పనామా పేపర్స్లో మరో హీరోయిన్! | Actress Emma Watson has been named in leaked Panama Papers | Sakshi
Sakshi News home page

పనామా పేపర్స్లో మరో హీరోయిన్!

Published Thu, May 12 2016 7:27 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

పనామా పేపర్స్లో మరో హీరోయిన్! - Sakshi

పనామా పేపర్స్లో మరో హీరోయిన్!

లాస్ఎంజిల్స్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరు ఈ జాబితాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా  'హ్యారీపోటర్ అండ్ ద గొబ్లెట్ ఆఫ్ ఫైర్'లో నటించిన బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్(26) పేరు పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలను స్థాపించిన వారి జాబితాతో కూడిన పనామా పత్రాల లీకేజీలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థను నెలకొల్పిన విషయం వాస్తవమే అని తెలిపాడు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని తెలిపాడు.

అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే)  తాజాగా 2 లక్షలకు పైగా విదేశీ  సంస్థల వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో వివిధ కంపెనీలు, ట్రస్ట్లు, ఫౌండేషన్స్కు సంబంధించిన వివరాలున్నాయి. వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన నెట్వర్క్ను సైతం ఐసీఐజే వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement