రికార్డ్లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్ | Beauty and the Beast Trailer Sets Record for Most Views in 24 Hours | Sakshi
Sakshi News home page

రికార్డ్లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్

Published Thu, Nov 17 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

రికార్డ్లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్

రికార్డ్లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్

గతంలో సినిమా రిలీజ్ తరువాతా కలెక్షన్ల రూపంలో రికార్డులు నమోదయ్యే, కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే రికార్డుల వేట మొదలవుతోంది. ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్లో కూడా ప్రస్తుతం ఇదే సాంప్రదాయం కనిపిస్తోంది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో సంచలనం సృష్టించింది.

త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న హాలీవుడ్ రొమాంటిక్ ఫాంటసీ మూవీ బ్యూటి అండ్ ద బీస్ట్. డిస్నీ సంస్థ భారీగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఓ వింత ఆకారానికి, అందమైన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా తెరకెక్కిన ఈసినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో 24 గంటల్లో 12 కోట్ల 76 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

డేవిడ్ హోబర్మన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బిల్ కాన్డన్ దర్శకుడు. ఎమ్మా వాట్సన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాతో నూతన నటుడు డాన్ స్టీవెన్స్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2017 మార్చ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాను 2డితో పాటు, రియల్ 3డి, ఐమాక్స్ 3డి, డిజిటల్ 3డి ఫార్మాట్ లలో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement