Ala Vaikunthapuramlo
-
'అలా వైకుంఠపురములో చిత్రంపై పూజా హెగ్డే కామెంట్స్'.. బుట్టబొమ్మపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్లో బుట్టబొమ్మగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే దేవా మూవీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే అంతుకుముందు ఈ సినిమా ప్రమోషన్లలో మెరిసింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతే కాదు.. బుట్టబొమ్మ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందా.టాలీవుడ్లో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేశారు. అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురములో పూజా హెగ్డే మెరిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉద్దేశించి తాజాగా పూజా చేసిన కామెంట్స్ ఆగ్రహానికి దారితీశాయి. అలా వైకుంఠపురములో మూములుగా తమిళ చిత్రం అంటూ మాట్లాడింది. అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారని మాట్లాడింది. దీంతో పూజా హెగ్డే కామెంట్స్‌పై టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు మీరు ఏ భాషలో మూవీ చేశారో కూడా మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే సిగ్గుగా ఉందని.. తెలుగు చిత్రంలో మీరు లీడ్ రోల్ చేసిన సినిమాను తమిళ్ చిత్రమని ఎలా చెబుతారంటూ నిలదీస్తున్నారు. కాగా.. అలా వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను షెహజాదాగా బాలీవుడ్లో రిలీజ్ చేయగా.. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. -
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మూవీ విడుదలైన ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq— Allu Arjun (@alluarjun) January 12, 2025 AVPL DAYS 💛 THROWBACK MEMORIES 💛 pic.twitter.com/7Nz904BaH2— Allu Arjun (@alluarjun) January 12, 2025 -
అల వైకుంఠపురములో రికార్డ్ ను బద్దలు కొట్టిన హనుమాన్
-
సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్
తెలుగులో పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన నటుడు పెళ్లి చేసుకున్నాడు. సీరియల్ హీరోయిన్‌తో ఏడడుగు వేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ వీళ్లెవరు? వీళ్లది ప్రేమ వివాహమా? అనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?) మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా చేశాడు. మరోవైపు తెలుగులోకి 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ కొడుకుగా చేసింది ఇతడే. దీని తర్వాత బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ తదితర సినిమాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. మలయాళంలో టీవీ షోలకు హోస్ట్‌గానూ రాణిస్తున్నాడు. ఇక పద్మసూర్య.. గతేడాది అక్టోబరులో సీరియల్ బ్యూటీ గోపిక అనిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమే. అలా ఇప్పుడు జనవరి 28న కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ విషెస్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) View this post on Instagram A post shared by Mouseartfilm™️ (@mouseart_film) View this post on Instagram A post shared by Mouseartfilm™️ (@mouseart_film) View this post on Instagram A post shared by Mouseartfilm™️ (@mouseart_film) -
Pooja Hegde :అవకాశాల కోసం అలా.. పూజాకెన్ని కష్టాలో..!
తమిళ సినిమా: నటి పూజా హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. బహుశా ఆమె కూడా ఊహించకూడదు. 33 ఏళ్ల బ్యూటీ ముగమూడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరచడంతో ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో టాలీవుడ్ పూజాకు చేయూతనిచ్చింది. అక్కడ మొదట్లో ఒకటి రెండు చిత్రాలు పర్వాలేదు అనిపించినా, వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా పూజాహెగ్డే స్టార్‌గా ఎదిగింది. ఇక అలా వైకుంఠపురం చిత్రం అనుహ్య విజయంతో ప్రముఖ స్టార్స్ దృష్టి పూజా హెగ్డేపై పడింది. దీంతో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా ఆమె ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్, చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య, తమిళంలో విజయ్‌తో జత కట్టిన బీస్ట్, అదేవిధంగా హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన చిత్రం వరసగా విడుదలై ఫ్లాప్ కావడంతో పూజ హెగ్డేకు కష్టాలు మొదలయ్యాయి. అవి తాను మహేష్‌బాబు సరసన నటించడానికి అందగీకరించిన గుంటూరు కారం చిత్రం వరకు వదలలేదు. ఆ అవకాశాన్ని ఈమె చేజేతులారా వదులుకుంది. అలా పూజా హెగ్డే చిత్రాల ఖాతా ఖాళీ అయిపోయింది. దీంతో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది. దానికి ఆమె తన అందాలను ఎరవేసే దిశగా పయనం సాగిస్తోంది. రకరకాల ఫొటో సెషన్లు చేయించుకుంటూ ఆ వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. అలాంటి వాటికి యూత్ నుంచి స్పందన వస్తున్నా చిత్ర వర్గాల నుంచి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. మరి ఇప్పుడు ఎవరు ఈ బుట్టబొమ్మకు చేయందిస్తారో చూడాలి. -
ఓటీటీకి వచ్చేసిన 'అల వైకుంఠపురములో'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
గ్రాండ్‌గా రిలీజైన షెహజాదా.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురములో. 2020 జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ బాక్సాఫీస్ హిట్ మీద కన్నుపడ్డ బాలీవుడ్ షెహజాదా పేరుతో రీమేక్ చేసింది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 17) రిలీజైంది. అయితే విచిత్రంగా మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు నిర్మాతలు. బుక్‌మై షోలో ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమని వెల్లడించారు. ఇలా ఆఫర్ ప్రకటించేందుకు కారణం లేకపోలేదు. షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకు దేశవ్యాప్తంగా టికెట్ రేట్లు తగ్గించారు. రూ.110 కే టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పఠాన్ పోటీని తట్టుకోవడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరీ సినిమా రిలీజైన మొదటి రోజే ఇలాంటి ఆఫర్ పెట్టడం బాగోలేదంటున్నారు నెటిజన్లు. మరోపక్క సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. మరి షెషజాదా ఈ అడ్డంకులను దాటి ఏమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి! SHEHZADA - BUY ONE GET ONE FREE OFFER on BOOK MY SHOW#Shehzada team teams up with Book My Show for a special Buy One Get One Free offer for the opening day. Features #KartikAaryan and #KritiSanon pic.twitter.com/rCN98aFLTh — Himesh (@HimeshMankad) February 16, 2023 చదవండి: సింపుల్‌గా ఉపాసన సీమంతం, ఫోటోలు వైరల్ -
'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా హిందీలో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో హిట్ అయిన హిందీ-డబ్బింగ్ వెర్షన్ హక్కులను ఈ కంపెనీ సొంతం చేసుకుంది అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన అధికారిక హిందీ రీమేక్ షెహజాదా మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం బన్నీ కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ సంచలనమే. ఇక తమన్ కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సాంగ్ నుంచి సినిమా విడుదల వరకు క్షణక్షణం అనేక రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయంటే సాంగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది. #AlaVaikunthapurramuloo (Hindi) | 2 Days To Go | Releasing On 2nd Feb 2023 Only On Our YouTube Channel #Goldmines #AlaVaikunthapurramulooHindi @alluarjun @hegdepooja pic.twitter.com/k0KLAPsX5W — Goldmines Telefilms (@GTelefilms) January 31, 2023 -
మూడేళ్ల క్రితం ఆ క్యారెక్టర్ పుట్టింది.. అందుకే ప్రత్యేకం: పూజా హెగ్డే
పూజా హెగ్డే కంటే అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు బుట్టబొమ్మ. టాలీవుడ్లో అగ్ర హీరోలతో పలు సినిమాల్లో నటించింది ముద్దుగుమ్మ. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుని సక్సెస్‌ను అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో జంటగా 'అల వైకుంఠపురంలో' సూపర్ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. పూజ హెగ్డే అమూల్య పాత్రలో తనదైన నటనతో అందరినీ మెప్పించింది. తాజాగా ఈ చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది బుట్టబొమ్మ. (ఇది చదవండి: Pooja Hegde: పూజా హెగ్డేకు బ్యాడ్‌టైం) పూజా ట్విటర్లో రాస్తూ..'మూడేళ్ల క్రితం 'అమూల్య' అనే క్యారెక్టర్ పుట్టింది. ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే. ముడేళ్ల వేడుకలు జరుపుకోవడానికి అల వైకుంఠపురములో సిద్దంగా ఉంది.' బుట్టబొమ్మ పాట ఉన్న వీడియో పోస్ట్ చేసింది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘బుట్టబొమ్మ’ పాట యూట్యూబ్‌లో అరుదైన రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరోసారి ఈ జోడిని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూజ బాలీవుడ్లో‘సర్కస్’(సర్కస్) సినిమాలో నటించింది. సల్మాన్‌ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల చేసింది. Three years ago today was born a character named ‘Amulya’ and this movie does hold a special place in my heart. Here’s to celebrating #3YearsOfAlaVaikunthapurramuloo 💫@alluarjun @MusicThaman @NavinNooli @GeethaArts @adityamusic @Nivetha_Tweets @pnavdeep26 @iamSushanthA pic.twitter.com/2qQqdYn40t — Pooja Hegde (@hegdepooja) January 12, 2023 -
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'
దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. -
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్‌కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్‌గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్‌ని త్రివిక్రమ్‌గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్‌గారు మమ్మల్నందర్నీ కూల్‌గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్‌ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్‌ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్‌కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్‌కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్‌తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్‌మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానున్న అల వైకుంఠపురములో..
పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వర్షన్ జనవరి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'పుష్ప ప్రభంజనం తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు. తెలుగులో ఎంతగానో హిట్ అయిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ జనవరి 26న రిలీజ్ కానుంది' అని పేర్కొన్నాడు. 2020వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. రాములా రాములా.., సామజవరగమన.., బుట్టబొమ్మ బుట్టబొమ్మ.. పాటలు ఎంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అక్కడ షెహజాదాగా రీమేక్ అవుతోంది. బన్నీ, పూజా హెగ్డే పాత్రల్లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కనిపించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI — taran adarsh (@taran_adarsh) January 17, 2022 -
యంగ్ హీరోకు నటి టబు వార్నింగ్!
Ala Vaikunthapurramuloo Bollywood Remake: బన్నీ నటించిన హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌పై కన్నేసిన బాలీవుడ్ హిందీ రీమేక్ తీయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే! యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా 'షెహజాదా' అన్న టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రోహిత్ ధావన్ డీల్ చేస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ కానుంది. తాజాగా హీరో కార్తీక్ దర్శకుడు రోహిత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్‌తో పనిచేయడం చాలా బాగుంది అని రాసుకొచ్చాడు. దీనికి టబు రిప్లై ఇస్తూ.. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. మీ సినిమాను మేము ఎంతో ప్రేమతో తీస్తున్నాం అని బదులిచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
బాలీవుడ్‌లోకి ఆర్ఎక్స్ 100, అల వైకుంఠపురములో.. టైటిల్స్ ఇవే
టాలీవుడ్ స్టోరీలు బాలీవుడ్ కి వెళుతున్నాయి. మన కథలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. రస్టిక్ లవ్ స్టోరీస్ ని మాత్రమే కాదు తెలుగులో సక్సెస్ అయిన కమర్షియల్ చిత్రాల్ని కూడా బాలీవుడ్ మేకర్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అలాంటి రెండు రీమేక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.. షెహజాదా... అంటే యువరాజు అని అర్థం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్, బ్రాత్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కృతీ సనన్ హీరోహిన్ గా యాక్ట్ చేస్తోంది. టబు పోషించిన పాత్రలో మనీషా కోయిరాల కనిపించబోతుంది. షెహజాదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు 2022 నవంబర్ 4న షెహజాదా రిలీజ్ కాబోతున్న ప్రకటించింది మూవీ టీమ్. తడప్.. తెలుగులో స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఎక్స్100 కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూద్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అషన్ శెట్టి, తారా సుతారియా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. -
'అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో బన్నీ!
అల్లు అర్జున్‌కి దక్షిణాదిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన స్టైలిష్ లుక్స్, నటనతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌తో అని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘షాజాదే’ (యువరాజు) పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పరేశ్ రావల్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్‌ని చిత్రవర్గాలు కోరగా, ఆయన పచ్చజెండా ఊపారని టాక్. తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ అతిథి పాత్ర లేదు. మరి ‘షాజాదే’లో అతిథి పాత్రను జోడించి ఉంటారా? ఉంటే.. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. -
తెలుగు సినిమాలపై బాలీవుడ్ కన్ను.. స్పెషల్ వీడియో
ఒకప్పుడు తెలుగులో మిగతా భాష చిత్రాలు రీమేక్ లేదా డబ్ అవ్వడం జరిగేది. ఇతర పరిశ్రమలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపేవే కాదు. ముఖ్యంగా బాలీవుడ్. హిందీలో మన సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు భాష చిత్రాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మన సినిమాలు బి-టౌన్లో భారీ స్థాయిలో మార్కెట్ చేయడంతో బాలీవుడ్ వరుస పెట్టి మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ హక్కులను సొంతంగా చేసుకున్న బి-టౌన్ మరిన్ని చిత్రాలను కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. మరీ రీమేక్ కోసం బాలీవుడ్ కన్నేసిన మన తెలుగు సినిమావో ఓ లుక్కేద్దాం. -
‘అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్ టైటిల్ ఇదే..
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అలవైకుంఠపురంలో'. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్లు హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షెహజాదా అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు. చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో -
తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల
తెలుగు సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయి అక్కడ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. రీసెంట్గా మన తెలుగు పాటలకు బాలీవుడ్లో సీటీమార్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఇక తెలుగులో సుశాంత్‌కు తల్లిగా నటించిన టబు పాత్రను బాలీవుడ్లో మనీషా కొయిరాల చేయనుందట. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరపగా, మనీషా కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కిందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ రీమేక్ వెర్షన్‌ను అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. చదవండి : ‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్ ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా -
అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్ అయిన ఈ పాట సెలబ్రెటీల నుంచి పద్దా, చిన్నా వరకు ఎంతో క్రేజ్‌ను సంపాదించి దాదాపు అందరితోనూ స్టెప్పు లేయించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీలోని ఈ పాటకు తమన్ స్వరాలను సమకూర్చగా, బాలీవుడ్ సింగర్ ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. యూట్యూబ్‌లో 627 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని ఈ పాట కొత్త రికార్టను సృష్టించింది. ఇప్పటికే శిల్పాశెట్టి, సిమ్రాన్, దిశా పటానీతో పాటు అస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ మొదలుకొని ఎంతో మంది బుట్ట బొమ్మకు స్టెప్పులేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా చేరాడు. అయితే ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్‌తో సహా అల్లు అర్జున్ వేసిన ఏ స్టెప్పులు కార్తీన్ వేయలేదు. స్ట్రీట్ స్టయిల్ హిప్ హాప్ తరహాలో తనదైన శైలిలో కార్తీక్ కార్తీక్ ఈ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకన్నాడు. అనంతరం ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి ‘డాన్స్ లైక్ కార్తీక్ ఆర్యన్’ అనే క్యాప్షన్‌తో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన అతడి ఫాలోవర్స్, అభిమానులు, సన్నిహితులు సైతం ఫిదా అయిపోయారు. కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా-2’ లో నటిస్తుండగా, ‘థమాకా’ అనే మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్ ప్రశంసలు అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు -
‘వంటలక్క’ వెరైటీ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
‘‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’’ అంటూ అల వైకుంఠపురములో మూవీలో మాస్ బీట్తో బంటు అలియాస్ అల్లు అర్జున్ స్టైలిష్ ఫైట్‌తో అలరించాడు కదా. సేమ్.. ఆ రేంజ్ ఫోజుతో వంటలక్క అలియాస్ నటి ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సీరియల్‌తోనే కాదు.. ఛాన్స్ దొరికితే బయట కూడా తన చేష్టలతో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటుంది ప్రేమి విశ్వనాథ్. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ, గాల్లో ఎగిరే కోడిపుంజు.. వెరసి ప్రేమి ఆరాచకమైన ఫొజుతో అలరిస్తోంది. తన సోదరుడు తీసిన ఆ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్ హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది మన వంటలక్క. ఫాలోవర్స్ కోసం.. కింద నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఉంచింది. View this post on Instagram A post shared by Premi Vishwanath (@premi_vishwanath) -
బుట్టబొమ్మ మరో సెన్సేషన్
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్ అయిన ఈ పాట.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులతో మరింత వైరల్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‌లో మరో రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో నాలుగు మిలియన్ల లైకులతో.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సాంగ్‌గా నిలిచింది. అల వైకుంఠపురములో.. మూవీ లోని బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో అరవై కోట్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను అర్మాన్ మాలిక్ పాడాడు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అల్లు అర్జున్ గ్రేస్.. బుట్టబొమ్మకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. చదవండి: బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య -
‘బుట్టబొమ్మ’ సంచనలం.. తొలి రికార్డు అందుకున్న బన్నీ..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దాదాపు 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బన్నీ కెరీర్లోనే దిబెస్ట్ మూవీగా నిలిచింది. ఇక సినిమాకు తమన్ సంగీతం అందించిన పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఒక్కో సాంగ్ ఒక్కో రికార్డును సాధించింది. ఇక రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఎవరి నోట విన్న ఇదే పాట కనిపించింది. టిక్ టాక్, డబ్ స్మాష్ ఇలా ప్రతిచోటా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. అక్టోబర్‌లో మరో 100 మిలియన్స్ అందుకొని 400 మిలియన్లు చేరుకుంది. జనవరిలో 500 మిలియన్లకు చేరుకుంటే.. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్స్ దాటింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. చదవండి: నేను బాగున్నాను.. కోలుకుంటున్నాను: అల్లు అర్జున్ -
అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన టాప్ 5 చిత్రాలు..
అల్లు అర్జున్... ఆయన అభిమానులకు ఈ పేరొక పవిత్ర మంత్రం. బన్నీ సినిమా రిలీజైందంటే చాలు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయేలా సందడి చేస్తుంటారీ ఫ్యాన్స్. అలాంటిది రేపు ఆయన బర్త్‌డే అంటే వీళ్ల హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు చోట్ల పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ర్యాలీలు తీస్తూ స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. వీళ్లు ఇంతగా అభిమానిస్తున్న ఆ హీరో కూడా మామూలోడు కాదు. ఏ సినిమా జనాలకు నచ్చుతుందో, ఎలాంటి కథలైతే ప్రేక్షకులకు బోర్ కొట్టవో, ఏవి తీస్తే అభిమానులు ఎగిరి గంతులేస్తారో అచ్చంగా అలాంటి సినిమాలే ఎంచుకుంటాడు. అవలీలగా హిట్లు సాధిస్తాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో అమాయక చక్రవర్తిగా కనిపించిన అల్లు అర్జున్ 'దేశముదురు'లో సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అదుర్స్ అనిపించుకున్నాడు. తండ్రిని ఆరాధించే కొడుకుగా, ప్రేయసి కోసం పాట్లు పడే ప్రేమికుడిగా, అన్న కోసం ఎవరినైనా ఎదిరించే తమ్ముడిలా, ఆశయం కోసం అన్నీ వదులుకునే యువకుడిగా.. ఇలా అన్నిరకాల పాత్రల్లోనూ ఒదిగిపోయాడాయన. డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ను సృష్టించే ఈ హీరో కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం.. సెన్సేషన్ క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అల వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామా, కామెడీ పార్ట్ మెండుగా ఉన్న ఈ చిత్రం జనాలకు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు థమన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. గతేడాది సంక్రాంతికి బరిలో దిగిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లు దాటేసిన సరైనోడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుడి ముందుకు వచ్చింది. రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి రూ.127 కోట్లు వచ్చాయి. బాక్సాఫీస్‌ను దున్నేసిన దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఒక పాత్రలో బన్నీ పూజారిగా కనిపిస్తే, మరో పాత్రలోఅండర్కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇందులో కిషోర్ కామెడీ, పూజా హెగ్డేతో బన్నీ కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సుమారు రూ.115 కోట్ల వసూళ్లు కురిపించింది. శభాష్ అనిపించుకున్న సన్నాఫ్ సత్యమూర్తి విలువలే నా ఆస్తి అంటూ తండ్రి సిద్ధాంతాన్ని నమ్ముతాడు బన్నీ. ఇందులో అన్నీ ఉన్న శ్రీమంతుడి స్థాయి నుంచి ప్రతీది కోల్పోయిన నిరుద్యోగి మారతాడు బన్నీ. విలువల కోసం అన్నింటినీ వదులుకునే వ్యక్తిగా బన్నీ నటన అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్, సమంత క్యారెక్టరైజేషన్, ఉపేంద్ర, స్నేహ, నిత్యామీనన్‌లు కనిపించే సీన్లు ప్రేక్షకుడిని వినోదాన్ని పంచుతాయి. ఈ చిత్రం సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోయి రూ.90 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెట్టిన రేసుగుర్రం 2014లో ఈ సినిమాలో బన్నీ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బన్నీ రౌడీతో తలపడే సన్నివేశాలు, అన్నతో ఫైట్ చేసే తీరు, స్పందనగా శృతి హాసన్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ప్రేక్షకుడికి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రూ.60 కోట్లు వచ్చాయి. చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్ కోహ్లిని ఎత్తిపడేసిన అనుష్క.. వీడియో వైరల్! -
‘బాలీవుడ్’ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ మూవీ రికార్డులు
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి అవార్డుల పంట కురిసింది. బాలీవుడ్ లైఫ్.కామ్ 2021 అవార్డుల జాబితాలో అన్ని కేటగిరీల్లోనూ అల వైకుంఠపురములో మూవీ రికార్డులు సృష్టించింది. సౌత్ మూవీస్ కెటగిరీలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉత్తమ డైరెక్టర్ అవార్డు వరించింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ నిలిచారు. వీటితోపాటు బెస్ట్ సాంగ్, రాములో రాములో, బెస్ట్ సపోర్టింగ్ రోల్-సుశాంత్, బెస్ట్ సినిమాటోగ్రఫీ- పీఎస్ వినోద్, బెస్ట్ స్క్రిప్ట్ వంటి రంగాల్లో అవార్డులు దక్కాయి. ఒక హీరోయిన్ తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అల వైకుంఠపురములో సినిమా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక భీష్మ సినిమాకు రష్మిక మందనా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. కాగా కరోనా కారణంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. బాలీవుడ్, సౌత్ సినిమా, భోజ్ పురి, ఓటీటీ వంటి పలు క్యాటగిరిల్లో 60కి పైగా అవార్డులు ఇచ్చారు. విన్నర్స్‌తో లైవ్ స్ట్రీమింగ్‌లో మాట్లాడుతూ పురస్కారాలు అందించారు. మరోవైపు బాలీవుడ్లో రణవీర్ సింగ్, దీపిక పదుకొణే, రాజ్ కుమార్ రావ్, నోరా ఫతేహి లాంటి వారికి అవార్డులు వరించాయి. ఓటీటీ క్యాటగిరిలో పలు వెబ్ సిరీస్ లకుగానూ అర్షద్ వార్సీ, హన్సల్ మెహతా, నీనా గుప్తా, బాబీ డియోల్ వంటి వారు బాలీవుడ్ లైఫ్ డాట్ కామ్ అవార్డ్స్ పొందారు. చదవండి: అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా . -
అల వైకుంఠపురములో రీమేక్‌లో బాలీవుడ్ బ్యూటీ!
‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే’ అంటూ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డే చుట్టూ తిరుగుతూ అల్లు అర్జున్ చేసిన సందడి భలే ఉంటుంది. బుట్టబొమ్మలా పూజ కూడా భలే ఉంది. ఇప్పుడు హిందీలో బుట్టబొమ్మ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ హిందీలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటుడు వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కథానాయికగా కృతీ సనన్ని అడిగారని సమాచారం. ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన కృతీ సనన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘భేదియా’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా అక్షయ్ కుమార్ సరసన ‘బచ్చన్ పాండే’ చిత్రంలో నటిస్తున్నారామె. ఇటీవలే ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’లో సీత పాత్రకు ఎంపికయ్యారు కృతీ సనన్. ఒకసారి డైరీ చెక్ చేసుకుని ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌కి డేట్స్ సర్దుబాటు చేయాలనుకుంటున్నారట. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. మరి బుట్టబొమ్మగా కృతీయే కనబడతారా? వేరే కథా నాయిక సీన్లోకి వస్తారా? వేచి చూడాల్సిందే. చదవండి: ఫాలోవర్స్ సాయం కోరిన బాలీవుడ్ నటి 'అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న నన్ను'.. -
సారంగదరియా.. ఇప్పట్లో ఆగేట్లు లేదయా..
జానపదానికి మెరుగులు అద్ది అందించిన పాట 'సారంగదరియా..'. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన చరణాలను మంగ్లీ తన గాత్రంతో మరింత మనోహరంగా మలిచింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరేటి స్టెప్పులేసిన సాయి పల్లవి ఓరకంగా నెమలి నాట్యాన్ని ప్రేక్షకులకు చూపించింది. ఓ పక్క ఈ పాటను వివాదాలు చుట్టుముట్టినప్పటికీ జనాలు మాత్రం దానికి అడిక్ట్ అయిపోయారు. ఇక రెండు వారాల కిందట రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు దాటి 'అల వైకుంఠపురం' పేరిట ఉన్న పాటల రికార్డును తిరగరాసింది. 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను చేరుకునేందుకు 'బుట్ట బొమ్మ..' పాటకు 18 రోజులు పట్టగా రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. కానీ 'సారంగదరియా..' మాత్రం జస్ట్ 14 రోజుల్లోనే ఆ రికార్డును అందుకోవడం విశేషం. కాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమే ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు. చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది -
స్టైలిష్ స్టార్ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్ లుక్, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు. కాగా బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్, ట్రైలర్, పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ మూవీ ట్రైలర్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించి టాప్ 20లో నిలిచింది. తాజా ఈ మూవీలోని ‘రాములో రాములా’ పాట మరో అరుదైన రికార్డు తెచ్చిపెట్టింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్ సెన్సేషనల్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీతో ఎన్నో రికార్డు కొల్లగొట్టిన బన్ని తాజాగా ‘రాములో రాములో’ పాటతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణీ, మంగ్లీలు ఆలపించారు. -
ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్లుగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్ లక్ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ షేర్ చేశాడు. అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్ చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్, సహానటుడు సుశాంత్, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. (చదవండి: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్) అంతేగాక ఈ కార్యమంలో చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఉన్న ఫొటోకు ‘వన్ ఈయర్ రీయూనియన్.. నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. మీకేల్లప్పుడు కృతజ్ఞతుడిని’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం బన్నీ క్రియోటివ్ డైరెక్టర్ సూకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘పుష్పా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా యూనిట్లో పనిచేసే ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ‘పుష్పా’ షూటింగ్ నిలిచిపోయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (చదవండి: ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంత టాలెంట్‌తో కష్టపడి పైకి వచ్చిన హీరో అల్లు అర్జున్. లక్కు, క్రేజ్ ఉండాలి కానీ.. బ్యాగ్రౌండ్ ఉంటేనే హీరో అవరనని నిరూపిస్తూ, లక్షలాది అభిమానులను సంపాధించుకున్నాడు. మామయ్య మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ.. గంగోత్రితో హీరోగా మారాడు. ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. (చదవండి : ప్రామిస్.. ఇకపై నేనేంటో చూపిస్తా: అల్లు అర్జున్) ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు తమన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.తాను వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే.. తమన్ టు బిలియన్ల కంటే ఎక్కువ అల్బమ్ ఇచ్చాడంటూ పొగడ్తలతో ముంచేశాడు. ఇక తమన్ కూడా స్టైలిష్స్టార్పై ఉన్న ప్రేమను పాట రూపంలో చూపించాడు. జర్నీ ఆఫ్ అల్లు అర్జున్ పేరుతో ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి మొదలు.. అల వైకుంఠపురములో వరకు అన్ని మూవీలను, అందులోని బన్నీ పాత్రలను గుర్తు చేస్తూ పాడిన ఈ ర్యాప్ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తమన్‌కు థాంక్యూ చెప్పారు. -
ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ సినిమా విడుదలై సోమవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మళ్ళీ రీ యూనియన్ ను హైదరాబాద్ లోని అల్లు వారి ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొంత ఎమోషనల్ గా మాట్లాడాడు. ‘గత ఏడాది సంక్రాంతి తరువాత 2020 అనేది ప్రపంచానికి చాలా బ్యాడ్ ఇయర్ గా నడిచింది. అయితే నాకు మాత్రం అలా కాదు. నేను బ్యాడ్ ఇయర్ అని చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్ మొత్తంలో ఇలాంటి విజయాన్ని నేను చూడలేదు. సినిమా విడుదలై ఏడాది అయినా ఇంకా ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఒకవేళ సినిమాను సంక్రాంతికి కాదని సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఈ స్థాయిలో విజయాన్ని అందుకొని ఉండేది కాదేమో. కోవిడ్ కు ముందు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాను. ఆ తరువాత కూడా మళ్లీ ఇంట్లోనే కూర్చున్నాను. కానీ ఈ మధ్యలో వచ్చిన అల.. వైకుంఠపురములో విజయం ఎంతగానో ఎనర్జీని ఇచ్చింది. ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్స్టోన్ అవుతుంది. ఉదాహరణకు.. కళ్యాణ్ గారికి ‘ఖుషి’ ఆల్ టైమ్ రికార్డ్. అది ఆయన ఏడో సినిమా అనుకుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏడో సినిమా ‘సింహాద్రి’ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. చరణ్‌కి రెండో సినిమా ఆల్ టైమ్ రికార్డ్. ఇలా అందరికీ ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఉంది. నాకెప్పుడు పడుతుందని నేను కూడా అనుకునేవాడిని. అందరికీ చాలా ముందుగా పడింది.. నాకు 20 సినిమాలు పట్టింది. ఇది నా మొదటి అడుగు. ఇకపై నేనేంటో చూపిస్తా. సినిమా సక్సెస్‌కు కృషి చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. అందరు ప్రేమతో చేస్తే.. అందరి కంటే ఎక్కువ లాభం పొందింది నేను. తమన్‌కు అయితే డబుల్ థాంక్యూ చెప్పాలి. నేను వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే.. నాకు టు బిలియన్ల కంటే ఎక్కువ అల్బమ్ ఇచ్చాడు’ అని తమన్‌పై బన్నీ ప్రశంసలు కురుపించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అల వైకుంఠపురములో’ ఏడాది సంబరాలు..
-
రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కున్న క్రేజే వేరు. తన యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్, స్టైల్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హోరోని ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలయన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) ఇక ఫేస్బుక్ పేజీలో తన పోస్టులకు గాను మొత్తంగా 13 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. సౌత్‌లో ఇంత భారీ ఎత్తున ఫేస్బుక్లో ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇక ట్విట్టర్లో బన్నీకి 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి గుర్తింపే ఉంది. ఇక హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు కూడా బన్నీ దగ్గరయ్యారు. అందుకే ఇపుడు సుకుమార్‌తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.(చదవండి: అల్లు అర్జున్ 'మెగాస్టార్' అయిపోతారా?) ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు ఇక గతేడాది సంక్రాతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురము’లో సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక తాజాగా బుట్ట బొమ్మ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. -
2020 ‘సినిమా’ రివ్యూ
2020.. ప్రపంచానికే ఓ బ్లాక్ ఇయర్. ఈ ఇయర్లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్ అయ్యాయి. ఏవి ప్లాప్‌ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం... సంక్రాంతికి సందడి చేసిన మహేశ్-బన్నీ టాలీవుడ్ సినిమా క్యాలెండర్ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. ప్లాప్‌ను మూటగట్టుకున్న మాస్ మహారాజా మహేశ్, బన్నీ సినిమాలు సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్ కాలేదు. అలరించని ‘అశ్వథ్థామ’ ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. మాయ చేయని ‘జాను’ శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. కానీ శర్వానంద్, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. డిజాస్టర్ మూటగట్టుకున్న‘రౌడీ’ మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మూడు లవ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. ఫలించిన ‘భీష్మ’ బాణం వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్‌ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. ‘హిట్’ సూపర్ హిట్ నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. పర్వాలేదనిపించిన ‘పలాస’ మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్ లేకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్‌డౌస్ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్ టాక్‌ను సంపాదించుంది. వీటితో పాటు కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు. -
బన్నీ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ మూవీ ట్రైలర్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన టాప్ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. (చదవండి : ‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డు) ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ లోని టాప్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సెలెబ్రెటీల జాబితాలో మొత్తం ఇండియన్స్ లో ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో సినీ పరిశ్రమ నుంచి ఎస్సీ బాలసుబ్రమణ్యం, సోనుసూద్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. -
సౌత్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బన్నీ కెరీర్లోనే రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ చిత్రంలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. యూట్యూబ్‌లో అనేక రికార్డులను సొంతం చేసుకున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో సినిమా మరో ఘనత సాధించింది. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన టాప్-20 ట్రైలర్ల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. అయితే దక్షిణాది నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే నిలవడం విశేషం. కాగా అల్లు అర్జున్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గానే ఉంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్ హీరోగా ఇటీవలే బన్నీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చదవండి: నలభైఐదు కోట్ల వ్యూస్ సాధించిన ‘బుట్టబొమ్మ’ #AlaVaikunthapurramuloo is the only Telugu film among the TOP 20 Most Viewed Trailers 2020 on @IMDb 🕺🧡https://t.co/fCYtJs6QEt@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine @adityamusic pic.twitter.com/eQimwbtVaT — Geetha Arts (@GeethaArts) December 5, 2020 -
బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్ ప్రశంసలు
‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ దుమ్ము దులిపాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వల్ల బుట్టబొమ్మ సాంగ్ విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తున్పప్పటికి ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాటని ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే అభిమానులు ‘బుట్టబొమ్మ’ హ్యాష్‌ట్యాగ్‌ని ఉదయం నుంచి ట్రెండ్ చేస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. అర్మన్ మాలిక్ పాడారు. గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్ రికార్డు ఫిదా సినిమాలోని ‘వచ్చిండే’ పాట ఖాతాలో ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘బుట్టబొమ్మ’ ఆక్రమించింది. (చదవండి: హిందీలోకి అల్లు అర్జున్ హిట్ సినిమా) ఇక బుట్ట బొమ్మ సాంగ్ 45 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిలో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ‘అల వైకుంఠపురములో’కి మ్యూజిక్ అందించిన తమ్న్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలపుతున్నారు. తమన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తెలుగులో సూపర్ హిట్టయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లోకి రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ లుక్‌తో ఇప్పటికే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. #UNSTOPPABLEAVPLALBUM #avpl Our #ButtaBomma HITS #450millionforbuttabomma My love to My dear brother @alluarjun My Respect to #Trivikram gaaru 🎵@ramjowrites @ArmaanMalik22@vamsi84 #radhakrishna gaaru #alluarvindh gaaru #pdprasad gaaru Team @haarikahassine @GeethaArts pic.twitter.com/4dmsqEzDZh — thaman S (@MusicThaman) November 24, 2020 -
‘బుట్టబొమ్మ’కు ఆడిపాడిన వార్నర్ సేన
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ ముంబైతో తలపడిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన ఈ ఆటలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. అయితే తమ జట్టు విజయాల క్రెడిట్ ఫ్రాంచైజీ యజమానులదేనని, ఫలితాలతో సంబంధం లేకుండా అండగా నిలవడంతోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. చదవండి: ముంబై చిత్తు: ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ ప్రస్తుతం వార్నర్ సేన సన్‌రైజర్స్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సభ్యులంతా టాలీవుడ్లో సెన్సేషన్ హిట్ సాధించిన ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది ఈ వీడియోలో వార్నర్, మిగిలిన వారంతా బుట్టబొమ్మ మార్కు స్టెప్పును అచ్చంగా దించేశారు. ఆరెంజ్ ఆర్మీ అంతా కలిసి ఆడి పాడుతూ ఆనందంలో తేలియాడారు. ఇక డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. లాక్డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో తన కుటుంబంతో కలిసి పలు తెలుగు పాటలకు కాలు కదిపారు. ఇందులో మైండ్ బ్లాక్, రాములో రాముల, బుట్ట బొమ్మ పాటలు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. చదవండి: వార్నర్.. నీ డ్యాన్స్ వీడియోలు పెట్టు: యువీ -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్‌లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్‌గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్‌ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. పలు చోట్ల బాహుబలి రికార్డులు కూడా తిరగరాసిన ఈ చిత్రం తాజాగా బుల్లితెరపై సునామి సృష్టించింది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్ చేసింది. తెలుగులో ఇదే అత్యధికం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టాలీవుడ్లో అత్యధిక టీఆర్పీ మూవీగా 23.4 టిఆర్పిని సాధించింది. ఇక బుల్లితెరపై కూడా తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. (చదవండి : ఏంటి అన్నయ్య.. ప్రతిసారి కొత్త లుక్) కాగా, ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి పాట ఓ సంచలనం. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో వంద కోట్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్న రికార్డుల హోరు మాత్రం తగ్గడం లేదు. -
అల.. హిందీలో
ఈ ఏడాది సంక్రాంతికి మంచి హిట్ అందుకొని, అల్లు అర్జున్‌కి కమ్‌బ్యాక్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ రీమేక్‌లో అల్లు అర్జున్ పాత్రను కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నారు. ‘దేశీ బాయ్స్, డిష్యూం’ చిత్రాలను తెరకెక్కించిన రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఏక్తా కపూర్‌తో కలసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘బుట్టబొమ్మ’ మరో సెన్సేషనల్ వీడియో
-
‘బుట్టబొమ్మ’ మరో సెన్సేషనల్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : సెలబ్రిటీలనుంచి పసిపాపల దాకా భారీ క్రేజ్ కొట్టేసిన "బుట్టబొమ్మా" పాట గురించి తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీలోని ఈ పాట చిన్నా పెద్ద దాదాపు అందరితోనూ స్టెప్పు లేయించింది. మ్యూజిక్ చార్ట్‌లో టాప్‌లో దూసుకుపోతున్న బుట్టబొమ్మకు తాజాగా ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగులు కూడా ఫిదా అయిపోయారు. వైజాగ్‌లోని ఇండిగో సిబ్బంది స్టైలిష్ స్టార్ బుట్టబొమ్మ పాటకు అద్భుతమైన స్టెప్పులతో ఇరగదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై హీరో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు గ్రేట్ సాంగ్, గ్రేట్ ఎనర్జీ అంటూ ఈ వీడియోను డేవిడ్ వార్నర్ రీట్వీట్ చేయడం మరో విశేషం. కాగా తమన్ స్వరాలందించగా, త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ పాట 200 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ముఖ్యంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో కూడా ఈ బుట్టబొమ్మ డ్యాన్స్ చేయించిన సంగతి తెలిసిందే. -
బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైంకుఠపురములో’ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బన్నీ కెరీర్లో బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 263 మిలియన్ వ్యూస్ రాబట్టి.. తెలుగులో అత్యధిక మంది చూసిన సాంగ్‌గా రికార్డులకు ఎక్కింది. (లేట్‌గా లేటెస్ట్గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ) తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా ‘అల వైకుంఠపురములో’ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జబ్బా వంటి సినిమాలతో బీటౌన్‌లో సంజయ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘అల వైకుంఠపురములో’ చూసిన ఆయన.. బన్నీ గురించి, సినిమా గురించి ట్విటర్లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూశాను. ఎంతో వినోదభరితంగా ఉంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడకపోతే.. ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రస్తుతమున్న పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, వీలైనంత త్వరగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలి’. అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. (కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్) #JustWatched ALA VAIKUNTHAPURRAMULOO on Netflix. What a film! Pure unadulterated entertainment. Not having seen it in a full theatre will be a life long regret. Beat the pandemic blues and watch this gem asap. — Sanjay Gupta (@_SanjayGupta) July 11, 2020 కాగా సంజయ్ ట్వీట్‌పై బన్నీ స్పందించారు... ‘మీరు ఈ సినిమా చూడటం ఆనందంగా ఉంది. సినిమాను ఇష్టపడినందుకు మీకు థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బన్నీ ట్వీట్‌పై మళ్లీ డైరెక్టర్ సంజయ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయినట్లు సంజయ్ పేర్కొన్నారు. ‘బ్రదర్.. మీ యాక్టింగ్‌కి నేను ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు నన్ను నవ్వించారు.. ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో వర్క్ చేయడానికి ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇక సంజయ్ ఆఫర్ ఇవ్వడంపై బన్నీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత) Thank you very much Sanjay Ji ! Glad u really liked the movie . Humbled — Allu Arjun (@alluarjun) July 11, 2020 -
బుట్టబొమ్మ సాంగ్ లేటెస్ట్ రికార్డ్
-
లేట్‌గా లేటెస్ట్గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు సామజవరగమన, రాములో రాములా సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేయగా.. సినిమా విడుదలయ్యాక బుట్టబొమ్మ వీడియో సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇటీవల ఈ సాంగ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చిందులేశాడంటే ఈ సాంగ్‌కు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విటర్లో వెల్లడించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను.. అర్మాన్ మాలిక్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంలో అందులోని పాటలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. #200millionforbuttabomma #ButtaBomma #Unstoppableavpl #AlaVaikunthapurramuloo album ♥️🎬🎛 My love @alluarjun gaaru my respect to #trivikram gaaru ♥️ It’s the love & trust of them @ramjowrites @haarikahassine @vamsi84 @GeethaArts 🎧✊⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/kAPxY6SgOc — thaman S (@MusicThaman) May 31, 2020 -
‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్ వ్యూస్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ సంచలనమే. ఇక తమన్ కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సాంగ్ నుంచి సినిమా విడుదల వరకు క్షణక్షణం అనేక రికార్డులను సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అక్షరాలా వంద కోట్ల వ్యూస్ అన్నమాట. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. అల వైకుంఠపురములో.. ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ వచ్చాయి.. మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. మొత్తానికి సినిమా విడుదలై ఆర్నెళ్లవుతున్నా కూడా అల వైకుంఠపురములో రికార్డుల హోరు జోరు మాత్రం తగ్గట్లేదు. చదవండి: ‘బుట్టబొమ్మ’కు పీటర్సన్ కూడా.. ‘నా దేశం అమితాబ్, షారుఖ్’ -
‘బుట్టబొమ్మ’కు పీటర్సన్ కూడా..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. తమన్ అందించిన స్వరాలు ఏ రేంజ్లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతీ పాట సోషల్ మీడియాలో ఓ సెన్సేషన క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలోని పాటల క్రేజ్ ఖండాతరాలు దాటింది. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ దంపతులు డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి డ్యాన్స్ టిక్‌టాక్‌లో తెగ హల్చల్ సృష్టించింది. తాజాగా ఇంగ్లండ్ మాజీ సారథి, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్‌కు కూడా ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు మంత్ర ముగ్దుడైనట్లు అనిపిస్తోంది. తాజాగా ఈ పాటకు పీటర్సన్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఈ పాటకు హుక్ స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ సాంగ్‌కు పీటర్సన్ చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పీటర్సన్‌కు టిక్‌టాక్ వీడియోలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే ఆయన చేసిన టిక్‌టాక్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. చదవండి: 'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు' వార్నర్ నోట మహేశ్ పవర్ఫుల్ డైలాగ్ #ButtaBomma craze Crossed Continents This time famous X England cricketor #ButtaBomma FT.@KP24 😂😂@ArmaanMalik22 @MusicThaman @alluarjun @hegdepooja @AlwaysJani pic.twitter.com/Q2KAi7uxFI — Vamsidhar 🇮🇳 (@Vamsidhar467) May 11, 2020 -
‘రాములో రాములా’.. మరో రికార్డు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. సంక్రాంతి కానుగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలసిందే. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా మ్యూజికల్‌గా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ ఆణిముత్యంగా నిలిచింది. ‘సామజవరగమనా’ సోషల్ మీడియాలో ఎంతటి ట్రెండ్ సృష్టించిందో చిత్రంలోని ప్రతీపాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘రాములో రాములా’ పాట మరో రికార్డును అందుకుంది. యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సుశాంత్, నివేదా పేతురాజు, మరళీ శర్మ, టబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించింది. 100 Million+ Views for #RamulooRamulaa Full Video Song 🤩 ► https://t.co/YcVsDat7d6 #AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @anuragkulkarni_ @LyricsShyam #Mangli #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @haarikahassine @adityamusic pic.twitter.com/sfqNERoUPv — Geetha Arts (@GeethaArts) May 12, 2020 చదవండి: ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’ ముంబై కాదు... హైదరాబాద్‌లోనే! -
హీరోయిన్ నివేదా పేతురాజ్ ఫోటోలు
-
బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ
అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వీడియోలో అర్హ తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బన్నీ అల.. వైకుంఠపురములో.. చిత్రంపై అర్హ చాలానే అల్లరి చేసింది. ఓ మై గాడ్ డాడీ లిరికల్ సాంగ్ వీడియోలో తన అన్న అయాన్‌తో కలిసి సందండి చేసింది. అలాగే రాములో రాములా సాంగ్‌లో బన్నీ దోశ స్టెప్పు వేశాడని ఫన్నీ కామెంట్ చేసింది. (చదవండి : బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య) తాజాగా ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ బుట్టబొమ్మకు అర్హ.. లిప్ సింక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్లో వేరే వాయిస్‌తో సాంగ్ ప్లే అవుతున్న సమయంలో లిరిక్స్‌కు అనుకూలంగా అర్హ పెదవి కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మా చిన్ని బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ సాంగ్ పాడుతోంది.. క్వారంటైన్ ఫన్’ అని పేర్కొన్నారు. స్నేహరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ మారింది. ఈ వీడియో చూసిన మెగా డాటర్ నిహారిక.. ‘హ..హ.. చిలక’ అని కామెంట్ కూడా చేశారు. మరోవైపు బుట్టబొమ్మ సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటేసింది. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ సాంగ్‌కు టిక్‌టాక్‌లో చిందేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.(చదవండి : బన్ని భారీ ఫైట్.. ఖర్చెంతో తెలుసా?) -
150 మిలియన్ మార్క్ దాటిన ‘బుట్టబొమ్మ’
‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ పాట విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియోట్ చేస్తూ కొత్త రికార్డులను బద్దలు కొడుతుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సంపాదించిన మొదటి సౌత్ ఇండియన్ సాంగ్‌గా అరుదైన ఘనతను నమోదుచేసింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో అలవోకగా నానుతూ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది ఈ పాట. (ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు! ) రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. అల్లు అర్జున్ , పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులు ఎంతో ఆకట్టుకున్నాయి. బుట్టబొమ్మ పాట క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మొన్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ పాటకు చిందులేయగా, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి సాంగ్‌కు స్టెప్పులేసి బుట్టబుమ్మ పాట సరిహద్దులు దాటేసింది అని నిరూపించారు. బుట్టబొమ్మ పాట ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. (వార్నర్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్) -
వార్నర్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ కూడా ఈ పాటకు ఫిదా అయ్యాడు. దీంతో తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు కాలు కదిపాడు వార్నర్. అంతేకాకుండా ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. కాగా వార్నర్-క్యాండిస్‌ల డ్యాన్స్‌పై బన్ని స్పందించాడు. ‘ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ధ్యాంక్యూ వెరీ మచ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక గీతా ఆర్ట్స్ కూడా వార్నర్-క్యాండిస్‌ల డ్యాన్స్ వీడియోను తమ అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ ‘బుట్టబొమ్మ’ పాట సరిహద్దులను చెరిపివేసిందంటూ ట్వీట్ చేసింది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ వీరిద్దరి డ్యాన్స్‌ను వీడియోను ట్విటర్లో షేర్ చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఓ తెలుగు సినిమా పాటకు విదేశీ స్టార్ క్రికెటర్ డ్యాన్స్ చేయడం పట్ల అటు చిత్ర బృందం ఇటు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా బుట్ట బొమ్మ హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. చదవండి: బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ When ur world 🌍 is under lockdown And At the same time to knw tat the music u have made has reached millions & billions across the globe makes u feel great ♥️ #avpl 💪🏼 Here is #sensationalbuttabomma #ButtaBomma from the famous @CricketAus @davidwarner31 ♥️ This is wow 🏏 pic.twitter.com/8maTslqui7 — thaman S (@MusicThaman) April 30, 2020 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య
కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో భార్య క్యాండిస్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని సూపర్ హిట్ బుట్ట బొమ్మ సాంగ్‌కు క్యాండిస్‌తో కలిసి వార్నర్ చిందేశారు. ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న సమయంలో.. వార్నర్ సన్‌రైజర్స్ టీ షర్ట్ ధరించారు. వార్నర్ దంపతులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను వార్నర్ దంపతులు వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన క్యాండిస్.. ‘ఇండి మొత్తం షోను దొంగిలించిందని’ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, ఐపీఎల్ సీజన్ అప్పుడు ఎక్కువ సమయం హైదరాబాద్‌లో గడుతున్న వార్నర్.. తెలుగు వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందులో భాగంగానే తెలుగు అభిమానుల అలరించడం కోసం బుట్టబొమ్మ సాంగ్‌కు చిందేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బుట్టబొమ్మ సాంగ్ కూడా ఇటీవల కాలంలో బాగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అల రీమేక్‌లో...
అల్లు అర్జున్ హీరోగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్. రాధాకష్ణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా తమిళంలోనూ రీమేక్ కానుందనే వార్త వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందట. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ : బన్నీ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విజయంలో తమన్ అందించిన సంగీతం కీలకమైన పాత్రను పోషించింది. తమన్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతమే. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వ్యూస్ పరంగా యూ ట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ఆల్బమ్ వంద కోట్ల పైచిలుకు వ్యూస్‌ను సాధించింది. అయితే, తన సినిమాకు ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్‌ను బన్నీ తాజాగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో బన్నీ ట్వీటర్ ద్వారా తమన్‌ను అభినందించాడు. ‘తమన్ నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఈ సినిమా ప్రారంభానికి ముందే, నాకు బిలియన్ ప్లే అవుట్స్ ఆల్బమ్ కావాలని నేను అడిగాను. వెంటనే నువ్వు ఓకే అనేశావ్. ఇప్పటికి 1.13 బిలియన్ మంది ఈ పాటలు విన్నారు. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్. థ్యాంక్యూ తమన్’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్‌పై స్పందించిన తమన్.. `ఈ ట్వీట్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్` అని రిప్లై ఇచ్చాడు. My dear @MusicThaman . I am soo proud & contented you have lived upto ur words . I said “ I want an Album which has more than a BILLION play outs “ before #avpl starting . You said “ Done brother I Promise “ . Today it has 1.13 Billion n more . Thank you ! #manofwords — Allu Arjun (@alluarjun) April 11, 2020 -
అల.. బాలీవుడ్ తెరపైకి!
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ అనూహ్య విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హీరోగా అక్షయ్ కుమార్ లేదా షాహిద్ కపూర్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
మరో చాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ!
‘అల వైకుంఠపుములో’ సినిమాతో హిట్ అందుకున్న ‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే మరో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఇప్పటికే సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళీ’లో ఆమె నటిస్తుండగా. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా ఫర్హాద్ షామ్జీ దర్శకత్వంలో వస్తున్న `బచ్చన్ పాండే`సినిమాలోనూ పూజా హీరోయిన్గా సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్గా కృతి సనన్ నటిస్తుండగా రెండో కథానాయికగా పూజాని ఎంపిక చేశారట. ఇటీవల ‘హౌజ్‌ఫుల్-4’ చిత్రంలో నటించిన పూజా బాలీవుడ్ జనాలను అలరించారు. ఈ చిత్రాలతో బాలీవుడ్ ఆమె క్రేజీ హీరోయిన్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. కాగా, తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘జాన్', అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో నటిస్తోంది. -
‘అర్జున్ రెడ్డి పార్ట్-2’ అని పెట్టాను..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సీన్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్, సుశాంత్ మధ్య సాగే సన్నివేశాలను ఆ వీడియోలో చూపించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సుశాంత్ వద్దకు వచ్చిన బన్నీ.. తను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నానని చెప్తాడు. సుశాంత్ మద్యం సేవిస్తున్న వీడియోని చూపించి.. దీనికి అర్జున్‌రెడ్డి పార్ట్ 2 అని పేరు పెట్టానని చెప్తాడు. దీంతో కంగారు పడిపోయిన సుశాంత్ నేనేం చేయాలి అని బన్నీని అగుడుతాడు. ఆ తర్వాత సుశాంత్ సిటీ బస్సు వెనక పరుగెడతాడు. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు ఈ సీన్ సినిమాలో పెట్టి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళీ శర్మ, సుశాంత్, సముద్రఖని, జయరామ్, నివేదా పేతురాజు ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సంక్రాంతికి విడులైన ‘అల వైకుంఠపురంలో’ భారీ విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్షిప్ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. తమన్ అద్భుతమైన సంగీతం, బన్ని, పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో పాటలు అలరిస్తాయి. ఇక ‘అల వైకుంఠపురంలో’ పాటలకు ఫ్యాన్స్ వేసే సెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా, బుట్టబొమ్మ పాటకు రణస్థలానికి చెందిన కొంతమంది చిన్నారులు వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బుట్టబొమ్మ పాటకు మా రణస్థలం పిల్లలు డాన్స్. ఈ పాటకు ఇప్పట్లో క్రేజ్ తగ్గేలా లేదు. ఎప్పుడూ గుర్తుండే పాట. అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌కు థాంక్స్’ అని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. ‘డాన్స్ బాగా చేశారు. బుట్టబొమ్మ ఒక సెన్సేషన్’ అంటూ తమన్ రీట్వీట్ చేశాడు. ఈపాటను రామజోగయ్య శాస్త్రి రాయగా..అర్మన్ మాలిక్ ఆలపించాడు. దీంతోపాటు సామజవరగమన పాటను ఇద్దరు చిన్నారులు పాడిన తీరుకు తమన్ ఫిదా అయ్యారు. ఆ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇలాంటి క్యూటెస్ట్ పిల్లల్ని చూడలేదని తమన్ శుక్రవారం చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. Wow ♥️ #sensationalbuttabomma 👏🏾🎶🎵 https://t.co/xzxRw9XkTE — thaman S (@MusicThaman) March 14, 2020 The cutest I have seen for #Samajavaragamana #sensationalsamajavaragamana on the social media Let’s shower some love on them ♥️ hoowwwwwwww cute ❤️🎶🎵#AlaVaikunthapuramuloo #avpl 🎈 pic.twitter.com/VJGKPDTQZM — thaman S (@MusicThaman) March 13, 2020 -
‘బుట్ట బొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్: మిలియన్ల వ్యూస్
అల వైకుంఠపురములో నుంచి జాలువారిన పాటల తోరణాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేసాయి. సినిమా విడుదలై నెల రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఫోనులో మోగుతూనే ఉన్నాయి, అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరితో స్టెప్పులేయించిన పాట ‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టూకుంటివే’ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మ్యాజిక్ ఈ పాటలో ఉంది. అందుకే, ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.(డబుల్ ధమాకా) అందరి మదులను దోచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, థమన్ సంగీతమందించాడు. ఇక ఈ పాటను అర్మన్ మాలిక్ అద్భుతంగా ఆలపించాడు. ఇక యూట్యూబ్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టిన ఈ సాంగ్ పూర్తి వీడియో తాజాగా విడుదలైంది. ఇంకేముంది.. కొద్ది గంటల్లోనే ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. మరోసారి తన రికార్డులను తానే తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. కాగా అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. (మరో మార్కును చేరుకున్న‘అల వైకుంఠపురములో’) పాట పూర్తి లిరిక్స్ మీకోసం ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మూ.. ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదునమ్మూ.. ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటన్నానే అమ్మూ.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మూ.. ఎట్టాగా నే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే.. అరె దేవుడా.. ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే.. బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2" మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నా గానీ అమ్మూ.. లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్మూ.. రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు.. అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే.. గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు.. చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే.. చిన్నగా సినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా.. ఓ మల్లెపూవునడిగితే మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే.. వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే.. కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మూ.. ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్మూ.. ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మూ.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మూ.. -
మరో మార్కును చేరుకున్న‘అల వైకుంఠపురములో’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ అయ్యి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్ మార్కుని దాటినట్లు ఆ యాప్ నిర్వాహకులు ప్రకటించారు. అంతే కాకుండా ఈ రికార్డును సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ ఆల్బమ్‌గా నిలిచిందన్నారు. సావన్ జియో సావన్‌గా లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 100 మిలియన్ మార్కును దాటడం విశేషం. అన్ని వేడుకల్లో, కచేరీల్లో ఈ చిత్రంలోని పాటలు మారుమోగుతున్నాయి. చిత్రంలోని ‘సామజవరగమన’ పాట సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన సామజవరగమన పాట ఒక్కరోజులోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సామజవరగమన’తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. సిరివెన్నల సీతారామశాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి,కృష్ణ చైతన్య, కరసాల శ్యామ,కళ్యాణ్ చక్రవర్తి, విజయ్‌కుమార్ బల్లా పాటలు రాయగా తమన్ అందించిన అద్బుత మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్అయ్యింది. అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు జియో సావన్‌లో 100 మిలియన్ మార్కును దాటడంపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అల్లుఅర్జున్,త్రివిక్రమ శ్రీనివాస్, అల్లు అరవింద్,రాధాకృష్ణలకు డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు.సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు 50 మిలియన్ మార్క్‌ను దాటి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
‘సామజవరగమన’ వీడియో సాంగ్ వచ్చేసింది!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ చిత్రంలోని ప్రతీ పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘సామజవరగమన’ లిరికల్ సాంగ్ ఎంతటి ట్రెండ్ సృష్టించింతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత ప్రియుల మనసుల్ని అంతగా దోచిన ఆ పాటను తమన్ కంపోజ్ చేయగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించాడు. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ క్రేజీ కాంబినేషనలో వచ్చిన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసి రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు లిరక్ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే.. తాజాగా ఈసినిమాలోని ‘సామజవరగమన’ పూర్తి వీడియో సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. లిరికల్ సాంగ్ మాదిరే వీడియో సాంగ్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఐదు లక్షల వ్యూస్‌తో పాటు 63 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. పాటకున్న క్రేజ్‌తో పాటు వీడియోలో పూజా హెగ్డే అందాలు.. అల్లు అర్జున్ అభినయం ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాకుండా విజువల్ పరంగా కూడా హై రిచ్‌గా కనిపిస్తుండటంతో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ వీడియో సాంగ్. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా చదవండి: ఏప్రిల్ 8న ‘అల..వైకుంఠపురములో’ ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
ఏప్రిల్ 8న ‘అల..వైకుంఠపురములో’
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి జెమిని టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రంపై బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏకంగా రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ రీమేక్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తాడని సమాచారం. దక్షిణాది చిత్రాలపై మక్కువ ఎక్కువ చూపే సల్మాన్‌కు ‘అల.. వైకుంఠపురములో’స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సల్మాన్ ఈ రీమేక్ చిత్రం విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఏర్పడింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో నేరుగా తానే నిర్మిస్తానని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. ఈ విషయంపై రాధాకృష్ణ, త్రివిక్రమ్‌లతో అల్లు అరవింద్ చర్చిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాలీవుడ్ రీమేక్ రైట్స్‌పై నెలకొన్న సందిగ్దత వీడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాటను ఏ ముహూర్తాన తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడో తెలియదు గాని దశాబ్దపు మేటి పాటగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది ఈ పాట. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ హిట్ సాంగ్ అన్ని వేడుకల్లో, కచేరీల్లో మారుమోగుతోంది. అంతేకాకుండా ‘సామజవరగమన’ తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(ఆదివారం) సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ లిరికల్ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ రేపు విడుదలయ్యే వీడియో సాంగ్ దృశ్య రూపంలోనూ వారిని కనువిందు చేయనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు)లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా చదవండి: సామజవరగమన పాట అలా పుట్టింది.. సామజవరగమన.. ఇది నీకు తగునా! ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
‘అలా బతకడంలో తప్పు లేదు.. కానీ!’
ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతూ.. టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు పూజా హెగ్డే. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగు పెట్టిన పూజా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతీక్ రోషన్ సరసన చారిత్రాత్మక చిత్రం ‘మొహంజదారో’లో నటించారు. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు బాలీవుడ్‌కే అంకితమైపోయారు. అయితే అందులో రాణిగా నటించినప్పటికీ బాలీవుడ్లో పూజాకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేశారు. తర్వాత వరణ్తేజ్తో ‘ముకుంద’, అల్లు అర్జున్ సరసన 'డీజే' ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత' మహేష్ బాబుతో ‘మహర్షి’లో నటించి టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. ఇటీవల ఈ భామ బన్నీతో మరోసారి 'అల వైకుంఠపురములో' నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అలా వరుస హిట్లతో ఊపు మీదున్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేశారు. సల్మాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన పూజా ఈ నేపథ్యంలో పూజా తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘సవాలుతో కూడుకునే నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మనిషి సుఖంగా జీవించడంలోనే ఆనందం ఉందనుకుంటారు. అందుకోసం.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే.. పదిమంది కంటే భిన్నంగా ఆలోచించాలి’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక కొత్తగా ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగలొచ్చు వాటిని తట్టుకుని నిలబడినప్పుడే ఇతరులు మనల్ని గుర్తించే స్థాయికి ఎదుగుతామని ఆమె అన్నారు. పూజాహెగ్డే లుక్‌కి అభిమానులు ఫిదా అదే విధంగా సినిమాలు నాకేందుకులే అని అనుకుని ఉంటే మిగతా అమ్మాయిల్లానే తాను చదువు, ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని... కాని ఓసారి ట్రై చేసి చూద్దాం అని గట్టిగా అనుకున్నానని చెప్పారు. అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో నటిస్తుంది. ఇక ప్రభాస్ సరసన ఓ సినిమా నటించనున్నట్లు సమాచారం. -
సామజవరగమన.. ఇది నీకు తగునా!
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠాపురంలో’ సినిమాలోని ‘సామజవరగమన నిను చూసి ఆగగలనా!’ అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాట నచ్చిన వారితోపాటు పాట మెచ్చని వారు కూడా ఈ పాటకు పారడీలు కట్టి మరీ పాడుతున్నారు. సోషల్ మీడియాను ఊపుతున్నారు. (సామజవరగమన పాట అలా పుట్టింది..) ‘సామజవరగమన ఇంత షాపింగ్ నీకు తగునా! కట్టుకున్న మొగడినే కనికరించే లలనా!’ అంటూ ఒకరు, ‘సామజవరగమనా ఓ భర్త నీకు తగునా! అంటూ మరొకరు మాటల కూర్పుతో నవ్విస్తున్నారు. ఏడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుహన రాజకీయాల గురించి ‘నీ కళ్లకు ఇంకా మాయరోగం పోనే లేదంటా, ఆ చూపులకింక పచ్చ కామెర్లు పోవా ఇక అసలు!’ అంటూ వ్యంగోక్తులు విసురుతున్న వారూ ఉన్నారు. త్యాగరాజ కృతి ‘సామజవరగమన’ను ఇలా అవమానిస్తారా ? మీకు పోయే కాలం వచ్చిందీ’ అంటూ శాపనార్థాలు పెడుతున్న సనాతన వాదులు లేకపోలేదు. వారిలో కూడా ‘ఇది శ్రీకృష్ణుడి గురించి పాడారు’ అని కొందరంటే ‘లేదు శ్రీరాముడి గురించి పాడారు’ అంటూ మరికొందరు వాదులాడుకుంటున్నారు. ఎవరి గురించి పాడినా ‘సామజవరగమన’ అంటే తెలుగులో మాత్రం ‘ఏనుగులా గాంభీర్యంగా నడచివొస్తున్నా’ అని అర్థం. మొత్తం సంస్కృతంలో త్యాగరాజ కృతి నుంచి ‘సామజవరగమన’ అన్న ఒక్క పదాన్ని మాత్రమే పాట పల్లవిగా తీసుకున్నారు. త్యాగరాజు కృతి ‘సామజవరగమన’ పాటను హిందోళ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడడం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2013లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమాలో ఎస్ జానకి ఈ పాటను పాడడం ద్వారా మరో తరానికి పరిచయం చేశారు. కొంత సినిమా టిక్‌గా పాడనన్న పశ్చాత్తాప భావంతో ఆమె ఆ తర్వాత ఈ పాట సహ పలు త్యాగరాజ కీర్తనలను పాడి ప్రైవేట్ ఆల్బమ్‌గా విడుదల చేశారు. గాన గాంధర్వుడు ఘంటసాల 1971, డిసెంబర్లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సంగీత కచేరి ఇచ్చినప్పుడు అక్కడి శ్రోతల డిమాండ్ మేరకు ‘సామజవరగమన’ త్యాగరాజ కృతిని పాడారు. తమిళనాడులోని తిర్పూర్‌లో కూడా ఆయన ఓసారి పాడిన రికార్డు ఉంది. బాల మురళి, ఎస్. జానకి, ఘంటసాల గాన మాధుర్యాన్ని అమితంగా ఆస్వాదించే శ్రోతలు, కొత్త పాట అర్థంపర్థంలేని పదాల కూర్పు కుప్పని, రాగాలాపన కూడా లేని కూని రాగమని విమర్శిస్తున్నన్నారు. ఎవరేమన్నా, అనుకున్నా నేటి కుర్రకారును కుదిపేస్తున్న ‘సామజవరగమన’ను కాదనగలమా! అని ఆ మీడియాలో మనగలమా!? -
సామజవరగమన.. ఇది నీకు తగునా!
-
సామజవరగమన పాట అలా పుట్టింది..
సిరివెన్నెల సీతారామశాస్త్రి: అలవైకుంఠపురములో చిత్రం కోసం ఈ పాటను గంట లోపుగానే పూర్తి చేసి ఇచ్చాను. ఏ పాటనైనా, ఏ అంశాన్నయినా సుకుమారంగా మాత్రమే రాయాలని మొదటి నుంచి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూలాల్లోకి చూడగలగటం, ప్రతి చిన్న విషయాన్ని కొత్తగా ఆలోచించే లక్షణం మా నాన్నగారి పెంపకంలో వచ్చింది. ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలోని బాహ్య సౌందర్యాన్ని కాకుండా దైవత్వం మాత్రమే చూడాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యకాలంలో నేను ఏ పాట రాసినా అలాగే భావన చేస్తున్నాను. ఈ పాటలోని సాహిత్యాన్ని కొంచెం లోతుగా చూస్తే, ఒక పాపాయిని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ‘మంజుల హాసం, మలెల్లమాసం, విరిసిన పింఛం, విరుల ప్రపంచం’ అన్ని పదాలూ సౌకుమార్యంతో నిండినవే. ముగ్ధత్వం నిండిన అమ్మాయిని, పువ్వుల పాపను చూస్తే ఎలాంటి భావన రావాలో, ఒక యవ్వనంలో ఉన్న యువతిని చూసినప్పుడు కూడా అదే భావన రావాలి. సౌందర్యాన్ని చూసే విధానంలో ఆబ ఉండకూడదు. అలా చూస్తే స్త్రీత్వాన్ని అవమానించినట్లు అవుతుంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అన్నప్పుడు, పట్టీలు పెట్టుకున్న నా మనవరాలి వెనుక నేను పరుగెడుతున్నట్లు నాకు భావన కలుగుతుంది. అంతర్లీనంగా ఆ అర్థం కూడా వస్తుంది. యవ్వనంలో ఉండే అమ్మాయిలో ఉండే అమాయకత్వం ముగ్ధత్వం, పెద్దపెద్ద కళ్లతో లోకాన్ని చూస్తున్నప్పుడు వికృతమైన ఆలోచనలు రాకూడదని నా తలపు. ‘‘నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు/నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు’’ అంటే నా వల్లే నీలో జరుగుతున్న అజ అంటే చేష్టలు ఇవి. అవి నా వల్ల వస్తున్నాయి. నడుచుకుంటూ వెడుతున్నప్పుడు తొక్కేసినట్టుగా అనిపిస్తుంది. నీ కళ్ల ఎరుపు నీకు సంబంధించినది కాదు, ‘నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు/నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు’. ఆడవారు నుదుటి మీద పడిన ముంగురులను చాలా సుకుమారంగా, చేతితో వెనక్కు తీసుకుంటారు. అలా పైకి తీయటం, కళ్లు నులుముకోవటం, కులుకుతూ నడవటం.. ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తాయి అంటాడు హీరో. స్త్రీ భావన పట్ల అంతర్లీనంగా ఉన్న ముగ్ధత్వం ఇందులో చూపాను. స్త్రీ గురించి వర్ణించేటప్పుడు, టీజింగ్‌గా కాకుండా, ప్లీజింగ్‌గా రాయాలి అనుకున్నాను. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్లు పట్టుకున్నాడంటే, అందులో ఉన్న సుకుమార శృంగారాన్ని చూడాలే కాని, అందులోని కోపాన్ని చూడకూడదు. అలాంటిదే ఈ పాట కూడా. డ్యూయెట్ రాసేటప్పుడు స్త్రీ గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ లిమిటేషన్ పెట్టుకుంటాను.. కాముకత ఉట్టిపడేట్టు అస్సలు రాయను. తనకు సుపీరియర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని చూసినప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. ‘ఏంటలా చూస్తున్నారు అని బాస్ అడగగానే, మీ కాళ్లు బావున్నాయండీ అంటాడు. బాస్‌ని అయినా, భగవంతుడిని అయినా ముందుగా కాళ్లనే చూస్తాం. ఇలా కాళ్లను చూస్తున్న సిట్యుయేషన్లో నేనేం చెప్పగలనా అని ఆలోచించాను. అలా పుట్టింది ఈ పాట. నాకు పెద్దగా పుస్తక పాండిత్యం లేదు. నేను రాసే పాటలకు ఎవరూ ప్రేరణ కాకపోవటమే ప్రేరణ. ఎవరి రచనలనైనా చదివితే వాళ్ల ఆలోచనతోనే ఆలోచిస్తాం. ప్రబంధ కావ్యాలు చదివేసి ఉంటే, వసంతమాసం అనగానే అందరి కవుల ఆలోచనలు వచ్చేస్తాయి. నేను అందరూ చూసే సంవిధానం నుంచి విలక్షణంగా చూడటం అలవాటు చేసుకున్నాను. నా నిర్వచనాలలోనే ఉంది నా జీవితం. మనకు జన్మనిచ్చింది స్త్రీ. మనం మాట్లాడటానికి కారణభూతమైనది స్త్రీ. ఆవిడ పట్ల ఎంతో గౌరవం ఉండాలి. అంతర్లీనంగా ఉన్న దివ్య అంటే దైవ సంబంధమైన సౌందర్యాన్ని మాత్రమే చూడాలి. రాముడిలా బతకగలిగితే పురుషుడు కూడా సౌందర్యంగా ఉంటాడు. గుణాలు సౌందర్యంగా ఉండాలి. చిన్నపిల్లలు కాళ్లు ఆడిస్తున్నప్పుడు చూస్తే అక్కడే సౌందర్యం ఉంటుంది. చూపు ఎలా ఉండాలన్నదే నా పాటలకు ముఖ్యంగా పెట్టుకున్న లక్ష్యం. నేను చూసే దృక్కోణంలో పరిస్థితులను తీసుకునే సంవిధానం వేరే ఉంటుంది. అందం, సౌందర్యం అనేవి దైవత్వంలో ఒక లక్షణం. మనం చూసే దృష్టి మారితేనే చెడు ఆలోచనలు వస్తాయి. స్త్రీని పవిత్రంగా చూడాలి. సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఆ కాలంలో ఏ దృష్టి కోణంలో ఎలా చూసేవారు. ఈ కాలంలో ఎలా చూస్తున్నారో పరిశీలించుకోవాలి. శరీరంలో తేడా లేదు. చూసే విధానంలోనే తేడా ఉంది. ‘‘స్త్రీలు ఇంకొకరి కంటి ఆకలికి ఆరాధనగా కనపడాలి, ఆహారంగా కనపడకూడదు. వారిలోని మానసిక సౌందర్యాన్ని చూడాలి’’ అనేదే నా భావన. అందుకే ఏ పాటనైనా లా రాయాలి అన్నది నాకు నేను నిర్దేశించుకున్నాను. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా -
బన్నీ డాన్స్ స్టెప్స్‌కు పాన్ ఇండియా క్రేజ్
సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం బ్లాక్బాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, పాటలు అంతకన్నా పెద్ద హిట్టయ్యాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సినిమాలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే... జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. దీంతో అల్లూ అర్జున్ డాన్స్స్టెప్స్కు పాన్ ఇండియాలో యమా క్రేజ్ వచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన అలవైకుంఠపురంలో సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుషాంత్, పూజాహెగ్డే, నివేదా పేతురాజ్, టబూ, మరళీ శర్మ, సముద్రఖని తదితరులు నటించారు. -
ఇల వైకుంఠంలో..
తిరుమల: అల.. వైంకుఠపురం చిత్ర బృందం శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకోనుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో బసచేశారు. శుక్రవారం ఉదయం తిరుమలేశుని దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లుచేశారు. -
టాలీవుడ్ దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్ర సక్సెస్‌లో మునిగితేలుతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖుల కోసం బన్నీ ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ టాలీవుడ్ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల షేర్కుచేరువైనట్లు తెలుస్తోంది. (అల.. విజయోత్సాహంలో...) అల వైకుంఠపురంలో.. సినిమా నిర్మాతగా తన తండ్రికి కూడా భారీగా లాభాలు తీసుకొచ్చింది. ఇక బన్నీ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ట్విటర్లో పెట్టారు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్,త్రివిక్రమ్‌తో పాటు దర్శకులు, యువ దర్శకులు, కో డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. I whole heartedly Thank everyone for coming home and being a part of our celebrations. This one will always be the most special... thank you all for making it more memorable with your presence. Humbled. pic.twitter.com/Y4jZAobziY — Allu Arjun (@alluarjun) February 3, 2020 -
అల.. విజయోత్సాహంలో...
అలవోకగా మాటలు రాయడం త్రివిక్రమ్‌కి వచ్చుఅలవోకగా డైలాగులు చెప్పడం బన్నీ (అల్లు అర్జున్)కి వచ్చు అలవోకగా సినిమా తీయడం త్రివిక్రమ్‌కి వచ్చు అలవోకగా నటించడం బన్నీకి వచ్చు. అల.. ఈ ఇద్దరి కాంబినేషన్ హిట్. బన్నీని త్రివిక్రమ్ ‘జులాయి’ని చేస్తే ప్రేక్షకులు ‘సూపర్ హిట్టోయి’ అన్నారు. బన్నీని త్రివిక్రమ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అంటే.. ‘సూపర్ సక్సెస్’ ఇచ్చారు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ అన్నారు. ఆడియన్స్ అదిరిపోయే హిట్ ఇచ్చారు. ఈ విజయోత్సాహంలో త్రివిక్రమ్, బన్నీ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► ఇంతకుముందూ మీరు హిట్స్ ఇచ్చారు... వాటికీ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి దక్కిన ఆనందంలో తేడా ఉందా? బన్నీ: కచ్చితంగా తేడా ఉంది. హిట్ సినిమాలు చేశాను. అయితే ‘ఆల్‌టైమ్ రికార్డ్ హిట్’ అనేదాంట్లో వైబ్రేషన్ వేరేలా ఉంటుంది. కేవలం హిట్ సినిమా అయితే ఇంతమంది ఫోన్ చేయరు. ఇన్ని అభినందనలు ఉండవు. ఇండస్ట్రీలో అందరూ పర్సనల్‌గా ఫోన్ చేసి అభినందించారు. అంటే.. అంత గొప్ప హిట్. త్రివిక్రమ్: ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాను. నేను చేసిన సినిమా ప్రయాణాల్లో టాప్ లిస్ట్‌లో ఇది కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజూ చాలా విలువైనదిగా ఉండేది. ఔట్పుట్ బాగా వచ్చేది. ఏం చేసినా, ఎలా చేసినా ఔట్పుట్ ముఖ్యం కదా. అనుకున్నట్టుగా రావట్లేదు అనిపించినప్పుడు షూటింగ్ ఆపేసేవాళ్లం. ఏ రోజూ సర్ది చెప్పుకొని చేయలేదు. రాకపోతే ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. ► బన్నీకి హిట్ పడాల్సిందే అనే పరిస్థితిలో ఈ సినిమా కమిట్ అయ్యారు. ఒత్తిడి ఏమైనా? త్రివిక్రమ్: హిట్ ఇవ్వడం, హిట్ చేయడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. నిజాయితీగా చెబుతున్న మాట ఇది. ఒక కథ అనుకుని చేయగలం. ప్రతిరోజూ చెక్ చేసుకుంటూ వెళ్లగలం. అయినా తప్పు జరగొచ్చు. ఫ్లాప్ అవ్వొచ్చు. అలాగని ఒత్తిడి లేదు అని చెప్పినా అబద్ధమే. ఒత్తిడి ఉంటుంది. దాన్ని దాటి, పనిలో ఫన్ వెతుక్కుంటూ వెళ్లడమే. ► ‘రేసుగుర్రం’లా దూసుకెళ్లే ఓ హీరో గ్యాప్ ఇవ్వడం ఆ హీరోకు, ఆయన ఫ్యాన్స్‌కు బాధగానే ఉంటుంది. హిట్ విషయంలో మీకు ఒత్తిడి? బన్నీ: హిట్ సినిమా చేయాలి అనే ఆలోచనతో గ్యాప్ తీసుకోలేదు. గ్యాప్ కేవలం అనుకోకుండా వచ్చింది. ఒక సినిమా అయిన వెంటనే 2–3 నెలల్లో ప్రారంభిస్తాం. కానీ 2–3 నెలల్లో మంచి ఆప్షన్స్ తగల్లేదు. 6–7 నెలలు ఎదురుచూశాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు నేను, కలిసి సినిమా చేయాలనుకున్నాం. కథ రెడీ చేసి సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ► దర్శకుడు వక్కంతం వంశీతో మాట్లాడుతున్నప్పుడే త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నాం అన్నారు. ఆయనతో మీరు చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు కదా.. బన్నీ: ఫ్లాప్ అనేది అందరిదీ. దర్శకుడు ఒక్కడే చేసేది కాదు. ఆ కథ ఒప్పుకున్న నాదీ.. అందరిదీ తప్పే. ఆ తర్వాత ఏం చేయాలి? ముందుకు వెళ్లిపోవాలి. నేను, ‘బన్నీ’ వాస్, వక్కంతం వంశీ కలసి మాట్లాడుకున్నప్పుడు త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బావుంటుందనుకున్నాం. అప్పుడు త్రివిక్రమ్‌గారు ‘అరవింద సమేత’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మాది మొదలుపెట్టాలనుకున్నాం. ► ‘అల... వైకుంఠ...’ లో మీ పాత్రకు అసౌకర్యాలు మీ చెల్లెలి పాత్రకు సౌకర్యాలు. రియల్ లైఫ్‌లో మీరు ముగ్గురు అన్నదమ్ములు. మీ ఇంట్లో ఒకరిని తక్కువ చూడటం ఒకరిని ఎక్కువగా చూడటం ఉంటుందా? బన్నీ: (నవ్వుతూ). ముగ్గురు పిల్లలుంటే ఏదో విషయంలో ఒకరిని తక్కువ చేయడం ఉంటుంది. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ప్రేమిస్తారు. ఒకడికి ఎక్కువ కొనిస్తారు. ఒకడికి తక్కువ కొనిస్తారు. త్రివిక్రమ్: సాధారణంగా పెద్దవాళ్లంటే తండ్రికి ఇష్టం. చిన్నవాళ్లంటే తల్లికి ఇష్టం. మధ్యలో వాళ్లంటే జనానికి ఇష్టం (నవ్వుతూ). మీకు (బన్నీ) సామాజిక న్యాయం జరిగింది అనుకోవచ్చు. ► ఈ మధ్య మీ కథలను పరిశీలిస్తే ధనికులు, మధ్య తరగతి వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయేమో? బన్నీ: ఉన్నవే మూడు క్లాస్‌లు. పేద, మధ్య తరగతి, ధనిక. ఇవి కాకుండా ఇంకేం ఉంటుంది. త్రివిక్రమ్: నిజానికి పేద అనేదానికి అర్థం మారిపోయింది. 1960 నుంచి 1980 వరకూ కథలన్నీ పేద–ధనిక మధ్య ఉండేవి. తర్వాత పేద, మధ్యతరగతి ఒకటైపోయాయి. వాటి మధ్య గీత చెరిగిపోయి ఏది ఏదో తెలియనటువంటి పరిస్థితి. రిచ్ పోయి సూపర్ రిచ్ అనేది ఒకటి వచ్చింది. ధనిక వర్గంలోనే మరో క్లాస్ వచ్చింది. పేద అనేది పోయి మధ్యతరగతి అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాను కాబట్టి నా కథలన్నీ మిడిల్ క్లాస్‌కి, ధనిక వర్గానికి మధ్య జరుగుతుంటాయి. నాకు కనిపిస్తున్న రెండు క్లాస్‌లు అవే కాబట్టి. ఒకవేళ సూపర్ రిచ్ మీద తీయాలంటే మన బడ్జెట్లు సరిపోవు. ► ‘అల.. వైకుంఠపురములో..’ సుశాంత్ పాత్ర చూపించిన తీరు మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినవాళ్లకు తెలివి తేటలు తక్కువుంటాయనే ఫీల్‌ని కలగజేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.. త్రివిక్రమ్: సినిమాను మనం సూక్ష్మంగా విశ్లేషిస్తే అలా అనిపిస్తుంది. అది కేవలం ఒక కేస్.. అంతే. మధ్యతరగతి వాళ్లు తెలివితక్కువ వాళ్లు అని చెప్పాలనుకోలేదు. నాకు తెలిసిన మేధావులందరూ పేద, మధ్యతరగతి నుంచి వచ్చినవాళ్లే. వాళ్లే గొప్ప గొప్ప విషయాలు కనుగొన్నారు. ఇది కేవలం కథ. దీన్ని జనరలైజ్ చేయడం తప్పు. సుశాంత్ పాత్ర కూడా సక్సెస్ అయితే సంతృప్తి పడతారా? పడరు. అందుకే ఆ పాత్రను అలా డీల్ చేశాం. బన్నీ: తెలివిగలవాళ్లు, తెలివి తక్కువవాళ్లు అన్ని తరగతుల్లోనే ఉన్నారు. ఈ క్లాస్వారికి ఇన్ని తెలివితేటలుంటాయి, వీళ్లకు ఉండవు అనలేం. త్రివిక్రమ్: వాళ్లు వాదించే కేస్కి సమాధానం చెప్పాలంటే ఈ సినిమాలో రామచంద్ర (జయరామ్), మురళీ శర్మ (వాల్మీకి) మధ్యతరగతివాళ్లే. కానీ రామచంద్రకు ఐక్యూ ఉంటుంది. ధనవంతుడిగా ఎదిగిన మధ్యతరగతి వ్యక్తే కదా అతను. కాబట్టి మధ్యతరగతి వాళ్లను తెలివితక్కువవాళ్లుగా చూపిస్తాననే వాదనకి ఈ పాత్రను ఉదహరించి కౌంటర్ ఇవ్వొచ్చు. ► మీ సినిమాల్లో హీరోయిన్లని కొంచెం తెలివితక్కువగా చూపిస్తారనే వాదన కూడా ఉంది? త్రివిక్రమ్: ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ అలా చూపించలేదు కదా. ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయే. మనం ‘ఇకపై అంతా సుఖాంతం’ అనే వాక్యంతో కథలను ముగిస్తాం. కానీ వాళ్లు ఉంటారో ఉండరో మనకు తెలియదు నిజంగా. నేను నిజాయితీగా నమ్మేది ఏంటంటే.. మన తెలివితేటలన్నీ మన పనుల్లో పెట్టి మనుషులతో మాట్లాడేటప్పుడు ఎంత అమాయకంగా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత సుఖం. నేను అది పాటించడానికి నిరంతరం ప్రయతిస్తుంటా. మగవాళ్ల కంటే ఆడవాళ్లు చాలా సింపుల్‌గా ఉంటారని నా ఫీలింగ్. చాలామంది అంటారు ఆడవాళ్లు చాలా లోతు అయినవాళ్లు, క్లిష్టంగా ఉంటారని. అయితే వాళ్ల సింప్లిసిటీని కొంతమంది తప్పుగా చూశారేమో? అని నా ఫీలింగ్. ఆ నిరాడంబరత్వాన్ని చూపిస్తున్నాను. అంతే. ► మీ సినిమా టైటిల్స్‌కి ‘అ’ అక్షరం మీద ఎక్కువ ఆధారపడుతుంటారు కాబట్టి మీ జీవితంలో అ (అమ్మ) ఆ (ఆలి) గురించి కొన్ని విషయాలు.. త్రివిక్రమ్: మా అమ్మ నా సినిమాలు ఏవీ చూడలేదు. ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తారు. చూశాక ఏరా నువ్వే తీశావా? అని ఫోన్ చేస్తారు. ఆమె థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడటం మానేసిన తర్వాత నా సినిమా ప్రయాణం మొదలయింది. అందుకే ఆవిడ సినిమాలు పెద్దగా పట్టించుకోరు. వాటి గురించి మాట్లాడి నేనూ పెద్ద ఇబ్బంది పెట్టను. నా భార్య అన్ని సినిమాలూ చూస్తుంది. తెలుగు ప్రేక్షకులందరూ తనలా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే తనకి ఏ సినిమా అయినా నచ్చుతుంది. ప్రేక్షకులు కూడా తనలా ఉంటే మా (సినిమా పరిశ్రమవారి) జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి. సినిమాల పరంగా చెప్పాలంటే అది. గౌరవంగా చెప్పాలంటే వాళ్లను గౌరవించకపోతే జీవితం ముందుకు నడవదు. వాళ్ల మీద ఉన్న గౌరవం, ప్రేమని బాహాటంగా పంచుకోవడం అనవసరం అని వాళ్ల గురించి మాట్లాడను. వాళ్లు ఇబ్బంది పడతారని వాళ్ల గురించి మాట్లాడను. ► ఈ మధ్య మీ నాన్నగారి (అల్లు అరవింద్) గురించి ‘అల....’ ఫంక్షన్లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మీరు తండ్రి అయిన తర్వాత తండ్రి విలువ ఇంకా బాగా అర్థం అయిందా? బన్నీ: అది ఒక కారణం. ఆయన నా తండ్రి అని మాత్రమే ఆ వేదిక మీద మాట్లాడలేదు. ఒక వ్యక్తిగా ఆయనేంటో చెప్పాలని కూడా మాట్లాడాను. నాన్నగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేను చూసిన వ్యక్తుల్లో అద్భుతమైన మనిషి అయ్యారు. మా అదృష్టం కొద్దీ ఆ వ్యక్తి మా తండ్రి అయ్యారు. ఆ మంచి వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు నేను అందుకే ఎమోషనల్ అయ్యాను. ► మీతో సినిమాలు చేసిన హీరోలు ఆ«ధ్యాత్మిక బాటలో వెళతారేమోననే ఫీలింగ్ కలుగుతోంది... బన్నీ: ప్రశ్న మిమ్మల్ని (త్రివిక్రమ్) అడిగినా నన్ను చూస్తూ అడుగుతున్నారు (నవ్వుతూ). త్రివిక్రమ్: నాకైతే అలాంటిదేమీ అనిపించదు. అయితే నాతో నేను ఏం ప్రయత్నిస్తానంటే... నిజాయితీగా ఉండటం. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పకు, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకు, పడకు. ఇంతకుమించి పెద్ద రూల్స్ ఏం ఉండవు. ఇది పాటించడం వల్ల మనం, మన చుట్టూ ఉండేవాళ్లు అందరూ సుఖంగా జీవించొచ్చు. నాకు ఫోన్ చేయడానికి ఎవ్వరూ ఇబ్బందిపడరు. నేను ఫోన్ చేస్తే తీయడానికి ఇబ్బంది పడరు. మనుషులు అంతిమంగా కోరుకునేది సుఖమే కదా. డబ్బు, పేరు, ప్రతిష్ట కంటే కూడా సుఖమే ఎక్కువ కోరుకుంటారు. ► బయటవాళ్లకు ఎలా అనిపిస్తుంటుందంటే మీ నుంచి బోధనలు ఎక్కువ ఉంటాయేమో అని.. త్రివిక్రమ్: అస్సలు ఉండవు. బన్నీ: మిమ్మల్ని గురూజీ అని పిలిస్తే... అందరూ మీరు గురుకులం నడుపుతున్నారనుకుంటున్నారేమో (నవ్వు). త్రివిక్రమ్: గురువు అనేది చాలా పెద్ద మాట. దానికి నేను అర్హుడిని కాదు. నిజానికి ఈ తరంలోనే గురువులు లేరని నా అభిప్రాయం. నేను మహానుభావులు అనుకునేవాళ్లే.. వాళ్లు గురువులో కాదో అనే సందేహం వ్యక్తం చేసినప్పుడు ఇక అసలు మనమెంత? గురూజీ అనే పదం అసంబద్ధం. మాటల మాంత్రికుడు అనేది కూడా అంతే అసంబద్ధం. అలా అనొద్దని అందరికీ చెప్పి ఆపించలేను. మాటల మాంత్రికుడు అనేదాన్ని భరించడమే తప్ప ఆనందించడమైతే ఏమీ ఉండదు. ► న్యూ ఏజ్ సినిమాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు వస్తున్నారు. దానివల్ల స్టార్ డైరెక్టర్లందరూ జాగ్రత్తగా సినిమాలు తీయాలంటారా? త్రివిక్రమ్: కరప్ట్ అవ్వనంత వరకూ మనం ఎవ్వర్ని మెచ్చుకున్నా ఏ సమస్యా లేదు. అవతలి వాడి విజయం వల్ల మనం కరెప్ట్ అవ్వకూడదు. ఆలోచనా విధానంలో కరెప్ట్ అవ్వకూడదు. అది ఆలోచనా విధానంలో అయినా, ఫాలో అవ్వడం అయినా, ప్రభావితం అయినా సరే. ఇవన్నీ కరెప్షన్ కిందకే వస్తాయి. ప్రేక్షకులు మనం చేసేది నచ్చే ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొకళ్లు నచ్చారంటే మనం నచ్చలేదు అని అర్థం కాదు. వాళ్లు కూడా నచ్చారని. దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత మనకు ఉండాలి. వాళ్లే నచ్చారు నేను నచ్చడం లేదేమో? అని వాళ్లు తీసినట్లు సినిమాలు తీయకూడదు. వాళ్లు తీసే ఒక్క సినిమాయే నచ్చి రెండో సినిమా నచ్చకపోతే నాది ఆ ఒక్క సినిమాయే నచ్చిందేమో అని వాళ్లూ బాధపడకూడదు. ఇది ప్రతివాళ్లకూ ఉండే సమస్య. ► మీరు చేసిన హీరోలందరితో క్లోజ్‌గా ఉంటారు. కానీ వాళ్ల మధ్య మార్కెట్ పరంగా పోటీ ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? త్రివిక్రమ్: వ్యక్తిగత ఈక్వేషన్లు వేరు. వ్యక్తిగతంగా మాట్లాడుకునేప్పుడు వ్యక్తిగతంగానే ఉండాలి. సినిమాకి పని చేస్తున్నపుడు మన సమయాన్ని, శక్తిని మొత్తం దానికే కేటాయించాలి. ► జనరల్‌గా ఒక సినిమా రిలీజయ్యాక ఓ వారం దాని గురించి మాట్లాడతారేమో. మీరేమో రెండు వారాలైనా ఇంకా మాట్లాడుతున్నారు. రీజన్ ఏంటి? త్రివిక్రమ్: ఈ సినిమా మా నుంచి ఎక్కువ పనిని కోరుకుంది. ఎప్పుడూ చేయనన్ని గంటల ఎడిటింగ్ ఈ సినిమా కోసం చేశాం. కథ రాసినంతవరకే మనం రాజులం. పూర్తయ్యాక దానికి బానిసలం. ఈ సినిమా ఇంకా డబ్బులు తెస్తున్నాను.. మీరు మాట్లాడండి అంటోంది. మాట్లాడుతున్నాం. మా అమ్మగారు ఫోన్ చేసి, ఎప్పుడొస్తావ్ రా అన్నారు. ఊరెళ్లాలని ఉంది కానీ అవ్వడం లేదు. బన్నీ: మామూలుగా విడుదలైన రెండు వారాల తర్వాత సినిమాతోపాటు మా పని కూడా అయిపోతుంది. కానీ ఈ సినిమా బాగా నడుస్తోంది. అందుకే మాట్లాడుతున్నాం. త్రివిక్రమ్: అంతమంది జనం థియేటర్స్‌కి వచ్చి చూస్తున్నారంటే దాన్ని మనం గౌరవించాలి కదా. మాట్లాడాలి కదా. ► మీ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు? బన్నీ: పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు. ► ‘అల.. వైకుంఠపురములో..’ రిలీజ్ అయిన రోజే ‘సంక్రాంతి విన్నర్’ అని పోస్టర్ వేశారు. మరో సినిమా రిలీజ్ కాకముందే వేయడానికి కారణం? త్రివిక్రమ్: అర్థమయిన తర్వాతే పెట్టాం. బన్నీ: ఇండస్ట్రీ హిట్ పోస్టర్ కూడా అర్థం అయిన తర్వాతే వేశాం. త్రివిక్రమ్: అల్లు అరవింద్‌గారు వసూళ్ల గురించి ఒక రూపాయి తక్కువ చెప్పినా ఒప్పుకుంటారు కానీ రూపాయి ఎక్కువ చెబితే తాట తీస్తారు. బన్నీ: మూడో వారంలో తెలిసింది మాకు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని. త్రివిక్రమ్: క్లారిటీ వచ్చిన 10–12 రోజుల తర్వాతే ఇండస్ట్రీ హిట్ అని అనౌన్స్ చేశాం. ► ఈ సినిమా సక్సెస్ కేవలం త్రివిక్రమ్‌గారిదే అని ఇటీవల సక్సెస్ మీట్లో బన్నీ అన్నారు? త్రివిక్రమ్: హిట్ కూడా అందరిదే. బన్నీ: అందరి కృషి ఉంది.. అందులో డౌట్ లేదు. అయితే సినిమా సక్సెస్‌కి ఒక్క కారణం చెప్పాలంటే మాత్రం కచ్చితంగా దర్శకుడే అని చెబుతాను. ► మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే మూడోసినిమా వినోద ప్రధానంగా చేయాలనుకున్నారా? బన్నీ: సన్నాఫ్ సత్యమూర్తి కథలోనే కొంచెం బరువుంది. కథ ఎక్కువుంటే వినోదానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎక్కువ వినోదం ఉండే సినిమా చేయాలని ముందే అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే మనం కూడా ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే కచ్చితంగా పాడు చేస్తాం (నవ్వుతూ). అందుకే ఎక్కువ ఆలోచించకుండా లైట్ మైండ్‌తో ఈ సినిమా చేశాం. ► త్రివిక్రమ్‌తో సినిమా చేసే హీరోలందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆయనతో మూడు సినిమాలు చేశారు.. ఏం మాయ చేస్తారో చెప్పండి? త్రివిక్రమ్: మాయలేవీ లేవండీ.. బన్నీ: త్రివిక్రమ్‌గారితో పని చేసే యాక్టర్స్ అందరూ సుఖంగా ఉంటారు. షూటింగ్ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తారాయన. కొన్నిసార్లు షూటింగ్ ప్రాసెస్‌ను ఆనందించకపోవచ్చు, కానీ సినిమా పెద్ద హిట్ అవ్వొచ్చు. త్రివిక్రమ్‌గారితో రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా కథలన్నీ నిజం కాదు. కానీ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రయాణం మాత్రం నిజం. ఆ వంద రోజుల ప్రయాణం నాకు నిజం. ► ఈ సినిమాలో హ్యాండ్సమ్గా ఉన్నారు.. హెయిర్ స్టయిల్ కూడా కొత్తగా ఉంది.. బన్నీ: నేను, త్రివిక్రమ్‌గారు మా ఆఫీస్‌లో కలిసినప్పుడు సినిమాలో ఉన్నట్టు జుట్టు పెంచాను. త్రివిక్రమ్‌గారు ‘ఈ హెయిర్ స్టయిల్ బావుంది, సినిమాలో వాడదాం’ అన్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఏదో హెయిర్ స్టయిల్లో కనిపించాను. ఫస్ట్ టైమ్ న్యాచురల్ స్టయిల్లో కనిపించాను. ఇది బాగుందంటున్నారు. మీ ముందు వరకూ ఏ రైటరూ అంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. దాని గురించి? త్రివిక్రమ్: మన సినిమాకి రైటర్ అవసరం ఉంది, కానీ వాడికి కావాల్సినంత గౌరవం ఇవ్వం. గొప్ప గొప్ప రచయితలను దగ్గర నుంచి చూశాను కాబట్టి అలా అనిపించింది. నాకు నేను చెప్పుకున్నది ఏంటంటే.. నువ్వైతే ఇలాంటి పరిస్థితులను మార్చేలా పనిచెయ్. దర్శకుడిని కూడా అవ్వాలని ముందే అనుకున్నాను. రచయితగా కొనసాగాలనుకోలేదు. బహుశా దాని వల్ల కూడా రచయితగా వచ్చిన అవకాశాలకు నో చెప్పేవాణ్ణి. పరిగెత్తుకెళ్లి ప్రతిదీ రాయాలనుకోలేదు. మీ మీద మీకు గౌరవం ఉంటే ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారు. -
‘అల..’ రికార్డును త్వరగా బద్దలు కొట్టాలి
సాక్షి, హైదరాబాద్: ‘రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. 'అల.. వైకుంఠపురములో' మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్లిద్దరు. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. 'సిత్తరాల సిరపడు' సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’ అని చెప్పారు. నటులు సుశాంత్, హర్షవర్ధన్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. (అది మొదట చెప్పింది మెగాస్టారే: బన్నీ) -
‘అల.. వైకుంఠపురములో’ విజయోత్సవ వేడుక
-
అది మొదట చెప్పింది మెగాస్టారే: బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన తొలి నాటి నుంచి రికార్డుల వేట దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. వారి ముచ్చట్లు ఏంటో చూద్దాం... ఇండస్ట్రీ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు? అల్లు అరవింద్: ఇండస్ట్రీ హిట్ అని నిర్మాతలు ప్రకటించారు. ఇది నా విజయం కాదు. ఇది జనం నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్. ఇది నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు. ఒక సినిమా రికార్డు వచ్చినప్పుడు అది హీరో ర్యాంకు కాదు. జనం ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు. టాప్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే ఆ సినిమాల్లో ఏ హీరో ఉంటే ఆ హీరోకి ఆ ర్యాంక్ అనేది కాదు. జనం ఆ సినిమాని అంతగా ఇష్టపడ్డారు అని అర్థం. జనం ఆ స్థాయిలో ఆ సినిమాను ఇష్టపడినందుకు నాకు అమితమైన ఆనందం. అందులోనూ అది నా సినిమా అవటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా చోట్ల బాహుబలి రికార్డుని క్రాస్ చేసింది. అయినా కానీ ఇక్కడ నాన్-బాహుబలి రికార్డు అని పెట్టడానికి కారణం ఏంటి? అల్లు అరవింద్: మీరు చెప్పింది నిజమే. ఇది చాలా చోట్ల 'బాహుబలి 2' తర్వాత వచ్చి ఆగింది. బాహుబలి అనేదాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మాట అని ఉండొచ్చు. కలెక్షన్ల గురించి హీరోకు, డైరెక్టర్‌కు తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజు ఫిగర్లు చూసుకొని ఆనందపడేది మేము. సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకొని వాళ్లు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు అవుతుందనేది చూసుకునే దగ్గర మేము మొదలవుతాం. యూఎస్‌లో టాప్ త్రీలో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఇంకా కలెక్ట్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. దీని మీద మీరేమంటారు? అల్లు అర్జున్: ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డు ఫిలిం పడుతూ ఉంటుంది. నాకు ఇదివరకు ఒక రికార్డు ఫిలిం పడింది కానీ ఓవరాల్ గా అన్నిచోట్ల పడలేదు. అన్ని జిల్లాల్లో యునానిమస్ గా ఆల్‌టైమ్ రికార్డు ఎప్పుడూ పడలేదు. నాన్నకు గీతా ఆర్ట్స్‌లో దాదాపు 10 ఆల్‌టైమ్ రికార్డు సినిమాలు పడ్డాయి. చిరంజీవిగారితో చాలా సినిమాలు, గజినీ, మగధీర వంటి సినిమాలు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త విషయం కాదు. నాన్న గారితో ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డు ఒక కొడుకుగా కొట్టడం సంతోషంగా ఉంది. దట్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. మళ్ళీ మేము ఇంకోసారి రికార్డు కొట్టొచ్చు. కానీ ఇంత ఆనందం రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ వెరీ స్పెషల్. ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్. మా ఫాదర్ తో రికార్డు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక. దీనికి కారణమైన అందరికీ మరోసారి థాంక్స్. ప్రత్యేకంగా త్రివిక్రమ్ గారికి. త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు ఈ స్థాయి రికార్డు కొడుతుండని మీరు ఊహించారా? అల్లు అర్జున్: మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో ఆయన ఒక డైలాగ్ రాశారు. అది ఆబ్సల్యూట్లీ ట్రూ. నిజంగానే ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు నేను ఈ ప్రయాణం నడిపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత చేస్తుందని నాకు తెలియదు. ఏ సినిమాకీ తెలియదు, ఎవరు చెప్పలేరు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని.. నేను పని మాత్రం చేశాను. జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. త్రివిక్రమ్ గారు చెప్పిన వెంటనే ఇది గోల్డ్ మైన్ అవుతుందని మాత్రం ఇది నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేమిద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం. మేము మా పని చేశాం. అది జనానికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ విషయంలో మీ ఫ్యాన్స్ కి ఎంత రేషియో ఇస్తారు? జనరల్ ఆడియన్స్ కి ఎంత రేషియో ఇస్తారు? అల్లు అర్జున్: నిజాయితీగా చెప్పాలంటే దాన్ని విడదీసి చెప్పలేం. చూసిన వాళ్ళలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జనరల్ ఆడియెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేం. మా కనెక్షన్లో లేని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అంటే గొడవ చేసే వాళ్ళు, బ్యానర్లు కట్టే వాళ్ళు కాదు. కామ్‌గా, అడ్మైరింగ్‌గా ఉండే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కిందే లెక్క. ఎంతమంది ఫ్యాన్స్‌కు నచ్చింది, ఎంత మంది అడ్మైరర్స్కు నచ్చింది, ఎంతమంది సామాన్య ప్రజలకు నచ్చింది అనేది విడదీసి చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం. ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, సినిమా నచ్చితే స్టుపెండస్ సక్సెస్ చేస్తారు. అందరికీ సినిమా నచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు? అల్లు అర్జున్: సినిమా అనేది ఎంటైర్ టీం వర్క్. ఒకరి పేరు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నిజానికి నేను 'నా పేరు సూర్య' చేసిన తర్వాత వక్కంతం వంశీ గారు, నేను, బన్నివాసు కలిసి ఉన్నప్పుడు ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వక్కంతం వంశీ గారు త్రివిక్రమ్ గారి పేరు సూచించారు. ఆయనతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. ఆయన మాటల్లో ఒక పల్స్ కనిపించింది. నా మైండ్‌లో ఆయనే త్రివిక్రమ్‌తో గారితో చేయాలని ఐడియా వేశారు. ఈ సినిమాతో మీకు పర్ఫార్మర్ గా కూడా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. దానికి ఎలా ఫీలవుతున్నారు? అల్లు అర్జున్: ఈ సినిమా విడుదలైన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నాకు అసలు తెలియదు. అది 100% త్రివిక్రమ్ గారు నా మీద వేసిన ట్రిక్. ఆయన ఒకటన్నారు.. 'మీకు తెలియకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యాను' అని. నా పర్ఫామెన్స్‌కు ఇంత అప్రిసియేషన్ వస్తుందని నా రిమోట్ ఇమేజినేషన్లో కూడా లేదు. నేను త్రివిక్రమ్ గారితో కూడా అన్నాను. 'ఏం సార్ నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను షాక్‌లో ఉన్నాను' అని. నా చేత ఎలా చేయించారనేది ఆయన చెప్తారు. నాతో ఆయన చేయించారు. నేను ఏం చేశాను అని ఆలోచించే లోపే అందరూ అదిరిపోయింది అన్నారు. ఏం మాయ చేసారు సార్ మీరు? త్రివిక్రమ్: నాకే తెలియదు సార్. అల్లు అరవింద్: సినిమా చూశాక 'బన్నీ.. నీ ఫీలింగ్ ఏంటి?' అని నేను అడిగాను. 'ఇది త్రివిక్రమ్ మాయ డాడీ' అని అన్నాడు. త్రివిక్రమ్: రుద్దినట్లు కాకుండా చాలా ఈజీగా చెప్పినట్లు ఉండాలని ట్రై చేశాను. కొన్ని సీన్లు ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో కొన్ని పాయింట్లు పెట్టుకున్నాము. తను చేసిన ఇంటర్వెల్ సీను నాకు సంబంధించినంత వరకు ఒక రిఫరెన్స్ పాయింట్. ప్రతి షాట్ ఒక ఫిలింలాగా ట్రీట్ చేశాం. నేను ఏదైతే ఒక గ్రాఫ్ అనుకున్నానో, ఆ గ్రాఫ్ పట్టుకొని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? త్రివిక్రమ్: నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారు, ఎంతమందికి నచ్చింది అనే విషయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆర్టిస్ట్ అయిన కోరుకునేది తన మాట ఎక్కువమందికి వినిపించాలని, ఎక్కువ దూరం చేరాలని. నేనైతే దాన్ని అలాగే చూస్తాను. ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలు పెట్టినప్పుడే తెలుసు. దీన్ని ఎంత కాంటెంపరరీగా తీస్తామనేది అనేది ముందు నుంచి కాన్షియస్ గానే ఉన్న విషయం. అల్లు అర్జున్: త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశాను. మళ్లీ మేము కలిసి పనిచేస్తే ఆ ఆసక్తి అనేది ఉంటుందని అనిపించింది. నిజంగా హ్యాట్రిక్ అని అనుకోలేదు. మూడోదానికి రిథం సెట్ అయింది. బాల్ కనెక్ట్ అయి బౌండరీ దాటేసింది. ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు అనేది పెద్ద విషయం. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందన్నప్పుడు మనం మరింత ఎక్స్పరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయొచ్చు. మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అల్లు అర్జున్: బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళి గారికి పర్సనల్‌గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. ‘మిర్చి’లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను త్యాగం చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్ లో అతని విగ్రహం పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. ప్రభాస్‌కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిలిమ్స్ అయినందుకు చాలా హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెళ్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎక్కడ ఏమి మాట్లాడలేదు. మరి మీతో ఏం మాట్లాడారు? అల్లు అర్జున్: చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు. 'మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో' అని నేను అన్నాను. 'లేదు లేదు నాకు తెలిసిపోతుంది, ఒక సినిమా ఏ లెవల్లో ఉంటుందనేది' అని చెప్పారు. అలా చెప్పటం అంత ఈజీ కాదు. తను ఒక్కరే చూసినా ఎంత పీపుల్ పల్స్‌లో ఆయన ఉన్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా చూసి ఇది ఎంత చేస్తుంది అని చెప్పడానికి ఎంత అనుభవం కావాలి! హి ఈజ్ రియల్లీ గ్రేట్. త్రివిక్రమ్: మేమిద్దరం అయితే షాక్ తిన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అన్నారేమో అనుకున్నాను. రామ్ చరణ్ నాతో మాట్లాడారు. ఈ రికార్డ్స్ ని పక్కన పెడితే మూడు సినిమాల జర్నీలో త్రివిక్రమ్ గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి? అల్లు అర్జున్: ప్రతి సినిమాలో ఒక విషయం నేర్చుకున్నాను. ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు. మనం చేసే పనిపై ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. డిటాచ్ అయ్యి అటాచ్ అవటం నేర్చుకున్నాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అది కూడా ఒక కీలకమని నమ్ముతున్నాను. ఇండస్ట్రీ హిట్ వచ్చింది కదా.. మీ అబ్బాయికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు? త్రివిక్రమ్: దీనిపై అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కు ఒక వినతిపత్రం సమర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అల్లు అరవింద్: తండ్రి కొడుకులుగా స్నేహితుల్లా ఉంటాము. ప్రొఫెషనల్‌గా వచ్చేటప్పటికి కొంచెం టైట్‌గా ఉంటాను. చిరంజీవి గారి దగ్గరనుంచి ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోలందరికీ వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ వచ్చాను. అలాగే బన్నీకి కూడా అది తప్పలేదు. రంగస్థలం, సైరా ఇప్పుడు 'అల వైకుంఠపురములో' వరుసగా మెగా హీరోల ఇండస్ట్రీ రికార్డ్స్ టాప్ ఫైవ్ లో ఉండటం ఎలా అనిపిస్తోందన్న ప్రశ్నకు సమాధానంగా అలా జరగటం ఎవరికైనా సంతోషమే కదండీ.. నాకూ ఆనందంగానే ఉంది అంటూ తమ సంభాషణను ముగించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. (చదవండి: అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ) -
అల... భైరిసారంగపురంలో..
‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. సిక్కోలు యాసతో యూత్‌ని ఆకట్టుకున్న ఈ పాట ఇటీవలే విడుదలైన ‘అల... వైకుంఠపురంలో...’ చిత్రంలోనిది. పాటను సినిమాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్న పాడారు. మందస మండలం భైరిసారంగపురం గ్రామానికి చెందిన సూరన్నకు బతుకునిచ్చే చదువు లేదు కానీ.. తన సిక్కోలు యాసతో జానపదాలను బతికిస్తున్నారు! సూరన్న అసలు పేరు సూరయ్య. గంగిరెద్దుల కుటుంబం. స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు అతడిని చదివించలేదు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. 15 ఏళ్ల వయస్సులో సూరన్న జీవితం చిన్న మలుపు తీసుకుంది. అప్పట్లో ‘భూమి భాగోతం’ అనే జానపద ప్రదర్శనకు తమ ఊరు వచ్చిన వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన మజ్జి బయ్యన్నతో సూరయ్యకు పరిచయం ఏర్పడింది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల కులానికి చెందిన పదమూడు మందితో బయ్యన్న నాటకాన్ని ప్రదర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నాటకం! మాటలు, పాటలు, హాస్యం కూడా బయ్యన్నే వెనుక నుంచి చెప్పేవారు. ఆ నాటకంలో సూరన్న అనే హీరో పాత్రను సూరయ్య వేస్తుండటంతో ఆయన పేరు సూరన్నగా మారిపోయింది. సుమారు 800 ప్రదర్శనలతో ఆ నాటకం మంచి ప్రాచుర్యం పొందింది! ‘తితిలీ.. తితిలీ..’ సూరన్న గంగిరెద్దులను ఆడిస్తూ.. జానపదాలను పాడుతూ, నాటకాలు వేస్తూ మంచి కళాకారుడిగా పదిమంది దృష్టిలోనూ పడ్డారు. జిల్లాను దాటి, ఇతర జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలో కూడా సూరన్న ప్రదర్శనలు ఇస్తుండడంతో మంచి గుర్తింపు వచ్చింది. 350 వరకు జానపదాలకు ఆయన అవలీలగా పాడగలరు. ఇప్పటికి 200 వరకు బాణీలు కట్టాడు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాకు కలిగిన నష్టాన్ని ‘తితీలీ.. తితీలీ.. తుపానమొచ్చి, ఊరు, వాడా వల్లకాడైతే.. శీకాకుళం జిల్లా సిన్నబోయిందే’ అనే తన పాట ప్రతి ఒక్కరి నోట్లో ఆడిందనీ.. ఈ పాటే తన జీవితానికి రెండో మలుపు అయిందనీ సూరన్న అన్నారు. సూరన్న సన్నాయి, సైడ్డ్రమ్ము, డోలు వాయిద్యాలు కూడా వాయిస్తారు. సంక్రాంతి సమయంలోనైతే సూరన్న గంగిరెద్దుల ప్రదర్శనకు ఊరూరూ నీరాజనాలు పలుకుతుంది. సినిమా తెరపైకి వైజాగ్‌లోని ఆడియో, వీడియో కంపెనీ ‘శ్రీమాతా మ్యూజిక్ హౌస్’ మేనేజింగ్ డైరెక్టర్లు పల్లి నాగభూషణరావు, బిన్నళ నర్సింహమూర్తి సూరన్న ప్రతిభను గుర్తించి, జానపద పాటలను శ్రీమాతా స్టుడియోలో రికార్డింగ్ చేసి, సీడీలు, యూట్యూబ్‌లలో విడుదల చేశారు. వాటిలో.. ‘అల్లుడా గారెండొలా.. బూరెండొలా..’ అనే పాటను యూట్యూబ్‌లో చూసిన సినీదర్శకుడు చిన్నికృష్ణ.. సూరన్నను సంప్రదించి, అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ‘అల.. వైకుంఠపురంలో...’ సెట్‌కి తీసుకెళ్లారు. ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదుట సూరన్నతో జానపదాలను పాడించారు. దాంతో ముగ్ధులైన త్రివిక్రమ్ అప్పటికప్పుడు ఇదే సినిమాలో పాడే అవకాశం కల్పించారు. దీంతో అల వైకుంఠపురంలో పోరాట దృశ్యాలకు సిక్కోలు యాసలో సూరన్న చేత ‘‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’’.. పాట పాడించారు. ఆ పాటకు సాహిత్యం ఒడిశాకు చెందిన బల్ల విజయ్‌కుమార్ సమకూర్చారు. మ్యూజిక్ డైరక్టర్ తమన్, అసిస్టెంట్ మ్యూజిక్ డైరక్టర్ శ్రీకృష్ణ.. పాటకు ట్యూన్ చెప్పడంతో సూరన్న తన గళం విన్పించాడు. జానపదాన్నే నమ్ముకుని జీవిస్తున్న తనకు సినిమాల్లో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉందని ‘సాక్షి’తో అన్నారు సూరన్న. మొట్టమొదటిసారిగా తను విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో కళాభినేత్రి వాణిశ్రీతో సన్మానం పొందానని, అనంతరం ముప్ఫైమంది వరకు ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు, సత్కారాలు పొందానని సూరన్న చెప్పారు. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ తనకు ఓ స్పెషల్ కోటు బహుమతిగా ఇచ్చారని, విశాఖలో జరిగిన సినిమా సక్సెస్ మీట్ వేదికపై అల్లు అరవింద్ తనను హత్తుకోవడం జీవితంలో మరచిపోలేనని, ఇది శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందంగా అన్నారు. – కందుల శివశంకర్, ‘సాక్షి’ శ్రీకాకుళం కొంచాటి ఆనందరావు, ‘సాక్షి’ మందస -
అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం
ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్ కన్నుమూశారు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికీ రాజేంద్ర ప్రసాద్ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మామయ్య. బన్నీకి ప్రసాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తమ కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రసాద్ చనిపోయారని తెలియడంతో అల్లు ఫ్యామిలీ విజయవాడకు బయల్దేరారు.(బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బన్నీ సినిమా) బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే బన్నీ మేనమామ ప్రసాద్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రెగ్యూలర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఆయన హఠాన్మరణం చెందారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి :రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బన్నీ సినిమా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో అందరి అంచనాలను దాటుకుని బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. విడుదలైన 10 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.220 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఇది ఆల్‌టైం రికార్డు అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విడుదలైన 10 రోజుల్లోనే రూ.143 కోట్లు(షేర్స్) వసూలు చేసినట్లు చెప్పారు. ఇది నాన్ బాహుబలి రికార్డు అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో మొత్తం 10 రోజుల్లో 112.90 కోట్లు కొల్లగొట్టింది. నైజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్‌లో రూ.18.07 కోట్లు, వైజాగ్ 18.80 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.89 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.65 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.8.80 కోట్లు ,నెల్లూరులో రూ.4.07 కోట్లు వసూలు అయ్యాయి. ఇక పోతే కర్ణాటకలో 10.70 కోట్లు, తమిళనాడు, కేరళ & రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3.60 కోట్లు, యూఎస్ 12.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 3.55 కోట్లు.. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 143.25 కోట్ల షేర్, 220 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్లో రికార్డును సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. -
సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా
సామజవరగమన.. ఈ పాట కొన్ని కోట్ల మందిని ఆగం చేసింది. రింగ్ టోన్, కాలర్ ట్యూన్ ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. థమన్.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు’ అని పేర్కొన్నారు. దీనికి సంగీత దర్శకుడు ఎస్.థమన్ స్పందిస్తూ మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందంటూ కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్ అవుతుందని ట్వీట్ చేశాడు. కాగా అల వైకుంఠపురం సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఇక జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. Sirrrrrrrr coming this from the man I look upto ♥️ @KTRTRS u have made our song more sensational ✊More power & more love to U sir ✨Happy to knw tat our #sensationalsamajavaragamana is making ur day 🥁🥁🥁We have got the best now 💿💿💿💿#godbless https://t.co/MUtOtGVKP4— thaman S (@MusicThaman) January 21, 2020 చదవండి: సైరా రికార్డును తుడిచేసిన అల వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి కష్టాన్నంతా మరచిపోయాం – తమన్