Allu Arjun Bags Sakshi Excellence Best Actor Award | Read More - Sakshi
Sakshi News home page

Allu Arjun In Sakshi Excellence Awards: ‘అల వైకుంఠపురములో’కు అవార్డుల పంట

Published Sat, Sep 25 2021 8:50 AM | Last Updated on Sat, Sep 25 2021 2:30 PM

Sakshi Excellence Awards Most Popular Actor 2020 Allu Arjun Ala VaikuntapuramLo

ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలకు సాక్షి’ మీడియా గ్రూప్‌ 2019, 2020 సంవత్సరాలకు గాను ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురములో’గాను బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు(2020) అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

నాకు అవార్డులంటే చాలా ఇష్టం. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. మా బ్రదర్‌ తమన్‌ని నాకు వన్‌ బిలియన్‌ ప్లే అవుట్స్‌ కావాలని ఏ ముహూర్తాన అడిగానో..! అంటే.. వందల కోట్ల సార్లు పాట ప్లే అవ్వాలని.. ఇప్పటికి దాదాపు 300 కోట్ల సార్లు ప్లే అయింది... ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇవ్వడమే కాదు.. 2020 లాస్ట్‌లో ఎవడు సిక్సర్‌ కొడతాడో ఆడే మొత్తం డికేడ్‌ అంతా కొట్టినట్టు. ఆల్బమ్‌ ఆఫ్‌ ద డికేడ్‌... థ్యాంక్యూ తమన్‌. ఆల్బమ్‌లో ‘మల్లెల మాసమా...’ రాసిన సీతారామ శాస్త్రిగారికి, ‘రాజుల కాలం కాదు.. రథము, గుర్రము లేదు’ అని రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి , ‘రాములో రాముల..’ పాట రాసిన కాసర్ల శ్యామ్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానంటే నాకు లాంగ్వేజ్‌ అంతగా రాదు.. కానీ లిటరేచర్‌ వేల్యూ బాగా తెలుసు. వచ్చే జనరేషన్‌ నాలా తెలుగు మాట్లాడకూడదు... చాలా బాగా మాట్లాడాలి (నవ్వు..). త్రివిక్రమ్‌గారిలా మాట్లాడాలనుకోండి. మా ప్రొడ్యూసర్‌ చినబాబుగారికి, వంశీగారికి, మా నాన్న అల్లు అరవింద్‌, బన్నీ వాసుకి థ్యాంక్యూ సో మచ్‌. ఈ సినిమాలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే... నాలుగైదేళ్లుగా ఇలాంటి ఒక పెద్ద హిట్టు పడాలి, ఇండస్ట్రీ రికార్డో లేదా ఆల్‌ టైమ్‌ రికార్డో పడాలి.. అనుకుంటూ ప్రతిసారీ సినిమా చేసేవాణ్ణి.

అయితే రాలేదు. ప్రతిసారీ అలాగే అనుకుంటాం.. ఈసారి అన్నీ వదిలేసి సరదాగా ఒక సినిమా చేద్దాం అనుకుని చేస్తే.. ఆ సినిమానే ఆల్‌టైమ్‌ రికార్డ్, బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఇది సినిమాకే కాదు.. లైఫ్‌కి కూడా మంచి పాఠం. అదేంటంటే మన లైఫ్‌లో అద్భుతం రావాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కాదు.. వదిలేయాలి, వదిలేసినప్పుడే అద్భుతం వస్తుంది. మీ లైఫ్‌లో కూడా ఏదైనా అద్భుతం రావాలంటే వదిలేయండి. అదొస్తదంతే. 
–  అల్లు అర్జున్‌, మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ (అల వైకుంఠపురములో...)

అవార్డులు మాకు చాక్లెట్స్‌లాగా..
చిన్నపిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో బేసిగ్గా సినిమావాళ్లకు అవార్డులు కూడా అంతే ఇష్టం. మీరు ఎన్ని చాక్లెట్లు ఇస్తామన్నా పిల్లలు వద్దనరు.. మేము అవార్డులు వద్దనం. ‘అల వైకుంఠపురములో..’ తాలూకు అవార్డు మొట్టమొదటగా ‘సాక్షి’తో స్టార్ట్‌ అయింది. ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి మా ‘అల వైకుంఠపురములో..’ టీమ్‌ తరఫున ధన్యవాదాలు. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్‌గార్లకు, సినిమా రిలీజ్‌ అవక ముందే అత్యద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్లిన నా మిత్రుడు తమన్‌కి, ఈ సినిమాని మా అందరితో కలిసి నటుడిగానే కాదు తోటి టెక్నీషియన్‌గానూ చేసిన మా హీరో అల్లు అర్జున్‌గారికి.. నాగవంశీ, పీడీవీ ప్రసాద్, పూజా హెగ్డే, టబులతో పాటు మిగతా అందరికీ నా కృతజ్ఞతలు.   
– త్రివిక్రమ్‌ శ్రీనివాస్,  మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ (అల వైకుంఠపురములో...)

2020 తర్వాత మొదటిసారి..
2020లో వైజాగ్‌లో చేసిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (‘అల వైకుంఠపురములో’)లో అంతమందిని జనాలను చూసిన తర్వాత.. మళ్లీ అంతమందిని చూడటం, ఓ ఫంక్షన్‌కి అటెండ్‌ కావడం కరువైపోయింది. ఓ ఏడాదిన్నర అటువంటి కరువులో ప్రయాణించిన మాకు ఒక చల్లటి గాలిలా మా ఇండస్ట్రీకి ఫస్ట్‌ వేడుకగా. ప్రప్రథమంగా ‘సాక్షి’ వారు ముందుకొచ్చి ఈ ఫంక్షన్‌ చేయడాన్ని ఎంతో అభినందిస్తున్నాను. ఇక ‘థర్డ్‌ వేవ్‌’ లేదనుకుంటూ ముందుకు సాగాలి. ‘సాక్షి’ వారు మా సినిమాని ఎన్నుకుని నాకు ,రాధాకృష్ణగారికి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు.   
– అల్లు అరవింద్, మోస్ట్‌ పాపులర్‌ మూవీ (అల వైకుంఠపురములో...)

క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్, బన్నీదే..
‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాకు మ్యాజికల్‌ ఫిల్మ్‌. ఈ క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్, బన్నీదే. ఈ సినిమాని ఇంత పెద్ద స్థాయిలో తీసిన రాధాకృష్ణ, అల్లు అరవింద్‌కు థ్యాంక్స్‌. ఓ సినిమాలో ఒక పాట హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ది. ఆరు పాటలూ హిట్‌ కావడం అంత సులభం కాదు. త్రివిక్రమ్‌గారు చాలా తెలివైనవారు.. రియల్లీ జీనియస్‌. ఈ సినిమాకి మంచి లిరిక్స్‌ ఇచ్చిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కల్యాణ్‌ చక్రవర్తి, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్, విజయ్‌ కుమార్‌గార్లకు థ్యాంక్స్‌. ఈ సినిమాకి చాలా అవార్డులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.. ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్‌. 
– సంగీత దర్శకుడు తమన్, మోస్ట్‌ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (అల వైకుంఠపురములో...)

ఇది నా రెండో సాక్షి అవార్డు..
‘సాక్షి’ అవార్డు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇది నా రెండో సాక్షి అవార్డు. మొదటిసారి ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అందుకున్నాను.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి తీసుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ టు మై డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ సార్‌. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్, నిర్మాత చినబాబుగారు, వంశీ, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్‌. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వారు మళ్లీ మళ్లీ నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించడంతో పాటు అభినందించారు.. అందుకు వారందరికీ థ్యాంక్స్‌.   
– పూజా హెగ్డే, మోస్ట్‌ పాపులర్‌ యాక్ట్రస్‌ (అల వైకుంఠపురములో...)


గర్వంగా ఉంది..

చిన్మయి ఇంతమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నందుకు  గర్వంగా ఉంది. ఇంత అద్భుతమైన పాట (మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌–‘ఊహలే...’ (జాను) కోసం ‘సాక్షి’ తనను గౌరవించడం చాలా సంతోషం. డైరెక్టర్‌ ప్రేమ్‌గారికి, నిర్మాతలు ‘దిల్‌’రాజు గారు, శిరీష్‌ గారు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోవింద్‌ వసంత, లిరిక్‌ రైటర్‌ శ్రీమణి గారు... అలాగే తెరపైన ఈ పాటకి ప్రాణం పోసిన సమంత, శర్వా.. అందరికీ చిన్మయి తరఫున ​కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.  
– రాహుల్, నటుడు–దర్శకుడు, చిన్మయి భర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement