతం రావాలంటే వదిలేయండి. అదొస్తదంతే. – అల్లు అర్జున్, మోస్ట్ పాపులర్ యాక్టర్ (అల వైకుంఠపురములో...) అవార్డులు మాకు చాక్లెట్స్లాగా.. చిన్నపిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో బేసిగ్గా సినిమావాళ్లకు అవార్డులు కూడా అంతే ఇష్టం. మీరు ఎన్ని చాక్లెట్లు ఇస్తామన్నా పిల్లలు వద్దనరు.. మేము అవార్డులు వద్దనం. ‘అల వైకుంఠపురములో..’ తాలూకు అవార్డు మొట్టమొదటగా ‘సాక్షి’తో స్టార్ట్ అయింది. ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి మా ‘అల వైకుంఠపురములో..’ టీమ్ తరఫున ధన్యవాదాలు. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్గార్లకు, సినిమా రిలీజ్ అవక ముందే అత్యద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లిన నా మిత్రుడు తమన్‌కి, ఈ సినిమాని మా అందరితో కలిసి నటుడిగానే కాదు తోటి టెక్నీషియన్‌గానూ చేసిన మా హీరో అల్లు అర్జున్‌గారికి.. నాగవంశీ, పీడీవీ ప్రసాద్, పూజా హెగ్డే, టబులతో పాటు మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. – త్రివిక్రమ్ శ్రీనివాస్, మోస్ట్ పాపులర్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) 2020 తర్వాత మొదటిసారి.. 2020లో వైజాగ్‌లో చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ (‘అల వైకుంఠపురములో’)లో అంతమందిని జనాలను చూసిన తర్వాత.. మళ్లీ అంతమందిని చూడటం, ఓ ఫంక్షన్‌కి అటెండ్ కావడం కరువైపోయింది. ఓ ఏడాదిన్నర అటువంటి కరువులో ప్రయాణించిన మాకు ఒక చల్లటి గాలిలా మా ఇండస్ట్రీకి ఫస్ట్ వేడుకగా. ప్రప్రథమంగా ‘సాక్షి’ వారు ముందుకొచ్చి ఈ ఫంక్షన్ చేయడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఇక ‘థర్డ్ వేవ్’ లేదనుకుంటూ ముందుకు సాగాలి. ‘సాక్షి’ వారు మా సినిమాని ఎన్నుకుని నాకు ,రాధాకృష్ణగారికి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. – అల్లు అరవింద్, మోస్ట్ పాపులర్ మూవీ (అల వైకుంఠపురములో...) క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే.. ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాకు మ్యాజికల్ ఫిల్మ్. ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్, బన్నీదే. ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో తీసిన రాధాకృష్ణ, అల్లు అరవింద్‌కు థ్యాంక్స్. ఓ సినిమాలో ఒక పాట హిట్ అయితే ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్‌ది. ఆరు పాటలూ హిట్ కావడం అంత సులభం కాదు. త్రివిక్రమ్‌గారు చాలా తెలివైనవారు.. రియల్లీ జీనియస్. ఈ సినిమాకి మంచి లిరిక్స్ ఇచ్చిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్‌గార్లకు థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా అవార్డులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.. ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. – సంగీత దర్శకుడు తమన్, మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (అల వైకుంఠపురములో...) ఇది నా రెండో సాక్షి అవార్డు.. ‘సాక్షి’ అవార్డు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా రెండో సాక్షి అవార్డు. మొదటిసారి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అందుకున్నాను.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి తీసుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ సార్. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్, నిర్మాత చినబాబుగారు, వంశీ, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వారు మళ్లీ మళ్లీ నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించడంతో పాటు అభినందించారు.. అందుకు వారందరికీ థ్యాంక్స్. – పూజా హెగ్డే, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (అల వైకుంఠపురములో...) గర్వంగా ఉంది.. చిన్మయి ఇంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది. ఇంత అద్భుతమైన పాట (మోస్ట్ పాపులర్ సింగర్–‘ఊహలే...’ (జాను) కోసం ‘సాక్షి’ తనను గౌరవించడం చాలా సంతోషం. డైరెక్టర్ ప్రేమ్గారికి, నిర్మాతలు ‘దిల్’రాజు గారు, శిరీష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత, లిరిక్ రైటర్ శ్రీమణి గారు... అలాగే తెరపైన ఈ పాటకి ప్రాణం పోసిన సమంత, శర్వా.. అందరికీ చిన్మయి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ. – రాహుల్, నటుడు–దర్శకుడు, చిన్మయి భర్త -
Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు ‘సాక్షి’
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ (స్పోర్ట్స్– మేల్) అవార్డును పర్వతారోహకుడు అమోఘ్ తుకారాం అందుకున్నారు. అమోఘ్ తుకారం‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ (స్పోర్ట్స్– మేల్) ఇరవై ఏళ్ల వయసులో.. పది నెలల వ్యవధిలో.. నాలుగు ఖండాల్లో.. ఎనిమిది శిఖరాలు అధిరోహించాడు అమోఘ్ తుకారాం. ప్రతి అధిరోహణ.. ఒక సందర్భం. ఒక సందేశం. ఒక సంకేతం. పర్వతారోహకులలో ప్రత్యేకం అమోఘ్ తుకారాం. ఎవరెస్టు శిఖరాన్ని సౌత్ కోల్ రూట్ గుండా ఎక్కడం ప్రమాదకరమైనా, ఈ దుస్సాహసం చేసి, విజయుడై నిలిచిన యంగెస్ట్ పర్సన్. ఆదివాసీ రైతు బిడ్డగా పుట్టి, పర్వత పుత్రుడిగా ప్రఖ్యాతి చెందిన ఈ యువ ఉత్తుంగ తరంగంది తెలంగాణా, రంగారెడ్డి జిల్లాలోని యాచారం. మట్టిలో మాణిక్యాలకు వెలుగు సాక్షి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడంలో సాక్షిదే అగ్రస్థానం. ఈ తరహా స్ఫూర్తిని అందించడం ద్వారా మరెందరో వెలుగులోకి వస్తారని భావిస్తున్నాను. సాక్షికి ధన్యవాదాలు. ముఖ్యంగా వై.ఎస్. భారతీరెడ్డిగారి నిరాడంబరత, ఆత్మీయ పూర్వక ప్రోత్సాహం నన్ను చాలా ఆనందాశ్చర్యాలకు గురిచేశాయి. వారికి ఎంతైనా రుణపడి ఉంటాను. – అమోఘ్ తుకారాం, పర్వతారోహకుడు -
‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది: జమున
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2019 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. నటి జమునకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారంపై ఆమె స్పందిస్తూ.. ‘‘సాక్షి’వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘సాక్షి’ టీవీకి చాలాసార్లు నా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. సీనియర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ ‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు. -
Sakshi Excellence Awards: థ్యాంక్యూ సాక్షి: కోనేరు హంపి
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథులుగా... ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా... ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’(స్పోర్ట్స్- ఫిమేల్) అవార్డును కోనేరు హంపి అందుకున్నారు. ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కోనేరు హంపి(స్పోర్ట్స్- ఫిమేల్) చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించిన ఘనత కోనేరు హంపికి ఉంది! హంపీ అకౌంట్లో బంగారు పతకాలూ ఉన్నాయి. అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయి. అర్జున ఉంది. పద్మశ్రీ ఉంది. ఇప్పుడు సాక్షి ఎక్స్‌లెన్స్ ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కూడా హంపి విజయాలకు జత కలిసింది. హంపీ ఏపీ చెస్ క్రీడాకారిణి. మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్. ఆమె కనని కల ఒకటి సాకారం అయింది! అది.. అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం. హంపి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ. మరిన్ని విజయాలకు స్ఫూర్తి... క్రీడల్లో నాకు పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు విభిన్న కేటగిరీల్లో అవార్డులు తీసుకుంటున్న అందరికీ అభినందనలు. జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏది సాధించినా దానికి ప్రతిగా వచ్చే ఇటువంటి పురస్కారాలు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్యూ సాక్షి. ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. –కోనేరు హంపి, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి గురించి సంక్షిప్తంగా.. ►కోనేరు హంపి 31 మార్చి 1987లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ►తండ్రి కోనేరు అశోక్ ఆమె మొదటి కోచ్ ►15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర సాధించిన విజయాలు- వరల్డ్ చాంపియన్‌షిప్స్ ►అండర్-10 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1997, ఫ్రాన్స్- స్వర్ణ పతకం ►అండర్-12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1998, స్పెయిన్- స్వర్ణ పతకం ►అండర్- 12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1999, స్పెయిన్- రజత పతకం ►అండర్-14 వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2000, స్పెయిన్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2001, ఏథెన్స్, గ్రీస్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2002, గోవా, ఇండియా- రజత పతకం ►వరల్డ్ కప్ 2002, హైదరాబాద్, ఇండియా- సెమీ ఫైనలిస్ట్ ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2004, ఎలిస్తా, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2008, నల్చిక్, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, 2010 టర్కీ- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్- 2011- రజత పతకం చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు
అన్నం పెట్టే అన్నదాతలు, ఆపన్నులకు ఆసరా ఇచ్చే సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, పర్వతాల మెడలు వంచిన పరాక్రమవంతులు.. ఇంకా ఎందరో స్ఫూర్తి ప్రదాతల విజయాలకు సాక్షి పట్టం కట్టింది.. పురస్కారాలు అందించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథిగా... అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నవారి స్పందనలు వారి మాటల్లోనే. తెలుగు వారందరి మీడియా నిజాలు తెలిపే నిష్పాక్షిక మీడియా గ్రూప్‌గా సాక్షి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రలో అందరికీ ఇష్టమైన మీడియా గ్రూప్ సాక్షి, ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్న చైర్ పర్సన్ భారతీ రెడ్డి కృషి ఎంతైనా అభినందనీయం. విభిన్న రంగాల్లో విజేతలను గుర్తించడం, వారి విజయాలను వెలుగులోకి తీసుకురావడం, గొప్ప కార్యక్రమం. స్ఫూర్తి దాయక విజయాలతో పురస్కారాలు దక్కించుకున్న విజేతలను, వివేకానందుని మాటలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పురస్కారం ప్రకటించడం, అమర జవాన్ బాబూరావు వంటివారిని పురస్కరించడం ద్వారా సరైన విజేతలను ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు అభినందనలు – ముఖ్య అతిథి తమిళసై, గవర్నర్, తెలంగాణ కట్టా సింహాచలం ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఆయనది అగాథం నుంచి అత్యున్నత శిఖరానికి సాగిన ఒక జైత్రయాత్ర. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో జన్మించిన సింహాచలం బాల్యంలోనే చూపు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రా బ్లైండ్ స్కూల్లో చదువుకున్న తరువాత, ఆర్వీఆర్ కాలేజీలో బిఏలో చేరారు. బీఈడీలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించి, విశాఖలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో చేరి కోర్సు పూర్తి చేశారు. ఆ తరువాత కేంద్రీయ విద్యాలయలో అధ్యాపకునిగా చేరారు. అక్కడితో ఆగిపోలేదు. సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలెట్టారు. ఐఆర్ఎస్కు సెలెక్టయినా మరోసారి సివిల్స్ అటెంప్ట్ చేశారు. 2019 లో జాతీయ స్థాయిలో 457వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అక్షరమనే ఆయుధంతో తనను చుట్టుముట్టిన ప్రతికూలతలను ఛేదిస్తూ గమ్యాన్ని ముద్దాడిన సింహాచలం ఎంతోమంది విద్యార్థులకు నిలువెత్తు స్ఫూర్తి. ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గొప్ప గౌరవం చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఇదో గొప్ప గౌరవం. ఈ గౌరవం నా కృషిలో నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందని భావిస్తూ మరికొంత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను. – కట్టా సింహాచలం, ఐ.ఎ.ఎస్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఐఏఎస్‌కు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి మీడియా ప్రాథమ్యాలు మారాలి ఒక చక్కని, అద్భుతమైన కార్యక్రమాన్ని సాక్షి నిర్వహిస్తోంది. ఇటీవలే మేం కూడా సిఎన్ఎన్ ఐబిఎన్‌లో ఇండియా పాజిటివ్, రియల్ హీరోస్ పేరిట ఇలాంటి పురస్కార ప్రదాన కార్యక్రమాలు ప్రారంభించాం. కేవలం చెడు వార్తలు, రాజకీయాలు మాత్రమే చూడడం పాక్షిక దృష్టి మాత్రమే అవుతుంది.. మనది సుసంపన్న దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్న వ్యక్తులున్నారు. ఎన్నో విశేషాలున్నాయి. మీడియా ప్రాథమ్యాలు మారాలని కోరుకుంటున్నా. వాస్తవిక అంశాలు, వాస్తవమైన పరిస్థితులు, విజయవంతమైన వ్యక్తుల ప్రయాణాలపై మీడియా మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలు స్ఫూర్తిదాయకమైన రియల్ హీరోస్, మోడల్ సిటిజన్స్. –సాగరికా ఘోష్, ప్రముఖ పాత్రికేయురాలు, సిఎన్ఎన్ ఐబిఎన్ పారదర్శకంగా ఎంపిక సాక్షి మీడియా మాకు విజేతల ఎంపికలో ఎంతో స్వేచ్ఛనిచ్చింది. న్యాయనిర్ణేతల బృందంలో రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులతో సహా మరెందరో ప్రముఖులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా, పారదర్శకంగా విజేతల ఎంపిక జరిగింది. విజేతలు ఇలాగే భావితరాలకు తమ విజయ పరంపర కొనసాగించాలని, రోల్ మోడల్స్‌గా మారాలని కోరుకుంటున్నాను. – నరేంద్ర సురానా, చైర్మన్, న్యాయనిర్ణేతల జ్యూరీ ఎండి, సురానా టెలికామ్ డాక్టర్ చావా సత్యనారాయణ ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. సమష్టి కృషి ఫలితం.. ఈ అవార్డ్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో భాగమైన అందరి కృషికీ ఇదో గొప్ప గుర్తింపు. మా సంస్థ సభ్యులు అందరి తరపున సాక్షికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – డా. చావా సత్యనారాయణ, ఫౌండర్ అండ్ సియీఓ, లారస్ ల్యాబ్స్ డా.సత్యనారాయణ చావాకు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్. భారతీరెడ్డి డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి ‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. పల్లె విలువలే పురస్కారాలు.. ఈ పురస్కారం అందుకోవడం చాలా గర్వకారణం. అమెరికాలో ఉంటున్నా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెటూళ్లో నేర్చుకున్న విలువలు మాకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా, అనుసరణీయాలుగా ఉన్నాయి. ఈ పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. డా.ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు, (అమెరికా నుంచి వీడియోబైట్) సాగరిక ఘోష్ నుంచి డా.ప్రేమ్ సాగర్ రెడ్డి తరఫున అవార్డు అందుకుంటున్న వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్, బాలకృష్ణ, -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019 & 2020
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు
-
ఘనంగా 'సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఎంచుకున్న ఆశయాన్ని మన సంతా నింపుకొని, కలలో కూడా మర్చిపోకుండా కృషి చేసిన వారే అద్భుత విజయాలు అందుకుంటారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై చెప్పారు. అంకిత భావం వ్యక్తులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించినవారిని గుర్తించి పురస్కారాలు అందించే ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఇందులో గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నమ్ముకున్న ఆశయాలకు కట్టుబడి ఎన్నో విజయాలను సాధించవచ్చని నిరూపించిన వారు మన చుట్టూరా ఎందరో ఉన్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి అవార్డులు అందించడం గొప్ప విషయమని ‘సాక్షి’ మీడియాను అభినందించారు. కరోనా వేవ్‌ల సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి శ్రమించిన వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలకు ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నానన్నారు. అవార్డు గ్రహీతలకు గవర్నర్ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డితోపాటు పలువురు సినీరంగ ప్రముఖులు, ‘సాక్షి’ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. (చదవండి: సైదాబాద్ నిందితుడి మృతిపై జ్యుడీషియల్ విచారణ) -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే రెండేళ్లకు (2019, 2020) ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు జనవరి 13, 2021 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–23322330 నంబర్‌పై గానీ, sakshiexcellenceawards2019@sakshi.com మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. -
ప్రతిభకు పట్టం కడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం... రంగం ఏదైనా ప్రతిభే కొలమానం... ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డ్స్ 6వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ఈ ఏడాది 6వ ఎడిషన్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను అందజేయవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపించవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తుల్ని గుర్తించి వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫామ్‌లో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www. sakshiexcellence awards. com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (వర్కింగ్ డేస్‌లో) 040–23322330 ఫోన్ నంబర్ లేదా sakshiexcellence awards2019 @sakshi. com ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కట్టేందుకు ‘సాక్షి’సిద్ధమైంది. రంగం ఏదైనా ప్రతిభే కొలమానంగా అవార్డులను అందించనుంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ పేరిట సత్కరిస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 6వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయిస్తుంది. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడడం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫామ్‌లో ఇచ్చిన చిరునామాకు పంపవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www. sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు (వర్కింగ్ డేస్‌లో) 040–23322330 నంబరు ద్వారా లేదా sakshiexcellenceawards2019 @sakshi.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు : తారలు తళుక్
-
కృషికి సాక్షి సలామ్
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు మున్ముందుకు అన్నాడో కవి. కృషి వుంటే మనుషులు ఋషులవుతారు అని మరొక కవి అన్నాడు. జీవితం ఉన్నది మనకోసం మాత్రమే దానిని మలచుకోవడానికి కాదని నమ్మేవారు ఎప్పుడూ ఈ నేలమీద ఉండనే ఉంటారు. నలుగురికోసం పనిచేయడం నాలుగు విధాలా మేలు చేయడం, నలుగుబాటులో ఉన్నవారిని గట్టున పడేయడం, వేదనను కొద్దిగా అయినా దూరం చేయడం, సంఘంకోసం అంకితమవడం, జాతి, దేశం ఉప్పొంగేలా నమ్ముకున్న రంగంలో సాధన చేయడం ... ఇది కూడా జీవితం అనుకునేవారు ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటారు. వారికి కృతజ్ఞత అర్పించడం మన బాధ్యత. వారిని సెహబాష్ అని మెచ్చుకోవడం మన కర్తవ్యం. వారిని సత్కరించుకోవడం మన సంస్కారం. ఎన్నో భిన్న రంగాల్లో , ఎంతో సేవ చేసిన అటువంటి కృషీవలురకు ‘సాక్షి’ కిరీటం తొడుగుతోంది. సలామ్ చేస్తోంది. అనన్య గరికపాటి జ్యూరీ స్పెషల్ అవార్డు :: స్పోర్ట్స్ – ఫిమేల్ తెలుగులో అనితర సాధ్యం అనే మాట ఉంది కాని అనన్య చేసే రిథమిక్ జిమ్నాస్టిక్స్ చూస్తే అనన్యకే సాధ్యం అని శ్లాఘించాలనిపిస్తుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అద్భుత ప్రతిభాశాలి బాల్యం నుంచే సంగీతానికి స్పందించే శరీర కదలికలు ప్రదర్శించేది. ఈ ప్రతిభను తీర్చిదిద్దుకుని సంగీతానికి నృత్యాన్ని మిళితం చేసే రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తర్ఫీదు పొందింది. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో దేశ ప్రతిష్టను తెలుగువారి కీర్తిని రెపరెపలాడిస్తోంది. 2016లో లండన్ స్ప్రింగ్ కప్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్ కాంపిటీషన్లో మూడు కాంస్య పతకాలు, ఆల్ రౌండ్ కాంస్య పతకంతో పాటు మిస్ హోప్ట్రోఫీని వశం చేసుకుంది. 2017లో ఉజ్బెకిస్తాన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కప్‌లో, 2017 దుబాయ్ ఎమిరేట్స్ కప్‌లో, 2018 మాస్కో విక్టరీ ఇంటర్నేషనల్ కప్‌లో సిల్వర్‌మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, స్పెషల్ ప్రైజ్‌లు దక్కించుకుని సత్తా చాటింది. అంతేకాదు మాస్కోలోనే జరిగిన జూనియర్ స్టార్ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్లో ఆల్ రౌండ్ విభాగంలో బంగారు పతకం గెల్చుకుని రికార్డు నెలకొల్పింది. అలాగే మాస్కోలో జరిగిన సెల్యూట్కప్లో సిల్వర్ మెడల్, స్పెషల్ ప్రైజ్‌తో పాటు మిస్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనే ఆశయంతో కృషి చేస్తున్న అనన్యకు స్పోర్ట్– ఫిమేల్ కేటగరిలో స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. చాలా సంతోషంగా ఉంది రిథమ్ జిమ్నాస్టిక్స్‌లో చాలా పోటీల్లో పాల్గొన్నాను. గత మే నెలలో జరిగిన అంతర్జాతీచయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో భారత్ తరఫున నాకు గోల్డ్‌మెడల్ లభించింది. ఇప్పుడు కొద్ది నెలల వ్యవధిలోనే సాక్షి నుంచి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. షేక్ మహమ్మద్ ఆరిఫుద్దీన్ సోషల్ వర్క్– యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ వేయి మైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే ఒక్క చిన్న దీపమైనా వెలిగించడం మేలని నమ్మి పని చేసే వారిలో అరీఫుద్దీన్ ఒకరు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్ మహ్మద్ అరీఫుద్దీన్ నలుగురిని కూడగట్టడంలో సమర్థులు. నాలుగు మంచిపనులకు పురిగొల్పడంలో నాయకుడు. అందుకే కుటుంబసభ్యులు, మిత్రుల సహకారంతో 2017లో యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించాడు. వృద్ధులు, యాచకులు, అనాథలకు ఆహారం, మందులు, దుస్తులు సరఫరా చేస్తున్నాడు. పేద విద్యార్థులకు చదువు ముఖ్యమని గ్రహించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నాడు. వేడుకలలో మిగిలిపోయిన ఆహారం వృథా పోకుండా సేకరించి ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. అనాథS శవాలకు సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కరాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. బ్లడ్‌బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాడు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో సేవ చేస్తున్న అరీఫుద్దీన్ను సోషల్ సర్వీస్‌లో యంగ్ అఛీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డు ఎంపికలో స్వచ్ఛత ఉంది సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికలో ఎంతో నిజాయితీ ఉంది. ఎక్కడో పని చేస్తున్న మమ్మల్ని గుర్తించి గౌరవించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంతకంటే ఏం కావాలి. సామాజిక సేవ చేయాలంటే అంకితం భావం ఒక్కటి చాలు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాం. నేనూ, నా స్నేహితులు కలిసి ఫుడ్‌బ్యాంకు ఏర్పాటు చేశాం. ఆహారం వృథా కాకుండా పేదలకు అందజేస్తున్నాం. వీటన్నింటినీ మేము ఏమీ ఆశించి చేయలేదు. అయినప్పటికీ మమ్మల్ని గుర్తించడం చాలా సంతోషకరం. చెరుకూరి రామారావు ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ఆహారం ఆయుష్షును ఇవ్వాలి... కాని అదే ఆహారం విషమయ్యే పరిస్థితి నెలకొని ఉంది రసాయనాల వాడకం వల్ల. అందుకే చెరుకూరి రామారావు తన సేద్యంలో రసాయనాలకు నో చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నారు. 20 ఎకరాల నేలలో రామారావు పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రజలకు ప్రకృతి వరాలని చెప్పవచ్చు. కూలీల మీద ఆధార పడకుండా తను, తన కుంటుంబ సభ్యులు రోజంతా కష్టపడి పంట పండించుకోవడమే కాదు చేతికొచ్చిన పంటను వీరే స్వయంగా మార్కెటింగ్ కూడా చేసుకుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ రైతుగా గుర్తింపు తెచ్చుకున్న రామారావు ఒక సందర్భంలో చెరకు పంటకు గిట్టుబాటు ధర లేదని తానే రసం తీసి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసుకుని మంచి లాభాలు గడించారు. కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలతోనే 6 ఎకరాల నుంచి 20 ఎకరాలకు ఎదిగారు. సమాజానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించాలనేది తన ఆశయం అంటున్న ఈ ఆధునిక రైతు సాటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. అందుకే చెరుకూరి రామారావును ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. సేంద్రీయ పంటలు ఆరోగ్య విప్లవాన్ని తెచ్చాయి సేంద్రీయ పంటలు పండిస్తున్నాం. 25 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వరి, గోధుమ, చిరుధాన్యాలు పండించి నేరుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు స్వస్థత లభించింది.సాక్షి నుంచి ఈ అవార్డును అందుకోవడం సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ పక్షవాతం, మూర్ఛ జీవితాన్ని నరక ప్రాయం చేస్తాయి. కాని వీటి పట్ల అవగాహన చైతన్యం ఉంటే నివారణ సులభం అని అందుకు కృషి చేయాలని 2013లో ఏర్పాటైన సంస్థ డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్. నెల్లూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ న్యూరో వ్యాధులపై అవగాహన కొరకు ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ‘వియ్ రీచ్, వియ్ టీచ్, వియ్ ట్రీట్’ అనే నినాదంతో ప్రజలలోకి వెళ్లారు. మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ హెల్త్ క్యాంప్‌లు, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, నరాల సంబంధిత వ్యాధులపై సందేహాలు నివృత్తి చేసేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. ‘ఎపిలెప్సి హెల్ప్’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నెలకు రెండువందల మంది పేషంట్లకు ఉచిత వైద్య చికిత్సతో పాటు నెలకు సరిపడా మందులు కూడా ఉచితంగా అందిస్తోంది ఈ ఫౌండేషన్. సమాజ హితం కోసం స్వచ్ఛందంగా పాటుపడుతున్న డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు విముక్తి కల్పిస్తా చాలా మంది ఈ వ్యాధుల కారణంగా తిరిగి కోలుకోలేకపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, పేదరికం ఒక కారణమైతే అవగాహన లేమి మరో కారణం. అలాంటి వారికి సేవలందజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము చేస్తున్న సేవలకు సాక్షి నుంచి గొప్ప గుర్తింపు, గౌరవం దక్కాయి. 2018లో కెనడాలో అంతర్జాతీయ అవార్డు పొందాం. కానీ దాని కన్నా సాక్షి నుంచి అవార్డు అందుకోవడమే ఎంతో గర్వంగా ఉంది. డాక్టర్ రమేష్ కంచెర్ల అంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఎంత ప్రాణాంతకమైన చిన్న పిల్లల వ్యాధులు వచ్చినా అత్యాధునిక చికిత్స అందించగల స్థాయిలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ రమేశ్ కంచర్లకు దక్కుతుంది. 1999లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెయిన్ బో చిల్డన్స్ర్ హాస్పిటల్ డాక్టర్ రమేష్ కంచెర్ల ఆధ్వర్యంలో విజయవాడ, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై శాఖలతో 1185 పడకలతో దేశంలోనే అతి పెద్ద చిల్డన్స్ర్ హాస్పిటల్ చైన్‌గా పేరు సంపాదించింది. నవజాత శిశువుల నుంచి 18 సంవత్సరాల యువతీ యువకుల వరకు వారికి సంక్రమించే వివిధ రకాల వ్యాధులకు ఆధునిక చికిత్సా పద్దతుల్లో వైద్యం అందించడానికి నిపుణులైన సిబ్బంది ఈ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నారు. గర్భధారణ సమస్యలకు కూడా ప్రత్యేక చికిత్సా విధానలు అందిస్తున్నారు. సంవత్సరానికి 5 వేలకు పైగా సర్జికల్ ప్రొసీజర్స్, 30,000 ఇన్‌పేషంట్ అడ్మిషన్స్ నిర్వహిస్తూ చిన్నారుల మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి రెయిన్బో చిల్డన్స్ర్హాస్పిటల్స్. ‘హీల్ ఎ చైల్డ్’ ట్రస్ట్ ద్వారా నిరుపేద పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఇంతటి పురోగతి సాధించిన హాస్పిటల్స్ సీఎండి డాక్టర్ రమేష్ కంచెర్లను ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. విజయవంతంగా పిల్లలకు వైద్య సేవలు పిల్లల ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చాలామంది వెనుకడుగు వేస్తారు. చిన్న పిల్లలకు వైద్యసేవలను అందజేయడం భారంగా,నష్టంగా భావిస్తారు. కానీ మొట్టమొదట 1999లో నెల్లూరులో పిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయంతంగా నడిస్తున్నాం, ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడాము. ఆ తరువాత మా ఆసుపత్రులను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాం. ఛత్తీస్‌గఢ్, బెంగళూర్ తదితర రాష్ట్రాల్లోనూ పిల్లల ఆసుపత్రులను నెలకొల్పి సేవలందజేస్తున్నాం, సాక్షి నుంచి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఈయర్‌గా అవార్డు లభించడం చాలా సంతోషం. డాక్టర్ దామెర యాదయ్య హెల్త్ కేర్– స్పెషల్ జ్యూరీ ప్రతి మహిళకు ప్రసవం మరుజన్మతో సమానం. తల్లికి సుఖప్రసవం జరిగి బిడ్డ క్షేమంగా ఉంటే ఆ ఇంట ఆనందం వెల్లి విరుస్తుంది. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం డాక్టర్ దామెర యాదయ్య ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేస్తోంది. నిపుణులైన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ 24 గంటలూ అందుబాటులో ఉంటూ శిశు మరణాలను అరికట్టాలనే ఆశయంతో సేవలందిస్తున్నారు. నెలల నిండకుండా పుట్టిన శిశువులు, తక్కువ బరువుతో జన్మించిన బిడ్డలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నారు. కేవలం 650 గ్రాముల బరువుతో జన్మించిన పాపను ప్రత్యేక వైద్యచికిత్సలతో కోలుకునేలా చేసి రికార్డు నెలకొల్పింది ఈ బృందం. 86 శాతం సర్వైవల్ రేట్‌తో పదివేల మంది శిశువులకు చికిత్స అందించారు. గతంలో వెయ్యికి నలభైగా ఉన్న శిశు మరణాల రేటును ఎనిమిదికి తగ్గించారంటే ఈ బృందం పని తీరును అర్థం చేసుకోవచ్చు. తోటి వైద్యులు, సిబ్బందితో కలిసి శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ దామెర యాదయ్యను హెల్త్‌కేర్ కేటగిరిలో జ్యూరీ స్పెషల్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది నల్గొండ జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం నుంచి ఎంతోమంది నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను కాపాడాం. 2015లో కేవలం 650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి మమతను కాపాడడం దేశంలోనే ఒక సంచలనం, ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది. స్కూల్‌కు కూడా పంపిస్తున్నారు. చాలా మంది బరువు తక్కువగా పుట్టినప్పుడు, లేదా 7, 8 నెలలకే పుట్టినప్పుడు వారిని కాపాడడం? అతి పెద్ద సవాల్. అది మా ఆసుపత్రిలో విజయవంతంగా చేస్తున్నాం, ఇప్పుడు సాక్షి నుంచి అవార్డును అందుకోవడం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. గొప్ప స్ఫూర్తిదాయకం. గాయత్రి ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ న్ను నీవు జయిస్తే ప్రపంచమంతా నీకు దాసోహం అవుతుంది అన్నారు స్వామీ వివేకానంద. గాయత్రి తనను తాను జయించింది. వనపర్తికి చెందిన గాయత్రి పుట్టుకతోనే అంధురాలు. గాయత్రిని హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలో చేర్పించి ఈమె జీవితానికో దారి చూపారు తల్లిదండ్రులు. చూపు లేదని చింతపడకుండా అక్షరాన్ని ఆయుధంగా మల్చుకుని స్వహస్తాలతో తన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకున్నారు గాయత్రి. ప్రస్తుతం వనపర్తిలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంధురాలైన తొలి గెజిటెడ్ హెడ్మాస్టర్గా రికార్డు సృష్టించారు గాయత్రి. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పూర్వ విద్యార్థులతో మాట్లాడి తమ పాఠశాలకు అవసరమైన మౌలికవసతులు సమకూర్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గాయత్రిని ఉత్తమ మహిళా అవార్డుతో సత్కరించింది. చిమ్మ చీకట్లను ఛేదించుకుని వెలుగు రేఖవైపు ప్రయాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గాయత్రికి ఈ సంవత్సరం ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. చాలా సంతోషంగా ఉంది అంధురాలైనప్పటికీ పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందజేస్తున్న గాయత్రి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో అవార్డును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మా స్కూల్ విద్యారంగంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నాం, 1100 మంది పిల్లలు, 50 మంది టీచర్లతో విజయంతంగా స్కూల్‌ను నడిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు సాక్షి నుంచి అవార్డును అందుకోవడం మరింత ఆనందంగా ఉంది. నాకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తాను. భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్ హెల్త్ కేర్– జ్యూరీ ప్రత్యేక గుర్తింపు పీసీ ప్రకాశ్ ఆధునిక జీవన శైలి కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డయాలసిస్ చేయించుకోవాలంటే నెలకు వేల రూపాయలు ఖర్చవుతుంది. అంత ఖర్చు భరించలేని నిరుపేద రోగులకు నరకయాతనే. అలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది మహావీర్ డయాలసిస్ సెంటర్. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన పదహారు మంది సహృదయులు 2009లో భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంట నగరాల్లో డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పేద రోగులకు నామమాత్రపు రుసుముతో డయాలసిస్ చేస్తూ వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయూతనందిస్తోంది ఈ ఫౌండేషన్. జంట నగరాల్లో 5 కేంద్రాల్లో 160 డయాలసిస్ మెషిన్లతో సాగుతున్న ఈ సేవ ద్వారా నెలకు 1100 మంది పేషంట్స్ లబ్ధి పొందుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటుతున్న భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్‌కు హెల్త్‌కేర్ కేటగిరిలో జ్యూరీ స్సెషల్ రికగ్నిషన్ అవార్డ్ అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్. డయాలసిస్‌కు పేదరికం సమస్య కారాదు భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ చికిత్సలను అందజేస్తున్నాం, నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. కానీ పేదరికం కారణంగా ఏ ఒక్కరూ ఈ చికిత్సను కోల్పోవద్దనే ఉద్దేశ్యంతో 2009లో ప్రారంభించాం. అప్పటినుంచి ఇప్పటి వరకు వందలాది మందికి చికిత్సలను అందజేశాం. డయాలసిస్ కోసం బాధితులు నేరుగా మా సంస్థను సంప్రదించవచ్చు. సాక్షి మా సేవలను గుర్తించి గౌరవించడం చాలా సంతోషం. యువ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ స్పోర్ట్స్– మేల్ పిడికిట్లో పట్టుదల ఉంటే పంచ్‌లో పవర్ వస్తుంది అని నిరూపించిన యువ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా, బాక్సింగ్ ప్రాక్టీసు కోసం ఎటువంటి వెసులుబాటు లేకపోయినా కుటుంబంలో తండ్రి బాక్సింగ్ ఛాంపియన్ కనుక ఆయన స్ఫూర్తితో ఆయన శిక్షణతో కటిక నేల మీద సాధన చేసి ఎదిగిన బాక్సర్ ఇతడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో 56 కిలోల కేటగిరిలో ప్రతిభ చూపుతున్నాడు. 2012లో ఆర్మేనియా వరల్డ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2015లో సౌత్ కొరియాలో నిర్వహించిన వరల్డ్ మిలిటరీ గేమ్స్‌లో పాల్గొన్నాడు. 2018 ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా స్మారక టోర్నీ, అదే సంవత్సరం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ సిటీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్ మెడల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ పోటీలో పాల్గొని గోల్డ్‌మెడల్ కైవసం చేసుకున్నాడు. జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న హుస్సాముద్దీన్ ఫిన్ ల్యాండ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ బాక్సింగ్టోర్నీ, పోలాండ్లోని వార్సా నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నీలో సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నాడు. రోజురోజుకూ ఎదుగుతూ భారతదేశానికి ఒక ఆశపెట్టుకోదగ్గ బాక్సర్‌గా గుర్తింపు పొందుతున్న హుస్సాముద్దీన్‌ను స్పోర్ట్స్–మేల్ కేటగరిలో జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్‌తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాను సాక్షి నుంచి అవార్డును అందుకోవడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సంగతి ఎలా ఉన్నా ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మిథాలి రాజ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ప్రపంచ మహిళా క్రికెట్లో ఆమె ఓ వేగు చుక్క. భారత మహిళా క్రికెట్‌కు ఓ వెలుగు రేఖ. మగవారి ఆటగా ముద్రపడ్డ క్రికెట్లో మేమేం తక్కువా అంటూ స్త్రీ బావుటా ఎగురవేసిన ప్రతిభామూర్తి. గతంలో క్రికెట్ అంటే గవాస్కర్, టెండూల్కర్ అనేవారు. ఇప్పుడు క్రికెట్ అంటే ధోనీ, కోహ్లీతోపాటు మిథాలి రాజ్ పేరు కూడా తప్పనిసరిగా ప్రస్తావించే స్థాయికి మహిళా క్రికెట్‌ను తీసుకెళ్లిన క్రీడాకారిణి మిథాలి. 10 ఏళ్ల పసి ప్రాయంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన మిథాలి... 16 ఏళ్లకే జాతీయ జట్టు జెర్సీని ధరించే స్థాయికి ఎదిగింది. 19 ఏళ్ల ప్రాయంలో టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టి సంచలనం రేపింది. నాలుగేళ్లు తిరిగే సరికి ఏకంగా భారత జట్టుకే సారథి అయింది. మిథాలీ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు రెండుసార్లు ప్రపంచ కప్‌లో ఫైనల్స్ చేరుకుని హర్షధ్వానాలు అందుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడమేగాక సిరీస్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. మిథాలి సుదీర్ఘకృషికి, ప్రతిభకు ప్రతిఫలంగా అర్జున, పద్మశ్రీ పురస్కారాలు, మరెన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. త్వరలో ఆమె బయోపిక్ వెండితెరపై మెరవనుంది. నిబద్ధత, కఠోర శ్రమ, అంకితభావాలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిథాలి రాజ్‌ను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించడాన్ని తమకు దక్కిన గౌరవంగా సాక్షి మీడియా గ్రూప్ భావిస్తోంది. గొప్ప గౌరవం... గుర్తింపు తెలుగు పర్సన్ ఆఫ్ ద ఈయర్‌గా అవార్డు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. నాకు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎంతో గుర్తింపును తెచ్చే అవార్డు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే మనం ఎంచుకున్న ఈ రంగంలోనైనా విజయాన్ని సాధించగలం, ఆ విజయమే గుర్తింపును, గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఇది నిజమని నిరూపించడానికి మీరే సాక్షి. డా. దినేష్ చర్ల సబీనా జేవియర్ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ పసిపిల్లల ప్రాణాలు నిలపడం కన్నా మహా సేవాకార్యం మరొకటి ఉండదని భావిస్తారు సబీనా జేవియర్. చిన్నారులకు జబ్బు చేస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. చికిత్సకు డబ్బు లేకపోతే మరింతగా వేదన అనుభవిస్తారు. కేవలం డబ్బు లేదన్న కారణంగా పిల్లలను కోల్పోతే ఆ క్షోభ జీవితాంతం వెంటాడుతుంది. అందుకే అటువంటి పిల్లల కోసం ఉచితం వైద్యం అందించేందుకు తోడ్పాటునందిస్తోంది హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్. చికిత్సకు డబ్బు లేని కారణంగా ఏ బిడ్డా ప్రాణలు కోల్పోకూడదనే ఆశయంతో సబీనా జేవియర్ ఏర్పాటు చేసిన ఈ చారిటబుల్ ట్రస్ట్. ప్రముఖ హాస్పిటల్స్ సహకారంతో జబ్బు చేసిన పసిపాపలకు చేయూతనందిస్తోంది. దాతలు అందిస్తున్న అండదండలతో సేవ్ సిక్ చిల్డ్రన్ క్యాంపెయిన్ నడుపుతోంది. గత తొమ్మిదేళ్లలో తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న 530కి పైగా పసిపాపల వైద్యానికి అయిన ఖర్చులు భరించింది. మరోవైపు అనాథాశ్రమాల్లో ఉన్న విద్యార్థులకు వారం వారం హెల్త్ చెకప్స్, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారుల కోసం హెల్త్ క్యాంప్స్నిర్వహిస్తోంది. అమూల్యమైన ఈ సేవకు గాను సబీనా జేవియర్‌ను సోషల్ సర్వీస్ కేటగిరిలో యంగ్ అఛీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. గొప్ప స్ఫూర్తిని అందించింది... మేం గత 9 సంవత్సరాలుగా సబీనా జేవియర్ గారి ఆధ్వర్యంలో ఈ హీల్ ఎ చైల్డ్ సంస్థను నిర్వహిస్తున్నాం. అనూహ్యంగా అనారోగ్య సమస్యలతో పుట్టిన శిశువుల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడే తల్లిదండ్రులకు ఆర్థికంగా మా సంస్థ చేయూతని ఇస్తుంది. గతంలోనూ మా సేవలకు అవార్డులు అందుకున్నా... తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా సంస్థగా సాక్షి ఇచ్చిన ఈ పురస్కారం మాకు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపును తీసుకువచ్చింది. థాంక్యూ సాక్షి. డాక్టర్ ఐ.వి.శ్రీనివాసరెడ్డి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్– ఎడ్యుకేషన్ మనం తల వొంచితే తప్ప ఓటమి మన దరి చేరదు అని నమ్మినవారు శ్రీనివాసరెడ్డి. పోలియో కారణంగా చిన్నతనంలోనే రెండు కాళ్లు చలన రహితమై పోయినా ఆయన ఓటమిని దరి చేరనివ్వలేదు. ఓటమి తనను అందుకోలేనంత వేగంగా పట్టుదలగా చదువులో దూసుకుపోయారు. మెరిట్ విద్యార్థిగా రాణించారు. ఫీల్డ్‌వర్క్‌ను, కదలికను డిమాండ్ చేసే చదువు అయినప్పటికీ వెరవక వ్యవసాయం మీద ఆసక్తి కొద్దీ అగ్రికల్చర్లో పీహెచ్డీ చేశారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎన్నో ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేశారు. రైతు శిక్షణా కార్యక్రమాలకు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. రైతు అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న శ్రీనివాసరెడ్డి కృషిని చూసి తెలంగాణ ప్రభుత్వం 2018లో ఆయనను బెస్ట్ సైంటిస్ట్ అవార్డుతో సత్కరించింది. శారీరక లోపాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ఉన్నత విద్యతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న డాక్టర్ఐ.వి. శ్రీనివాసరెడ్డిని ఎడ్యుకేషన్ కేటగరిలో యంగ్ అఛీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. చాలా సంతృప్తినిచ్చింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న తనను గుర్తించి యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో గౌరవించడం గొప్ప సంతృప్తిగా ఉంది. శాస్త్రీయమైన వ్యవసాయ విధానాల పట్ల రైతులకు అవగాహన కలిగించేందుకు ఇప్పటివరకు 170 శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. వ్యవసాయరంగంపైన 94 వ్యాసాలు రాశాను. ఉద్యోగ కల్పన కార్యక్రమాల్లో భాగంగా ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేశాను. వ్యవసాయరంగం బాగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. రామలీల మల్లికాంబ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అసోసియేట్ డిజేబిలిటీస్ ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ తన బిడ్డకు మానసిక ఎదుగుదలలో లోపం ఉంది అని తెలిసిన క్షణాన ఏ తల్లి అయినా కుప్పకూలిపోతుంది. మరి ఇద్దరు పిల్లలకు అలాంటి లోపం ఉంటే? కాని హన్మకొండకు చెందిన రామలీల తన పిల్లల కష్టాన్ని చూసి అలాంటి అందరు పిల్లలకూ సేవ చేయాలని నిశ్చయించుకుంది. మానసిక ఎదుగుదలలో లోపం ఉన్న తన ఇద్దరు పిల్లల వంటి వారి కోసం 2001లో హన్మకొండలో మల్లికాంబ మనోవికాన కేంద్రం ఏర్పాటు చేశారు రామలీల. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యా బుద్ధులు నేర్పించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ఆశయం. ఈ సంస్థ నిర్వహణ కోసం రామలీల స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, బీఈడీ చేశారు. మల్లికాంబ మనో వికాస కేంద్రంలో కేంద్రంలో 200 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. మానసిక లోపం ఉన్న పిల్లలను డిపెండెంట్ స్థాయి నుంచి ఇండిపెండెంట్ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటున్నారు రామలీల. ఆ విధంగా ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు చేస్తున్నారు. స్పెషల్ చిల్డ్రన్ కోసం అవిరళ కృషి చేస్తున్న మల్లికాంబ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హాండిక్యాప్డ్ అండ్ అసోసియేట్ డిజేబిలిటీస్కు ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్y ðlవలప్మెంట్ అవార్డు అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్. మా సేవలకు సముచితమైన గుర్తింపు లభించింది నా జీవిత అనుభవమే నన్ను బుద్ధిమాంద్యుల శిక్షణ, పునరావాస సంస్థను ఏర్పాటు చేసేందుకు కారణమైంది. మా ఇద్దరు పిల్లలు మంజునాథ, సాయిక్రిష్ణలు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో మరింత మంది పిల్లలను చేరదీశాం. పద్మజారెడ్డి, భాగ్యలక్ష్మి, కల్యాణి తదితరులతో కలిసి బుద్ధిమాంద్యుల, మానసిక వికలాంగుల శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాం. అందరం కలిసి బుద్ధిమాంద్యులైన పిల్లల అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. సోషల్ డెవలప్మెంట్ రంగంలో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. -
సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. ‘వైఎస్. రాజశేఖరరెడ్డిగారు అంటే నాకెంతో ఇష్టం. ఆయన నన్ను రాజా అని పిలిస్తే నేను ఆయన్ను రాజా అని పిలిచేవాణ్ణి. ఆయన కుమారుడు జగన్‌గారు పెట్టిన ఈ ‘సాక్షి’ భారతిగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది.’ – నటుడు కృష్ణంరాజు ‘సాక్షి’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హుందాగా ఉంటుంది.’ – దర్శకుడు పూరి జగన్నాథ్ ‘సాక్షి’ అవార్డులు చాలా జెన్యూన్‌గా ఉంటాయి.’ – నటుడు– నిర్మాత రామ్ చరణ్ అని శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్’ని కొనియాడారు. పలు విభాగాల్లో ఈ అవార్డులను పలువురు ప్రముఖులు అందుకున్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్’ ఎంపిక జాబితాలో జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’ చిత్రాలు ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో ‘మధుర’ శ్రీధర్, నవీన్ ఎర్నేని, రాజారవీంద్ర, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ట్రెండ్‌ని సెట్ చేసేందుకు కష్టపడ్డా –కృష్ణంరాజు నేను నా సినిమాల్లో ఫైట్స్ అన్నీ డూప్ లేకుండా నిజంగా చేసినవే. అటువంటి ఫైట్స్ చేసి ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ పొందినప్పటికీ నేను మాత్రం రెండు కాళ్లు, కుడి చెయ్యి విరగ్గొట్టుకున్నాను(నవ్వుతూ). ఎన్నిసార్లు హాస్పిటల్‌కు వెళ్లానో నాకు తెలుసు(నవ్వుతూ). అప్పట్లో ఇలా ట్రెండ్‌ని సెట్ చేయడానికి నేను పనిచేశా, కష్టపడ్డాను. విలన్‌గా చేయమని దర్శకులు అడిగితే ఒప్పుకోలేదు. అయితే విలన్ పాత్రలను నా స్టైల్లో చేస్తాను, మీకు ఓకే అయితే చేస్తానన్నాను. ఫైట్స్ దగ్గర నుంచి పిస్టల్‌తో పేల్చడం వరకు ప్రతిదీ కొత్తగానే ప్రయత్నించాను. ‘మదర్ ఇండియా, బంగారు తల్లి’ లాంటి సినిమాల్లో చాలా డిఫరెంట్‌గా చేశా. ఒక ప్రొడక్షన్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా అవమానాలు వచ్చాయి. అప్పట్లో హీరోయిన్స్‌ని ముట్టుకోకుండా ఆమడ దూరంలో ఉండి చేసే విధానం ఉండేది. నా ఉద్దేశం ఏంటంటే మగవాళ్లు, ఆడవాళ్లు సమానమే అనేది. అందుకే ‘కృష్ణవేణి’ సినిమాను తెలుగు ప్రేక్షకులు గుర్తించుకోగలిగేలా తీయగలిగాను. ఈ సినిమాను చూసిన హీరో ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారు. ‘భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి సినిమాల్లో ట్రెండ్‌ని సెట్ చేశాం. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. నేనూ మంచి స్నేహితులం. ఆయన నన్ను ఎంతమందిలో చూసినా ‘ఏం రాజా’ అంటూ పిలిచేవారు. నేను కూడా ఆయన్ని ‘రాజా’ అంటూ పిలచేవాణ్ణి. ‘సాక్షి’ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి నా అభినందనలు. ‘సాక్షి’ నన్ను గుర్తించి ‘జీవితసాఫల్య పురస్కారం’ అందించడం అత్యంత సంతోషదాయకంగా భావిస్తున్నా. నా పుట్టిల్లు ఇచ్చిన అవార్డు ఇది – అనసూయ ‘సాక్షి’ మీడియా నా పుట్టినిల్లు. అదే పుట్టినిల్లు నుంచి నా నటనను మెచ్చుకుని ఎక్స్‌లెన్స్ అవార్డు ఇవ్వడం గర్వంగా ఉంది. నేను ‘సాక్షి’ ద్వారానే గుర్తింపు తెచ్చుకోగలిగాను. ‘రంగమ్మత్త’ లాంటి క్యారెక్టర్ ద్వారా నన్ను తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండేలా చేసిన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞలు. రామ్‌చరణ్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ లాంటి పేరుమోసిన ఆర్టిస్ట్‌లతో షూటింగ్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘రంగస్థలం’ లోని ‘ఓయ్ చిట్టిబాబూ’ అంటూ హీరో రామ్‌చరణ్‌ని వేదిక మీద పిలవడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు. అదే నిజమైన అవార్డు – రామ్‌చరణ్ ‘‘రంగస్థలం’ సినిమా నాకే కాదు, యూనిట్ అందరికీ మరచిపోలేని చిత్రం. నిజంగా రెండు కారణాల వల్ల ఈ అవార్డు తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నిజాయతీగా జనాలు ఓటు వేసి అవార్డులు రావడం అనేది చాలా తక్కువ. ఓ జ్యూరీ కమిటీ ఉంటుంది. వారందరూ కూర్చుని ఎంపిక చేస్తారు. అయితే జనాల్లో నుంచి వచ్చినప్పుడే అది నిజమైన అవార్డు. సాక్షి మీడియా జనాల నుంచి ఓటింగ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసి చాలా నిజాయతీగా ఐదేళ్ల నుంచి సౌత్ ఇండియాలో అవార్డులు ఇస్తుండటం అభినందనీయం. ఏ అవార్డు తీసుకున్నా ఆనందం రాదు.. మరి ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు ఓ ఆర్టిస్టుకు నిజంగా ఏదో గెలిచామనే ఆనందం వస్తుంది. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ.. ఇలాంటి అవార్డుల వేడుక ఇంకా ఇంకా కొనసాగాలి. మరో కారణం ఏంటంటే... ఆ వ్యక్తి లేకుంటే, నన్ను కలవకపోయి ఉంటే ఈ అవార్డు లేదు. చాలా మొండోడు.. గట్టోడు. ఏదైనా సాధించేవరకూ వదలడు. పెన్ను పట్టుకుని పేపర్ మీద రాయడం మొదలు పెడితే కథతో, డైలాగులతో, పాత్రలతో ప్రేమలో పడిపోతారు... ఆయనే సుకుమార్. ఆయన డైరెక్టర్ అయ్యారు కానీ, స్కూల్లో లెక్కల మాస్టారులా ఎలా ఉన్నారో షూటింగ్‌లోనూ అంతే.. ఆయన అనుకున్న లెక్కలు వచ్చే వరకూ వదలడు.. ఆ సన్నివేశం అర్థమయ్యేవరకూ మమ్మల్ని వదలడు. స్కూల్ టీచర్లా మమ్మల్ని అలా చెక్కుతూ చెక్కుతూ మంచి నటన రాబట్టుకున్నారు.. థ్యాంక్యూ సుక్కు. నువ్వు అలా రాబట్టుకున్నావు కాబట్టే రంగమ్మత్త నుంచి దేవిశ్రీ, రత్నవేలుగారికి.. ఇలా అందరికీ ఈ ప్రయాణం సులభమైంది ఈ సినిమా చేయడానికి.. సో హాట్యాఫ్ సుక్కు. ‘రంగస్థలం’ సినిమా చేయడానికి నీ ఆలోచనలే నీ బలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. జాతీయ అవార్డుకు ఎంపికైన వారందరికీ అభినందనలు. నన్ను హీరోగా పరిచయం చేసన మా డైరెక్టర్ (పూరి జగన్నాథ్) మొన్ననే ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ కొట్టారు.. ఈ మధ్యనే మాట్లాడాను.. ఏంటో చరణ్.. హిట్ చూసి మూడేళ్లయింది అన్నారు.. సార్.. ఇది మామూలే.. మేమూ అలాంటివి చూశాం. కానీ మీరు మంచి లవబుల్ డైరెక్టర్. ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే మళ్లీ మరచిపోరు.. మీ సినిమా కోసం వేచి చూస్తారంతే.. థ్యాంక్యూ’’ అన్నారు. భారతమ్మ చల్లని నీడలో ‘సాక్షి’ – పూరి జగన్నాథ్ ‘సాక్షి’ అంటే నాకు చాలా అభిమానం. ‘సాక్షి’తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ‘సాక్షి’ని స్థాపించింది మన పెద్దాయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు. ఇప్పుడు ఈ మీడియా సంస్థ భారతమ్మ చల్లని నీడలో విజయపథంలో వెళ్లడం ఆనందంగా ఉంది. ప్రతిఏటా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులికి ఇవ్వడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. నా చేత కూడా అవార్డులు ఇప్పించినందుకు సంతోషిస్తున్నా. కృష్ణంరాజుగారి సినిమాలు చూసి పెరిగినవాణ్ణి. అప్పట్లో ఆయన సినిమాల్లోని ఫైట్స్‌కి ‘డిహే డిహే’ అని సౌండ్స్ వచ్చేవి. ఆ సౌండ్స్ కూడా ట్రెండే. అవార్డు అందుకున్న వేదికపై అవార్డు ఇవ్వడం హ్యాపీ –హాస్యనటుడు అలీ ‘సాక్షి’ మీడియా నాకు ఇదే వేదికపై అవార్డు ఇచ్చింది. ఆరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే వేదికపై నా చేత అవార్డు ఇప్పించిన ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. అప్పట్లో నరేష్‌గారిని చూస్తే హిందీ హీరో వస్తున్నాడు అనే చర్చ జరిగేది. అటువంటి మంచి నటుడికి నేను అవార్డ్ ఇవ్వడం గర్వంగా భావిస్తున్నా. గౌరవంగా భావిస్తున్నా –నరేష్ నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగ ప్రవేశం చేశాను. దర్శకులు జంధ్యాలగారు, మా అమ్మ విజయనిర్మలగారు నా గురువులు. నా మొదటి సినిమాను జంధ్యాలగారి దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉంది. అదే విధంగా బాపు, విశ్వనాథం, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ రంగరావుగార్ల దర్శకత్వాల్లో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాను. నేను అవార్డు కోసం సినిమా చేయను. చేసిన సినిమాకు అవార్డు రావాలని ఎదురు చూస్తుంటాను. ‘రంగస్థలం, మహానటి, సమ్మోహనం’ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఇందుకు నేను గర్విస్తున్నాను. ‘సాక్షి’లాంటి ఉన్నత మీడియా నా నటనను మెచ్చుకుని నాకు అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నా తొలి అవార్డు – రాహుల్ రవీంద్రన్ ఇది నా జీవితంలో తొలి అవార్డు. ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. వారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. ఏడేళ్ల క్రితం ఇదే రోజు నేను నటించిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ విడుదలైంది. ఈ సినిమా అత్యంత ప్రేక్షకాదరణ పొందినా అవార్డును అందుకోలేకపోయాను. ఆ సమయంలో హీరో నాని నాతో ఓ మాట అన్నాడు. ‘రాహుల్... డెబ్యూ ఫిల్మ్‌కి అవార్డు ఒకటి కొట్టు. జీవితంలో గుర్తుండిపోతుందని అన్నాడు. కానీ నేను సాధించలేకపోయాను. నా ఏడేళ్ల సినిమా ప్రయాణంలో ‘సాక్షి’ అందించిన ఈ అవార్డే ఫస్ట్‌ది. అందుకు నేను సాక్షికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డు అందుకోవడం గర్వంగానూ ఉంది. జీవితాంతం రుణపడి ఉంటా –అజయ్ భూపతి నా మనసులో ఉన్న భావాన్ని, నేను ఎలా సినిమా తీయాలనుకుంటున్నాను అనే నా ఆలోచల్ని టెక్నీషియన్స్ గుర్తించారు. ‘పిల్లా రా.. ’ అనే పాటలు ఊపిరిపోశాయి. నేను చెప్పిన ప్రతి సీన్‌కి వాళ్లు ఊపిరిపోయబట్టే ‘ఆర్ఎక్స్–100’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయినే విలన్. అందుకే హీరోయిన్గా, విలన్‌గా రెండు అవార్డులు పాయల్‌కు రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గా నన్ను ‘సాక్షి’ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటాను. ‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా –ఛార్మి ‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా. చాలా హానెస్ట్, జెన్యూన్, సూపర్ టాలెంట్. ఈ మీడియాతో నేను చాలా అనుబంధంగా ఉంటాను. చాలా ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అటువంటి మీడియా సంస్థ నన్ను ఆహ్వానించి, నా ద్వారా అవార్డును ప్రదానం చేయించడం ఆనందంగా ఉంది. ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినిమా ఎక్స్లెంట్ –రెజీనా తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. అటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను కూడా భాగస్వామిని అవడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా నిజంగా ఎక్స్లెంట్. పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులతో పాటు ‘సాక్షి’ మీడియా నన్ను గుర్తించి ‘ఎక్స్‌లెన్స్’ అవార్డును ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చిన్న నటుడికి అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్ – సంపూర్ణేష్ బాబు నేనొక చిన్న నటుణ్ణి. నా నటనను మెచ్చుకుని మెగా ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ రూపంలో వీడియో రావడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా నా లాంటి చిన్న నటుణ్ణి గుర్తించి ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్, రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని మూడు నిమిషాల నిడివిగల డైలాగ్‌ని చెప్పి అలరించాడు. నిజమైన అవార్డు – దేవిశ్రీప్రసాద్ కష్టపడినవాడిని గుర్తించి ఈ అవార్డు ఫలనా వ్యక్తికే చెందినది అంటూ ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. ఇది నిజమైన అవార్డు. గతంలో కూడా ‘సాక్షి’ నాకు అవార్డు ప్రకటించింది. ఆ సమయంలో నేను ఇండియాలో లేకపోవడం వల్ల అందుకోలేని పరిస్థితి. అయినా ఆ అవార్డు దేవిశ్రీ ప్రసాద్‌కే చెందినది అంటూ నా తమ్ముణ్ణి (సాగర్)ని పిలిచి అవార్డు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. అందుకే ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డును రియల్ అవార్డుగా పరిగణిస్తున్నా. నేను సంగీతం అందించిన ప్రతి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ నాకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తున్నందుకు గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయా – పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా నా జీవితంలో గుర్తుండిపోయే ఓ మైలురాయి. ఆ సినిమాతో నేను ఓవర్‌నైట్ స్టార్‌ని అయిపోయా. దర్శకుడు అజయ్ భూపతి నన్ను ఎందుకు హీరోయిన్గా ఎంచుకున్నారో సినిమా విడుదలయ్యాక తెలిసింది. ఆ సినిమా అత్యంత ప్రజాదరణ పొందబట్టే నన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. నాకు ఇంత మంచి పేరు వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నా (ఆనంద భాష్పాలతో). తెలుగు సినీ పరిశ్రమ నాకొక మంచి అవకాశాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అటువంటి ఓ మంచి సినిమాకి సాక్షి అవార్డు ఇవ్వడం నేను గర్వంగా ఫీలవుతున్నా. గర్వంగా ఉంది – పూజాహెగ్డే ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి మంచి సినిమాకు నాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా అభినయం, అందానికి మెచ్చి నాకు ఈ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం హ్యాపీ. అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అ అవార్డుకు ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్. ఆయన నా మీద నమ్మకంతో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్‌లో నన్ను హుందాగా, అందంగా చూపించారు. హీరోయిన్ పాత్రతో పంచ్‌లు వేయించడం ఆయనకే చెల్లింది. గోదావరి ప్రజలకు అంకితం – రత్నవేలు గోదావరి పరిసర ప్రాంతాల్లో ‘రంగస్థలం’ షూటింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాం. తెలుగు సినిమాటోగ్రఫీ ఇంత గొప్పగా ఉంటుందా? అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి, రామ్‌చరణ్‌గారికి థ్యాంక్స్. సాక్షి ఇచ్చిన ఈ అవార్డుని గోదావరి ప్రజలకు అంకితం ఇస్తున్నా. కథ అమ్మలాంటిది – సునీల్ సినిమాల కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రచయిత త్రివిక్రమ్ నన్ను ఆదరించాడు. నేను సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. సినిమాకి కథ అమ్మలాంటిది. అటువంటి కథకు త్రివిక్రమ్ ప్రాణం పోస్తారు. స్క్రిప్ట్రాసే వాడు అమ్మలాంటి వారైతే... దర్శకుడు తండ్రిలాంటి వాడు. తల్లి, తండ్రి కలిసి సినిమాను తీసి, సినిమా ద్వారా ప్రపంచానికి మాలాంటి వారిని పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ‘సాక్షి’ నుంచి అందుకున్న అవార్డు నాకు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి ప్రధాన కారణం త్రివిక్రమే. ఇంకేం ఇంకేం కావాలి – అనంత శ్రీరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటకు అవార్డు రావడం ‘ఇంకేం ఇకేం కావాలే’ అన్నట్టుగా ఉంది. పురస్కారం అనేది ఒక విజయం, ఒక గుర్తింపు. అటువంటి పురస్కారాన్ని సాక్షి నన్ను గుర్తించి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ‘గీత గోవిందం’ సినిమా డైరెక్టర్ పరశురామ్‌గారు నాపై నమ్మకంతో పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పాట రాసి 300 మిలియన్ ప్రేక్షకులు ఆదరించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ప్రత్యేక గుర్తింపు – నిధీ అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు నేను హీరోయిన్గా పరిచయం అయ్యాను. దీనికి ప్రధాన కారణం హీరో నాగచైతన్య. ఆయనకు థ్యాంక్స్. దర్శకుడు చందూమొండేటి నన్ను వెతికి మరీ హీరోయిన్గా సెలక్ట్ చేయబట్టే మీ ముందు ఇలా ఉన్నాను. ‘సాక్షి’ ప్రత్యేకంగా నన్ను గుర్తించి నా నటన మెచ్చుకుని ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం –అడివి శేషు వందశాతం కష్టపడి ‘గూఢచారి’ సినిమాను తీశాను. సినిమా ప్రేక్షాకాదరణ పొందటమే కాకుండా నన్ను ఉన్నత శిఖరంలో నిలబెట్టింది ఈ సినిమా. వందశాతం కష్టపడి చేశాను కాబట్టే సాక్షి నన్ను గుర్తించి ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేసింది. అందుకు సాక్షికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కష్టానికి ప్రతి ఫలమే ఎక్స్‌లెన్స్ అవార్డు. ఈ అవార్డు ప్రత్యేకం – చిన్మయి గాయనిగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబ ప్రోత్సాహమే. ఇంతమంది కథానా యికలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటమే కారణం. నా భర్త రాహుల్ రవీంద్రన్ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, నా భుజం తడుతూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఈ రోజు సాక్షి అవార్డు అందుకోవడం ప్రత్యేకం. సోషల్ మీడియాలో అభినందనలతో పాటు తిట్లు వస్తుంటాయి. నేను కూడా అదే రీతిలో స్పందిస్తుంటాను. -
కన్నుల పండువగా.. సాక్షి అవార్డుల పండుగ
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’ కార్యక్రమం శనివారం కన్నుల పండువగా సాగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా, సాక్షి గ్రూపు మాజీ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి గౌరవఅతిథిగా పాల్గొన్నారు. 2014లో ప్రారంభమైన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ఐదో ఎడిషన్‌లో భాగంగా 2018కి సంబంధించి వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి అవార్డులు ప్రదానం చేశా రు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, క్రీడ లు, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సినీ నటి ఝాన్సీ వ్యాఖ్యానం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దీపికారెడ్డి బృందం ‘స్వాగతాంజలి’కూచిపూడి నాట్యంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథి గా హాజరైన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, గౌర వ అతిథి వైఎస్ భారతీరెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ రంగంలో చెరుకూరి రామారావు, విద్యారంగంలో పెరవలి గాయత్రి, ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా డాక్టర్ రమేశ్ కంచర్ల, తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అవార్డులు అందుకున్నారు. సామాజిక సేవా రంగంలో మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీకాప్డ్ సంస్థ వ్యవస్థాపకురాలు రామలీల, విద్యారంగంలో డాక్టర్ ఐవీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య పరిరక్షణ విభాగంలో డాక్టర్ బిందు మీనన్, క్రీడారంగానికి సంబంధించి గరికపాటి అనన్య, షేక్ మహ్మద్ అరీఫుద్దీన్ తరపున అతడి సోదరుడు అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో డాక్టర్ యాదయ్య, హుసాముద్దీన్‌తోపాటు సబీనా జేవియర్ తరపున దినేశ్ అవార్డులు స్వీకరించారు. ప్రముఖుల చేతుల మీదుగా: ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌ను వైఎస్ భారతీరెడ్డి సన్మానించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిన జ్యూరీ చైర్పర్సన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హాతో పాటు, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన రెయిన్బో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి, రిటైర్డు ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీ రంగా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ పద్మరాజు, కాటన్ బోర్డు మాజీ సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, సురానా టెలికాం ఎండీ నరేంద్ర సురానా, రిటైర్డు ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్ తదితరులకు సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు శేఖర్ విశ్వనాథన్, శంకర్ విశ్వనాథన్, సాక్షి సీఈఓ వినయ్ మహేశ్వరి, సాక్షి మీడియా డైరెక్టర్లు ఎ.లక్ష్మీనారాయణ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, పీవీకే ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. -
సమాజానికి స్ఫూర్తిదాతలు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సభ్యుడిగా ఉంటూ. సమాజం కోసం పాటుపడేవారిని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపిక చేయడం ఆహ్వానించదగిన అంశమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ అవార్డులు పొందిన వారిని చూసి సమాజం స్ఫూర్తి పొందుతుందని ఆయన అన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆరోగ్యం, విద్య తదితరరంగాల్లో విశేష కృషిచేస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీకి అభినందనలు. సమాజం సుఖ, సంతోషాలతో ఉండేందుకు ఆరోగ్య పరిరక్షణ, విద్య అత్యంత కీలకం.ఈ రెండు రంగాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందనే విషయాన్ని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమం నొక్కి చెప్పింది’అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలను నివారించలేమా? ‘సమాజంలో ప్రతికూల ధోరణి క్రమంగా పెరుగుతోంది. పత్రికల మొదటి పేజీ, ఎలక్ట్రానిక్ మీడియాలో విచారకరమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. సమాజంలో చెడు తప్ప మరేదీలేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే ప్రమాదముంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్ ఎస్టేట్) చెప్పుకునే మీడియాకు సంబంధించి.. నేను ఐదో లేదా ఆరో స్తంభంగా నా మనస్సాక్షి మేరకు మాట్లాడాలని అనుకుంటున్నా. నా మాటలు ఫోర్త్ ఎస్టేట్‌తో విభేదించేలా ఉన్నా.. సమాజంలో సానుకూల ధోరణి పెరిగేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఉదయాన్నే ఎస్వీబీసీ లాంటి భక్తి ఛానెల్‌ను చూస్తే ఓ రకమైన సంతృప్తి లభిస్తుంది. కానీ ఆ తర్వాత పేపర్ తెరిచి చూసినా.. టీవీ ఆన్ చేసినా అన్నీ చెడు వార్తలే కనిపిస్తాయి. ఇలాంటి వార్తలను మొదటి పేజీలు, టీవీ హెడ్లైన్లలో రాకుండా నివారించలేమా’అని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించారు. తాను ఏ ఒక్క మీడియా సంస్థనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఇలాంటి సంస్కృతి ప్రబలకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. నివారించాల్సిన బాధ్యత మీడియాపైనా.. ‘వరకట్న వేధింపులు, గృహహింస తదితరాలను పదే పదే చూపే బదులు.. వాటిని నివారించేందుకు మీడియా ఎందుకు ప్రయత్నించదు. ప్రతీ దృశ్యాన్నీ ఫోటోలు, వీడియోలు తీసి చూపడం ద్వారా ఒరిగేదేమిటో నాకు అర్థం కావడంలేదు. ఈ విషయాలను గవర్నర్ హోదాలో కాకుండా.. నా మనస్సాక్షి మేరకు చెప్తున్నా’అని నరసింహన్ వ్యాఖ్యానించారు. ‘ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే పత్రికలు, టీవీ ఛానెళ్లు సమాజంలో అంతర్భాగమే. అందరికీ ఉపయోగపడే విధానాలు రూపొందించేలా మీడియా మార్గనిర్దేశనం చేయాలి. అందులో లోటు పాట్లపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. తద్వారా సమాజం మార్పు దిశగా సాగుతుంది’అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు మీడియా అనుసరించే ధోరణిపై కూడా గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా తన వంతు సామాజిక బాధ్యతగా సహాయ సామగ్రి వంటివి చేరవేయడం ద్వారా ప్రజల్లో సానుకూల ధృక్పథం పెరిగేలా చూడాలన్నారు. ఎవరైనా వెళ్లాల్సిందే.. సెన్సేషనలిజం వద్దు ‘ఈ రోజు సమాజంలో ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితి కనబడుతోంది. సత్యమేవ జయతే నినాదం ఉన్న దేశంలో సెన్సేషలిజం పెరుగుతోంది. సెన్సేషనలిజం ద్వారా పాఠకుల సంఖ్య, టీఆర్పీ రేటింగ్ పెరిగినా.. సమాజానికి మాత్రం నష్టమే చేకూరుతోంది. నిజాలను వెలికితీయడంలో మీడియా మార్గదర్శకత్వంతో వ్యవహరించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఓ వ్యక్తి మరణించకముందే బ్రేకింగ్ అంటూ వార్తలు వేస్తున్న పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ‘ఈ గవర్నర్ వెళ్తున్నాడు.. వెళ్తామని మేము ముందే చెప్పాం’తరహా వార్తలపై నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏదో ఒక గవర్నర్ వెళ్లక తప్పదు అని వ్యాఖ్యానించారు. వార్తల ప్రచురణ, ప్రసారంలో మీడియా సంస్థలు నైతిక విలువలు పాటించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా చర్చలను అరుపులు కేకలు లేకుండా అర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే డైలీ సీరియళ్లకు బదులుగా సంతోషకరమైన కుటుంబ వాతావరణం ఉండేలా వాటిని ప్రసారం చేయాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. ఇతరులు స్ఫూర్తి పొందేలా అవార్డులు సమాజంలో వివిధరంగాల్లో కృషి చేసిన వారికి గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తి లభిస్తుందని సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి అన్నారు. నాలుగేళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాక్షి మీడియా గ్రూపు మాజీ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డు ఐఎఎస్ అధికారి అజేయ కల్లం, ఏపీ డీజీపి దామోదర్ గౌతమ్ సవాంగ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జ్యూరీ చైర్మన్ పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సిన్హా, జ్యూరీ సభ్యులు ప్రణతి రెడ్డి, అరుణ బహుగుణ, చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ రాజే, దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, నరేంద్ర సురానా, వినోద్ కె అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవం
-
‘రంగస్థలం’ చిత్రానికి అవార్డుల పంట
సాక్షి, హైదరాబాద్ : వివిద రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గత నాలుగేళ్లుగా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’లతో ఘనంగా సత్కరిస్తోంది ‘సాక్షి’. 2018కి సంబంధించిన ఈ అవార్డులను ప్రకటించారు. సమాజాభివృద్దిలో భాగంగా.. మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థకు సాక్షి ఎక్స్లెన్స్అవార్డును ప్రకటించారు. యంగ్ అఛీవర్ ఆఫ్ ద ఇయర్‌గా డాక్టర్ ఐవీ నివాస్ రెడ్డి, ఎక్సలెన్స్ ఇన్ ఫామింగ్‌లో చెరుకురి రామారావు, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో పి. గాయత్రి, భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రకటించారు. ఇక సినీ రంగం విషయానికొస్తే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా మహానటి, మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రామ్ చరణ్ ఎంపికయ్యారు. అవార్డుల వివరాలు.. లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు : రెబల్‌స్టార్ కృష్ణంరాజు మోస్ట్ పాపులర్ డైరెక్టర్ : సుకుమార్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ : దేవీ శ్రీ ప్రసాద్ మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫర్ : రత్నవేలు మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : నరేష్ మోస్ట్ పాపులర్ యాక్టర్ (నెగెటివ్ రోల్) : పాయల్ రాజ్‌పుత్ మోస్ట్ పాపులర్ యాక్టర్ : పూజా హెగ్డే మోస్ట్ పాపులర్ డెబ్యూ హీరోయిన్ : నిధి అగర్వాల్ మోస్ట్ పాపులర్ కమెడియన్ : సునీల్ మోస్ట్ పాపులర్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ : గూఢాచారి మోస్ట్ సక్సెస్ఫుల్ బాక్సాఫీస్ హిట్ : ఆర్ఎక్స్ 100 డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ : రాహుల్ రవీంద్రన్ మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (మేల్) : అనురాగ్ కులకర్ణి మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్) : చిన్మయి శ్రీపాద మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్ : అనంత శ్రీరామ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ : డాక్టర్ రమేష్ కంచర్ల తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ : మిథాలీ రాజ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ : డాక్టర్ బిందుమీనన్ ఫౌండేషన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : మహ్మద్ హుస్సాముద్దీన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : గరికపాటి అనన్య జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : డాక్టర్ యాదయ్య యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : షేక్ మహ్మద్ ఆరీఫుద్దీన్ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : సబీనా జేవియర్ -
ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ సేవ, అత్యుత్తమ ప్రతిభ, విశేష కృషి ద్వారా తమ రంగాల్లో సమాజాభివృద్ధికి దోహదపడుతున్న వారికి ప్రతి ఏటా అందించే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల ప్రధానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ఇతర ముఖ్యులు అతిథులుగా పాల్గొనే ఈ వేడుకలో 2018 సంవత్సరం సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ సేవ, మరికొందరి విశేష కృషి.. తగు రీతిన గుర్తింపు పొందడమే కాకుండా సమకాలికులకు, తర్వాతి తరాల వారికి స్ఫూర్తి కావాలనేదే సాక్షి తలంపు. ఇదే యోచనతో, సమాజంలోని వేర్వేర రంగాల్లో విశేషంగా శ్రమిస్తున్న వారిని గుర్తించి, అభిమానించి, అభినందించి, అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని సాక్షి మీడియా సంస్థ గత నాలుగేళ్లుగా నిర్వహిస్తోంది. వరుసగా ఇది ఐదో సంవత్సరం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యవసాయ, సామాజిక సేవ తదితర రంగాలతో పాటు వివిధ విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. సినిమా రంగానికి చెందిన పాపులర్ అవార్డులతో పాటు జ్యూరీ ప్రత్యేక అవార్డులను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు. సమా జ ఉన్నతికి తోడ్పడే కృషి ఏదైనా, అది.. వినూత్నంగా చేయడం, ప్రభావవంతంగా ఉండటం, సుస్థిరమై నిలవడం అన్న మూడంశాల ప్రాతిపదికన ఈ విజేతల్ని ఎంపిక చేశారు. అసాధారణ సేవ, కృషి, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సంస్థల గురించి పలువురి ద్వారా అందిన ఎంట్రీలను లోతుగా పరిశీలించి, ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయనిర్ణేతలు అంతిమంగా విజేతల్ని ఖరారు చేశారు. శనివారం జరిగే ఈ అవార్డు ప్రదానోత్స కార్యక్రమ విశేషాలను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సాక్షి టీవీ ప్రసారం చేయనుంది. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం జ్యూరీ సమావేశం
-
ప్రతిభకు పట్టం కడదాం
ప్రతిభ ఏదైనా.. పట్టం కడదాం.. రంగం ఏదైనా.. ప్రతిభే కొలమానం. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతి భ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన జ్యూరీ ‘సాక్షి’కి వచ్చిన ఎంట్రీల నుం చి విజేతలను ప్రకటిస్తోంది. 2018కి సం బంధించి ‘సాక్షి’అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 2019, మార్చి 30 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎంట్రీలు అందుతున్నాయి. ప్రతిభను గుర్తించిన వారెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంప వచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సామాజిక సేవ, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో రాణిస్తున్న వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. కొందరికి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం విభాగాల్లోనూ అవార్డులున్నాయి. నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన ఉన్న వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది, ‘సాక్షి’చేస్తున్న ఈ కృషికి చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards@sakshi.com లాగిన్ కావచ్చు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబర్‌పై సంప్రదించవచ్చు. ఈమెయిల్: sakshiexcellenceawards@sakshi.com -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2018: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ఏ రంగంలోనైనా ‘అవార్డులు’ ఇవ్వడానికి ప్రధానంగా మూడు లక్ష్యాలుంటాయి. ఒకటి, అప్పటివరకు విశేషంగా కృషి చేస్తున్న, ప్రతిభ చూపిన, సేవలందిస్తున్న వారిని గుర్తించి నలుగురికి తెలిసేలా సత్కరించడం. రెండు, సదరు అవార్డుతో బాధ్యతాయుతంగా వారా కృషి–ప్రతిభ–సేవను మరింత కొనసాగించేట్టు చేయడం. మూడు, సమాజానికి మేలయ్యేలా ఇతరులలో ఆ స్ఫూర్తి రగిలించడం! అక్షరాలా ఇది సాధించే లక్ష్యంతో గత నాలుగేళ్లుగా సాక్షి ఈ కృషిని యజ్ఞంలా నిర్వహిస్తోంది. వేర్వేరు రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గుర్తిస్తోంది. ‘‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’’లతో వారిని ఘనంగా సత్కరిస్తోంది. ఏటా నగరంలో ఓ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రముఖుల సమక్షంలో వారికా అవార్డుల్ని అందజేస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ, సేవ, దయ.... ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికి తీస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులు న్యాయనిపుణులుగా ఏర్పాటైన ‘జ్యూరీ’ సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతల్ని నిర్ణయించి ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురు 2014 నుంచి 2017 వరకు ఏటా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అన్ని వయసుల వారూ ఈ విజేతల్లో ఉన్నారు. 2018కి సంబంధించిన సాక్షి అవార్డుల ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలయింది. 28 ఫిబ్రవరి, 2019 సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఎంపిక ప్రక్రియలోనూ ప్రత్యేకత! ఏమంటే..... ఎవరికి వారు సొంతంగా ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభ, అసాధారణ నైపుణ్యం, విశిష్ట కళ, నిష్కళంక సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరపున సాక్షికి ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా ఎంట్రీలను పరిశీలించిన మీదట, అర్హమైన వాటిని నిపుణుల జ్యూరీకి సిఫారసు చేస్తారు. జ్యూరీ తుది విజేతల్ని ఎంపిక చేస్తుంది. విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో అసాధారణంగా రాణించే, ప్రతిభ చూపే, సేవ చేసే వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుల కోసం గుర్తిస్తారు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు! ఇంకా, సినిమా రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారికి ‘ప్రజాదరణ’ ఆధారంగా ఎంపిక చేసి, అవార్డులిచ్చే పద్ధతీ ఉంది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం, ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం – నేపథ్యగానం విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, లక్ష్య సాధనను అభినందించడం... ఎవరమైనా చేయదగినదే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి ప్రతిభా మూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ ఈ అవార్డుల కోసం ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం www.sakshiexcellenceawards.com లాగిన్ కాగలరు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు. ఈ–మెయిల్: sakshiexcellenceawards@sakshi.com. -
ఈ పురస్కారం నాకు గర్వకారణం..
సాక్షి, హైదరాబాద్: ‘‘గత శనివారం సైరా షూటింగ్ చాలా ముమ్మరంగా జరుగుతుండటం వల్ల నేను అవార్డ్ ఫంక్షన్‌కు హాజరుకాలేకపోయాను. కానీ నా మీద ఎంతో అభిమానంతో ‘సాక్షి’ చైర్పర్సన్ భారతీగారు అవార్డుని నాకు అందజేయాలనుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును అందజేయటానికి ‘సాక్షి’ సంస్థ ప్రతినిధులు పెద్దలు శ్రీ రామచంద్రమూర్తిగారు, సోదరుడు రామ్‌గారు వచ్చి కలవటం సంతోషంగా ఉంది’’అని నటుడు చిరంజీవి అన్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2017’కు సంబంధించి బెస్ట్ హీరో అవార్డును చిరంజీవి స్వగృహంలో ఆయనకు బుధవారం అందజేసింది ‘సాక్షి’ మీడియా. ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘భారతీ గారు నాకు సోదరి లాంటి వారు. నా మీద ఎంతో అభిమానంతో అవార్డుతోపాటు ఓ చాక్లెట్ బాక్స్ పంపారు. ఇది ఆమె తియ్యని మనసుకు నిదర్శనం. ‘సాక్షి’ గ్రూప్ వారు గత నాలుగేళ్లుగా ఈ ఎక్స్‌లెన్స్ అవార్డులు ఇస్తున్నారు. గతంలో నేను కూడా ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నాను. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వాళ్లందరినీ గుర్తించి వారిని ఇలా ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. అలాగే జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించిన కృష్ణ, విజయనిర్మల గార్లకు, ఇదే అవార్డును స్వీకరించిన చుక్కా రామయ్య గారికి నా అభినందనలు. ఇదే విధంగా ‘సాక్షి’ ఎల్లప్పుడూ ఔత్సాహికులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నా విషయానికొస్తే అవార్డు నాకు రావటానికి దోహదపడింది ‘ఖైదీ నంబర్ 150’ సినిమా. 9 ఏళ్ల తర్వాత వచ్చిన నా కమ్ బ్యాక్ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఆ విధంగా ప్రజల్లో నా స్థానం సుస్థిరం అని మరోసారి రుజువైంది. వాళ్ల ప్రేమను నిజం చేస్తూ వచ్చిన ఈ అవార్డును అందుకోవటం నాకు గర్వంగా, ఆనందంగా ఉంది’’అన్నారు. సైరా చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘ఇది చాలా మంచి రోజు. నాకు ఈ అవార్డును అందించిన రోజు ఆగస్టు 15. ఈ సందర్భంగా నేను చేస్తున్నది దేశభక్తిని తెలియజేసే సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితగాధ ఆధారంగా తీస్తున్న సినిమా సైరా. దేశం యావత్తూ గర్వించే గొప్ప సినిమా చరిత్రలో నిలిచిపోతుంది..జైహింద్’’ అంటూ ముగించారు. అవార్డు స్వీకరించిన ఆనందాన్ని మనవరాళ్లు సమార, సంహిత, నివృతితో పంచుకుంటున్న చిరంజీవి -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చుక్కా రామయ్య
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: జీవిత సాఫల్య పురస్కారం: సూపర్ స్టార్ కృష్ణ,విజయ నిర్మల
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్)- ఎమ్.మధుప్రియ
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ వల్గోట్ కిషన్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్ స్వాతి, విజయ్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ సుజాత
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ పుల్లెల గోపీచంద్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: తెలుగు ఎన్ఆర్ఐ ఆఫ్ ద ఇయర్ సురేశ్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్టార్టప్ అల్లోల దివ్యారెడ్డి
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ జగదీశ్ యాదవ్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్ ఉమెన్ షేక్ జఫ్రీన్
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ నారాయణరెడ్డి
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వెంకటేశ్వరరావు
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ - ఎడ్యుకేషన్ బాల లత
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు ఆశ్రిత
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: స్పెషల్ జ్యూరీ రికగ్నిషన్ స్పోట్స్ మేల్ అవార్డు అజయ్ కూమర్ రెడ్డి
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ శేఖర్ కమ్ముల
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ సెంథిల్ కుమార్
-
కన్నుల పండువగా‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులు
-
సాక్షి ఎక్స్‌లెన్స్ పురస్కార విజేతలు వీరే!
వినూత్నమైన, ప్రభావవంతమైన, సుస్థిరమైన మార్పుకోసం కృషిచేస్తున్న ఎందరో మహానుభావులు... వారిలో కొందరికి సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు నిత్యవిద్యార్థి నాన్న గారి మాటలే నాకు స్ఫూర్తి. ‘నడవలేవని బాధపడవద్దు, పదిమందిని నడిపించే స్థాయికి చేరు’ అని చెప్పారు. ఆయన కోరుకున్న బాటలో నడుస్తున్నాను. కాళ్లు లేవని బాధపడను, సమాజానికి ఏమీ చేయలేనప్పుడే బాధపడతాను. – బాల లత (యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – ఎడ్యుకేషన్) ‘‘ఒక అమ్మాయి జీవితమంటే సోదరి, భార్య, తల్లి ఇంతేనా? ఈ భూమ్మీదకు వచ్చినందుకు మనకంటూ ఏదైనా చేస్తే తృప్తిగా ఉంటుంది’’ ‘జీవితంలో తానిక నడవలేను’ అని తెలుసుకున్న బాలలత మనసులో మెదలిన ఆలోచన ఇది.అదే ఆమె సంకల్పంగా మారింది. ప్రస్తుతం భారత రక్షణశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలలత ఆత్మసంతృప్తికోసం తాను అనుకున్నది సాధించారు, ఇంకా సాధిస్తూనే ఉన్నారు. మల్లవరపు బాలలతది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జడి జమాల్పూర్ గ్రామం. తల్లి విజయరాణి, తండ్రి శౌరయ్య. పోలియో చుక్కలు వికటించడంతో నడకకు దూరమైన లతను తల్లిదండ్రులు తిప్పని ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఊళ్లు తిరగడంతో బడికి దూరమవడం తప్ప మరో ఫలితం కనిపించలేదు. అమ్మానాన్న శ్రద్ధగా బోధించడంతో పదవతరగతి పూర్తి చేసిన బాలలత ఆ తర్వాత చదువంతా దూరవిద్యలోనే పూర్తిచేశారు. ఇంటర్లో రెండుసబ్జెక్టులు ఫెయిలయినపుడు కొందరు నవ్వారు, అయినా ఆమె కుంగిపోలేదు. లా ఎంట్రన్స్ లో ఫస్ట్ ర్యాంకు వచ్చినపుడు చాలామంది చప్పట్లు కొట్టారు, ఆమె పొంగిపోనూలేదు. తనకు తృప్తి కలిగించే విజయం కోసం చదువుల యజ్ఞం సాగించారామె. పట్టుదలతో సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే 399 ర్యాంకు సాధించారు. అయినా ఆమె చదువుల ప్రయాణం ఆగిపోలేదు. సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడాలనుకున్నారు. తనలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లలో ఆత్మస్థయిర్యాన్ని నింపి, వారికి చేయూతనివ్వాలనుకున్నారు. బోధించేవాళ్లు ఎప్పుడూ విద్యార్థులతో పోటీ పడాలని నమ్మే బాలలత 2016లో రెండోసారి సివిల్స్ రాసి 167వ ర్యాంకు సాధించారు. ఐఎఎస్ వచ్చినా ఎందుకు వెళ్లలేదని అడిగితే ‘‘నా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపడానికే నేను మళ్లీ సివిల్స్ రాశాను’’ అంటారు. విధి చేసిన తప్పిదాన్ని తన విజయాలతో సరిచేసి, చుట్టూ ఉన్న సమాజానికి తన కాళ్లవైపు చూసే అవసరం లేకుండా చేసిన విజేత ఆమె. దేశానికి ఎక్కువమంది అధికారులను అందించడంలోనే తనకు సంతృప్తి ఉంటుందంటున్న ఈ చదువుల తల్లిని... ఎడ్యుకేషన్ విభాగంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి. వెలుగు వీచికలు మేము జంటగా ఎన్నో చోట్ల స్ట్రీట్ ఆర్ట్ వేశాం. ఓ అర్ధరాత్రి జెఆర్సి సెంటర్ గోడలకు కూడా. ఇప్పుడు అదే జెఆర్సిలో అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రకారులుగా రాణిస్తూ, సందేశాన్ని కళాత్మకంగా చెప్పాలనేది మా కోరిక. – స్వాతి, విజయ్ (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్, స్పోర్ట్స్) గోడలపై రాతలంటే మనం తక్కువగా చూస్తాం. కానీ... వాళ్లు గీసే గీతలు, రాసే రాతలు, వేసే బొమ్మలు చూస్తే మాత్రం క్షణం ఆగి ఆలోచిస్తాం. ఆ కళాకారులు ఎంచుకున్న దారి అంత గొప్పది మరి. ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతి, హైదరాబాద్ వాసి విజయ్... ఇద్దరూ హైదరాబాద్ జేఎన్టీయూలో ఫైన్ఆర్ట్స్ చదువుకున్నారు. అక్కడే ఒకరికొకరు పరిచయమయ్యారు. కళతోపాటు జీవితాన్నీ పంచుకున్నారు. నచ్చిన బొమ్మలు వేసి ఏడాదికో గ్యాలరీ పెట్టుకోవడం ఈ జంటకు సంతృప్తినివ్వలేదు. కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నారు. సమాజానికి ఆర్ట్ ద్వారా ఏదైనా సందేశాన్ని చేరవేయాలనుకున్నారు. రోడ్లపైన, గోడలపైన కొటేషన్లు, పెయింటింగ్స్‌తో అలాంటి ప్రయత్నమే చేశారు. ఆ కళ పేరు గ్రాఫిటీ. తమ ప్రతిభతో ఫ్రెంచ్ ఎంబసీ స్కాలర్ షిప్ గెలుచుకున్న ఈ జంట, పారిస్‌లో తొమ్మిదినెలలు కళావిహారం చేసింది. స్ట్రీట్ ఆర్ట్‌కి అక్కడ ఉన్న ఆదరణ వారిని అబ్బురపరచింది. తాము ఎంచుకున్న పనిని మరింత వేగంగా ఎలా చేయాలో తెలుసుకున్నారు. జనసంచారం ఉండేచోట ఖాళీగా ఒక గోడ కనిపిస్తే... తెల్లారేసరికి అదొక సందేశంగా మారిపోవచ్చు. అది మనల్ని ప్రశ్నగా నిలదీయొచ్చు. బాధ్యతను గుర్తుచేయొచ్చు కూడా. రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లారి నాలుగు గంటల్లోగా పని పూర్తి చేస్తారు. ఈ కళాకారులకు ఇది హాబీ కాదు, సొంత ఖర్చులతో చేసే ఉద్యోగం. ఇదే జీవితం. రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ ఐదెకరాల పొలంలో సేవ్ ఫార్మర్ నినాదాన్ని సృష్టించి ప్రపంచాన్నే ఆలోచింపజేశారు. డ్రాపవుట్స్ కారణంగా విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో ప్రభుత్వం ఏకంగా రెండువేల పాఠశాలలను మూసేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ వార్త చదివి చలించిపోయిన ఈ జంట సర్కారు బడికి కొత్త రూపు ఇచ్చి డ్రాపవుట్స్‌ని తగ్గించే బాధ్యతనూ తలకెత్తుకుంది. 2014లో జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరయ్యారు ఈ గ్రాఫిటీ కళాకారులు. రాత్రిపూట కుంచెను కదిలిస్తూ పగటికి కొత్త వెలుగును ప్రసాదిస్తూ... గొప్ప గొప్ప ఆలోచనలకు గోడ కడుతున్న స్వాతి విజయ్‌లను, సోషల్ సర్వీస్ విభాగంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్’ సత్కరిస్తోంది సాక్షి. టెక్ సేద్యం యాభై మూడేళ్ల వయసులో నేను అవార్డు అందుకోవడానికి వచ్చింది నేచురల్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే. వ్యవసాయం తెలియని నేను కేవలం పాలేకర్ పుస్తకాలు చదివి వ్యవసాయం నేర్చుకున్నాను. అందరూ నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించండి, స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోండి. – గుళ్లపల్లి సుజాత (ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్) గుళ్లపల్లి సుజాత స్వస్థలం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారకట్ల. గ్రాడ్యుయేషన్ చేసి, గ్రానైట్ ఎగుమతి వ్యాపారంలో అనుభవం గడించారామె. కానీ... ఒక్కసారిగా తనకు ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏకంగా నలభై ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నారు. కారణం... అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక గొప్ప ఆలోచన. సుజాత బంధుమిత్రుల్లో చాలామంది వైద్యులున్నారు. వారంతా ఆహారం విషయంలో చాలా పద్ధతులు పాటించేవారు. అయినాసరే తమవారి కుటుంబాల్లో కొందరు క్యాన్సర్ బారిన పడటం, దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురికావడం సుజాతను కలచివేసింది. వీటన్నింటికీ కారణం రసాయనిక అవశేషాలున్న ఆహారపదార్థాలు తినడమేనని ఆమె గ్రహించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన ఆహారోత్పత్తులే తినాలని నిశ్చయించుకున్నారు. కానీ అవి అంత సులువుగా దొరికేవి కావు. అలాంటి సమయంలో మనమే ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేయకూడదు అనుకున్నారు.పెదారకట్ల వద్ద రాళ్లు రప్పలతో నిండిన 40 ఎకరాల పొలం తీసుకుని సాగు మొదలుపెట్టారు సుజాత. డ్రిప్ ఇరిగేషన్ సాయంతో పండ్లతోటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు చేసి మంచి దిగుబడి సాధించారు ఈ మహిళారైతు. వ్యవసాయం చేస్తూనే, అందులో అనుభవం సంపాదించిన సుజాత ఇప్పుడు తమ బంధువులతోపాటు ఎంతోమందికి స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తుల్ని అందించగలుగుతున్నారు. మెకానికల్ ఇంజనీరైన భర్త కోటేశ్వరరావు సాయంతో పొలంలోనే సొంత ఖర్చులతో ఓ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు సుజాత. టెక్నాలజీని తనకు అనుగుణంగా మలచుకున్న సుజాత 40 ఎకరాల క్షేత్రాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తుంటారు. మొదట్లో తాను పండించిన కూరగాయలు, పప్పుధాన్యాలు బంధువులకు మిత్రులకు ఉచితంగా పంపిణీ చేసి వారిలో అవగాహన పెంచారు. ఇప్పుడు వ్యవసాయశాఖ అధికారులతో పాటు ఎంతోమంది తన ఇంటికే వచ్చి ఉత్పత్తులు తీసుకెళ్లడం తనకెంతో సంతోషాన్నిస్తుందంటారామె. పదిమంది ఆరోగ్యం కోసం సాగునే వృత్తిగా ఎంచుకున్న ఈ ఆదర్శరైతును ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017, ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్’ విభాగంలో సత్కరిస్తోంది సాక్షి. గిరిజన సేవ వైద్యం అందని ప్రాంతాల్లో రోగి ఇంటి ముందుకే వైద్యాన్ని చేరుస్తున్నాం. మా ఆలోచన చెప్పగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మమ్మల్ని ప్రోత్సహించారు. నాలుగున్నరేళ్ల మా ప్రయాణంలో కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లలేని వేలాది మందికి వైద్యం అందించాం. – డాక్టర్ పద్మనాభరెడ్డి, సీఈవో, నైస్ ఫౌండేషన్ (ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్) భగవంతుడు ప్రాణాలు పోస్తాడు. వైద్యుడు ప్రాణాలు నిలుపుతాడు. అందుకే మన సమాజంలో వైద్యుడిని దేవుడితో సమానంగా ఆరాధిస్తారు. వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో, నిరుపేదలకు ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు ఫీజుతో అవసరమైన వైద్యచికిత్సలు అందించడానికి ఏర్పాటైంది నైస్ ఫౌండేషన్. నిరుపేద బాలికలు, గర్భిణీలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఈ ఫౌండేషన్. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో కమ్యూనిటీ హెల్త్ ఇంటర్వెన్షన్ ప్లాన్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలకు వెళ్లి గిరిజన స్త్రీలు, పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది నైస్ ఫౌండేషన్. నల్గొండ, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని 160 గ్రామాల్లో ఉచిత వైద్య సేవలందిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది నైస్. పలు గ్రామాల్లో మంచానికే పరిమితమైన పేషెంట్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తోంది నైస్. ఐదు మండలాల్లోని 256 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాల వైద్యసేవలను ఉచితంగా అందచేస్తూ, శిశుమరణాలకు అడ్డుకట్ట వేయాలనే ఆశయంతో నవజాత శిశువుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది ఈ ఫౌండేషన్. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న నైస్ ఫౌండేషన్‌ను 2017 సంవత్సరానికి గాను హెల్త్‌కేర్ రంగంలో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. ఆటుపోట్ల గెలుపు నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన మా అమ్మానాన్నలకు వందనాలు. – షేక్ జఫ్రీన్ (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్) చిన్నతనంలోనే టెన్నిస్ ఆటపై మక్కువ పెంచుకుంది షేక్ జఫ్రీన్. కూతురి అభిరుచి గుర్తించిన తండ్రి షేక్ జహీర్ అహ్మద్ కూతురిని మంచి క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు తన సర్వస్వం త్యాగం చేశారు. నిరంతర శిక్షణ, టోర్నమెంట్లలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా టూర్లు, ఇతర ఖర్చుల కోసం ఆస్తి మొత్తం అమ్మేశారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి లక్ష్యంగా దిశగా అంతులేని విశ్వాసంతో ముందుకు సాగారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు. ఆడపిల్లకు ఆటలెందుకని సూటిపోటి మాటలు. అయినా సరే, కూతురి మీద, ఆమె ఎంచుకున్న టెన్నిస్ మీద నమ్మకం కోల్పోలేదు జహీర్ అహ్మద్. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జఫ్రీన్ తన ఆటతీరుతో కొద్దికొద్దిగా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటికే జఫ్రీన్ ఆట కోసం తండ్రి తనకున్నదంతా ఖర్చు చేసేశారు. సొంత ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఇక అమ్మడానికి ఏమీ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జఫ్రీన్ పట్టుదలతో సాధన చేసింది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంట్లలో పాల్గొని అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. కాని స్పాన్సరర్స్ ఎవరూ ముందుకు రాలేదు. తండ్రీకూతుళ్లు ఆటను విడిచి పెట్టలేదు. 2013లో బల్గేరియాలో జరిగిన డెప్లింపిక్స్లో ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది జఫ్రీన్. ఆ తరువాత నుంచి జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాకెట్లా దూసుకుపోయింది. 2017లో జరిగిన డెప్లింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి తన తండ్రి కల నెరవేర్చింది. చిత్రమేమిటంటే, జఫ్రీన్‌కు వినిపించదు, మాటలు సరిగ్గా రావు. అయినా ఇవేవీ ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. షేక్ జఫ్రీన్‌కు జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ – ఫిమేల్ కేటగిరీలో ఎక్స్‌లెన్స్ అవార్డు అందిస్తోంది సాక్షి. తొలగిన చీకటి మా అమ్మానాన్నల కళ్లెదుట, వారి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పురోగతిలో ప్రధాన భూమిక వారిదే. నా స్నేహితులు, సంస్థ (ఎస్బిఐ)తోపాటు నాకు పూర్తి సహకారం అందిస్తున్న టీమ్‌కి కృతజ్ఞతలు. – ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి (జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు – స్పోర్ట్స్) గ్రౌండంతా కలియతిరుగుతూ అందరినీ ఉత్సాహ పరుస్తూ, క్రికెట్ ఆడే ఓ కుర్రాడు నాలుగేళ్ల వయస్సులో హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. ఇంట్లో కరెంటు పోవడంతో, చీకట్లో పరుగెత్తి, గుమ్మానికి బలంగా గుద్దుకున్నాడు. దానితో ఒక కన్ను పోయింది, మరో కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి పాక్షికంగా కంటిచూపు దెబ్బతింది. పిల్లవాడి భవిష్యత్తు అంధకారమైపోతుందని తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఆ చిన్నారి మాత్రం ధైర్యం కోల్పోలేదు. క్రికెట్ ఆడలేనేమోనన్న∙భయం తెలిసే వయసు కాదు అది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని లూథరన్ అంధుల పాఠశాలలో చేరి పదోతరగతి పూర్తి చేశాడు. ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ చదువుతూనే పట్టుదలగా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయస్థాయిలో అనేక క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించాడు. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, రైటార్మ్ ఫాస్ట్ బౌలర్‌గా సేవలందిస్తూ, అనేక విజయాలు సాధించాడీ యువకుడు. 2016 నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు కొనసాగిస్తూనే, ఆటలో ప్రతిభను ప్రదర్శిస్తూ, క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. గుంటూరు జిల్లా గురజాలలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి తనకు ఎదురైన అడ్డంకులన్నిటినీ అధిగమించాడు. విశిష్టమైన ఆటతీరుతో ఇప్పటికే 80 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, యాభైకి పైగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సాధించారు అజయ్. అనేకమార్లు తన జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. ఆసియా కప్, రెండో టి 20 వరల్డ్ కప్, ఐదో వన్ డే అంతర్జాతీయ ప్రపంచ వరల్డ్ కప్పులను సాధించారు. ఈ యువకుణ్ణి స్పోర్ట్స్ కేటగిరీ పురుషుల విభాగం, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి. నేలమ్మ బిడ్డ శాస్త్రవేత్త వెంకటరెడ్డి చెప్పినట్లు పోషకాలు, పురుగు మందు అన్నీ మట్టిలోనే ఉన్నాయి. ఇదే నా నమ్మకం, ఇదే నా సాగు రహస్యం. నా అనుభవంలో నేర్చుకున్నది కూడా ఇదే. పంటకు సోకిన ఎలాంటి తెగులైనా సరే మట్టి ద్రావణం చల్లితే చాలు... పురుగు నాలుగు రోజుల్లో చచ్చిపోతుంది. – తుమ్మల జగదీశ్ యాదవ్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్) ఎదిగే బిడ్డను చూసి తండ్రి మురిసిపోయినట్టు... పెరిగే పంటను చూసి రైతు సంతోషిస్తాడు. జగదీశ్ యాదవ్ వేసిన చెరకు పంట నిచ్చెన వేసుకుని ఎక్కేంత ఎత్తు ఎదిగింది. సాగు అతనొక్కడిదే అయినా సంతోషం మనందరిదీ. ఎందుకంటే... అతను చేసింది సేంద్రియ వ్యవసాయం. మట్టిని నమ్ముకున్న రైతు ఎప్పుడూ నష్టపోడు అంటారు. అది కేవలం నమ్మకం మాత్రమే కాదు, నూటికి నూరుశాతం నిజమని నిరూపిస్తున్నారు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన తుమ్మల జగదీష్ యాదవ్. డిగ్రీ చదువుకున్న జగదీష్ తండ్రి బాటలోనే పొలంబాట పట్టి వ్యవసాయాన్నే ఉద్యోగంగా ఎంచుకున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా తనకున్న 30 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టిద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషిని ఆచరణలో పెట్టి ఫలితాలు సాధించి చూపిస్తున్నారు జగదీష్ యాదవ్. సివిఆర్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ కేవలం మట్టిని పిచికారీ చేస్తే అతని పొలంలో చెరకు 15 అడుగుల ఎత్తుకు పెరిగింది. పంటకు వేయడానికి ముందు పొలంలో గొర్రెల మందను కట్టేయడం, పంట కాలంలో పదిసార్లు మట్టి ద్రావణాన్ని స్ప్రే చెయ్యడం మినహా ఈ రైతు ఎలాంటి మందులు, ఎరువులు వాడలేదు. ఈ ద్రావణం తయారీలో రెండు రకాల మట్టిని ఉపయోగిస్తారు. భూమికి పైన ఆరంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని పై మట్టిగా, ఆ తర్వాత మరో నాలుగు అంగుళాల లోతు వరకు తవ్విన మట్టిని లోపలి మట్టిగా పరిగణిస్తారు. ఈ రెండింటినీ సమపాళ్లలో నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేసి దాన్ని పంటపై పిచికారీ చేస్తారు. ఇదే పద్ధతిలో జగదీష్ యాదవ్ పత్తి, కంది, మొక్కజొన్న, ఇతర కూరగాయలు పండిస్తూ అద్భుత దిగుబడి సాధిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడే రైతులు ఎకరానికి 20 వేలు పెట్టుబడి పెడుతుంటే... అందులో పదవవంతు కంటే తక్కువ పెట్టుబడితో అత్యధిక రాబడి అందుకుంటూ మరింతమంది రైతుల్ని సేంద్రీయ వ్యవసాయం వైపు చూసేలా చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తూ, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తోన్న ఈ మట్టిమనిషిని ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 ఉత్తమ రైతు’గా సత్కరిస్తోంది సాక్షి. గలగలా... గోదావరి వృత్తి అయినా, వ్యాపారం అయినా... విలువలతో కూడి ఉండాలి. అదే మన సమాజానికి, దేశానికీ గర్వకారణం. – వెంకటేశ్వరరావు(బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్) రైతులకు నాణ్యమైన పైపులను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిందే గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ‘గోదావరి పైపులే రైతుకు శ్రీరామ రక్ష’ అంటూ... 1991లో ఈ సంస్థ్ధను రాజేంద్ర కుమార్‌తో కలిసి ప్రారంభించారు సి.వెంకటేశ్వరరావు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ చేశారు. అంతేకాదు, ఆయన యూనివర్సిటీ టాపర్ కూడా. వారి కుటుంబ నేపథ్యం కూడా వ్యాపార వాణిజ్యరంగం కావడంతో ఆయన 16 సంవత్సరాల వయసులోనే కార్గో బిజినెస్‌ను ప్రారంభించారు. ఆయన సారథ్యంలో గోదావరి పాలీమర్స్ కంపెనీ దాదాపుగా 3.5లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. ఎపి, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం కార్యకలాపాలు కొనసాగిస్తోంది గోదావరి పాలీమర్స్ ఇండస్ట్రీ. సంవత్సరానికి 240 టన్నుల ప్రొడక్షన్‌తో ప్రారంభమైన గోదావరి పాలీమర్స్... ఆయన ఆధ్వర్యంలో 25వేల టన్నుల సామర్థ్ధ్యానికి విస్తరించింది. 20 ఎమ్.ఎమ్. పైపు సైజ్ నుంచి 500 ఎమ్.ఎమ్. పైపుల వరకు తయారు చేస్తున్నారు. హెచ్‌డిపిఈ పైప్ ఫిట్టింగ్స్, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులను రైతులకు అందిస్తోంది. కంపెనీ టర్నోవర్ సైతం 0.42 కోట్ల నుంచి 342 కోట్లకు చేరడంలో వెంటేశ్వరరావు కృషి అభినందనీయం. ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి పంట పొలాలకు మళ్ళించడమే తమ లక్ష్యం’ అంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న గోదావరి పాలీమర్స్ ఫౌండర్ కమ్ ఎం.డి... సి. వెంకటేశ్వరరావు... ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017– బిజినెస్ విభాగంలో బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి. విద్యాగంధం నాకు 92 ఏళ్లు, ఇంత వరకు ఒక్క అవార్డు కూడా తీసుకోలేదు. సాక్షి మీడియా సంస్థ నిర్వర్తిస్తున్న విశిష్టమైన కర్తవ్యమే నన్ను అవార్డుకి అంగీకరించేటట్లు చేసింది. – డాక్టర్ చుక్కారామయ్య(లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు) ఆయన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘ఎంతకాలం ఈ అన్యాయం’ అని గట్టిగా ప్రశ్నించి, ఊరి పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. దళితులు, అణగారిన వర్గాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. నాటి నైజాము ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించారు. రజాకార్ల దౌర్జన్యాలపై తిరగబడ్డారు. సహించలేని కర్కశ నిజాం ప్రభువులు అరెస్టు చేయడంతో ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు. చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడారు. ఆయనే చుక్కా రామయ్య. తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని విద్యావేత్త. ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థులకు ఐఐటీల్లో ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం కల్పించిన విద్యాదాత. క్లిష్టమైన గణిత సమస్యల పరిష్కారాలను ఎంతో సులువుగా విప్పి చెప్పిన విశిష్ట ప్రతిభాశీలి. ఉద్యోగ విరమణ తరవాత కూడా విద్యావ్యాప్తి కోసం కృషి చేయాలనే సంకల్పంతో 1985 లో హైదరాబాద్‌లో నల్లకుంటలో ఐఐటీ స్టడీ సర్కిల్ ప్రారంభించిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. దానితో చుక్కా రామయ్య, ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో నర్సమ్మ, అనంతరామయ్య దంపతులకు 1925 నవంబర్ 20న జన్మించారు రామయ్య. నాగార్జునసాగర్ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా 1983లో రిటైరయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, జేఈఈలలో సీటు కోసం ప్రయత్నిస్తున్న కొందరు విద్యార్థులు ‘గణిత శాస్త్రంలో ఇబ్బందిపడుతున్నాం, సహాయం కావాలి’ అని చుక్కారామయ్యను కోరి, ఆయనతో ఐఐటీ ఎంట్రన్స్ పాఠాలు చెప్పించుకుని విజయం సాధించారు. అత్యంత క్లిష్టమైన ఐఐటీ ఎంట్రన్స్ కోచింగు రంగంలోకి వచ్చిన రామయ్య అద్భుతమైన టీచింగ్ విధానాలతో తన విద్యార్థులకు మెరికల్లాగ తీర్చిదిద్దుతున్నారు. ఐఐటీలోనే కాదు, రామయ్య ఐఐటీ కోచింగు సెంటర్లో సీటు రావాలన్నా ఎంట్రన్స్ టెస్టు క్లియర్ చేయాల్సిందే. రామయ్య ఐఐటీ కోచింగు సెంటర్లో చేరడానికి ప్రతి ఏడాది ఐదువేల మంది పోటీపడితే 180 మందిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. 1985 నుంచి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించారు. సాంఘికసంస్కర్తగా, ఉద్యమకారునిగా, విద్యావేత్తగా, రచయితగా ఎమ్మెల్సీగా బహుముఖమైన సేవలు చేస్తున్న చుక్కా రామయ్యను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి. పరిపూర్ణ సమాజం కోసం... రెడ్డీస్ లాబొరేటరీస్ సంస్థ... కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీని రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో విశిష్టమైన సేవలందిస్తోంది రెడ్డీస్ ఫౌండేషన్. మేమందిస్తున్న విద్య, వైద్య రంగాలకు ఒకే రోజు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మా సంస్థ స్థాపకులు డాక్టర్ కల్లం అంజిరెడ్డిగారికి అంకితం. వారి స్ఫూర్తితో ఈ సేవను కొనసాగిస్తాం. – డా. వి.నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్) వివిధ వ్యాపారాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. లాభనష్టాలకు పరిమితం కాకుండా సమాజ హితం కోసం పాటుపడుతూ అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు పాటు పడుతున్న సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒకటి. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆశయంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి 1996లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నిరుపేద పిల్లలకు విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది ఈ ఫౌండేషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో తన వంతు సమాజ సేవ చేస్తోంది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం 130 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, స్కూల్ బ్యాగులు సరఫరా చేయడంతో పాటు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రతిభ చూపిన నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఉన్నత విద్యకు తోడ్పడుతోంది ఈ సంస్థ. విద్యార్థులకు హెల్త్‌కార్డులను కూడా అందచేస్తోంది. 130 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, గ్రంథాలయాలు, ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుచేసింది ఈ ఫౌండేషన్. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహిస్తోంది. ఒక సమున్నత ఆశయంతో నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి, జాతినిర్మాణంలో తనవంతు సామాజిక బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌ను ఎడ్యుకేషన్ విభాగంలో 2017 సంవత్సరానికిగాను ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి. రైతు బాంధవుడు రైతు కష్టపడితేనే మనం మూడు పూటలా తినగలుగుతాం. అలాంటి రైతు తన బిడ్డలకు మూడు పూటలా కడుపునిండా పెట్టలేకపోతున్నాడు. రైతును కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలి. ప్రభుత్వాలకు బాధ్యత తెలిసేలా చేయాలి. – సురేశ్ ఈడిగ (తెలుగు ఎన్ఆర్ఐ ఆఫ్ ద ఇయర్) చదువుకునే రోజుల్లో పై చదువులకోసం బ్యాంకు నుంచి విద్యారుణం తీసుకున్నారు సురేష్. కష్టపడి చదివాడు. అంచలంచలుగా ఎదిగారు. విదేశాలకు వెళ్లారు. అక్కడ తానెంచుకున్న వృత్తిలో మరింతగా ఎదిగారు. త్వరలోనే ఆ దేశంలో ఉన్న ప్రొఫెషనల్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తాను పొందిన ఫలాలను తానొక్కడే తినాలనుకోలేదు. పెద్ద చదువులు చదువుకోవాలన్న తపన ఉండీ, పైకం లేక నిరాశానిస్పృహలలో కొట్టుకుపోయే పేద విద్యార్థులకు కూడా పంచాలనుకున్నారు. దానిని ఏదో తూతూమంత్రంగా చేయదలచుకోలేదు. ఒక బాధ్యతగా భుజాన వేసుకున్నారు. ప్రతిభ ఉండీ, పై చదువులు చదువుకోలేని వారికి అండగా నిలిచారు.పేద రైతులు, చేనేత కార్మికులు, గ్రామీణ విద్యార్థులకు ఆసరా ఇచ్చారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆÔ¶ యం ఉన్న తనలాంటి మరికొందరిని కలుపుకుని ఆపన్నులకు ఆర్థిక సహకారం అందించారు. ప్రత్యేకించి రైతులకోసం ఒక ఎన్జీవోను నెలకొల్పారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి, అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ పెద్దలను కోల్పోయిన రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచారు. తోడుగా తానున్నానన్న నమ్మకం కల్పించారు. వారు జీవితంలో నిలదొక్కుకునేందుకు తగిన దారి చూపించారు. సంగారెడ్డి జిల్లాలో నేలమ్మ స్త్రీ రైతు సహకార సంఘాన్ని స్థాపించి, వారికి వడ్డీలేని రుణాలను ఇప్పించాడు. అప్పుల పాలైన పేద రైతు కుటుంబాలకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాకుండా ముందుగానే వారి రుణదాతలతో మాట్లాడి, ఒకవేళ వారు తీర్చలేకపోతే వారి అప్పులు తాను తీరుస్తానని హామీ ఇచ్చి, రైతులను ఒత్తిడి పెట్టకుండా చేశారు. బహుళజాతి కంపెనీలు విక్రయించే నకిలీ విత్తనాలను, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందులను వాడి భూసారాన్ని కోల్పోయి, ఆశించిన దిగుబడి రాక పంట నష్టపోయిన రైతులను సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహించారు సురేష్. వారం వారం ఇంటర్నెట్ రేడియో నుంచి ‘కిసాన్ కీ బాత్’ అనే కార్యక్రమం ద్వారా రైతులకు కొత్త కొత్త పంటలు, పథకాలు, నూతన సేద్యవిధానాలపై అవగాహన కల్పిస్తుంటారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కూడా రైతు సహకార సంఘాన్ని స్థాపించి తనకు చేతనైన సాయం చేస్తుంటారు సురేష్. వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులు దళారులు, కమీషన్ ఏజెంట్ల బెడద లేకుండా నేరుగా రైతుల దగ్గరే కొనుగోలు చేయడం వల్ల రైతులకు, వినియోగదారులకు కూడా లా¿¶ దాయకంగా ఉంటుందని సురేష్ నమ్మకం. అందువల్ల తనతోబాటు మరో యాభై కుటుంబాలు రైతుల వద్దే నేరుగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేశారు. సురేష్ భార్య శిరీష, ఆమె తల్లిదండ్రులు చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ. 60,000 విలువైన పోచంపల్లి చీరలను గొనుగోలు చేశారు. తనతోబాటు మరో 14 మందిని కలుపుకుని రైతు కుటుంబాలను పైకి తీసుకొచ్చేందుకు సురేష్ పడుతున్న తపనను, చేస్తున్న సేవలను గుర్తించిన సాక్షి 2017 సంవత్సరానికిగాను ఉత్తమ ఎన్నారైగా ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసింది. సలామ్ మాస్టారూ! సమాజంలోని విశిష్ట వ్యక్తులను గుర్తించి, వారిని పురస్కరించడం సాక్షి ఔన్నత్యం. టీచర్‌గా నేను ప్రజల డబ్బును జీతంగా తీసుకుని నా పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నాను. ఆ ప్రజల కోసం కొంతైనా చేయడం నా బాధ్యత అనుకుంటాను. అందుకే నా ఇంక్రిమెంట్ డబ్బుల్ని పేద పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను. – వాల్గోతు కిషన్ (ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్) తల్లి, తండ్రి, గురువు, దైవం... అన్నారు. దేవుడికంటే ముందే గురువుకి స్థానం ఎందుకిచ్చారో చెప్పడానికి ఈ ఉపాధ్యాయుడి జీవితం ఒక ఉదాహరణ. వాల్గోతు కిషన్. పాటిల్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. స్వస్థలం ఖానాపూర్ మండలం బిలవార్ పూర్. గవర్నమెంటు టీచర్ అంటే స్కూల్లో పిల్లలు ఉన్నా లేకపోయినా, సంతకం పెట్టి వచ్చే ఉద్యోగం అనే అపోహను తొలగించారు. కిషన్ మాస్టారు పనిచేస్తున్న, ఇప్పటికే చేసి వచ్చిన పాఠశాలలకు వెళితే మాత్రం ఆ ముద్ర క్షణాల్లో చెరిగిపోతుంది. పాఠాలు చెప్పడంతో తన పని అయిపోయిందని ఈ ఉపాధ్యాయుడు ఏనాడూ అనుకోలేదు. తన బడిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు... ఎంతమంది ఉండాలి... ఎంతమంది బడి మధ్యలోనే మానేశారు... ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుక్కుంటారాయన. అంతటితో ఆగిపోకుండా ప్రభుత్వ పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దడం తన కర్తవ్యంగా భావిస్తారు. పాఠశాలను శుభ్రంగా ఉంచడం, కనీస అవసరాలు కొరవడితే తన సొంత ఖర్చులతో వెంటనే ఏర్పాటు చేయడం, డ్రాపవుట్స్ ఉంటే... వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి ఆ పిల్లల్ని మళ్లీ బడిబాట పట్టించడం కిషన్ మాస్టారికి నిత్యకృత్యం. నవోదయ, గురుకుల పాఠశాలలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలిచ్చి ప్రవేశ పరీక్ష రాయిస్తారాయన. స్కాలర్షిప్ వచ్చే అవకాశమున్న నిరుపేద విద్యార్థులను గుర్తించి, దరఖాస్తు చేయించి ప్రభుత్వ సహాయం అందేలా చేస్తారు. పదవ తరగతి పిల్లల కోసం సాక్షి భవిత ప్రచురించిన పుస్తకాలను పెద్దమొత్తంలో తీసుకుని అల్పాదాయ కుటుంబాల పిల్లలకు ఉచితంగా పంపిణీ చేశారీ మాస్టారు. ఎప్పుడూ ఒకటే ధ్యాస... పిల్లలు, చదువు, బడి, సమాజం... ఇంతే. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుడు ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు.వాల్గోతు కిషన్‌ను భారతప్రభుత్వం 2016 సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గౌరవించింది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అని నమ్మి... ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిని సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ విభాగంలో సత్కరిస్తోంది సాక్షి. అమ్మ ఒడి పిల్లలను గౌరవిద్దాం. బాల్యాన్ని కాపాడుదాం. పిల్లల్లోని నైపుణ్యాన్ని సంరక్షించుకుందాం. వీథి బాలలను, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలను సంరక్షించే ప్రయత్నంతో నాకు సహకరిస్తున్న నా భార్యకు, అధికారులకు ఈ అవార్డు అంకితం. – నాగరాజు, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ (ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్) అందమైన బాల్యం శాపంగా మారితే భవిష్యత్తు అంధకారమవుతుంది. ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఎక్కడికెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ రైల్వేస్టేషన్లో, బస్ స్టేషన్లలో తిరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వీరంతా నా అన్నవారు లేక, ఆకలికి అలమటిస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపై కనిపిస్తుంటారు. ఇటువంటి వారిని చేరదీసి, ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పిస్తోంది ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ. చిన్నతనంలోనే పరిస్థితుల కారణంగా మానసికంగా దెబ్బ తిన్న బాలబాలికలకు కౌన్సెలింగ్ చేసి ‘మేమున్నాం’ అనే ధైర్యాన్ని కల్పిస్తోంది ఆశ్రిత. మరోవైపు సమాజం చేత తిరస్కరించబడినవారు, భిక్షాటన చేసుకుని జీవించే అభాగ్యులు, చిత్తు కాగితాలు ఏరుకునే చిన్నారులు, అమ్మనాన్నలు ఉండి కూడా ఏ రక్షణ లేని బాలబాలికలకు అండగా నిలుస్తోంది ఆశ్రిత. విద్యతో పాటు ఆటపాలలోను ఈ పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. పెద్దయ్యాక సమాజంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే నైపుణ్యం కూడా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం రెయిన్బో హోమ్ పేరుతో నిర్వహిస్తున్న ఆశ్రమంలో 100 మంది బాలికలు, స్నేహఘర్లో 55 మంది బాలురు ఉన్నారు. బాలల హక్కులను పరిరక్షించి వారి బంగారు భవిష్యత్‌కు పునాదులు వేయాలనేది తమ సంస్థ ఆశయం అంటారు ఆశ్రిత ఫౌండర్ సెక్రటరీ నాగరాజు. ఇంటి నుంచి పారిపోయినవారు, తప్పిపోయిన చిన్నారుల సమాచారం సేకరించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు సుమారు 65 మంది పిల్లలను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వారంతా ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రైవేటు సంస్థలు, పోలీసుల సహకారంతో నిర్వహిస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థకు 2017 సంవత్సరానికిగాను సోషల్ డెవలప్మెంట్ విభాగంలో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా. గోమాత ఆవుల కోసం సేవ చేయడానికి ఆవులే మమ్మల్ని ఎంచుకున్నాయి. వాటి సేవ చేయించుకుంటున్నాయి. మా ప్రయత్నంతో మా పిల్లలే కాదు, మరెంతో మంది పిల్లలు, వృద్ధులు స్వచ్ఛమైన పాలను తాగుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన ఆవుల్ని సంరక్షించుకుందాం. – అల్లోల దివ్యారెడ్డి (బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్టార్టప్) ‘గంగిగోవుపాలు గరిటడైన చాలు... కడివెడైన నేమి ఖరముపాలు...’ అన్న వేమన శతకానికి సరిగ్గా సరిపోతుందామె. ఎందుకుంటే జీవాన్ని నింపాల్సిన జలాలు గరళాన్ని నింపుతున్న తరుణంలో... పౌష్టికాహారం అందించాల్సిన పాలు కూడా విషతుల్యం అవుతున్నాయని గ్రహించారు. కల్తీ పాల కాటుకు బలవుతున్న పిల్లలకు స్వచ్ఛమైన పాలనందించాలనే సంకల్పమే ఆమెను ముందుకు నడిపింది. అదే తపన... ఇవాళ వేలాదిమంది పిల్లలకు స్వచ్ఛమైన పాలనందించగలుగుతోంది. స్వయంగా గుజరాత్‌కు వెళ్ళి పాతిక గిర్ ఆవులను తీసుకువచ్చి గచ్చిబౌలిలో డైరీ ఫార్మ్‌ను ప్రారంభించారు. అంతేకాదు రైతు కుటుంబంలో ఒక్కటిగా భావించే ఆవుకు మళ్ళీ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారామె. ఆమే అల్లోల దివ్యారెడ్డి. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పట్టుభద్రురాలైన దివ్య... విదేశాల్లో స్థిరపడాలనుకుంది. కానీ పెద్దవాళ్ల నిర్ణయం ప్రకారం పెళ్ళి అవడం, ఆ తరువాత ఇద్దరు పిల్లలతో గృహిణిగా మారిపోయారు. మార్కెట్లో దొరికే కల్తీ పాలతో పిల్లలను పెంచడానికి ఆమెలోని తల్లి మనసు అంగీకరించలేదు. స్వచ్ఛమైన పాలనందించాలనే సంకల్పంతో ఒక అడుగు వేశారు. అదే ముందడుగుగా మారి ఎంటర్ప్రెన్యూర్ అయ్యారామె. ఆమె స్థాపించిన క్లిమామ్ డైరీ ఫార్మ్ 85 ఆవులతో నడుస్తోంది. ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికే ఒక మహిళకు రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. అలాంటి సమయంలో ఈ డైరీ ఫార్మ్ ప్రాజెక్టును తలకెత్తుకున్నారు దివ్య. అది కొంత బరువైన బాధ్యతే అయినా... తన లక్ష్యం ముందు ఆ బాధ్యత చిన్నదిగా అనిపించిందామెకి. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తూ... సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆమెను స్టార్టప్ విభాగంలో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో సత్కరిస్తోంది సాక్షి. తొలితరం తెలుగు రాకెట్ నా శ్రమను గుర్తించిన సాక్షికి కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచిన క్రీడాకారులు, సమాజంలో అందరికీ కృతజ్ఞతలు. క్రీడారంగంలో నా బాధ్యతను కొనసాగిస్తాను. – పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ (తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్) క్రికెట్ బ్యాట్ పట్టుకుందామనుకున్న ఆ కుర్రాడు... అన్నయ్య సలహాతో షటిల్ బ్యాట్ ఎంచుకున్నాడు. ఎంచుకున్న క్రీడ ఏదైనా తన సత్తా ఏంటో చూపించాలనుకున్నాడు. దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. ఆ కుర్రాడే భారతీయుల అభిమాన బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్. 1973 నవంబర్ 16న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు గోపిచంద్. తండ్రి సుభాష్ చంద్ర, తల్లి సుబ్బరావమ్మ. హైదరాబాద్ ఎవి కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసిన గోపిచంద్, చదువుతో పాటు తనలో ఉన్న బ్యాడ్మింటన్ ఆటకు సానబెట్టారు. పదిహేడేళ్లకే ఇండియన్ కంబైన్డ్ యూనివర్సిటీస్ బ్యాడ్మింటన్ టీమ్‌కి కెప్టెన్‌గా పనిచేసిన గోపిచంద్... మొదట్లో ఎస్.ఎమ్.ఆరిఫ్ దగ్గర కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ప్రకాశ్ పదుకోన్ అకాడమీలో చేరారు. రాకెట్ పట్టుకుని కోర్టులోకి దిగింది మొదలు విజయాల పరంపర కొనసాగించిన ఈ భారత క్రీడాకారుడు, 1996 నుంచి వరుసగా ఐదేళ్లు నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లతో, స్టార్ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. 2001... బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా గోపిచంద్ కెరీర్‌ని మలుపు తిప్పిన సంవత్సరం. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకొని, ఆ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచారు. అంతవరకు ఆ ఘనత వహించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్పదుకోన్. ‘ఆటనుంచి రిటైర్ అవ్వడం అంటే ఆటను వదిలేయడం కాదు. తనకంటే గొప్ప క్రీడాకారులను తయారుచేయడం’ అనుకున్నారు గోపీచంద్. ఆ ఆలోచనే 2008లో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా అవతరించింది. 2012, 2016 ఒలింపిక్స్‌లో దేశానికి రెండు ఒలింపిక్ పతకాలు అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అకాడమీకి చెందినవారే. సైనానెహ్వాల్, పివి సింధు, కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ వంటి అద్భుతమైన క్రీడాకారులను అందించారు పుల్లెల. గోపీచంద్‌ను అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, ద్రోణాచార్య, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. చీఫ్ నేషనల్ కోచ్ ఫర్ ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ పుల్లెల గోపిచంద్‌ని ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సత్కరిస్తోంది సాక్షి. చదవండి: ప్రతిభకు పట్టం ప్రతిభకు సాక్షి పురస్కారం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్‌గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్‌గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్‌టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్‌స్టార్‌గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్‌గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్‌కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్‌లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్‌రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్‌ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్‌కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్‌లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్‌బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్‌బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్‌గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్‌కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్‌లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్‌లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్‌తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్‌కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్‌కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్‌బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్‌రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్‌రెడ్డి (అర్జున్‌రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్‌రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్‌బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్‌బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
ప్రతిభకు పట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభకు ‘సాక్షి’పట్టం కట్టింది. భవిష్యత్ తరాల స్ఫూర్తిదాతలను సమున్నతంగా సత్కరించింది. ఎక్స్‌లెన్స్ అవార్డులతో గౌరవించింది. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేసే ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకలకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, పల్సెస్ హెల్త్‌టెక్ సీఈవో శ్రీను బాబు, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య, రఫీ ఫుడ్స్ ప్రతినిధి రఫతుల్లా విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. శనివారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులకు హాజరైన సినీ ప్రముఖులు ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్, సినీనటులు కోట శ్రీనివాసరావు, అలీ, జ్యూరీ చైర్పర్సన్ ప్రణతీరెడ్డి, సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు వేడుకలకు హాజరయ్యారు. విద్యావేత్త చుక్కా రామయ్యతోపాటు సినీరంగ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’అవార్డును అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షల కోసం ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్న దివ్యాంగురాలైన విద్యావేత్త మల్లవరపు బాలలత ‘యంగ్ అచీవర్ అఫ్ ది ఇయర్’అవార్డును అందుకున్నారు. సామాజిక సేవా విభాగంలో గ్రాఫిటీ చిత్రాల ద్వారా కృషి చేస్తున్న స్వాతి, విజయ్ దంపతులు, స్పోర్ట్స్ విభాగంలో టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్, అజయ్కుమార్రెడ్డిలు జ్యూరీ స్పెషల్ అవార్డును అందుకున్నారు. వ్యవసాయరంగంలో ఎక్స్‌లెన్స్ ఫార్మింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గుండ్లపల్లి సుజాత, సేంద్రియ వ్యవసాయరంగంలో జగదీశ్ యాదవ్‌లకు అవార్డులు లభించాయి. వైద్య రంగంలో నైస్ ఫౌండేషన్, బిజినెస్ ఆఫ్ ద ఇయర్‌గా చీకోటి వెంకటేశ్వర్రావు, సోషల్ డెవలప్మెంట్ విభాగంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అలోల దివ్యారెడ్డి, ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో వి.కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా సురేష్, తదితరులు ‘ఎక్స్‌లెన్స్’అవార్డులను అందుకున్నారు. సినీరంగంలోనూ వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఉర్రూతలూగించిన ఆటపాటలు.. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అదరహో అనిపించాయి. ఆ పాత సుమధుర గీతాలు ఆçహూతులను వీనుల విందు చేశాయి. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆదర్శ సినీ జంట కృష్ణ, విజయనిర్మల సినిమాల నుంచి పాడిన హిట్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినీ సంగీత ప్రముఖులు ఆర్పీ పట్నాయక్‌తోపాటు గాయకులు సింహా, అంజనా సౌమ్య, రక్షిత తమ గాన లాహిరితో ఆహూతులను అలరించారు. స్టార్ సింగర్స్ రేవంత్, మధుప్రియలు సైతం పాటలతో అబ్బురపరిచారు. ఎన్జీ డ్యాన్స్ అకాడమీ యువ డ్యాన్సర్లు తమ తుఫాన్ నృత్యాలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. నవ్వుల పువ్వులు పూయించి రచ్చ రవి (జబర్దస్త్ ఫేం) బృందం ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది. చుక్కా జీవితం స్ఫూర్తిదాయకం సామాజిక రంగాల్లో అపారమైన సేవలు అందజేసిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు జస్టిస్ నర్సింహారెడ్డి సాక్షి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నేత చుక్కా రామయ్య అని, విద్యారంగంలో ఆయన అపారమైన సేవలు అందజేశారని కొనియాడారు. వేలాది మంది జీవితాలను, వారి కుటుంబాలను గొప్పగా ప్రభావితం చేసిన రామయ్యకు అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘సాక్షి’చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు స్ఫూర్తినిస్తాయన్నారు. మంచిని గుర్తించి ప్రోత్సహించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. శిశువులకు స్వచ్ఛమైన పాలు పాల కల్తీపై చాలా ఆందోళన చెందా. కేవలం నా పిల్లలకే కాదు చిన్నారులందరికీ స్వచ్ఛమైన పాలు అందించాలని భావించా. ఆ మేరకు గుజరాత్ నుంచి ఆవులను తెప్పించి డెయిరీ నడుపుతున్నా. పిల్లలకు కల్తీలేని నాణ్యమైన పాలను సరఫరా చేయగలుగుతున్నాం. దేశీ ఆవుల ప్రాముఖ్యత తెలుసుకున్నాం. వాటిని పెంచుతున్నాం. మంచి ఫలితాలు పొందుతున్నాం. – ఎ.దివ్యారెడ్డి, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది స్టార్టప్ అవార్డీ పది మందిని నడిపించలేకపోతేనే బాధ మా నాన్న విలువలతో కూడిన జర్నలిస్ట్. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన స్ఫూర్తితోనే ఇదంతా చేస్తున్నా. జీవితంలో కష్టాలకు ఎప్పుడూ వెరవలేదు. అందరిలా నడవలేకపోతున్నానని ఏనాడూ బాధపడలేదు. పదిమందిని జీవితంలో ముందుకు నడిపించలేనప్పుడే నిజంగా బాధే స్తుంది. ఏనాడైతే తోటివారికి సహాయపడలేనో.. ఆ రోజే వికలాంగురాలిగా భావిస్తాను. సమాజానికి సేవచేసే అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి. అంగవైఖల్యంతో బాధపడుతున్న నాకు అండగా నిలిచి, నన్నెంతగానో ప్రోత్స హించిన నాన్నతో పాటు దీపంవెలుగులో చదువుకుని సివిల్స్‌లో రాణిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. – బాలలత, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అవార్డు గ్రహీత గౌరవంగా భావిస్తున్నా ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను ఆశ్రిత ఫౌండేషన్ ద్వారా పోలీసుల సహకారంతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నాం. చదువు ఆపేసిన వారికి, భిక్షాటన చేస్తున్న పిల్లలకు విద్యను అందిస్తున్నాం. నేషనల్ రెయిన్ బో సహకారంతో హోం నిర్వహిస్తున్నాం. మా సేవను గుర్తించి సాక్షి అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. – నాగరాజు, ఆశ్రిత ఫౌండేషన్,ఎక్స్‌లెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు ‘సాక్షి’మీడియాకు కృతజ్ఞతలు వివిధ రంగాల్లో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డులు ఇవ్వడం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ విద్యార్థుల మెరుగైన చదువు కోసం తీసుకుంటున్న చర్యలకు అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. – వల్గోట్ కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ జీరో నాలెడ్జ్‌తో సాగు మొదలు పెట్టా రైతులంటే మగవారు మాత్రమే కాదు. మహిళలు కూడా వ్యవసాయం చేయగలరు అని చాటి చెప్పాలని భావించా. జీరో నాలెడ్జ్‌తో ప్రకాశం జిల్లాలో నాకున్న 40 ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలు పెట్టా. సంప్రదాయ పద్ధతులకు ఆధునికత జోడించా. మంచి ఫలితాలు సాధిస్తున్నా. రైతులు విషరహిత పంటలనే సాగు చేయాలి. – సుజాత, మహిళారైతు, ప్రకృతి వ్యవసాయం మా బాధ్యతను మరింత పెంచింది రెండేళ్ల క్రితం ఇద్దరం కలిసి ఇదే హాల్ పక్కన అర్ధరాత్రి ఓ పెయింటింగ్ వర్క్ చేశాం. అదే వర్క్‌ను ప్రస్తుత వేడుకలో ప్రదర్శించడం గర్వకారణంగా ఫీలవుతున్నాం. మేం అందుకున్న తొలి అవార్డు ఇదే. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. – స్వాతి, విజయ్, యంగ్ అచీవర్ ఆఫ్ ది సోషల్ సర్వీసెస్ మట్టినే మందుగా పిచికారీ చేశా చాలా మంది రైతులు సాగుపై అవగాహన లేక అడ్డగోలుగా రసాయన పురుగుమందులు వాడి దిగుబడి రాక నష్టపోతుంటా రు. సేంద్రియ వ్యవసాయం చాలా మందికి తెలియదు. భూమిలోనే పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మట్టినే మందుగా శనగపై పిచికారీ చేశాను. మంచి ఫలితం వచ్చింది. – తుమ్మల జగదీష్ యాదవ్, సేంద్రియ వ్యవసాయం వెలుగులు నింపినప్పుడే సంతృప్తి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతోపాటు ఆ రంగంలో ఆధారపడిన కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నింపినప్పుడే నిజమైన సంతృప్తి. గోదావరి పైప్స్ సంస్థను వ్యాపారపరంగా విస్తరింపజేయడమే కాదు అనేక మందికి ఉపాధి కల్పించింది. – చీకోటి వెంకటేశ్వరరావు,బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత రైతు కష్టం చూడలేక రైతు సంక్షోభంలో ఉండటం ఎంతగానో కలిచివేసింది. వారికి నా వంతు సహాయ, సహకారాలు అందజేస్తున్నా. రైతు కష్టపడితే కానీ మనం మూడు పూటలా భోజనం చేయలేం. కానీ అదే రైతు తన కుటుంబానికి రెండు పూటలు కూడా తిండి పెట్టలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి. – సురేష్ ఏడిగ, తెలుగు ఎన్ఆర్ఐ అవార్డు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు నాపై నమ్మకం ఉంచి నాకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కృతజ్ఞతలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. – పుల్లెల గోపీచంద్,తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ‘సాక్షి’ ప్రేరణతో మరింత ముందుకెళ్తా నాన్న జహీర్ ఇచ్చిన ప్రోత్సాహంతో టెన్సిస్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నా. నా కోసం ఇల్లు తాకట్టు పెట్టి మరీ వెన్నుతట్టారు. సాక్షి ఇచ్చిన ప్రేరణతో మరిన్ని పతకాలు సాధిస్తా. – షేక్ జాఫ్రీన్, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్ బాధ్యతను పెంచింది సంపాదించిన డబ్బులో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే విధానంతో అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. వారికి మెరుగైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది. – వి.నారాయణరెడ్డి,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ కష్టానికి తగిన గుర్తింపు ఇది చిన్నప్పుడు జరిగిన ప్రమాదంతో ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పో యింది. మరో కన్ను పాక్షికంగా కనిపిస్తుంది. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కు వను చంపుకోలేదు. 2010 నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత అంధుల క్రికెట్‌కు ఆడుతున్నా. 2016లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాను. నా కష్టాన్ని గుర్తించి సాక్షి గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. – అజయ్ కుమార్ రెడ్డి, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్ సేవకు తగిన గుర్తింపు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద బాలికలు, గర్భిణులకు ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. కమ్యూనిటీ హెల్ప్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చుకే సేవలందిస్తున్నాం. – డాక్టర్ పద్మనాభరెడ్డి,నైస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లైఫ్‌టైమ్ స్టార్స్
పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో పనిచేస్తారు. కానీ.. కొంతమంది ఎంచుకున్న పనికే వన్నె తెస్తారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల. ఈ పేర్లు ప్రస్తావించకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. ఇక తెలుగు సినిమా చరిత్రలో వీరి పాత్ర చెప్పాలంటే అది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రస్థానం. ఒకరు తిరుగులేని సూపర్స్టా్టర్, మరొకరు కళారంగంలో స్త్రీ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంచుకున్న రంగంలో ఇద్దరూ ఇద్దరే. 1943 మే 31న గుంటూరు జిల్లాలో బుర్రిపాలెంలో వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణ, సూపర్‌స్టార్ కృష్ణగా ఎదగడంలో ఎన్నో ఎత్తుపల్లాలు... ఒడిదుడుకులు... ఇంకెన్నో సాహసాలు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్నపుడు, ‘చేసిన పాపం కాశీకి వెళ్లినా...’ అనే నాటకంతో మొదలైన నటనాభిలాష, 1965లో తేనెమనసులు సినిమాతో హీరోగా వెండితెరకు చేరింది.బంగారు వర్ణంతో మెరిసిపోతూ.. సన్నని మీసకట్టుతో.. అమాయకంగా, అందంగా ఇంట్లో పెద్దకొడుకులా కనిపించే కృష్ణను చూసి తెలుగు ప్రేక్షకులు మురిసిపోయారు. సీతారామరాజు గెటప్ వేసినా... సింహాసనం మీద కూర్చున్నా...కౌబాయ్‌గా కనిపించినా... జేమ్స్ బాండ్‌గా మెరిపించినా... చారిత్రకం, పౌరాణికం, జానపదం, సాంఘికం ఏ జానరైనా, ఏ పాత్ర వేసినా అది సూపర్‌హిట్... అందుకే అతను టాలీవుడ్ సూపర్‌స్టార్ అయ్యారు. హీరోగా కృష్ణ చేసిన తొలి చిత్రమే తెలుగులో పూర్తిస్థాయి కలర్లో తీసిన తొలి సాంఘిక చిత్రం. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తర్వాత ఆయన ఎన్నో విషయాల్లో తొలివ్యక్తిగా నిలిచారు. సాహసానికి చిరునామాగా పేరు తెచ్చుకున్న ఈ బుర్రిపాలెం బుల్లోడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈస్ట్‌మన్ కలర్, కలర్స్కోప్, 70 ఎమ్ ఎమ్, డిటిఎస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పోకడల్ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈ నటశేఖరుడే. ఇక తెలుగువారికి తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ ఆయనే. ఒకే ఏడాది హీరోగా 18 సినిమాలు రిలీజైన ఏకైక సూపర్ బిజీ... సూపర్ స్టార్ ఆయననొక్కరే. కెరీర్లో 25సార్లు ద్విపాత్రాభినయం, ఏడు సార్లు త్రిపాత్రాభినయంతో అలరించిన ఈ సూపర్‌స్టార్ 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా సేవలందించడంతో పాటు పద్మాలయా బ్యానర్‌పై తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో మరపురాని చిత్రాలను నిర్మించారు. తొలి నుంచి కాంగ్రెస్ అభిమానిగా ఉన్న కృష్ణ రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1989లో ఏలూరు నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణగారు... రాజీవ్ మరణంతో రాజకీయాలు వదిలేశారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ సూపర్‌స్టార్ ఐదుపదులు దాటిన తర్వాత కూడా మెగా హీరోలతో పోటీ పడి రెండు సార్లు సంక్రాంతి విన్నర్ ట్రోఫీ ఎత్తుకు పోయారు. ఇండస్ట్రీలో పట్టుదలతో కష్టపడితే పెద్ద హీరో అనిపించుకోవచ్చు కానీ... మంచి మనిషి అనిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కృష్ణ అది సాధించారు. విజయనిర్మల వెండితెరపై కృష్ణ విజయనిర్మల ’సాక్షి’ వేదికగానే పరిచయమయ్యారు. 1967లో సాక్షి చిత్రంలో తొలిసారి జంటగా నటించిన వీరిద్దరూ ఆ తర్వాత నిజజీవితంలోనూ ఒకటయ్యారు. తమ కెరీర్లో 47 చిత్రాల్లో కలిసి నటించారు. 11 యేళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు విజయనిర్మల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రెండువందలకు పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించి తిరుగులేని గుర్తింపు సాధించుకున్నారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా, తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పుపొందారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినిమా చరిత్రలోనే ఆ ఘనత సాధించిన ఏకైక కథానాయకుడిగా చరిత్ర సృష్టిస్తే... ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల అరుదైన ఘనతను సాధించారు. వెండితెరపై ఈ కళాజంటది అర్ధశతాబ్దపు ప్రయాణం. కళకు అంకితమై తెరకు గౌరవం పెంచిన ఈ దంపతులను ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2017 జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తోంది సాక్షి. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు
-
అట్టహాసంగా సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక
-
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం
-
ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!
సాక్షి, హైదరాబాద్: తమ రంగాలలో ఉత్తమ సేవ, అత్యుత్తమ ప్రతిభ, విశేష కృషి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడుతున్న వారికి ప్రతి ఏటా అందించే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ఇతర ముఖ్యులు అతిథిలుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. విజేతలకు 2017 సంవత్సరం సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను అందజేస్తారు. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ సేవ, మరికొందరి విశేష కృషి.. తగురీతిలో గుర్తింపు పొందడమే కాకుండా సమకాలికులకు, తర్వాతి స్ఫూర్తి కావాలనేదే సాక్షి తలంపు. ఇదే యోచనతో, సమాజంలోని వేర్వేరు రంగాల్లో విశేషంగా శ్రమిస్తున్నవారిని గుర్తించి, అభిమానించి, అభినందించి, అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని సాక్షి మీడియా సంస్థ గడిచిన మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. వరుసగా ఇది నాలుగో సంవత్సరం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యవసాయ, సామాజిక సేవ తదితర రంగాలతోపాటు వివిధ విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. సినిమా రంగానికి చెందిన పాపులర్ అవార్డులతోపాటు జ్యూరీ ప్రత్యేక అవార్డులను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు. సమాజ ఉన్నతికి తోడ్పడే కృషి ఏదైనా, అది.. వినూత్నంగా చేయడం, ప్రభావవంతంగా ఉండటం, సుస్థిరమై నిలవడం అన్న మూడు అంశాల ప్రాతిపదికన ఈ విజేతల్ని ఎంపిక చేశారు. అసాధారణ సేవ, కృషి, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సంస్థల గురించి పలువురి ద్వారా అందిన ఎంట్రీలను పరిశీలించి, ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయనిర్ణేతలు అంతిమంగా విజేతల్ని ఖరారు చేశారు. రెయిన్బో ఆస్పత్రి మెటర్నల్, ఫీటల్ మెడిసిన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి జ్యూరీకి అధ్యక్షత వహించారు. శనివారం జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ విశేషాలను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సాక్షి టీవీ ప్రసారం చేయనుంది. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2017: ప్రతిభకు పట్టం..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన నాయక్ వెంకటరమణకు సలామ్ చేసింది...,భారత కీర్తి పతాకని విశ్వవీధుల్లో ఎగరేసిన పీవీ సింధును ఆకాశానికెత్తింది..., సమోసాలమ్ముకునే నిరుపేద కడుపున పుట్టి దేశపు అత్యున్నత ఐఐటీల్లోకి దూసుకెళ్లిన బిడ్డ అభ్యాస్‌ని ఆశీర్వదించింది...., సర్కారు బడుల్లో చదువుకు వన్నెలద్దిన ‘వందేమాతరం’ సేవలకు వందనాలంది...., దిక్కులేని దీనులకు అన్నీ తానై ఆదుకున్న ‘సహృదయ’ యాకుబ్ బీని అభినందించింది...., నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించింది. ఇలా త్యాగాన్ని, నైపుణ్యాన్ని, ప్రతిభని, సేవని, దయని, కళని... అవెక్కడున్నా వెలికి తీసింది ‘సాక్షి’! వారందరినీ అభిమానించి, అభినందించి, అవార్డులతో అలరించి సముచిత రీతిన సత్కరించింది. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ కృషి, మరిన్ని సంస్థల సేవా నిరతిని ఇలా ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. ఈ మంచి వీరితోనే ఆగిపోకూడదని, మరింత విస్తరించి సమకాలికులతో పాటు భావితరాలకు స్ఫూర్తి కావాలని తలపోసినందునే, ఏటేటా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ద్వారా వారిని సత్కరించి, ప్రోత్సహిస్తోంది. స్ఫూర్తిని తెలుగునాట పరివ్యాప్తం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులు, నైపుణ్యపు దిట్టలు, నిబద్ధత కలిగిన సేవా సంస్థలకు ఇలా అవార్డులిచ్చే ప్రక్రియను సాక్షి మీడియా సంస్థ చేపట్టి మూడేళ్లవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ అవార్డులకు ఎంపికై ఎందరికో స్ఫూర్తిని రగిలించారు. లేలేత చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్య పురస్కారం పొందిన మహనీయుల వరకు ఎందరెందరో ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. 2017కుగాను వేర్వేరు అవార్డులకు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 2018 ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రత్యేకత ఏమంటే... ఎవరికి వారు ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభావంతుల్ని, అసాధారణ నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని, విశిష్ఠ సేవలందిస్తున్న సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా వారి తరపున ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ముఖ్యులు న్యాయ నిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి. ప్రతిభ ఎక్కడున్నా పట్టం విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ఈ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల కోసం గుర్తిస్తారు. కొన్ని విభాగాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ అవార్డుల్నీ అందిస్తున్నారు. ఇవే కాక, సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారిని ప్రజాదరణ ఆధారంగా ఎంపిక చేసి అవార్డులిస్తారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం వంటి విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. దివంగత సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి, ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్, ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణలు గత మూడేళ్లుగా జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ‘తెలుగు శిఖరం’ ప్రత్యేక అవార్డును దర్శకరత్న దాసరినారాయణరావుకు అందించారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసి సాక్షి ఎక్సలెన్స్ అవార్డులందుకున్న వారిలో పీవీ సింధు, డా.సతీశ్‌రెడ్డి, డా.చరణ్ జీ రెడ్డి, శ్రీకాంత్ బోళ్ల, డా.ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, జ్యోతిరెడ్డి తదితరులున్నారు. క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, సైనా నెహ్వాల్, నైనా జైస్వాల్, సిరాజ్, సాకేత్ తదితరులున్నారు. ఇక వందేమాతరం ఫౌండేషన్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లతో పాటు భారత్ వికలాంగుల సేవా సమితి వంటి సంస్థలూ అవార్డు గ్రహీతల్లో ఉన్నాయి. అవార్డు పొందిన సినీ ప్రముఖుల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, రామజోగయ్య శాస్త్రి, దేవీశ్రీప్రసాద్, కారుణ్య వంటి వారున్నారు. వరుసగా మూడేళ్లు జరిగిన అవార్డు ప్రదానోత్సవాలకు మీడియా ప్రముఖులైన శేఖర్‌గుప్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్కాదత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని గుర్తించడం, సేవ–ప్రత్యేక కృషిని అభినందించడం, లక్ష్య సాధనను ప్రశంసించడం ఎవరైనా చేయదగ్గ మంచి పనే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి వారిని గుర్తించి, సదరు అర్హుల పేర్లను ఈ అవార్డుకు ప్రతిపాదిస్తూ ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం... www.sakshiexcellenceawards.com లో లాగిన్ కాగలరు. వివరాలకు : 040-2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ఈ–మెయిల్: sakshiexcellenceawards@sakshi.com. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన నాయక్ వెంకటరమణకి సలామ్ చేసింది...,భారత కీర్తి పతాకని విశ్వవీధుల్లో ఎగరేసిన పీవీ సింధుని ఆకాశానికెత్తింది..., సమోసాలమ్ముకునే నిరుపేద కడుపున పుట్టి దేశపు అత్యున్నత ఐఐటీల్లోకి దూసుకెళ్లిన బిడ్డ అభ్యాస్‌ని ఆశీర్వదించింది...., సర్కారు బడుల్లో చదువుకు వన్నెలద్దిన ‘వందేమాతరం’ సేవలకు వందనాలంది...., దిక్కులేని దీనులకు అన్నీ తానై ఆదుకున్న ‘సహృదయ’ యాకుబ్ బీని అభినందించింది...., నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించింది... ఇలా త్యాగాన్ని, నైపుణ్యాన్ని, ప్రతిభని, సేవని, దయని, కళని... అవెక్కడున్నా వెలికి తీసింది ‘సాక్షి’! వారందరినీ అభిమానించి, అభినందించి, అవార్డులతో అలరించి సముచిత రీతిన సత్కరించింది. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ కృషి, మరిన్ని సంస్థల సేవా నిరతిని ఇలా ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. ఈ మంచి వీరితోనే ఆగిపోకూడదని, మరింత విస్తరించి సమకాలికులతో పాటు భావితరాలకు స్ఫూర్తి కావాలని తలపోసినందునే, ఏటేటా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్' ద్వారా వారిని సత్కరించి, ప్రోత్సహిస్తోంది. స్ఫూర్తిని తెలుగునాట పరివ్యాప్తం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులు, నైపుణ్యపు దిట్టలు, నిబద్దత కలిగిన సేవా సంస్థలకు ఇలా అవార్డులిచ్చే ప్రక్రియను సాక్షి మీడియా సంస్థ చేపట్టి మూడేళ్లవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ అవార్డులకు ఎంపికై ఎందరికో స్ఫూర్తిని రగిలించారు. లేలేత చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్య పురస్కారం పొందిన మహనీయుల వరకు ఎందరెందరో ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. 2017కు గాను వేర్వేరు అవార్డులకు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 10 ఫిబ్రవరి, 2018, సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఇప్పుడిప్పుడే ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రత్యేకత ఏమంటే... ఎవరికి వారు ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభావంతుల్ని, అసాధారణ నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని, విశిష్ఠ సేవలందిస్తున్న సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా వారి తరపున ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ముఖ్యులు న్యాయ నిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి. ప్రతిభ ఎక్కడున్నా పట్టం విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ఈ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల కోసం గుర్తిస్తారు. కొన్ని విభాగాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ అవార్డుల్నీ అందిస్తున్నారు. ఇవే కాక, సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారిని ప్రజాదరణ ఆధారంగా ఎంపిక చేసి అవార్డులిస్తారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం వంటి విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. దివంగత సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి, ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్, ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణలు గత మూడేళ్లుగా జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ‘తెలుగు శిఖరం’ ప్రత్యేక అవార్డును దర్శకరత్న దాసరినారాయణరావుకు అందించారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసి సాక్షి ఎక్సలెన్స్ అవార్డులందుకున్న వారిలో పీవీ సింధు, డా.సతీశ్‌రెడ్డి, డా.చరణ్ జీ రెడ్డి, శ్రీకాంత్ బోళ్ల, డా.ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, జ్యోతిరెడ్డి తదితరులున్నారు. క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, సైనా నెహ్వాల్, నైనా జైస్వాల్, సిరాజ్, సాకేత్ తదితరులున్నారు. ఇక వందేమాతరం ఫౌండేషన్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లతో పాటు భారత్ వికలాంగుల సేవా సమితి వంటి సంస్థలూ అవార్డు గ్రహీతల్లో ఉన్నాయి. అవార్డు పొందిన సినీ ప్రముఖుల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, రామజోగయ్య శాస్త్రి, దేవీశ్రీప్రసాద్, కారుణ్య వంటి వారున్నారు. వరుసగా మూడేళ్లు జరిగిన అవార్డు ప్రదానోత్సవాలకు మీడియా ప్రముఖులైన శేఖర్‌గుప్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్కాదత్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని గుర్తించడం, సేవ–ప్రత్యేక కృషిని అభినందించడం, లక్ష్య సాధనను ప్రశంసించడం ఎవరైనా చేయదగ్గ మంచి పనే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి వారిని గుర్తించి, సదరు అర్హుల పేర్లను ఈ అవార్డుకు ప్రతిపాదిస్తూ ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం...www.sakshiexcellenceawards.comలాగిన్ కాగలరు. వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు. ఈ–మెయిల్: sakshiexcellenceawards@sakshi.com. -
సాక్షి అవార్డుల వేడుక
-
ఝుమ్మంది నాదం ...సయ్యంది పాదం..!
హోరెత్తిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల వేదిక సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ –2016 వేదిక సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది. ఆదివారం ఫిల్మ్‌నగర్ – జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కూచిపూడి మువ్వల సవ్వడులతో ఘల్లుమంది. కళాకారుల నత్య విన్యాసాలు కనువిందు చేశాయి. తొలుత అంతర్జాతీయ కూచిపూడి నర్తకీ దీపికా రెడ్డి తన శిష్య బృందంతో ‘కూచిపూడి ... వందనం’నృత్య ప్రదర్శన చేశారు. నృత్యకారుల పాద మంజిర రవళులై ప్రేక్షక జగతని పులకింప చేసింది. మంత్రముగ్దుల్ని చేసిన ప్లేట్ డ్యాన్స్.. కూచిపూడి వందనంలో భాగంగా ఇత్తడి పల్లెంపై తకిట... తకిట... విజయ గణపతి... వందే లోకపాలకం నృత్యం పులకింపజేసింది. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ తొలుత వినాయక స్తుతితో ప్రారంభమైన నృత్యం బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర అంశాలతో ముగిసాయి. ఈ అంశాలను పల్లెంపై దీపకా రెడ్డి చేసిన వివిధ రకాల భంగిమలు శిలాక్షరాలు అయ్యాయి. చప్పట్లతో ప్రాంగణం మారుమోగిపోయింది. ఆలోచింపజేసిన జానపద సందేశం... సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండో అంశంగా జానపద సందేశం నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రకృతిని ఎలా కాపాడాలి..? అనే ఇతివృత్తంగా జానపద సందేశమిస్తూ సాగిన నృత్యహోరు అందరినీ పరవశింపజేసింది. ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకైన సాక్షి దినపత్రిక ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ గీతంతో ప్రారంభమైన కార్యక్రమం జ్యోతి ప్రకాశనం, కూచిపూడి వందన నృత్యం, అవార్డుల ప్రదానోత్సవంతో ముగిసింది. -
సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు
-
సిరాజ్‌కు సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్: సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్, సాక్షి గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, ఈడీ రామచంద్రమూర్తిలు హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేశారు. అమరవీరుడు వెంకరమణకు పోస్ట్ హ్యూమస్ అవార్డు ప్రకటించగా.. ఆయన సోదరుడు కోటేశ్వరరావు అవార్డును అందుకున్నారు. వరంగల్‌లో సహృదయ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న యాకుబ్ బీకు సామాజిక సేవ అవార్డును అందుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి యాకుబ్ బీకు అవార్డు అందజేశారు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఐపీఎల్లో పాల్గొంటున్న మహ్మద్ సిరాజ్ యంగ్ అచీవర్ స్పోర్ట్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సోదరుడు సిరాజ్ తరఫున అవార్డును అందుకున్నారు. యంగ్ అచీవర్ అవార్డును జేఈఈ మెయిన్స్‌లో టాపర్‌గా నిలిచిన మోహన్ అభ్యాస్ అందుకున్నాడు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి యంగ్ అచీవర్ స్పోర్ట్స్ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అందించారు. యంగ్ అచీవర్ స్పోర్ట్స్ ఫిమేల్ అవార్డును ఆమె తల్లిదండ్రులు హారిక తరఫున అందుకున్నారు. -
‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ ఎంట్రీల పరిశీలన పూర్తి
-
ప్రతిభకు పట్టం.. సేవకు స్ఫూర్తి
‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపిక ప్రక్రియ మొదలు స్ఫూర్తిగా నిలుస్తున్నవారిని మీరే ప్రతిపాదించండి సాక్షి, హైదరాబాద్: ప్రతిభ, కృషి ఏ ఒక్కరి సొంతమో కాదు! సమాజమంతటికీ విస్తరించాలి. అసాధారణమైన ప్రతిభామూర్తులు, నిబద్ధత కలిగిన సంస్థల సామాజిక సేవ ఇంకా ఎందరెందరికో స్ఫూర్తి కావాలి. సమాజహితం కోసం జరిగే ఇలాంటి కృషి మరింత పెరగాలి. ఈ భావనతోనే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇవ్వడం ద్వారా లక్ష్య సాధనలో విశేష కృషి సల్పిన విజేతల్ని ప్రోత్సహించడంతో పాటు ఇతరులకు ప్రేరణ కల్పించేందుకు పూనుకుంది. ఇదే తలంపుతో అవార్డుల ప్రక్రియను ఒక సామాజిక బాధ్యతగా సాక్షి మీడియా హౌజ్ చేపట్టి రెండేళ్లవుతోంది. తెలుగునాట వివిధ రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015లలో జరిగిన ప్రక్రియలో ఈ అవార్డులకు ఎంపికై ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. కొత్త చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్యం పొందిన మహామహుల వరకు ఈ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. అసాధారణ ప్రతిభ, విశేష సేవల్ని గుర్తించిన సాక్షి తగు రీతిన వారిని సత్కరించి తద్వారా ఇతరులకు స్ఫూర్తి, ప్రేరణ కలిగించింది. 2016కుగాను అవార్డు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువుండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో విశేషమేమంటే.. ఎవరికి వారు ఎంట్రీలు పంపే అవకాశం లేదు. విశేషంగా ప్రతిభ కనబరుస్తున్న, సేవలందిస్తున్న, లక్ష్యాలు సాధిస్తున్న విజేతల్ని గుర్తించి వారినెరిగిన ఇతరులెవరైనా ఈ ఎంట్రీలు పంపొచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు న్యాయనిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి. విభిన్న రంగాల్లో ప్రతిభకు పట్టం విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా తదితర రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తుల్ని, సంస్థల్ని సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం గుర్తిస్తారు. కొన్ని విభాగాల్లో యువతరానికి, ప్రవాసభారతీయులకూ అవార్డులున్నాయి. జ్యూరీ ప్రత్యేక అవార్డుల్ని కూడా పొందుపరిచారు. ఇవి కాకుండా సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన, ప్రతిభ చూపిన వారిని ప్రజాదరణ ఆధారంగా ఎంపిక చేసి అవార్డులిచ్చే ప్రక్రియకూ స్థానం కల్పించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపధ్యగానం వంటి విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. ప్రఖ్యాత సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు గడిచిన రెండు సంవత్సరాల్లో జీవనసాఫల్య పురస్కారాల్ని అందించారు. వివిధ రంగాల్లో విశేష లక్ష్యాలు సాధించి విజేతలుగా అవార్డులు పొందిన వారిలో డా.సతీశ్‌రెడ్డి, శ్రీకాంత్బొళ్ల, డా.మధుకర్ గంగాడి, డా.ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, వినోద, జ్యోతిరెడ్డి, బాల థెరిసా సింగారెడ్డి వంటి వారితో పాటు డా. గోపాలమ్ శివనారాయణ, పూర్ణ, ఆనంద్ తదితరులున్నారు. క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, నైనా జైస్వాల్ వంటి వారు ఉన్నారు. ఇక ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (అనంతపురం), ప్రజాధరణ వంటి పలు సంస్థలు కూడా ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నాయి. అవార్డులు పొందిన సినీ ముఖ్యుల్లో మహేష్‌బాబు, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, గుణశేఖర్, దేవీశ్రీ ప్రసాద్, కారుణ్య వంటి వారున్నారు. వరుసగా రెండేళ్లు జరిగిన అవార్డు ప్రధానోత్సవాలకు మీడియా ప్రముఖులైన శేఖర్‌గుప్త, రాజ్‌దీప్ సర్దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అవార్డు విభాగాల రూపకల్పన, ఎంపిక ప్రక్రియను ‘యర్నెస్ట్ అండ్ యంగ్’ సంస్థ స్వతంత్రంగా పర్యవేక్షిస్తోంది. ప్రతిభకు పట్టం కట్టడం, ప్రత్యేక కృషిని అభినందించడం, లక్ష్య సాధనను ప్రశంసిచడం ఎవరైనా చేయదగ్గ మంచి పని అనే భావన కలిగిన వారంతా అర్హుల పేర్లను ఈ అవార్డుకు ప్రతిపాదిస్తూ ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. తద్వారా మనమంతా విజేతల్ని ప్రోత్సహిస్తూ, స్ఫూర్తిని వ్యాప్తి చేసినవాళ్లమవుతాం అన్నది ఈ పిలుపు వెనుక ఉద్దేశంగా సాక్షి భావిస్తోందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు లాగాన్ చేయండి:www.sakshiexcellenceawards.com సంప్రదించాల్సిన నంబర్: 040–23322330 -
సాక్షి అవార్డులు గౌరవానికే గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్‌లో ప్రాణాలు అర్పించిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ ధైర్యసాహసాలు గుర్తించి సాక్షి మీడియా గ్రూప్ అవార్డు ఇవ్వడం గౌరవానికే గౌరవం ఇవ్వడంలాంటిదని ప్రముఖ జర్నలిస్టు.. టీవీ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్ అన్నారు. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పాల్గొన్నారు. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్కు సర్దేశాయ్ అందించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న సర్దేశాయ్ వీర జవాను ముస్తాక్ అహ్మద్ భార్యకు సాక్షి అవార్డు అందించడంపట్ల ముగ్దుడయ్యారు. హైదరాబాద్‌లో చక్కటి సాయంత్రం వేళ నిజమైన తెలుగు హీరోల మధ్య గౌరవానికి గౌరవం దక్కిందని చెప్పారు. ఇందరు తెలుగువాళ్ల మధ్య వేదికపై తానొక్కడినే తెలుగేతరుడినని ఆయన అన్నారు. ముస్తాక్‌కు అవార్డు ప్రకటించిన సాక్షి మీడియా గ్రూప్ ను ప్రశంసించారు. Honoured for the honour of presenting Sakshi award for bravery to Widow of Mushtaq Ahmed, martyred at Siachen. pic.twitter.com/DwspvNK2jx — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 Honoured to be honoured in Hyderabad at a spl evening celebrating real Telugu heroes.As only non Telugu on stage! pic.twitter.com/uXTENfQVdF — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 April 2016 -
కన్నులపండువగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు
-
ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు
► సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన వేడుకలో జీవిత సాఫల్య పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ► కనులపండువగా అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన అతిరథులు ► తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి.. బెస్ట్ లిరిసిస్ట్‌గా సిరివెన్నెల ► తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి.. మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా మహేశ్‌బాబు సాక్షి, హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులు, సంస్థలను ‘సాక్షి’ సమున్నతంగా గౌరవించింది. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది. కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. సినీ దర్శకుడు దాసరి నారాయణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే..’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఇక మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నటుడు మహేశ్‌బాబు(శ్రీమంతుడు), తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(ఫిమేల్) జ్యోతి సురేఖ, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(మేల్) శ్రీకాంత్ , మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిలను అవార్డులు వరించాయి. అత్యంత వైభవంగా సాగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అభినందనీయం: కె.విశ్వనాథ్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. సాక్షి ఎంపికలో వైవిధ్యం ఉందని కొనియాడారు. సియాచిన్ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన ఓ సైనికుడి సేవలను గుర్తిస్తూ ఆయన భార్య, బిడ్డలకు ‘సాక్షి’ అవార్డు ఇవ్వడం తన హృదయాన్ని కదలించిందన్నారు. అలాంటి వీరులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి సాక్షి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాంటివారి మధ్య పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. విశ్వనాథ్‌కు సాక్షి చేస్తున్న ఈ సత్కారం సినీపరిశ్రమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.అవార్డులు వీరికే మెడ్‌ప్లస్ మెడికల్ షాప్‌లను వేలల్లో విస్తరించిన వ్యాపారవేత్త డాక్టర్ మధుకర్ గంగడికి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(లార్జ్)’ దక్కింది. అంధుడైన చక్కని చిట్కాలతో డిస్పోజబుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో దూసుకెళుతున్న బొల్లా శ్రీకాంత్ (బొల్లాంట్ ఇండస్ట్రీస్)ను ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(స్మాల్/మీడియం) అవార్డు వరించింది. విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. లక్షల్లో కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేసిన డాక్టర్ మదసి వెంకయ్యకు ఎక్సలెన్సీ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు దక్కింది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు లభించింది. సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్ అందుకున్నారు. తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు గెల్చుకున్న బాల థెరిస్సా సింగరెడ్డి తరఫున శౌరిరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. సేంద్రియ సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా రైతు ఎం.వినోదకు ఎక్సలెన్సీ ఇన్ ఫామింగ్ అవార్డు దక్కింది. ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు ఎక్సలెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు, యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డు సోనీవుడ్‌ను వరించాయి. ఫోర్మ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డి.. ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ శాంతా సిన్హా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.పాపులర్ విభాగంలో వీరికే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా ‘శ్రీమంతుడు’ నిలిచింది. దర్శకుడు కొరటాల శివ, రవిశంకర్, సినీ నటుడు మహేశ్‌బాబు... రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేశ్‌బాబు సినీ నటి జయప్రద, వైఎస్ భారతి చేతుల మీదుగా అందుకున్నారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ (పండుగ చేస్కో), మోస్ట్ పాపులర్ డెరైక్టర్‌గా గుణశేఖర్(రుద్రమదేవి), మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్‌గా దేశీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి, కుమార్ 21ఎఫ్), పాపులర్ సింగర్‌గా సత్య యామిని, పాపులర్ సింగర్(మేల్)గా కారుణ్య అవార్డులు అందుకున్నారు. జ్యూరీ స్పెషల్ అవార్డు-బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్‌గా కంచె సినిమా అవార్డు దక్కించుకుంది. మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దేవీ శ్రీ ప్రసాద్ తరఫున సుకుమార్ అందుకున్నారు. వీరికి రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ, జయప్రద, ఆర్పీ పట్నాయక్, గుణశేఖర్, క్రిష్ తదితరులు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సెల్కాన్ కంపెనీ ఎండీ గురుస్వామి నాయుడు, సీఐఐ ప్రెసిడెంట్ వనిత దాట్ల, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గొప్పగా గౌరవిస్తోంది: రాజ్‌దీప్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి అవార్డులు ఇచ్చి ఎంతో గొప్పగా గౌరవిస్తోందని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చాలా చాలా ఆనందం... శ్రీమంతుడు సినిమా నా జీవితంలోనే బెస్ట్ టర్నింగ్ పాయింట్. సాక్షి మీడియా గ్రూప్ ద్వారా వరుసగా రెండోసారి మోస్ట్ పాపులర్ మేల్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా చాలా ఆనందం కలిగిస్తోంది. - హీరో మహేశ్‌బాబు ఈ అవార్డు తిరుపతి లడ్డూ లాంటిది... న్యాయస్థానాల్లో నిజం చెప్పమని అడుగుతూ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ ఆ అవసరం లేకపోయినా, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను... ఇక్కడకు వచ్చి, ఇక్కడ అవార్డులు అందుకున్న కొందరి ప్రొఫైల్స్ చూశాక... నేను సాధించింది చాలా తక్కువ అని నేను చాలా చిన్నవాడ్ని అని భావిస్తున్నాను. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే. - కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రభుత్వ అవార్డుల కన్నా మిన్న విభిన్న రంగాల నుంచి సేవ చేసిన వారిని ఎంపిక చేసి సాక్షి మీడియా అవార్డులు ఇచ్చి సత్కరించడం గొప్ప విషయం. మీడియా అవార్డులు ప్రభుత్వ అవార్డుల కన్నా గొప్పవి అంటాన్నేను. కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాధ్‌కి లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డ్ అందించడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఆయన సినిమాలు వేటికవే ఆణిముత్యాలు. ఆయన తీసిన సిరిమువ్వల సింహనాదం అనే ఒక్క సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అది చాలా గొప్ప సినిమా. బహుశా దాన్ని నేనే విడుదల చేస్తానేమో - సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుడు సినీరంగం అంటే కొందరికి చిన్న చూపు. అయితే అలాంటివారు కూడా గౌరవం ప్రకటించక తప్పని గొప్ప సినిమాలను తీసిన దర్శకుడు కె.విశ్వనాధ్. అలాంటి కళాతపస్విని సాక్షి మీడియా సత్కరించడం ఎంతైనా సముచితం. ఆయన సినిమా ద్వారా పుట్టిన రచయితగా ఈ వేడుకలో పాలు పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇదే కార్యక్రమంలో నాకు కూడా అత్యధిక ప్రజాదరణ పొందిన సినీ రచయిత పురస్కారం అందించినందుకు సాక్షికి, కంచె సినిమాలో ఆ పాట రాసే అవకాశం ఇచ్చిన సినిమా రూపకర్తలకు కృతజ్ఞతలు. - సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు వారి ఆదరణకు చిహ్నం సన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నేను సాధించింది చాలా తక్కువే అయినా... ఇలాంటి అరుదైన పురస్కారాలతో నన్ను అభిమానిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు ప్రేక్షకుల నన్ను ఆదరిస్తున్న తీరుకు మరో నిదర్శనం.- సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నత ప్రమాణాల సాక్షి... మీడియా గ్రూప్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించే సాక్షి నుంచి అవార్డు అందుకోవడం సంతృప్తిని అందించింది. - సినీ దర్శకుడు గుణశేఖర్ స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి వ్యక్తిగతంగా మంచి సక్సెస్‌ని అందించిన సినిమా శ్రీమంతుడు. దానికే సాక్షి ద్వారా మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి. - సినీ దర్శకుడు కొరటాల శివ వెరీ హ్యాపీ మంచి పాట పాడే అవకాశాన్ని అందించిన బాహుబలి సినిమా దర్శకులు, సంగీత దర్శకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు వచ్చినందుకు వెరీ హ్యాపీ. - గాయని సత్య యామిని ఈ వేదిక ఎంతో గొప్పది.. అవార్డు వస్తే జనం వై అనకూడదు. వైనాట్ అనాలి. గమ్యం నుంచి అలాంటి సినిమాలే తీస్తూ వస్తున్నాను. ఇక్కడ అవార్డు అందుకుంటున్న వారిని చూశాక... ఈ వేదిక నాకు చాలా గొప్పదిగా అనిపిస్తోంది. ఇలాంటి వేదిక మీద నేను కూడా అవార్డు తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది. - సినీ దర్శకుడు క్రిష్ అమ్మ పాట తెచ్చిన అవార్డు... నాకు మనసుకు బాగా నచ్చిన పాట ద్వారా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు జన్మనిచ్చి, తద్వారా ఈ పాటకి జన్మనిచ్చిన అమ్మకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. - సినీ గాయకుడు కారుణ్య ఆయన ఫొటో పక్కనే పెట్టుకుంటా... నా భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన లేకపోయినా, ఆయన త్యాగాన్ని గుర్తించి సాక్షి గ్రూప్ ఈ అవార్డు అందించడం ద్వారా నా భర్తను మరోసారి గౌరవించింది. ఇంటికి వెళ్లాక సాక్షి పురస్కారాన్ని నా భర్త ఫొటో పక్కనే పెట్టుకుంటా. - నసీమున్, అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య మీడియా చేసిన తొలి సత్కారమిది క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే ప్రతిభావంతురాలైన విద్యార్ధినిగా, అదీ ఒక ప్రతిష్టాత్మక మీడియా గ్రూప్ నుంచి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం చాలా తృప్తినిచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా ఇది నాకెంతో ప్రత్యేకం. -నైనా జైస్వాల్ వైఫల్యాలపై పోరాడే శక్తిని ఇచ్చింది జీవితంలో సామాజిక సేవ పరంగా ఎన్నో ఆశయాలున్నా, ఏమీ సాధించలేదని, నిస్పృహ చెందుతూ, అన్నింటా ఫెయిల్యూర్ అని బాధపడుతున్న నాకు సాక్షి అవార్డు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సాక్షి దినపత్రిక అభిమాని అయిన నా భార్య ఈ పోటీకి దరఖాస్తు చేయమని ప్రోత్సహించింది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చిన ఈ గుర్తింపు స్ఫూర్తిగా ముందడుగు వేస్తాను. - సోనీ వుడ్, సామాజికవేత్త మీడియా సంస్థ నుంచి తొలి అవార్డు ఇది ఒక మీడియా సంస్థ నుంచి నేను స్వీకరిస్తున్న తొలి అవార్డ్. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత మెడల్ సాధించాలనేదే లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు ఇలాంటి పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయి. - జ్యోతి సురేఖ, క్రీడాకారిణి సేవా హృదయాల కోసం డబ్బుండటం కాదు, సేవా హృదయం ఉండడం ముఖ్యం. అనంతపురంలో ప్రారంభించిన మా సేవాకార్యక్రమాలకు మరింత మంది ఊతంగా నిలవాలి. అందుకు ఇలాంటి పురస్కారాలు ఉపకరిస్తాయి. - మాచో ఫై, సామాజికవేత్త మంచికి ప్రోత్సాహమిది బాల థెరిసా కొన్నేళ్లుగా 6 వేల గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఆమె తరపున ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సమాజంలో మంచి అనేదే కొద్దిగా ఉంది. ఉన్న కొంచెం మంచిని ప్రోత్సహించడం మరీ కొరతగా ఉంది. అలాంటి ప్రోత్సాహం అందిస్తున్న సాక్షికి కృతజ్ఞతలు. -శౌరి రెడ్డి శాస్త్రవేత్తలందరికీ... అత్యాధునిక క్షిపణి సామర్థ్యం కలిగిన టాప్ 7 దేశాల్లో మన భారత్ ఒకటి. అందుకు హైదరాబాద్‌లోని తయారీ సంస్థలే ప్రధాన కారణం. నాకు లభించిన ఈ అవార్డ్‌ను ఈ రక్షణ రంగంలో పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్టుగా భావిస్తున్నా. - సతీశ్‌రెడ్డి, ప్రధాని రక్షణ సలహాదారు లక్ష్యసాధనలో స్ఫూర్తి... రాజకీయాల్లోకి నీతివంతులు, నేరచరిత్ర లేనివారు, మంచి వారు రావాలని, ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పనిచేయాలని మా సంస్థ కృషి చేస్తోంది. దీని కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇంకా ఎన్నో చేయాలి. లక్ష్యసాధనలో మాకు ఈ అవార్డు స్ఫూర్తి. -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆనందంగా అనిపిస్తోంది నాణ్యమైన ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనేది మా నినాదం. మన దేశ జనాభాలో ఇప్పటికీ 70శాతం గ్రామాల్లోనే ఉంది. వీరికి మంచి వైద్యం అందేందుకు కృషి చేస్తున్నాం. మా కృషిని సాక్షి గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరింత పట్టుదలగా పనిచేస్తాం.- డాక్టర్ మాదాసి వెంకయ్య మహిళా రైతులకు గుర్తింపు వ్యవసాయం చేసే మహిళలకు ప్రోత్సాహం కావాలి. అందరి ఆరోగ్యానికి మేలు చేసేలా, ప్రకృతి సహజమైన, సేంద్రియ సాగుకు కట్టుబడి ఉన్న మాకు సాక్షి ఇచ్చిన ఈ అవార్డు ఎంతో శక్తిని అందించింది. -వినోద, ఆదర్శ రైతు థ్యాంక్స్ టు సాక్షి గత పదేళ్లుగా మెడికల్ స్టోర్స్ నిర్వహణలో ఉన్నాం. నకిలీ మందుల విజృంభణకు విరుగుడుగా, మంచి, నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందిస్తున్నాం. ప్రస్తుతం 12 రాష్ట్రాలకు విస్తరించిన మా సంస్థను గుర్తించి అవార్డ్‌ని అందించినందుకు థ్యాంక్స్ టు సాక్షి -గంగాడి మధుకర్, వ్యాపారవేత్త వినూత్నంగా ఉండాలనుకున్నా ఒక వయసు రాగానే ప్రభుత్వోగం, పెళి...్ల మన దేశంలో పేరెంట్స్ ఐడియాలజీ అలా ఉంటుంది. అయితే నాకంటూ ఒక ప్రత్యేకత సాధించాలనుకున్నాను. ఎంచుకున్న రంగంలో నాదైన ముద్ర వేయాలనుకున్నాను. నా సక్సెస్‌కు సాక్షి ఇచ్చిన గుర్తింపు ఆనందాన్నిచ్చింది. -శ్రీకాంత్, అంధ వ్యాపారవేత్త -
'శేఖర్‌గుప్తా'ని సన్మానించిన సాక్షి మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2014:జ్యూరీ స్పెషల్ అవార్డు- ఎవరెస్ట్ పర్వతారోహకులు పూర్ణ, ఆనంద్
-
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2014: సోషల్ సర్వీస్ - యంగ్ అచీవర్ - ఏలేటి మధుసూదన్ రెడ్డి