రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్‌ స్టార్‌ | Allu Arjun Reaches 10 Million Followers in Instagram | Sakshi

రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్‌ స్టార్‌

Jan 7 2021 8:15 PM | Updated on Jan 7 2021 8:28 PM

Allu Arjun Reaches 10 Million Followers in Instagram - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కున్న క్రేజే వేరు. తన యాక్టింగ్ స్కిల్స్‌‌, డ్యాన్స్‌, స్టైల్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్‌. ఇక తాజాగా బన్నీ‌ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హోరోని ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలయన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

ఇక ఫేస్‌బుక్ పేజీలో తన పోస్టులకు గాను మొత్తంగా 13 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. సౌత్‌లో ఇంత భారీ ఎత్తున ఫేస్‌బుక్‌లో ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇక ట్విట్టర్‌లో బన్నీకి‌ 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి గుర్తింపే ఉంది. ఇక హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు కూడా బన్నీ దగ్గరయ్యారు. అందుకే ఇపుడు సుకుమార్‌తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.(చదవండి: అల్లు అర్జున్‌ 'మెగాస్టార్‌' అయిపోతారా?)

‘బుట్టబొమ్మ’ మరో రికార్డు
ఇక గతేడాది సంక్రాతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురము’లో సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక తాజాగా బుట్ట బొమ్మ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్‌, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement