Record Views
-
స్టైలిష్ స్టార్ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్ లుక్, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు. కాగా బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్, ట్రైలర్, పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ మూవీ ట్రైలర్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించి టాప్ 20లో నిలిచింది. తాజా ఈ మూవీలోని ‘రాములో రాములా’ పాట మరో అరుదైన రికార్డు తెచ్చిపెట్టింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్ సెన్సేషనల్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీతో ఎన్నో రికార్డు కొల్లగొట్టిన బన్ని తాజాగా ‘రాములో రాములో’ పాటతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణీ, మంగ్లీలు ఆలపించారు. -
రికార్డుల మోత మోగిస్తోన్న స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కున్న క్రేజే వేరు. తన యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్, స్టైల్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హోరోని ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలయన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా బలంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) ఇక ఫేస్బుక్ పేజీలో తన పోస్టులకు గాను మొత్తంగా 13 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. సౌత్‌లో ఇంత భారీ ఎత్తున ఫేస్బుక్లో ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇక ట్విట్టర్లో బన్నీకి 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి గుర్తింపే ఉంది. ఇక హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు కూడా బన్నీ దగ్గరయ్యారు. అందుకే ఇపుడు సుకుమార్‌తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.(చదవండి: అల్లు అర్జున్ 'మెగాస్టార్' అయిపోతారా?) ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు ఇక గతేడాది సంక్రాతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురము’లో సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బుట్ట బొమ్మ సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక తాజాగా బుట్ట బొమ్మ ఖాతాలో మరో రికార్డు నమోదయ్యింది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. -
బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్ ప్రశంసలు
‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ దుమ్ము దులిపాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వల్ల బుట్టబొమ్మ సాంగ్ విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తున్పప్పటికి ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాటని ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే అభిమానులు ‘బుట్టబొమ్మ’ హ్యాష్‌ట్యాగ్‌ని ఉదయం నుంచి ట్రెండ్ చేస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. అర్మన్ మాలిక్ పాడారు. గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్ రికార్డు ఫిదా సినిమాలోని ‘వచ్చిండే’ పాట ఖాతాలో ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘బుట్టబొమ్మ’ ఆక్రమించింది. (చదవండి: హిందీలోకి అల్లు అర్జున్ హిట్ సినిమా) ఇక బుట్ట బొమ్మ సాంగ్ 45 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిలో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ‘అల వైకుంఠపురములో’కి మ్యూజిక్ అందించిన తమ్న్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలపుతున్నారు. తమన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తెలుగులో సూపర్ హిట్టయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లోకి రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ లుక్‌తో ఇప్పటికే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. #UNSTOPPABLEAVPLALBUM #avpl Our #ButtaBomma HITS #450millionforbuttabomma My love to My dear brother @alluarjun My Respect to #Trivikram gaaru 🎵@ramjowrites @ArmaanMalik22@vamsi84 #radhakrishna gaaru #alluarvindh gaaru #pdprasad gaaru Team @haarikahassine @GeethaArts pic.twitter.com/4dmsqEzDZh — thaman S (@MusicThaman) November 24, 2020 -
అఖిల్ అరుదైన రికార్డు
సాక్షి, హైదరాబాద్ : అఖిల్ అక్కినేని నటించిన తెలుగు మూవీ మిస్టర్ మజ్నూ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీ యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ను రాబట్టింది. మిస్టర్ మజ్నూ అఖిల్ నటించిన మూడో సినిమా. జులై 4న మిస్టర్ మజ్నూ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా, కేవలం నెల వ్యవధిలోనే రికార్డు వ్యూస్‌ను సాధించింది. 2019లో ఈ సినిమా విడుదలైనప్పుడు మూవీకి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ విడుదల కోసం వేచిచూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీ విడుదల కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. చదవండి : సంక్రాంతికి ఫిక్స్ -
యూట్యూబ్ నిబంధనల్లో మార్పులు
శాన్ఫ్రాన్సిస్కో: వీడియోలు చూసే వారి సంఖ్యకు సంబంధించి యూట్యూబ్ కీలకమైన మార్పులు చేసింది. కొంతమంది కళాకారులు కృత్రిమ పద్ధతుల ద్వారా వీడియో వ్యూస్ సంఖ్యను మార్చుకుంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో తామీ మార్పులు చేసినట్లు యూట్యూబ్ తెలిపింది. వీడియోల్లోని ప్రకటనలను ఎంతమంది చూశారన్న అంశంపై కాకుండా వేర్వేరు ఇతర పద్ధతుల ఆధారంగా ఎంత మంది చూశారన్న లెక్క తేలుస్తామని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు ‘ద వర్జ్’అనే వెబ్సైట్ తెలిపింది. అంతేకాకుండా 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంలోనూ కొన్ని మార్పులు చేశామని, డైరెక్ట్‌గా లింక్‌లు షేర్ చేసుకోవడం, సెర్చ్ ద్వారా వీడియోలను చూడటం వంటి సహజసిద్దమైన ప్రక్రియల ఆధారంగా వ్యూస్ లెక్కపెడతామని తెలిపింది. ఈ ఏడాది జూలైలో భారతీయ ర్యాప్ సింగర్ వీడియో ఒకటి ఒక రోజులోనే 7.5 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ సంఖ్య తప్పుడు మార్గాల్లో పెంచుకున్నదని అంచనా. -
రికార్డుల రంగమ్మ.. మంగమ్మ..
‘రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు...’ పాట వినగానే మనకు టక్కున ‘రంగస్థలం’ సినిమా గుర్తుకు రాక మానదు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాట బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ పాట యూ ట్యూబ్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది తక్కువ టైమ్‌లో 10 కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ పాట రికార్డు సృష్టించడం విశేషం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మానసి పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్
గతంలో సినిమా రిలీజ్ తరువాతా కలెక్షన్ల రూపంలో రికార్డులు నమోదయ్యే, కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే రికార్డుల వేట మొదలవుతోంది. ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్లో కూడా ప్రస్తుతం ఇదే సాంప్రదాయం కనిపిస్తోంది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న హాలీవుడ్ రొమాంటిక్ ఫాంటసీ మూవీ బ్యూటి అండ్ ద బీస్ట్. డిస్నీ సంస్థ భారీగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఓ వింత ఆకారానికి, అందమైన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా తెరకెక్కిన ఈసినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో 24 గంటల్లో 12 కోట్ల 76 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డేవిడ్ హోబర్మన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బిల్ కాన్డన్ దర్శకుడు. ఎమ్మా వాట్సన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాతో నూతన నటుడు డాన్ స్టీవెన్స్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2017 మార్చ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాను 2డితో పాటు, రియల్ 3డి, ఐమాక్స్ 3డి, డిజిటల్ 3డి ఫార్మాట్ లలో రిలీజ్ చేస్తున్నారు.