Emma Watson
-
నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ
Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి కామెంట్ చేసిన ఒక యూజర్‌కు 'నువ్ యాక్ట్ చేస్తావా' అని ఆ ఆర్ఆర్ఆర్ ట్విటర్ గ్రూప్ అడ్మిన్ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్ నిర్వహించింది. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్. మీక్కీ మౌస్ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే #వాట్సన్సిస్టర్స్ఫరెవర్ అని హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసింది. View this post on Instagram A post shared by Emma Watson (@emmawatson) ఇదీ చదవండి: స్పానిష్ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్ -
యో చూస్కో బడలా.. ఆమెకు బదులు మరో హీరోయిన్.. నెటిజన్ల ట్రోలింగ్
Emma Watson Or Emma Roberts Trolled In Harry Potter Reunion Special: హాలీవుడ్ నుంచి వచ్చిన హ్యారీ పోటర్ చిత్రం అంటే తెలియని వారుండరు. సినిమాలోని వింతలు, అద్భుతాలు పిల్లల నుంచి పెద్దవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2011లో ఈ సిరీస్‌లోని ఎనిమిదో చిత్రం 'హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2'తో ఈ ఫ్రాంచైజీ ముగిసింది. నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20 వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) నిర్వహించింది హెచ్‌బీవో మ్యాక్స్. దీనికి 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' స్పెషల్ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేశారు. హెచ్‌బీవో మ్యాక్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్లో డేనియల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, తదితర సహ నటులు మెమరీ లేన్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. అయితే ఇందులో నిర్వాహకులు ఒక పెద్ద తప్పు చేశారు. ఎమ్మా వాట్సన్ తన అనుభవాలను చెబుతున్న సెగ్మెంట్లో ఆమెకు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్న నాటి ఫొటోను చూపించారు. ఇందులో రాబర్ట్స్ మాంటేజ్ మిన్నీ మౌస్ చెవులను ధరించి ఉంటుంది. ఆ పిక్ 2012లో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఎమ్మా రాబర్ట్స్. ఇది చూసిన ఎమ్మా అభిమానులు రీయూనియన్ నిర్వాహకులపై 'యో.. చూస్కో బడలే, అది ఇది కాదు' అన్నట్లుగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా 'దయచేసి నాకు సహాయం చేయండి. తను కచ్చితంగా ఎమ్మా వాట్సన్ కాదు.. ఎమ్మా రాబర్ట్స్ అని చెప్పండి' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి మరికొన్ని పోస్టులను చూసేయండి. View this post on Instagram A post shared by Emma Roberts (@emmaroberts) GUYS HELP ME THATS LITERALLY EMMA ROBERTS NOT EMMA WATSON ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️ #ReturnToHogwarts #HarryPotter20thAnniversary pic.twitter.com/bLbXcCUpnh — 𝕞𝕒𝕟𝕚𝕒 (@vee_delmonico99) January 1, 2022 Harry Potter 20th Anniversary how do u mess up putting an Emma Roberts child photo instead of an Emma Watson one? You think with such an icon series there would 2X & 3X check things for the reunion.😋 An American actress when we know American kids weren’t used. #ReturnToHogwarts — Krista (@BeatGrrl18) January 2, 2022 I tried to search "emma watson baby" on google and yes that emma roberts baby picture shows up at the top 😂#EmmaWatson #ReturnToHogwarts pic.twitter.com/rkGkqbDPYi — loony (@girlonquibbler) January 2, 2022 Wow. The editors / producers of #HarryPotter #ReturnToHogwarts seriously used a picture of a young Emma Roberts instead of Emma Watson. HOW did this get past everyone?!?! 😂😂😂 pic.twitter.com/kNm0ZkWOh5 — Tyler (@OldGoldenSnitch) January 2, 2022 -
చిక్ బుక్ రైలు
దిల్లీకి చెందిన శృతిశర్మ గురించి చెప్పుకునే ముందు బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ దగ్గరకు వెళ్లాలి. హారిపోటర్ ఫిల్మ్‌సిరీస్‌తో ఫేమ్ అయిన ఎమ్మా ఉద్యమకార్యకర్త కూడా. స్త్రీల హక్కులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టభద్రురాలైన ఎమ్మాకు పుస్తక పఠనం అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్లో ఏ మంచి పుస్తకం వచ్చినా ఆమె చదవాల్సిందే. ఒక మంచి పుస్తకం గురించి ఎక్కడైనా విన్నా చదవాల్సిందే. అలాంటి ఎమ్మా ప్రజల్లో పుస్తకపఠన అలవాటును పెంపొందించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. న్యూయార్క్, లండన్లలో సబ్వే, స్ట్రీట్‌కార్నర్, జనాలు ఎక్కువగా కనిపించే చోట్లలో పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం మంచిఫలితాన్ని ఇచ్చింది. ‘ఒక మంచి పుస్తకం చదివాను... అనే భావన కంటే ఒక మంచి పుస్తకాన్ని చాలామందితో చదివించాను అనే భావన ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది ఎమ్మా. మళ్లీ దిల్లీ దగ్గరకు వద్దాం. ఎమ్మా వాట్సన్‌లాగే శృతిశర్మకు కూడా పుసక్తపఠనం అనేది చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడు ఆమెకు అదొక ఖరీదైన వ్యవహారం. అయినప్పటికీ ఏదో రకంగా పుస్తకాలు సేకరించి చదివేది. ఇప్పుడు పుస్తకాలు కొనడానికి ఆర్థికసమస్య అంటూ లేకపోయినా తానే కాదు పదిమంది చేత పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి రావడానికి రెండు కారణాలు. 1. ఎమ్మా వాట్సన్ 2. మెట్రో రైలు లో ప్రయాణం. ఒకరోజు తాను మెట్రోలో ప్రయాణం చేస్తోంది. ఎటు చూసినా సెల్‌ఫోన్ లో మాట్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? కొందరు న్యూస్‌పేపర్స్ చదివేవారు. కొందరు వీక్లీ చదువుకునే వారు. కొందరు పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. ఈ సమయంలోనే తనకు పుస్తకాల ఆలోచన వచ్చింది. మొదటి ప్రయత్నంగా ప్రముఖ రచయిత్రి జంపా లహిరి పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్లలో పెట్టింది. ఈ విషయంలో భర్త తరుణ్ చౌహాన్ కూడా తనకు సహాయంగా నిలిచాడు. ‘తమ ఎదురుగా పుస్తకం కనిపించగానే ఆబగా చదవకపోవచ్చు. మొదటిసారి పుస్తకాన్ని ఇటూ అటూ తిరగేయవచ్చు. రెండోసారి ఆసక్తిగా కనిపించే భాగాలను చదవాలనిపించవచ్చు. మూడోసారి పుస్తకం మొత్తం చదవాలనిపించవచ్చు. ఆ తరవాత మరిన్ని పుస్తకాలు చదవాలనే ఆలోచన రావచ్చు’ అంటోంది శృతిశర్మ. అయితే ఆమె ప్రయత్నం వృథా పోలేదు. పుస్తకాలు చదివిన వాళ్లు ఆమెకు కృతజ్ఞత పూర్వకంగా ఫోన్లు చేస్తుంటారు. అంతేకాదు, శృతిశర్మను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది తాము కూడా ట్రైన్లో ప్రయాణికులు చదవడానికి బుక్స్ అందుబాటులో పెడుతున్నారు. -
ఎంత కాలం ‘సింగిల్’గా ఉంటావ్..
పారిస్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో పెరిగిన ప్రముఖ ఆంగ్ల నటి, మోడల్, సామాజిక కార్యకర్త ఎమ్మా వాట్సన్‌కు పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు దేశాల నుంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చినా ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్న విషయం తెల్సిందే. 30 ఏళ్ల వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎంత కాలం ‘సింగిల్’గా ఉంటావని ఆమెను ఇటీవల ‘వోగ్’ పత్రిక ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, పెళ్లి మాటను పక్కన పెట్టి ‘సింగిల్’ మాటకు ఆమె కొత్త భాష్యం చెప్పడంతోపాటు కొత్త ప్రత్యామ్నాయ పదాన్ని సూచించారు. ‘నన్ను సింగిల్ మహిళగా పిలవద్దు. నేను స్వీయ భాగస్వామిని (సెల్ఫ్ పార్టనర్డ్)’ అని వాట్సన్ సూచించారు. ఈ రోజుల్లో 25 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని యువతులను ‘సింగిల్ విమెన్’ అని పిలుస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దంలో పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోని యువతులను ‘స్పిన్స్టర్’ అని పిలిచే వారు. అంతకుముందు ‘ఓల్డ్ మెయిడ్స్’ అని, ‘వర్జిన్’ అని లేదా ‘ప్యుయెల్లా (స్పానిష్‌లో బాలిక అని అర్థం)’ అని పిలిచేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాల్లో పాతికేళ్ల లోపే మహిళలు పెళ్లి చేసుకునే వారు. అది 18వ శతాబ్దంలో పెళ్లి చేసుకునే సరాసరి సగటు వయస్సు పాతికేళ్ల నుంచి 30వ దశకంలో పడగా, ఇప్పుడది 40వ దశకంకు చేరింది. పెళ్లితో పాటు కొత్తింట్లో ప్రవేశించాలనే లక్ష్యం యువతీ యువకులు పెట్టుకోవడంతోనే మహిళల పెళ్లీడు కాస్త 40వ దశకంకు క్రమేణ చేరుకుందని ‘నార్త్ వెస్టర్న్ యూరోపియన్ మ్యారేజ్ ప్యాటర్న్’ పరిశోధనాత్మక పుస్తకం రాసిన జాన్ హజ్నాల్ తెలిపారు. దాంతో ఆయా దేశాల్లో పెళ్లి చేసుకోకున్నా కలసి సహజీవనం చేయడం మొదలయింది. దాంతో మొదట్లోనే ‘వర్జిన్’ అనే పదం కాలగర్భంలో కొట్టుకుపోయింది. ఆర్థిక కారణాల వల్ల 19వ శతాబ్దంలో యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోగా, 20–21వ శతాబ్దం సంధికాలంలో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోయే ‘సింగిల్ విమెన్’ సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్న మహిళల సంఖ్య ఆశ్చర్యంగా 30 శాతానికి చేరుకుంది. పెళ్లి చేసుకోకపోతే కోతులు కొడతాయి! 17వ శతాబ్దానికి ముందు సంప్రదాయం పేరిట పెళ్ళిళ్లు ఎక్కువగా జరిగేవి. పెళ్లి చేసుకోని మహిళలను అపవిత్రులని, అంటరాని వారని అసహ్యించుకునేవారు. వాళ్లంతా నరకంలోకి వెళతారని, పెళ్లి చేసుకోనందుకు నరకంలో వారిని కోతులు కొరడాలు పట్టుకొని హింసిస్తాయనే నమ్మకాలు కూడా ఎక్కువగా ప్రచారంలో ఉండేవి. 17వ శతాబ్దంలో యూరప్‌లో శాస్త్రీయ విజ్ఞానం పెరగడం, ఆర్థిక కారణాల వల్ల మహిళలు పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో 1690–1700 సంవత్సరాల కాలంలో ఒక్కసారిగా ఇంగ్లండ్‌లో జనాభా పెరుగుదల నిష్పత్తి హఠాత్తుగా పడిపోయింది. దాంతో అప్పటి ఇంగ్లీషు పాలకులు పెళ్లి చేసుకోని వారిపై ‘మ్యారేజ్ డ్యూటీ ట్యాక్స్’ విధించారు. అమెరికాలో కూడా.... బ్రిటన్ దేశంలోలాగా కాకపోయినా అమెరికాలో యువతీ యువకుల పెళ్లీడు వయస్సు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో యువతుల పెళ్లీడు వయస్సు 28 కాగా, యువకులు పెళ్లీడు వయస్సు 30 ఏళ్లుగా ఉంది. గతంలో అక్కడ యువతుల సరాసరి పెళ్లీడు వయస్సు 20 కాగా, యువకుల వయస్సు 22గా ఉండింది. ఇంతకు పెళ్లిపై వాట్సన్ మాటేమిటీ! సమాజంలో పేరు ప్రఖ్యాతులతోపాటు ఆస్తిపాస్తులు కూడా ఉన్నందున 30 ఏళ్ల ఒడిలో కూడా ఎందుకు ఒంటరిగా ఉంటున్నారని ‘వోగ్’ పత్రిక ఎమ్మా వాట్సన్‌ను ప్రశ్నించింది. ‘నేను ఒంటరిగా ఉన్నానని ఎవర న్నారు. నేను స్వీయ భాగస్వామిని. నా మీద నేను దష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా లక్ష్యాలు, నా అవసరాలు సాధించడం నాకు ముఖ్యం. మరో వ్యక్తి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ ఆమె పెళ్లి మాటను ఆమె పక్కన పడేశారు. -
అవును 30... అయితే ఏంటి?
‘‘పెళ్లెప్పుడు?!’’ అని అడిగే వాళ్లకు సరదాగా ఉంటుంది. చెప్పేవాళ్లకే చిర్రెత్తుకొస్తుంటుంది. ‘‘ముప్పయ్ ఏళ్లు వచ్చాయి, ఇక పెళ్లి చేసుకో’’ అని ఎమ్మా వాట్సన్‌కు హితులు, సన్నిహితుల నుంచి పోరు ఎక్కువైంది. ‘‘నాకు 29 దాటాయి, సంతోషంగా ఉన్నాను. సింగిల్‌గా ఉండడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు పార్టనర్ లేరని ఎవరన్నారు! నాకు నేనే పార్టనర్‌ని. సెల్ఫ్ పార్టనర్డ్ పర్సన్’’ అని ఒక పోస్ట్‌లో అందరికీ కలిపి ఒకే సమాధానమిచ్చింది ఎమ్మా. ఎమ్మా వాట్సన్ బ్రిటిష్ నటి. ప్యారిస్‌లో పుట్టింది. హ్యారీ పోటర్ సినిమాలు చూసిన వాళ్లకు హర్మియోన్ గ్రేంజర్ పాత్రలో ఆమె తెలిసే ఉంటుంది. హ్యారీ పోటర్ సీరీస్‌తో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి పడింది. డబ్బు కూడా ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. ఆమె కష్టాలూ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఆమె పెళ్లెప్పుడు చేసుకుంటుందో? ఎవరిని పెళ్లి చేసుకుంటుందోనని ఒక చూపు ఆమె మీద పెట్టేసింది అక్కడి మీడియా. ఆమెను వెంబడిస్తూ, రహస్యంగా ఆమె కదలికలను ఫొటో తీసే పాపరాజ్జిలు కూడా ఎక్కువైపోయారు. ఆమె ఏ వేడుకలో కనిపించినా సరే... ఆమెతో మరెవరైనా వచ్చారా అని అందరి కళ్లూ వెతకడమూ ఎక్కువైంది. ఇంత గందరగోళాన్ని భరించలేక ఇప్పుడామె సోషల్ మీడియాలో ఈ ‘పెళ్లి పోస్ట్’ పెట్టారు. అమ్మాయి విషయంలో ఇంగ్లండ్ అయినా ఇండియా అయినా ఒక్కటే కాబోలు. ఆమె పెళ్లి బాధ్యత తమ భుజాల మీదనే ఉన్నట్లు సమాజం ఒత్తిడి తెస్తుంటుంది. అందుకే అంత సున్నితంగా, కొంచెం ఘాటుగా బదులిచ్చింది ఎమ్మా. అందుకు కారణం తన కెరీర్‌ని ఆమె గాఢంగా ప్రేమిస్తుండటం. తనపై తాను కాన్ఫిడెంట్‌గా ఉండటం. -
కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్ ఏంజెల్స్ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కిరాతకమైన ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా హ్యారీ పోర్టర్ నటి ఎమ్మా వాట్సన్ స్పందించారు. అత్యాచార బాధిత తరుఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌కు ఆమె మద్దతు తెలిపారు. దీపికా సింగ్ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ఎమ్మా వాట్సన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ... దీపికా సింగ్ రజావత్‌కే అన్ని అధికారాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ ఐక్యరాజ్యసమితిలో మహిళల గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. యువతుల్లో సాధికారిత కలిగించేందుకు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మా వాట్సన్ షేర్చేసిన ఆర్టికల్‌లో రజావత్ నమ్మకాన్ని, వృత్తి పట్ల ఆమెకున్న వైఖరిని పేర్కొన్నారు. కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్ పిటిషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును చేపట్టిన వెంటనే ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె భయపడకుండా.. హంతకులకు శిక్షపడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. కశ్మీరీ పండిట్ అయిన 38 ఏళ్ల దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు జిల్లా కుప్వారాలో కరిహామా గ్రామం. ఈ చిన్నారి తరుఫున వాదిస్తున్న రజావత్‌కు బెదిరింపులు ఎక్కువ అవడంతో, ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. రజావత్‌తో పాటు, చిన్నారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి సాయంగా ఉన్న బకర్వాల్ కమ్యూనిటీ సభ్యుడు తలీబ్ హుస్సేన్‌కు కూడా సెక్యురిటీ ఏర్పాటు చేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ హైకోర్టులో ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. All power to Deepika Singh Rajawat ✊🏻https://t.co/sZzDVcIFNo — Emma Watson (@EmmaWatson) May 3, 2018 -
లవ్.. బ్రేకప్.. ప్యాచప్...
‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్. హాలీవుడ్లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం... దాచేదేముంది.. ప్రేమే ఎమ్మా వాట్సన్ కథ ఇలా ఉంటే, మరో స్టార్ హీరోయిన్ టేలర్ స్విఫ్ట్ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్ జాయ్ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఇప్పుడున్న హాట్ కపుల్స్‌లో వీళ్లూ టాప్ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు. టేలర్ స్విఫ్ట్, జాయ్ అల్విన్ వాళ్లు విడిపోయారు మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్లో ఆయన బెస్ట్ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్. అయితే ఆ విషయాన్ని ఆస్కార్ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు. లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో వీళ్లు మళ్లీ కలిసిపోయారు ఈ దశాబ్దంలో హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్ లారెన్స్ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్ రొమాన్స్ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్ హౌల్ట్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు. జెన్నీఫర్ లారెన్స్, నికోలస్ హౌల్ట్ లవ్వా? అదేం లేదే ‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్ ఆస్కార్ పార్టీలో కోర్డ్ ఓవర్స్ట్రీట్తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్ తనకు ‘జస్ట్ ఫ్రెండ్’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి! ఎమ్మా వాట్సన్, కోర్డ్ ఓవర్ స్ట్రీట్ అటో.. ఇటో.. ఎటో.. అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్ ఎ బ్రేక్’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్ కాదు. టేక్ ఎ బ్రేక్ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్రేమకథ ఒక దగ్గర ఆన్ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం. స్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ -
పదికోట్లిచ్చిన ఎమ్మా వాట్సన్
లండన్: బ్రిటన్‌లో స్త్రీ, పురుషుల సమాన హక్కుల కోసం, మహిళా సాధికారిత కోసం ‘టైమీస్ అప్’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ బ్రిటన్ నటి, ఫెమినిస్ట్ ఎమ్మా వాట్సన్ ‘బ్రిటన్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్’కు పది కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇటు లండన్, అటు న్యూయార్క్ సబ్వేలలో ఫెమినిస్టు పుస్తకాలను ఉద్దేశపూర్వకంగా వదిలేసి రావడం వల్ల తొలుత వార్తల్లోకి ఎక్కిన ఆమె ఆ తర్వాత ‘టైమీస్ అప్’ ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫెమినిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ‘మహిళల సాధికారిత కోసం, పనిచేసే చోట స్త్రీ, పురుషులను సమానంగా చూసే సమ న్యాయం కోసం కొనసాగిస్తున్న ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం కావాలి. మహిళలు–మహిళలతో, మహిళలు, పురుషులతో భుజంభుజం కలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించాలి. ముఖ్యంగా సమానత్వ నిధికి విరాళాలు విరివిగా అందించాలి’ అని పిలుపుతో కూడిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
నిశ్శబ్దానికి కాలం చెల్లింది
‘మీటూ’ లాంటిదే ‘టైమ్స్‌అప్’ ఉద్యమం. ఇప్పుడది బ్రిటన్‌కూ విస్తరించింది. బ్రిటన్ నటి ఎమ్మా వాట్సన్ ఆ ఉద్యమానికి పది లక్షల పౌండ్లు (సుమారు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు) విరాళం ఇచ్చారు! మీటూ ఉద్యమకారులు తమ గళాన్ని వినిపించడానికి గత జనవరిలో యు.ఎస్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్ని వేదికగా చేసుకున్నట్లే.. ఈ ఆదివారం లండన్‌లో జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్తా) ఉత్సవాలను ‘టైమ్స్‌అప్’ ఉద్యమకారులు తగిన సందర్భంగా తీసుకుని ప్రపంచ మహిళలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది. డియర్ సిస్టర్స్ ‘టైమ్స్‌అప్’ ఉద్యమం మొదలై నెల మీద కొద్ది రోజులే అయింది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన అప్పటి బహిరంగ లేఖను మీరు చదివే ఉంటారు. అవార్డు వేడుకలలో రెడ్ కార్పెట్ మీద మహిళలు నిరసనగా నలుపురంగు దుస్తులు ధరించి నడవడమూ గమనించే ఉంటారు. వేధింపులకు గురైన మహిళలు ముందుకొచ్చి చెప్పుకున్న అనుభవాలనూ వినే ఉంటారు. బహుశా అలాంటి అనుభవాలూ మీకూ ఉండివుండొచ్చు. ప్రపంచమంతటా మహిళలు ఏకమౌతున్నారు. ప్రతిఘటిస్తున్నారు. బయటికివచ్చి మాట్లాడుతున్నారు. లాటిన్ అమెరికాలో ‘నినూకమాస్’, కరీబియ లో ‘లైఫ్ ఇన్ లెగ్గింగ్స్’, ఫ్రాన్స్‌లో ‘బ్యాలెన్స్ టాన్ పార్క్’, యు.కె.లో ‘ఎవ్రీడే సెక్సిజం’.. ఉద్యమాలు, ఉద్యమ హ్యాష్‌టాగ్‌లు మొదలయ్యాయి! ‘మీటూ’ను మీరు చూసే ఉంటారు. ‘మీటూ’ అని కూడా అని ఉంటారు.గత శరదృతువులో.. హాలీవుడ్ పరిశ్రమలోని లైంగిక వేధింపులు, లైంగిక వివక్ష, లైంగిక హింసలపై పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినప్పుడు ఏడు లక్షల మంది మహిళా రైతు కూలీలు సంఘీభావంగా మాకు రాశారు.. ‘మీకు మేమున్నాం’అని! మా ఆవేదనను, ప్రపంచాన్ని మార్చవచ్చన్న మా నమ్మకాన్ని అర్థం చేసుకుని మాతో భుజం భుజం కలిపి నడిచేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్న భావన ఆ ఉత్తరాలలో కనిపించింది. సకల రంగాలలోని మహిళా బాధితులు, మహిళా కార్యకర్తల వల్ల ‘టైమ్స్‌అప్’ ఉద్యమం ఊపిరిదాల్చింది. ఇది మన ఒక్కరి పరిశ్రమలోనే మార్పు తేచ్చేంత చిన్నది కాదు. ఇంకా పెద్దది. అన్ని రంగాలలోని వేధింపుల బాధితులు చేరుకుంటున్న కూడలి ఈ ‘టైమ్స్‌అప్’. ఇక్కడ ఇంగ్లండ్‌లో ఈ ఉద్యమం కీలకమైన తరుణంలో ఉంది. ఉద్యోగినుల వేతనాలలో వ్యత్యాసం ఆరేళ్ల క్రితంనాటితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. యు.కె.లో ఉద్యోగం చేస్తున్న మహిళల్లో సగం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగ భద్రతలేని తాత్కాలిక విధుల్లోని మహిళలు అన్ని రకాల లైంగిక దోపిడీలకూ అనువైన çపరిసరాల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ సమాజాన్ని స్థాపించడానికి మన బాధ్యత ఏమిటి? పెద్ద బాధ్యతే. ఉద్యమ బాధ్యత. వెలుగులో ఉన్నా, ఆ వెలుగుల నీడల్లో ఉన్నా, మనం అంతా కూడా కార్మికులం. మనది ఒకటే స్వరం. మనం కలిసి, మిగతావాళ్లను కలుపుకుందాం. మొన్నటి వరకు మనం ఉన్న ప్రపంచంలో లైంగిక వేధింపు అన్నది తేలికపాటి విషయం. ఇప్పుడీ 2018లో అలాక్కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏకాకితనం సమూహం అవుతుంది. నిశ్శబ్దం స్వరం అవుతుంది. లోలోపల మనల్ని సమాధానపరచుకోవడం.. పైపైకి పెల్లుబికే ప్రశ్న అవుతుంది. ఇది మీ ఉద్యమం కూడా. లైంగిక వేధింపులకు, లైంగిక అకృత్యాలకు కాలం చెల్లింది. -
నటికి అవార్డు వచ్చినా.. చేదు అనుభవం!
కాలిఫోర్నియా: ఎవరికైనా అవార్డులు వస్తే ప్రశంసలు వర్షం కురుస్తోంది.. కానీ 'హ్యారీపోటర్' ఫేమ్ ఎమ్మా వాట్సన్ కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. తనకు అవార్డు వచ్చిందని చెప్పిన ఈ ముద్దుగుమ్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం ఆమె అత్యుత్సాహమని చెప్పవచ్చు. అవార్డుల కార్యక్రమం మొదలవ్వకముందే తనకు అవార్డు వచ్చిందని ఆమె ప్రకటించడమే. మే7న లాస్ ఏంజిలిస్ లోని ష్రైన్ ఆడిటోరియంలో ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆమె బ్లాక్ స్లీవ్ డ్రెస్ లో దర్శనమిచ్చి సందడి చేసింది. లైవ్ షో ప్రారంభానికి ముందే తాను అవార్డు గెలుచుకున్నట్లు అభిమానులకు శుభవార్త చెప్పింది. ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డులలో భాగంగా తొలి జెండర్ లెస్ (జెండర్ న్యూట్రల్) అవార్డు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఫంక్షన్ లో అవార్డు విజేత గౌరవ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే హాలీవుడ్ భామ ఎమ్మా వాట్సన్ ఇచ్చిన ప్రసంగం ఎవరినీ ఆకట్టుకునేలా లేదట. అవార్డు విషయం ముందే తెలిసిన ఎమ్మా.. ఉద్వేగభరితంగా ప్రసంగించలేదని, ఏదో మొక్కుబడిగా ప్రీపేర్ చేసుకున్న వ్యాసాన్ని చదివిందని విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో అవార్డు నెగ్గిన ఆనందం కన్నా విమర్శలే ఆమెకు తలనొప్పిగా మారినట్లుగా కనిపిస్తోంది. అవార్డు విషయం ముందుగానే ఎమ్మా ఎందుకు వెల్లడించిందంటూ కొందరు సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. -
ఆ సినిమా బాక్సాఫీస్‌కు బాంబు పెట్టింది!
ట్రాన్స్ఫార్మర్స్, ఇండియానా జోన్స్ వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ సినిమాలు తీసిన అగ్రహీరో షాయా లాబౌఫ్ తాజా సినిమా 'మ్యాన్ డౌన్' బ్రిటన్ బాక్సాఫీస్‌కు ఒకరకంగా బాంబు పెట్టింది. డైరెక్టర్ డిటో మాంటియల్ రూపొందించిన ఈ వార్ డ్రామా బ్రిటన్‌లో కేవలం ఏడుపౌండ్లు (రూ. 567) మాత్రమే వసూలు చేసింది. ఈ కలెక్షన్ కూడా ఒక్క టికెట్దే కావడం గమనార్హం. ఈ సినిమా కేవలం ఒక్క థియేటర్లోనే విడుదలైంది. ఆ థియేటర్లోనూ కేవలం ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. గతంలో పలు సూపర్‌హిట్ సినిమాలు తీసిన లాబౌఫ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొని అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అతను సినిమాలపై దృష్టి పెట్టాడు. పెద్దగా కలెక్షన్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను వెంటనే వీడియో ఆన్ డిమాండ్ పేరిట ఆన్లైన్లో పెట్టేశారు. లాబౌఫ్ సినిమానే కాదు గతంలో పలు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే బాక్సాఫీస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. అమెరికాలో రెండువేలకుపైగా థియేటర్లలో విడుదలైన పిల్లల సినిమా ద వూజీలవ్స్ ఇన్ ద బిగ్ బెలూన్ అడ్వంచర్ (2012)..కేవలం 206 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అమెరికాలో ఒక్క టికెట్ ధర 10 డాలర్లు. ఇక హ్యాలీ బెర్రీ నటించిన డార్క్ టైడ్ (2012) సినిమా బ్రిటన్‌లో కేవలం 90 పౌండ్లు వసూలు చేసింది. ప్రస్తుతం డిస్నీ నిర్మించిన 'బ్యూటీ అండ్ బీస్ట్' సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎమ్మా వాట్సన్‌కు 2015లో ఇదేరకమైన అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకున్న హ్యారీపొటర్ సినిమాలతో తళుక్కుమన్న ఈ అమ్మడు నటించిన 'కలోనియా' చిత్రం బ్రిటన్‌లో కేవలం 47పౌండ్లు వసూలు చేసింది. -
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్
గతంలో సినిమా రిలీజ్ తరువాతా కలెక్షన్ల రూపంలో రికార్డులు నమోదయ్యే, కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే రికార్డుల వేట మొదలవుతోంది. ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్లో కూడా ప్రస్తుతం ఇదే సాంప్రదాయం కనిపిస్తోంది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న హాలీవుడ్ రొమాంటిక్ ఫాంటసీ మూవీ బ్యూటి అండ్ ద బీస్ట్. డిస్నీ సంస్థ భారీగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఓ వింత ఆకారానికి, అందమైన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా తెరకెక్కిన ఈసినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో 24 గంటల్లో 12 కోట్ల 76 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డేవిడ్ హోబర్మన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బిల్ కాన్డన్ దర్శకుడు. ఎమ్మా వాట్సన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాతో నూతన నటుడు డాన్ స్టీవెన్స్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2017 మార్చ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాను 2డితో పాటు, రియల్ 3డి, ఐమాక్స్ 3డి, డిజిటల్ 3డి ఫార్మాట్ లలో రిలీజ్ చేస్తున్నారు. -
కాల్ గర్ల్స్ తనను గుర్తుపట్టకుండా..
చనిపోయి ఏడేళ్లు కావస్తున్నా పాప్ కింగ్ మైఖెల్ జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల వేడి ఇంకా చల్లారడంలేదు. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ హీరోయిన్ ఎమా వాట్సన్ ను, ఓ స్నేహితుడి కూతురు హెరియట్ లిస్టర్ లను జాక్సన్ పెళ్లాడాలనుకున్నాడట. అతనికి ఆ ఆలోచన కలిగినప్పుడు ఎమా, లిస్టర్ ల వయసు ఐదేళ్లు! బాలనటిగా ’హ్యారీ పొట్టర్’ సినిమాలో ఎమా నటన జాక్సన్ ను ముగ్ధుణ్ని చేసిందట. ఆ సినిమా చూసిన తర్వాత ఆ అమ్మాయిని(చిన్నారిని) పెళ్లిచేసుకోవాలని జాక్సన్ భావించాడట. బ్రిటన్ కు చెందిన స్నేహితుడి కూతురైన లిస్టర్ ను మాత్రం ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాతే పెళ్లాడాలనుకున్నాడట! ఈ వివాదాస్సద విషయాలను జాక్సన్ వ్యక్తిగత ఫిజిషియన్ గా పనిచేసిన డాక్టర్ కన్రాడ్ ముర్రే వెల్లడించారు. జాక్సన్ హత్యలో దోషిగా నాలుగేళ్లు జైలు జీవితం పూర్తిచేసుకున్న డాక్టర్ ముర్రే తాజాగా "This is it: laying bare grim" అనే పుస్తకాన్ని రాశారు. అందులో జాక్సన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను వెల్లడించారు. అంతేకాదు స్వయంగా జాక్సనే ’ఎప్పటికైనా ఈ విషయాలను ప్రపంచానికి చెప్పు’ అని తనతో అన్నట్లు ముర్రే పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, నైట్ క్లబ్ లకు వెళ్లడం, చిన్న చిన్న హోటళ్లలో బసచేయడం లాంటి పనులు మైఖెల్ జాక్సన్ కు ఎంతో ఇష్టమని, అయితే తాను కనబడితే కాల్ గర్ల్స్, అభిమానులు మీదపడిపోతారేమోననే భయంతో జాక్సన్ మారువేషాల్లో ఆయా ప్రదేశాలకు వెళ్లేవాడని డాక్టర్ ముర్రే తన పుస్తకంలో రాశాడు. జాక్సన్ చాలాసార్లు తాను సౌదీ అరేబియా నుంచి వచ్చినవాడినని అరేబియా యాసలో మాట్లాడుతూ జనాన్ని బోల్తా కొట్టించేవాడని, కొన్నిసార్లు పైజామా(సౌదీ సంప్రదాయ దుస్తులు) ధరించేవాడని డాక్టర్ ముర్రే తెలిపారు. ఇంకా విడుదలకాని ముర్రే పుస్తకంలో ఎన్ని విషయాలు బయటికొస్తాయో వేచిచూడాలిమరి. ఎమా వాట్సన్ అప్పుడు- ఇప్పుడు జాక్సన్ పర్సనల్ ఫిజీషియన్ డాక్టర్ కన్రాడ్ ముర్రే -
పనామా పేపర్స్‌లో మరో హీరోయిన్!
లాస్ఎంజిల్స్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరు ఈ జాబితాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా 'హ్యారీపోటర్ అండ్ ద గొబ్లెట్ ఆఫ్ ఫైర్'లో నటించిన బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్(26) పేరు పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలను స్థాపించిన వారి జాబితాతో కూడిన పనామా పత్రాల లీకేజీలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థను నెలకొల్పిన విషయం వాస్తవమే అని తెలిపాడు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని తెలిపాడు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకు పైగా విదేశీ సంస్థల వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో వివిధ కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్స్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌ను సైతం ఐసీఐజే వెల్లడించింది. -
మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!
లండన్: బహిరంగ ప్రదేశాల్లో చురుగ్గా కనిపించకుండా బోరింగ్ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడే హాలీవుడ్ తార ఎమ్మా వాట్సన్. ఓ ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల జోలికి వెళ్లనంటోంది. తనకు కొన్ని పనులున్నాయని వాటిని నిర్వహించిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెపుతోంది ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ 'హీ ఫర్ షీ' లాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్త్రీవాదం గురించి తాను ఎంతో తెలుసుకోవాల్సి ఉందని, ఎన్నో పుస్తకాలు చదవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం రెండు విషయాలపై దృష్టిసారించడానికి ఈ గ్యాప్ తనకు అవసరమని మీడియాకు వివరించింది. మొదటిది స్త్రీవాదం, లింగ సమానత్వం కాగా, వ్యక్తిత్వ వికాసం రెండో అంశమని వెల్లడించింది. ఇప్పటినుంచి ప్రతివారం ఓ బుక్ చదవడం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు తన వద్ద ఉన్న లైబ్రరీ నుంచి నెలకు మరో పుస్తకాన్ని చదవడాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రపంచంలో ఎన్ని రకాల మహిళలు ఉంటారో తెలుసుకుంటానంటోంది. ఎమ్మా తదుపరి చిత్రం 'బ్యూటీ అండ్ ద బీస్ట్' తో 2017లో వెండితెర మీద కనిపించనుందట. -
'కావాలనే బోరింగ్ పర్సన్‌లా కనిపిస్తా'
లండన్: బహిరంగ ప్రదేశాల్లో తాను పెద్ద చురుగ్గా కనిపించనని, బోరింగ్ పర్సన్ (పెద్దగా ఆసక్తి లేని వ్యక్తి)లా ఉండటానికే ఇష్టపడుతానని చెపుతోంది హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. అయితే లైమ్‌లైట్‌లో ఉండి ప్రజల అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడం అసలు ఇష్టం ఉండదని, తన ప్రైవసిని కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని ఆమె చెపుతోంది. 'నేను చాలా బోరింగ్ పర్సన్‌లా అందరికీ కనిపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. నన్ను నేనుగా గుర్తుంచుకొని ప్రైవసీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. ఉదాహరణకు రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు కాస్తా స్తబ్దుగా, నాలో నేను ఉన్నట్టు కనిపిస్తా' అని ఎమ్మా వాట్సన్ పోర్టర్ మ్యాగజీన్‌కు తెలిపింది. 'నాకు ఇప్పుడు 25 ఏళ్లు వచ్చాయి. నాకు నేను నచ్చేవిధంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఏదైతే చెప్తానో అదే చేయాలనుకుంటాను. నాకు నేనుగా నా ప్రామాణికంగా ఉండాలనుకుంటా. పబ్లిక్ లైఫ్, వ్యక్తిగత జీవితం మధ్య పెద్దగా తేడా చూపించడం నాకు నచ్చదు' అని ఎమ్మా వివరించింది. -
‘టాపు’ లేచిపోద్దట!
హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట. తన రాబోయే చిత్రం ‘రిగ్రెషన్’లో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా కనిపించనుందట. ఈ వార్త నెట్టింట్లో లావాలా పాకేసి పురుష పుంగవుల బాడీలు హీటెక్కిస్తోంది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదంటూ అప్పుడే అక్కసు వెళ్లబోసుకొంటున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఈ హ్యారీ పోటర్ స్టార్ గతంలో కూడా అందాల ప్రదర్శనలో కాస్త వెసులుబాటు ఇచ్చినా... అది అంతగా కిక్కెంచలేదనేది వారి అసలు బాధ. ఏదిఏమైనా... రిగ్రెషన్లో ‘ట్రైనింగ్ డే’ నటుడు ఇథాన్ హాకె అమ్మడితో జతకడుతున్నాడట. -
ప్రియుడు దూరమయ్యాడు!
‘హారీ పోట్టర్’ తార ఎమ్మా వాట్సన్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. అదే ఆమెకు తంటా అయ్యింది. బోయ్‌ఫ్రెండ్ మాథ్యూ జాన్నీతో కాసిన్ని ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి కుదరడం లేదట. జాన్నీయేమో రగ్బీ ప్లేయర్. ఆటలాడుకున్నప్పుడు మినహా మిగతా సమయంలో ఎక్కువ శాతం ప్రియురాలితోనే ఉండాలనుకుంటాడట. కానీ, ఎమ్మాకి అంత తీరిక లేదు కదా. ఈ విషయంలోనే జాన్నీ అలిగాడని సమాచారం. ఆ ఆలక విడిపోయేదాకా వచ్చేసింది. ఇటీవలే ఈ ఇద్దరూ తాము విడిపోయిన విషయాన్ని బాహాటంగా అంగీకరించేశారు. ప్రేమికులుగా విడిపోయినా.. స్నేహితుల్లా మిగిలిపోతాం అంటున్నారు. -
ఎంత పనయింది.. ఎమ్మా!
హాలీవుడ్ సెలబ్రిటీల నగ్న ఫొటోల హ్యాకింగ్ సీరియల్ తారస్థాయికి చేరింది. హ్యాకర్లు తాజాగా స్టార్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ నగ్న ఫొటోలు పోస్ట్ చేస్తామంటూ ప్రకటించారు. అంతటితో ఆగలేదు. దానికి నాలుగు రోజుల్లో ఓ వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయబోతున్నామంటూ దాని పేరూ వెల్లడించారు. సైట్ ప్రారంభానికి నెట్లో కౌంట్‌డౌన్ కూడా పెట్టి కలకలం రేపుతున్నారు. ‘ఫెమినిజంపై ఎమ్మా అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. దానికి ప్రతీకారంగానే ఈ చర్య’ అంటూ హ్యాకర్లు ఓ నోట్ కూడా విడుదల చేసినట్టు ఓ వెబ్సైట్ కథనం. -
రక్తం కారేలా లిప్‌లాక్!
ముద్దంటే చేదా అనేది పాతకాలపు నాటి మాట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో లిప్‌లాక్ ఉన్న ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. యువ హీరో, హీరోయిన్లు ఎలాంటి సంకోచం లేకుండా గాఢ చుంబనానికి సై అంటున్నారు. ఇక హాలీవుడ్లో అయితే చెప్పనక్కర్లేదు. అయితే ‘హ్యారీ పోటర్’ హీరోయిన్ ఎమ్మా వాట్సన్‌కు ముద్దు సీన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ‘నోవా’ అనే రచన ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో డ గ్లస్ బూత్‌కు భార్యగా ఎమ్మా నటిస్తోంది. ఈ చిత్రంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరూ గాఢంగా ముద్దుపెట్టుకునే సీన్లో నటించారు. అయితే ఆ సన్నివేశాన్ని అనుకున్న విధంగా తీయడానికి నాలుగైదు సార్లు షూటింగ్లో సీన్‌ను రిపీట్ చేశారట. ఆ ముద్దు సీన్లో ఎమ్మా పెదాలకు గాయమై రక్తం కారిందట. దాంతో ఆమెకు ప్రథమ చికిత్స తప్పలేదు. ‘ముద్దు సీన్లో నా పెదవికి గాయమై రక్తం కారింది. డగ్లస్ ముక్కుకు కూడా గాయమైంద’ని వాట్సన్ తెలిపింది. -
హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!
తెరమీద లిప్ లాక్ లు ప్రేక్షకులకు బ్రహ్మండమైన అనుభూతిని కలిగిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచడానికి లిప్ లాక్ సీన్ షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ వాళ్ల కష్టం దేవుడెరుగు. అయితే 'హ్యారీ పోటర్' హీరోయిన్ ఎమ్మా వాట్సన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డగ్లస్ బూత్ తో కలిసి చేసిన లిప్ లాక్ సన్నివేశం వాట్సన్ కు పెదాల నుంచి రక్తం కారేలా చేసింది. గాఢ చుంబనం కారణంగా పెదాలకు గాయమై రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో పరుగెత్తుకుంటూ వచ్చి గాఢంగా ముద్దు పెట్టుకోవాలి. ఫర్ ఫెక్షన్ కోసం ఆ సీన్ ను పదే పదే షూట్ చేయడంతో వాట్సన్ పెదాలకు గాయమై రక్తం కారడం జరిగిందన్నారు. ఈ షూటింగ్ లో డగ్లస్ ముక్కుకు కూడా గాయమైందట. -
మిలియన్ డాలర్ టీనేజర్స్
పూర్వీకుల ఆస్తులు కలిసిరాలేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేదు... ఇవేమీ లేకపోయినా టీనేజ్లోనే కోటీశ్వరులయ్యారు. డ బ్బుతో అనుభవించగల అన్ని సౌఖ్యాలు సొంతం చేసుకున్నారు. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెడుతున్నారు. కొందరిలో అసూయను, మరికొందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. వీళ్లు డబ్బున్న వాళ్ల పిల్లలు కాదు... డబ్బున్న పిల్లలు! ప్రతిభనే పెట్టుబడిగా చేసుకుని కోట్ల డాలర్లకు అధిపతులయ్యారు. అలాంటి వారిలో మొదటి స్థానాల్లో ఉన్నవారితో కూడిన ‘రిచెస్ట్ టీనేజర్స్ ఆన్ ది ప్లానెట్’ జాబితా ఇది... ఎమ్మావాట్సన్: మోడలింగ్ ద్వారా ప్రతి యేటా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ ఇంగ్లిష్ నటి. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఫ్యాషన్ పరేడ్లలో ఎమ్మా ద్వారా తాము రూపొందించిన డ్రస్సులను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. దీంతో ఎమ్మా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఏడాదికి 12 మిలియన్ డాలర్ల సొమ్ము జమ అవుతోందని అంచనా. ఇది రూపాయల్లో 72 కోట్లు. జడెన్స్మిత్: ఈ కరాటే కిడ్‌ను చాలా సులువుగా గుర్తించవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ కుమారుడు అయిన జడెన్ స్మిత్ ‘కరాటే కిడ్’ అనే సినిమాతో బాగా ఫేమస్అయ్యాడు. 13 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో నటించాడు ఈ జూనియర్ స్మిత్. అది సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కో సినిమాకు పారితోషి కంగా ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని భోగట్టా. సెలీనా గొమెజ్: హాలీవుడ్ సినిమాల ద్వారా భారతీయ యువతకు పరిచయమున్న అమెరికన్ యువతి. 19 ఏళ్ల వయసులోసెలీనా ఒక ఏడాదికి పొందుతున్న పారితోషికాన్ని లెక్కగడితే అది దాదాపు ఆరు మిలియన్ డాలర్లుగా తేలింది. అంటే దాదాపు 36 కోట్ల రూపాయలు. మిల్లీ సైరస్: 18 ఏళ్ల వయసులో ఒక ఏడాదిలోనే 48 మిలియన్ డాలర్ల డబ్బును సంపాదించి రికార్డు స్థాపించింది. రిచెస్ట్ టీనేజ్ గర్ల్‌గా నిలిచింది ఈ యాక్టర్ కమ్ సింగర్. జస్టిన్ బీబెర్ : 17 యేళ్ల వయసులో ఒకే ఏడాదికి 50 మిలియన్ డాలర్ల సొమ్మును సంపాదించాడు బీబెర్. దీన్ని రూపాయిల్లోకి మారిస్తే దాదాపు 300 కోట్లు! ఇదంతా ఒక ఏడాది సంపాదనే. బీబెర్ ఈ స్థాయిలో సంపాదన మొదలుపెట్టి మూడేళ్లు గడిచిపోయాయి! నిక్జొనస్: ఇతడూ పాప్ గాయకుడే. బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం కోసం భారీ స్థాయి పారితోషికాన్ని పొందుతున్నాడు. ఈ కుర్రాడి ఏడాది సంపాదన 20 మిలియన్ డాలర్ల పైమాటే! అంటే దాదాపు 120 కోట్ల రూపాయలు.